ఏఎఫ్ క్యాట్-2023
వాయుసేన.. త్రివిధ దళాల్లో ఒకటి. ఎయిర్‌ఫోర్స్‌లో ఆకాశమంత అవకాశాలు. ఏటా పలు ఉద్యోగాలకు వాయుసేన నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం పలు బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్)- 1/2023 నోటిఫికేషన్‌ను ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసిన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా …
ఏఎఫ్ క్యాట్
ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఏటా ఈ టెస్ట్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు-258
- బ్రాంచీలవారీగా ఖాళీలు:
- ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ బ్రాంచీ: ఫ్లయింగ్
- ఖాళీలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)-10 (వీటిలో పురుషులు-5, మహిళలకు-5)
- బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
- ఖాళీలు: ఏఈ (ఎల్)-130 (వీటిలో పురుషులు-117, మహిళలకు- 13)
- బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
- ఖాళీలు: పురుషులకు- వెపన్ సిస్టమ్-15, అడ్మిన్-43, లాజిస్టిక్స్-19, అకౌంట్స్-11, ఎడ్యుకేషన్-8, మెటీయోరాలజీ-7.మహిళలకు- వెపన్ సిస్టమ్-2, అడ్మిన్-5, లాజిస్టిక్స్-2, అకౌంట్స్-2, ఎడ్యుకేషన్-2, మెటీయోరాలజీ- 2 ఖాళీలు ఉన్నాయి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
- బ్రాంచీ: ఫ్లయింగ్
- ఖాళీలు: సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్ఎస్సీ కింద భర్తీ చేస్తారు.
శిక్షణ
- జనవరి 2024 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ బ్రాంచీ)కి 74 వారాలు, నాన్ టెక్నికల్ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు.
- పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్ ఆఫీసర్- లెవల్ 10 నెలకు రూ.56,100-1,77,500/-ఇతర అలవెన్సులు ఇస్తారు.
ఎవరు అర్హులు?
- ఫ్లయింగ్ బ్రాంచీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు. అయితే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం
మార్కులతో ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. - ఫ్లయింగ్ బ్రాంచీకి 2024, జనవరి 1 నాటికి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి.
- నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహ పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
- ఏఎఫ్ క్యాట్ పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ప్రశ్నల సంఖ్య- 100. దీనిలో జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 30
పరీక్షతేదీ: ఫిబ్రవరి 24, 25, 26
వెబ్సైట్: https://afcat.cdac.
in/AFCAT
- Tags
- AF CAT-2023
- AFCAT
- jobs
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?