కాయినేజ్ మెటల్స్ అని వేటినంటారు?

1. కింది వాటిలో సరైనది?
ఎ. ఇంధనం కెలోరిఫిక్ విలువ పెరిగితే ఇంధన సామర్థ్ధ్యం పెరుగుతుంది
బి. పెట్రోలియంను క్రూడ్ ఆయిల్ అంటారు
సి. సహజ వాయువులో మీథేన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది
డి. Co + N2ల మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు
1) బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
2. కింది వాటిని జతపర్చండి.
ఇంధనం ఉపయోగాలు
ఎ. ఆయిల్ గ్యాస్ 1. పరిశ్రమలు, ప్రయోగశాలలు
బి. గోబర్ గ్యాస్ 2. గ్రహాల్లో ఇంధనం
సి. కోల్ గ్యాస్ 3. గృహ, పారిశ్రామిక ఇంధనం
డి. సహజవాయువు 4. గృహ, కార్బన్ సమ్మేళనాల తయారీలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
3. కింది వాటిలో సరికానిది.
ఎ. ఎల్పీజీకి మిథైల్ మెర్కాప్టాన్ (CH3SH) ను కలపడం వల్ల లీకేజీ జరిగినప్పుడు గాఢమైన వాసన వస్తుంది
బి. ఎల్పీజీ సిలిండర్లో ఉన్న వాయువును అల్ప ఉష్ణోగ్రత, అధిక పీడనం వద్ద ద్రవ రూపంలో నిలువ ఉంచుతారు
సి. లిగ్నైట్ను బ్రౌన్కోల్ అంటారు
డి. యాంటీ నాకింగ్ ఏజెంట్గా టెట్రిథైల్ లెడ్ [(C2H5)4 Nb]ను ఉపయోగిస్తారు.
ఇ. రసాయనికంగా ఇంధనం మండినప్పుడు ఆక్సీకరణం వల్ల ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది
1) ఎ, బి, సి 2) బి, సి
3) సి, డి, ఇ 4) ఇ
4. కింది వాటిని జతపర్చండి.
మూలకాలు సంబంధితం
ఎ. లోహాలు 1. పాదరసంలో ఉన్న మిశ్రమలోహాలు
బి. అలోహాలు 2. లోహ, అలోహాల లక్షణాలు ఉంటాయి
సి. అర్ధలోహాలు 3. సులభంగా ఎలక్రాన్లను గ్రహిస్తాయి
డి. అమాల్గంలు 4. సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోతాయి.
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-1, డి-2
5. కింది వాటిలో లోహ లక్షణం కానిది గుర్తించండి.
ఎ. లోహాలు మెత్తగా ఉంటాయి
బి. లోహాలకు తలతన్యత ధర్మం వల్ల సన్నని తీగలుగా మార్చగలుగుతాం
సి. లోహాలకు అఘాత వర్దనీయత ధర్మం వల్ల రేకులుగా సాగదీస్తాం
డి. కాపర్, వెండి, బంగారాలను కాయినేజీ మెటల్స్ అంటారు
ఇ. లోహాలకు సోనోరస్ ధర్మం ఉంటుంది
1) ఎ 2) సి 3) డి 4) ఎ, బి
6. కింది వాటిని జతపర్చండి.
ఎ. A- గ్రూప్ 1. నికొజన్స్
బి. A- గ్రూప్ 2. క్షారమృత్తిక లోహాలు
సి. A- గ్రూప్ 3. ఆల్కలి లోహాలు (క్షార)
డి. A- గ్రూప్ 4. చాల్కోజన్స్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
7. కింది లోహాలు, వాటి ప్రాధాన్యతలను సరిగా జతపర్చండి.
ఎ. ఐరన్ 1. భూమి ఆకర్షణ శక్తికి కారణం అయ్యే లోహం
బి. నికెల్ 2. అర్ధ్దలోహం
సి. టంగ్స్టన్ 3.నూనెల హైడ్రోజనీకరణంలో
డి. జెర్మేనియం 4. అత్యంత కఠినమైన లోహం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-3
8. సరైన జోడి లేనిది ఏది.
ఎ. బోరాన్- ఒక లోహం
బి. ఆర్సినిక్- పాము కాటువేస్తే శరీరంలోకి వెళ్లే లోహం
సి. కాల్షియం- శరీరంలో ఎక్కువగా ఉండే లోహం
డి. మాంగనీస్- శరీరంలో తక్కువగా ఉండే లోహం
ఇ. మెగ్నీషియం- విటమిన్ బి12లో ఉంది
1) ఇ 2) సి 3) ఎ 4) ఏదీకాదు
9. కింది అంశాల్లో అలోహాలకు సంబంధించింది ఏది?
ఎ. అలోహాల్లో మెతక ఉంటుంది
బి. వీటి ద్రవీభవన, భాష్పీభవన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి
సి. గ్రాఫైట్ ఒక అలోహం అయినప్పటికీ ఒక మంచి విద్యుత్ వాహకం
డి. సూపర్హాలోజన్ ఒక (ఫ్లోరిన్) అలోహమే
ఇ. వీటికి సోనోరస్ ధర్మం ఉండదు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) పైవన్నీ 4) ఏవీకాదు
10. కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ. పాదరసం (Hg) ద్రవస్థితిలో ఉండే లోహం
బి. బ్రోమిన్ (Br) ద్రవస్థితిలో ఉండే ఒకే ఒక అలోహం
సి. ఆర్సినిక్ ఒక అర్ధలోహం
డి. లోహ, అలోహాలు, అర్ధ్దలోహాలు P-బ్లాక్లో ఉన్నాయి
ఇ. రేడియో ధార్మికత లోహాలు ఆల్ఫ, బీటా, గామా కిరణాలను ఉద్గారం చేస్తాయి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి, డి, ఇ 4) సి, డి, ఇ
జవాబులు
1-4, 2-1, 3-4, 4-1, 5-1, 6-2, 7-1, 8-5, 9-3, 10-3
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు