General Science Chemistry | ఒకే విధమైన అణుభావిక ఫార్ములా కలిగిన అణువులు?
సంకేతాలు, ఫార్ములాలు, సమీకరణాలు
1. సోడియం : నైట్రియం :: టంగ్స్టన్ : ?
1) టిన్ 2) యాంటిమొని
3) స్టిబియం 4) వోల్ఫ్రం
2. టిన్, లెడ్, యాంటిమొని సంకేతాలు వరుసగా?
1) Sn, Pb, Sb 2) Sb, Pb, Sn
3) Sb, Pb, An 4) W, Pb, Sb
3. జింక్ పరమాణు భారం?
1) 65.3 2) 63.5
3) 65.1 4) 61.8
4. స్వతంత్రంగా ఉండగల పరమాణువు ?
1) H 2) He
3) N 4) O
5. అణుదృక్పథం ప్రకారం పదార్థపు అతి తక్కువ, స్వతంత్రంగా ఉండే భాగం?
1) మూలకం 2) పరమాణువు
3) అణువు 4) కేంద్రకం
6. కింది వాటిలో ఫార్ములా తెలియజేసేది?
1) మూలకపు పరమాణువుల సంఖ్య
2) అణుభారం
3) సమ్మేళనంలోని వివిధ పరమాణువులు
4) పైవన్నీ
7. సల్ఫేట్ రాడికల్ సంయోజకత?
1) 3 2) -2
3) 1 4) -1
8. చతుస్సంయోజక అయాన్ కానిది?
1) Pb 2) Sn
3) Pt 4) Ba
9. కింది వాటిలో ధనాత్మక ఆవేశం గల రాడికల్?
1) ఫెర్రిక్ 2) బైకార్బోనేట్
3) పర్మాంగనేట్ 4) సల్ఫైట్
10. పొటాషియం డై క్రోమైట్ ఫార్ములా?
1) K2Cr2O7 2) KCr2O7
3) K2Cr2O4 4) పైవేవీ కావు
11. సమ్మేళనాల అణుభారాల అవరోహణ క్రమం ?
1) K2Cr2O7, H2SO4, CaCO3, KMnO4
2) H2SO4, CaCO3, H2SO4, K2Cr2O7
3) K2Cr2O7, KMnO4, CaCO3, H2SO4
4) KMnO4, CaCO3, H2SO4, K2Cr2O7
12. ఫార్మాల్డిహైడ్ ఎంపిరికల్ ఫార్ములా?
1) CH2O 2) CH2
3) CHO 4) పైవేవీ కావు
13. Ax By అనే ఫార్ములాలో A రెండు హైడ్రోజన్ పరమాణువులతో B3CI పరమాణువులతో చర్యలో పాల్గొనగలదు. అయితే x:y = ?
1) 5:3 2) 3:5
3) 2:3 4) 3:2
14. అమ్మోనియం నైట్రేట్‌లో వివిధ పరమాణు సంఖ్యల నిష్పత్తి (N:H:O)?
1) 2:4:3 2) 1:4:3
3) 3:4:1 4) 2:4:1
15. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) CuO – క్యూప్రస్ ఆక్సైడ్
2) FeO – ఫెర్రస్ ఆక్సైడ్
3) PbS – లెడ్ సల్ఫైడ్
4) H3PO4 – పాస్ఫారికామ్లం
16. రసాయన సమీకరణం సూచించేది ఏది?
1) చర్యలో పాల్గొన్న క్రియాజనకాలు
2) చర్యలో పాల్గొన్న అణువుల మోల్ సంఖ్య
3) చర్యలో ఏర్పడ్డ వాయువులు ఆక్రమించే ఘనపరిమాణం
4) పైవన్నీ
17. 8 గ్రా. కాల్షియం కార్బోనేట్‌ను వేడి చేస్తే విడుదలైన కార్బన్ డై ఆక్సైడ్ భారం?
1) 3.52 గ్రా. 2) 35.2 గ్రా.
3) 44 గ్రా. 4) 100 గ్రా.
18. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయుటలో చేయకూడనిది ?
1) కేవలం క్రియాజనకాలు మోల్‌ల సంఖ్యను మార్చాలి
2) ఫార్ములాలోని పరమాణువుల సంఖ్యను మార్చవచ్చు
3) క్రియాజనకాలు, క్రియాజన్యాల మోల్‌ల సంఖ్యను సవరణ చేయవచ్చు
4) 1, 2
19. కింది వాటిలో సరికానిది గుర్తించవచ్చు.
1) 2Pb(NO3)2 ->2PbO+O2+4NO2
2) Br2 + 2Kl -> 2KBr+l2
3) 2Pb(NO3)2 + HCL -> 2PbCl2 + HNO3
4) Na2CO3 + Ca(OH)2 -> CaCO3 + 2NaOH
20. కింది వాటిలో సరికాని ఫార్ములాను గుర్తించండి.
1) Na3PO4 2) Ca3(PO4)2
3) Al3PO4 4) Mg3(PO4)2
21. ఇప్పటి వరకు కనుగొన్న ధర్మాలను నిర్ణయించవలసిన మూలకాల సంఖ్యలు వరుసగా?
1) 106, 12 2) 108, 10
3) 114, 04 4) 118, 00
22. ఇటీవల కనుగొన్న 116వ మూలకం పేరు?
1) లివర్మోరియం 2) ప్ల్లెరోవియం
3) కాపర్నికియా 4) రాంట్జీనియం
23. పాదరసపు సంకేతం?
1) Pb 2) Hg
3) Sn 4) W
24. చాకలి సోడా ఫార్ములా?
1) NaOH 2) Na2CO3
3) NaHCO3 4) Na2SO3
25. Al నుంచి Al3+ ఎప్పుడు ఏర్పడుతుంది?
1) ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయినప్పుడు
2) రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
3) మూడు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
4) నాలుగు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
26. పాస్ఫేట్ అయాన్ ఫార్ములా?
1) PO3-4 2) O-2
3) O2- 4) OH-
27. కింది వాటిలో సంక్లిష్ట అయాన్ కానిది ఏది?
1) SO2-4 2) SO2-3
3) O2- 4) OH-
28. అల్యూమినియం సల్ఫేట్ ఫార్ములా?
1) Al2S3 2) Al2(SO4)3
3) AlSO4 4) Al3(SO4)2
29. సంయోజకతకు సంబంధించి సరికానిది గుర్తించండి.
1) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల క్లోరిన్ పరమణువుల సంఖ్య
2) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య
3) సరళ అయాన్ల సంయోజకతలు నాల్గవ గ్రూప్ వరకు గ్రూప్ సంఖ్యకు సమానంగా ఉంటాయి
4) ఏ మూలకం అయినా ఒకటి కంటే ఎక్కువ సంయోజకతలు ప్రదర్శించదు
30. సంకేతం అనే పదాన్ని మొదటిసారి ప్రవేశపెట్టింది?
1) లెవోయిజర్ 2) బెర్జీలియస్
3) ఓలర్ 4) జోసఫ్ ఫ్రాస్ట్
31. రసాయన చర్యలో పాల్గొనే పదార్థం అతి సూక్ష్మ భాగాన్ని ఏమంటారు?
1) పరమాణువు 2) అణువు
3) మూలకం 4) సమ్మేళనం
32. 27Al13లో ఉండే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వరుసగా?
1) 13, 13, 13 2) 13, 13, 14
3) 14, 13, 13 4) 14, 14, 13
జవాబులు
1.4 2.1 3.1 4.2
5.3 6.4 7.2 8.4
9.1 10.1 11.3 12.1
13.4 14.1 15.1 16.4
17.1 18.4 19.3 20.3
21.3 22.1 23.2 24.2
25.3 26.1 27.3 28.2
29.4 30.2 31.1 32.2
33. ఒకే విధమైన అణుభావిక ఫార్ములా కలిగిన అణువులు?
1) ఇలిన్, ఈథేన్ 2) బెంజీన్, ఇథిలిన్
3) బెంజిన్, ఈథేన్
4) బెంజీన్, ఎసిటిలిన్
34. ఇనార్గానిక్ బెంజీన్ అని పిలిచే బోర్జోల్ అనుభావిక ఫార్ములా?
1) B3N3H6 2) B3N3H3
3) BNH2 4) B2N2H2
35. పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7 అణుభారం ఎంత? (K=39, Cr=52, O=16)
1) 294 2) 158
3) 180 4) 342
36. ఒక కర్బన సమ్మేళనంలో 10.6 శాతం కార్బన్, 0.84 శాతం హైడ్రోజన్, 89.1 శాతం క్లోరిన్ కలవు. సమ్మేళనం
అణుఫార్ములా?
1) CH2Cl2 2) CH3Cl
3) CHCl3 4) CH3Cl3
37. 24 గ్రా. కార్బన్‌ను గాలిలో పూర్తిగా మండించినప్పుడు ఏర్పడే కార్బన్ డై ఆక్సైడ్ భారాన్ని గ్రాముల్లో లెక్కించండి.
1) 44 గ్రా. 2) 88 గ్రా.
3) 22 గ్రా. 4) 65 గ్రా.
38. ఒక గ్రాము కార్బన్‌తో చర్యనొందే ఆక్సిజన్ భారం?
1) 1.33 గ్రా. 2) 5.32 గ్రా.
3) 4.88 గ్రా. 4) 2.66 గ్రా.
39. కింది వాటిలో ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు గల అయాన్లు?
1) Mg2+, Na+ 2) Cl-, Fe3+
3) F-, Cl- 4) Al3+, Fe3+
40. CH4 + XO2 -> YCO2 + ZH2O ఈ చర్యలో X, Y, Zలు వరుసగా?
1) X=1, Y=2, Z=3
2) X=2, Y=1, Z=2
3) X=2, Y=2, Z=2
4) X=2, Y=2, Z=3
41. N3- లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య?
1) 14 2) 7
3) 11 4) 10
42. 10 గ్రా.ల H2 ఎన్ని గ్రాముల O2తో చర్య జరుపుతుంది?
