భారత శాస్త్రవేత్తలు -వారి సేవలు

ఏపీజే అబ్దుల్ కలాం ( తమిళనాడు)
-మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిచెందారు.
-పోఖ్రాన్-2 అణుపరీక్షలో కీలక పాత్ర వహించారు.
-11వ రాష్ట్రపతిగా పనిచేశారు.
-బాలిస్టక్ క్షిపణులు, లాంచ్ వెహికళ్లను అభివృద్ధి చేశారు.
-సైన్స్, రక్షణ రంగాల్లో చేసిన కృషికిగాను 1997లో భారతరత్న అవార్డు ఇచ్చారు.
-ఇతని ప్రముఖ రచనలు India 2020, Wings of Fire, Ignited Minds,Turning Points, My Journey.
-ప్రముఖ క్షిపణి ప్రయోగ కేంద్రమైన వీలర్ ద్వీపానికి అబ్దుల్ కలాం పేరుపెట్టారు.
రాజా రామన్న (కర్ణాటక)
-ఇతను అణుశక్తి శాస్త్రవేత్త, భారత అణుశక్తి కార్యక్రమానికి ఆద్యుడు.
-అప్సర, సైరస్, పూర్ణిమ రియాక్టర్ల అభివృద్ధికి కృషి చేశారు.
-భారత అణుబాంబు పితామహుడు.
శుశ్రుతుడు
-ఇతడిని శస్త్ర చికిత్స పితామహుడు అంటారు.
-శస్త్రచికిత్సలపై శుశ్రుత సంహిత గ్రంథాన్ని రాశారు.
-ఈ పుస్తకంలో ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన సమాచారం కూడా ఉంది.
-కాటర్టాక్ (కంటి వ్యాధి)కి చిక్సితను కనిపెట్టారు.
-ఇతను కాశీ విశ్వవిద్యాలయ విద్యార్థి.
ఆర్యభట్ట
-ఇతను గుప్తయుగానికి చెందిన శాస్త్రవేత్త.
-ఇతను సూర్య సిద్ధాంతం, ఆర్యభట్టీయం అనే భావనలను తెరపైకి తెచ్చారు.
-సున్నా లేదా జీరోను మొదటగా ప్రతిపాదించారు.
-సూర్య సిద్ధాంతం అనేది ఖగోళ శాస్త్రంపై అధ్యయనం. ఈ సిద్ధాంతంలో కింది నియమాలనువివరించారు.
1. రాత్రులు ఏర్పడటానికి కారణం భూమి తనచుట్టూ తాను తిరగడం అని పేర్కొన్నారు.
2. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన రుతువులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
3. సూర్య, చంద్ర గ్రహణాల గురించి వివరించారు.
4. భూమి వ్యాసార్థాన్ని చాలా దగ్గరగా కనుగొన్నారు.
ఆర్యభట్టీయం
1.రేఖాగణితం: రేఖాగణితం గురించి మొదట పేర్కొన్నది- సుళువ సూత్రాలు 2. బీజగణితం 3. అంకగణితం 4. త్రికోణమితి
-ఇతని సేవలకు గుర్తింపుగా స్థాపించిన సంస్థలు
-ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీ (పాట్నా)
-ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ అబ్జర్వేషన్ సైన్సెస్ (నైనిటాల్)
విక్రంసారాభాయ్ (అహ్మదాబాద్)
-ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం లేదా భారత అంతరిక్ష పితామహుడు అని అంటారు.
-Indian National Committee for Space Research (INCOSPAR)కు మొదటి చైర్మన్‌గా పనిచేశారు. INCOSPARను 1969లో ISROగా మారింది
-ఈయన కృషి ద్వారా 1962లో ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఏర్పాటైంది
-ఇతని ఆధ్వర్యంలో 1963 నవంబర్ 21న తొలి రాకెట్‌ను భారత్ ప్రయోగించింది.
-భారత మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను రష్యా నుంచి ప్రయోగించడంలో కీలక పాత్ర వహించారు.
వరహామిహిర
-ఇతనికి వరాహి అనే బిరుదును ఇచ్చినది-రెండో చంద్రగుప్తుడు
1.బృహత్ సంహిత- దీనిలో ఉన్న సమాచారం ఆధారంగా దీన్ని సర్వజ్ఞ అని పేర్కొన్నారు.
2.పంచసిద్ధాంతిక- దీనిలో ఖగోళశాస్త్రంలో ఐదు సిద్ధాంతాలు పేర్కొన్నారు. అవి సూర్య సిద్ధాంతం, వశిష్ట సిద్ధాంతం, పైతామహ సిద్ధాంతం, రోమక సిద్ధాంతం (ఇది ప్రస్తుత చంద్రమాన క్యాలెండర్‌కు ఆధారం), పౌలిస సిద్ధాంతం.
3.బృహత్ జాతక (జ్యోతిష్య శాస్త్రం). దీన్ని మొదటగా ప్రవేశపెట్టినది ఇతనే
బ్రహ్మగుప్తుడు
-ఇతన్ని ఇండియన్ న్యూటన్, గణక చక్ర చూడామణి అని పేర్కొంటారు.
-న్యూటన్ కంటే ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించారు.
-బృహత్ స్మృతి సిద్ధాంతం, ఖండ కాద్వక అనే పుస్తకాలను రాశాడు
Latest Updates
దేహంలోని అతిచిన్న ఎముక దేనికి సహాయపడుతుంది?
గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సే
గ్రూప్ -1 కొట్టడం సులువే!
Top Cities and Universities in the USA
సైబర్ సంగిని దేనికి సంబంధించింది?
తొలి పశువుల హాస్టల్‌ను ఏ జిల్లాలో నిర్మించారు?
Scholarships
నిశ్శబ్ద మహమ్మారి.. గుర్తించకుంటే ప్రమాదకారి
ప్లేగు లక్షణాలు వ్యాధి సోకిన ఎన్ని రోజులకు బయటపడతాయి?
రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?