1) 32 గ్రా. 2) 80 గ్రా.
3) 90 గ్రా. 4) 100 గ్రా.
43. SiO2 అణుభారం?
1) 30 2) 40
3) 60 4) 80
44. కాపర్ పరమాణు సంఖ్య, పరమాణు భారాలు వరుసగా?
1) 29, 63.5 2) 29, 58
3) 29, 58.7 4) 65.3
45. బోరాన్ సంకేతం?
1) B 2) Be
3) Br 4) Ba
46. హైడ్రార్జిరం అంటే?
1) H 2) He
3) Hg 4) HCl
47. Mg++ అయాన్ సంయోజకత?
1) +1 2) +2
3) -1 4) -3
48. ఓజోన్ అణు ఫార్ములా?
1) O2 2) O4
3) O3 4) O5
49. సోడియం కార్బోనేట్కు మరో పేరు?
1) తినే సోడా 2) ఉతికే సోడా
3) బేకింగ్ సోడా 4) దాహక సోడా
50. +2, +3 అయాన్లను ఏర్పరిచే మూలకం?
1) బోరాన్ 2) ఇనుము
3) జింక్ 4) లెడ్
51. ప్లాటినం సంయోజకత?
1) 1 2) 2
3) 4 4) 3
52. వోల్ఫ్రం అంటే?
1) బంగారం 2) టంగ్స్టన్
3) వెండి 4) టిన్
53. ఫెర్రం అంటే?
1) ఇనుము 2) వెండి
3) బంగారం 4) లెడ్
54. కాల్షియం కార్బోనేట్‌ను వేడి చేస్తే ఏర్పడే పదార్థాలు?
1) Ca, C, O2 2) CaC2, O2
3) CaO, CO2 4) Ca, CO3
55. కాపర్ సల్ఫేట్ రంగు?
1) నీలి రంగు 2) పసుపు
3) తెలుపు 4) నలుపు
56. కాపర్ కార్బోనేట్ ఫార్ములా?
1) CuCO3 2) CuSO4
3) CaCO3 4) Ca(OH)2
జవాబులు
33.4 34.3 35.1 36.3
37.2 38.4 39.1 40.2
41.4 42.2 43.3 44.1
45.1 46.3 47.2 48.3
49.2 50.2 51.3 52.2
53.1 54.3 55.1 56.1
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
తెలుసుకుందాం
తరంగం ప్రాథమిక అంశాలు
1. తరంగదైర్ఘ్యం – ఒక పూర్తి తరంగం ప్రయాణం చేసిన దూరం. అంటే రెండు వరుస సంపీడనాల (లేదా) రెండు వరుస శృంగాల మధ్య దూరం
ప్రమాణాలు – ఆంగ్‌స్ట్రామ్ (1 ఆంగ్‌స్ట్రామ్ = 10-8 సెం.మీ.)
2. కంపన పరిమితి – యానకంలోని కణం తన విరామ స్థానం నుంచి ప్రయాణించే గరిష్ఠ దూరాన్ని కంపన
పరిమితి అంటారు.
ప్రమాణాలు – మి.మీ., సెం.మీ., మీటర్
3. ఆవర్తన కాలం – తరంగం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలం అంటారు.
ప్రమాణాలు – సెకను
4. తరంగ వేగం – ఒక సెకను కాలంలో తరంగం ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు.
ప్రమాణాలు – మీటర్/సెకను
5. దశ – అంతరాలంలో ఒక బిందువు వద్ద తరంగం తాత్కాలిక స్థితిని ప్రావస్థ అంటారు.
ప్రమాణాలు – రేడియన్లు
6. దశా భేదం – తరంగంలోని ఏవైనా రెండు బిందువుల వద్ద గల దశల మధ్య తేడాను దశాభేదం అంటారు.
7. పౌనఃపున్యం – ఒక సెకను కాలంలో తరంగం చేసే డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు
సహజ పౌనఃపున్యం – ప్రతి వస్తువు శక్తిని పొందిన ప్రతిసారి ఒక ప్రత్యేక పౌనఃపున్యంతో కంపిస్తుంది. ఈ పౌనఃపున్యాన్ని సహజ పౌనఃపున్యం అంటారు. ఈ కంపనాలను సహజ కంపనాలు అంటారు.
అవరుద్ధ డోలనాలు- క్రమంగా కంపన పరిమితి తగ్గిపోయే డోలనాలు బలాత్కృత డోలనాలు – ఒక వస్తువుపై బాహ్య బలాన్ని పదేపదే ప్రయోగిస్తే ఆ వస్తువు, ప్రయోగించిన బలానికి అనుకూలమైన పౌనఃపున్యంతో కంపనాలు చేస్తుంది. ఇటువంటి కంపనాలను బలాత్కృత కంపనాలు అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు