POLITY | జాతీయ ట్రాన్స్‌జెండర్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులుంటారు?
పాలిటీ
1. కింది చట్టాల్లో సరికానిది ఏది?
1) జాతీయ మహిళ కమిషన్ చట్టం 1991
2) గృహహింస నిరోధక చట్టం 2005
3) నిర్భయ చట్టం 2014
4) శారదా చట్టం 1929
2. మహిళా ఉద్యమాల్లో సరికానిది?
1) చిప్కో ఉద్యమం 1972
2) వరకట్న నిషేధ సవరణ చట్టం 1984
3) ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధ చట్టం 1994
4) న్యూయార్క్‌లో మహిళా హోదా మొదటి సమావేశం 1948లో జరిగింది
3. ఐక్యరాజ్యసమితి మహిళా తీర్మానాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) 1948 డిసెంబర్ 10న యూఎన్ఓ మానవ హక్కుల ప్రకటన చేసింది
2) 1953లో మహిళల ఆర్థిక హక్కుల తీర్మానం
3) 1967లో మహిళలపట్ల అన్ని రకాల వివక్షను తొలగించాలని యూఎన్ఓ తీర్మానించింది
4) 1975 లో మొట్టమొదటి ప్రపంచ మహిళా సమావేశం మెక్సికోలో జరిగింది
4. కిందివాటిలో బాలల హక్కులకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) ప్రపంచంలో బాలల జనాభాలో 19 శాతం భారతదేశంలో ఉన్నారు
2) 15(2)నిబంధన ప్రకారం బాలల హక్కుల కోసం ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు
3) 21(ఎ) ప్రకారం 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి
4) 25వ నిబంధన ప్రకారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన
5. అంతర్జాతీయ మహిళా దశాబ్దాన్ని గుర్తించండి.
1) 1976-1985 2) 1978-1987
3) 1979-1988 4) 1980-1990
6. కిందివాటిలో బాలల హక్కులకు సంబంధించి సరికాని వాక్యం?
1) 24వ నిబంధన బాలకార్మిక వ్యవస్థ రద్దు
2) 23వ నిబంధన -బాలలను అవినీతి, అశ్లీల కార్యక్రమాలకు వినియోగించడం నేరం
3) 39(ఇ) నిబంధన బాలల ఆరోగ్యం కోసం చట్టం చేయడం
4) 18వ నిబంధన – బాలలకు బిరుదులు ఇవ్వడం
7. బాలల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చట్టాల్లో సరికానిది?
1) గనుల హక్కుల చట్టం 1952
2) సమగ్ర బాలల అభివృద్ధి పథకం-1980
3) బాల కార్మిక నిషేధ చట్టం -1986
4) బాలల హక్కులపై ఐక్యరాజ్య సమితి తీర్మానం -1992
8. కింది వాటిలో బాలల హక్కుల చట్టాలకు సంబంధించి సరికానిది ఏది?
1) బాలల న్యాయచట్టం -2000
2) బాలల హక్కుల రక్షణ చట్టం -2005
3) సమగ్ర బాలల రక్షణ పథకం -2009
4) నేరాల నుంచి బాలలను రక్షించే చట్టం-2014
9. కింది వాటిలో బాలల హక్కు కానిది?
1) ఆరోగ్యం, శరీర పోషణ హక్కు
2) కూడు, గుడ్డ, నీడ హక్కు
3) కష్టమైన పనిచేయకుండా ఉండే హక్కు
4) దౌర్జన్యం చేసే హక్కు
10. వికలాంగుల రక్షణకు సంబంధించి సరికాని వాక్యం?
1) భారత జనాభాలో 10 శాతం వికలాంగులున్నారు
2) 2011 జనాభా లెక్కల ప్రకారం 2.2 వికలాంగులున్నారు
3) 41వ నిబంధన ప్రకారం వీరి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం
4) 45వ నిబంధన ప్రకారం వీరికి ప్రత్యేక సదుపాయాలను కల్పించడం
11. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) వికలాంగుల హక్కుల రక్షణ బిల్లు 2012లో ప్రవేశ పెట్టారు
2) వికలాంగుల జాతీయ విధానం 2006
3) వికలాంగుల ప్రత్యేక మంత్రిత్వశాఖ 2012
4) వయోవృద్ధి పథకం 2012
12. కిందివాటిలో వయోవృద్ధుల హక్కు కానిది?
1) 1991 ఐక్యరాజ్య సమితి వయోవృద్ధుల తీర్మానం చేసింది
2) గౌరవం పొందే హక్కు
3) వ్యాయామం పొందే హక్కు
4) ఆసరా పొందే హక్కు
13. వృద్ధుల చట్టాలకు సంబంధించి సరికానిది ఏది?
1) వృద్ధాప్య పెన్షన్ చట్టం -1950
2) హిందూ వారసత్వ నిర్వహణ చట్టం-1958
3) వయోవృద్ధుల జాతీయ విధానం -1999
4) సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007
14. ట్రాన్స్‌జెండర్‌కు సంబంధించి సరికానిది?
1) 2016లో పార్లమెంటులో ట్రాన్స్‌జెండర్‌కు సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించింది
2) వీరిని స్త్రీలు లేదా పురుషులు లేదా రెండింటి సమూహం లేదా దేనికి చెందని పౌరులుగా గుర్తిస్తారు
3) 21వ ప్రకరణ ప్రకారం వీరికి కూడా జీవించే హక్కు సమాన గౌరవం పొందే హక్కు ఉంటుంది
4) ఇతర పౌరుల వలే అన్ని హక్కులు వీరికి వర్తించవు
15. జాతీయ ట్రాన్స్‌జెండర్ కౌన్సిల్ గురించి సరికానిది?
1) దీనిని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేస్తుంది
2) దీన్ని కేంద్ర సామాజిక న్యాయమంత్రిత్వ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉంటారు
3) దీనిలో 5 మంది సభ్యులు ఉంటారు
4) దీనికి వైస్ చైర్మన్ ఉండరు
16. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) 2007 సీనియర్ సిటిజన్ యాక్ట్‌ను అమలు చేశారు
2) ఈ చట్టం ప్రకారం వృద్ధుల సంరక్షణ కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, అల్లుళ్ల్లది.
3) వృద్ధులను సంరక్షించకపోతే 6 నెలల జైలువిక్ష 10 వేలు రూపాయలు జరిమాన విధిస్తారు
4) దీన్ని కూడా అతిక్రమించిన వారికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది
17. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
1) మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు కె.సి. నియోగి
2) 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి చేర్చిన అంశాలు విద్య, అడవులు కుటుంబ నియంత్రణ
3) విద్యుచ్ఛక్తి ఉమ్మడి జాబితాకి చెందినది
4) కేంద్రం నుంచి రాష్ర్టాలకు లభించే ప్రణాళిక సహాయం లక్డావాలా ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది
18. ప్రణాళికా సంఘం విధి కానిది?
1) పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం
2) ప్రణాళికా అమలును సమీక్షించడం
3) రాష్ట్ర ప్రణాళికలను ఆమోదించడం
4) దేశంలో మానవ ఇతర వనరులను అంచనా వేయడం
19. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు గల కారణాలు గుర్తించండి.
1) రాజకీయ, పరిపాలనా కారణాలు
2) సాంస్కృతిక కారణాలు
3) వ్యూహాత్మక కారణాలు 4) పైవన్నీ
సమాధానాలు
1-3 2-4 3-2 4-4
5-1 6-4 7-2 8-4
9-4 10-4 11-4 12-3
13-2 14-4 15-4 16-4
17-4 18-2 19-4
రాజకీయ పార్టీలు
1. రాజకీయ పార్టీలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేయాలంటే రాజకీయ పార్టీలు చాలా అవసరం
2) రాజకీయ పార్టీలు అనే పదాన్ని 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 వ షెడ్యూల్లో చేర్చారు
3) 19(1)సి ప్రకారం రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసుకోవచ్చు
4) 1987లో పార్టీ ఫిరాయింపు చట్టంలో మొదటిసారిగా రాజకీయ పార్టీలు అనే పదాన్ని చేర్చారు
2. భారతదేశంలో పార్టీ వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
1) భారతదేశంలో జాతీయోద్యమ కాలం లోనే రాజకీయ పార్టీలు అవతరించాయి
2) 1885లో జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు
3) ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి
4) ప్రస్తుతం దేశంలో 58 ప్రాంతీయ పార్టీలున్నాయి
3. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ప్రస్తుతం దేశంలో 2538 రిజిస్టర్ పొలిటికల్ పార్టీలు ఉన్నాయి
2) ప్రస్తుతం దేశంలో 53 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి
3) 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోవాలి
4) 4000 పొలిటికల్ రీజినల్ పార్టీలు ఉన్నాయి
4. రాజకీయ పార్టీల వర్గీకరణలో సరికానిదేది?
1) జాతీయ పార్టీలు
2) ప్రాంతీయ పార్టీలు
3) నమోదిత పార్టీలు
4) గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలు
5. భారత రాజకీయ పార్టీలకు సంబంధించి సరికానిది ఏది?
1) భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థ అమల్లో ఉంది
2) చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం కొనసాగించింది
3) ప్రజారహిత ప్రభావ పార్టీలున్నాయి
4) ప్రజారహిత ప్రతిపక్ష పార్టీలున్నాయి
6. 2010లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి సరికాని షరతు ఏది?
1) లోక్‌సభ లేదా రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీకి 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో పోలై చెల్లిన ఓట్లలో 6 శాతం సాధించాలి
2) ఏదైనా రాష్ర్టాల్లో 4 లోక్‌సభ స్థానాలు గెలవాలి లేదా 3 రాష్ర్టాల్లో 3 శాతం సీట్లు సాధించాలి
3) 5 రాష్ర్టాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి
4) 4 రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి
7. కిందివాటిలో జాతీయ పార్టీ కానిది
1) కాంగ్రెస్ 2) టీడీపీ
3) బహుజన్ సమాజ్ 4) బీజేపీ
8. కిందివాటిలో జాతీయ పార్టీ కానిది ఏది?
1) బీఆర్ఎస్
2) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్
3) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ
4) పైవేవీకాదు
9. నేషనల్ పీపుల్స్ పార్టీ గురించి సరికానిది?
1) దీన్ని 2013లో పీఏ సంగ్మా స్థాపించారు
2) మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ పార్టీ ప్రభావశీలంగా ఉంది
3) ఈ పార్టీని 2015లో సస్పెండ్ చేశారు
4) ఇది 2014 ఎన్నికల్లో 28 లోక్‌సభ స్థానాలను సాధించింది
10. ప్రాంతీయ పార్టీకి అర్హతలు కానివి?
1) ఆ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను ఒక స్థానాన్ని ఆ రాజకీయ పార్టీ సాధించాలి
2) ఆ రాష్ట్ర శాసన సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3 శాతంగాని లేదా 8 శాతం ఓట్లు సాధించడంతోపాటు 3 అసెంబ్లీ స్థానాలను కూడా గెలవాల్సి ఉంటుంది
4) ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లతోపాటు ఒక లోక్‌సభ స్థానాన్ని కూడా గెలవాల్సి ఉంటుంది
11. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.
1) ఏకపార్టీ వ్యవస్థలో ఒక పార్టీ మాత్రమే ఉంటుంది. ప్రతిపక్షపార్టీలు ఉండవు
2) జాతీయ పార్టీల సంఖ్య ప్రాంతీయ పార్టీల సంఖ్య ఎప్పుడు సమానంగా ఉంటుంది
3) ఏకపార్టీ వ్యవస్థ కమ్యూనిస్టు దేశాల్లో నియంతృత్వ దేశాల్లో అమల్లో ఉంటుంది
4) గతంలో సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు పార్టీ, జర్మనీలో నాజీపార్టీ, ఇటలీలో ఫాసిస్టు పార్టీలు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
12. ద్విపార్టీ వ్యవస్థ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) దేశ రాజకీయాల్లో ప్రధానంగా రెండు పార్టీల ప్రభావం కలిగి ఉంటాయి
2) ఇతర రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వాటి ఉనికి చెప్పుకోదగ్గ విధంగా ఉండదు
3) అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు ఉన్నాయి
4) భారతదేశం కూడా ద్విపార్టీ వ్యవస్థకు చెందినదే
13. కింది వాటిలో సరికానిది.
1) గతంలో ఇటలీలో ఫాసిస్ట్ పార్టీ ఉంటూ ఏకపార్టీ వ్యవస్థను చెలాయించినది
2) ఇంగ్లండ్‌లో ద్విపార్టీలు అయిన కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీలు ప్రభావం చూపుతున్నాయి
3) భారతదేశంలో బహుళపార్టీ వ్యవస్థ ఉన్నది
4) భారతదేశంలో 1998 వరకు కాంగ్రెస్ ఒక్కటే ప్రభావం చూపింది
14. కిందిపార్టీ స్థాపనలకు సంబంధించి సరికానిది ఏది?
1) భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 ముంబై
2) ముస్లింలీగ్ పార్టీ 1906 (ఢాకా)
3) శిరోమణి అకాళీదళ్ పార్టీ 1921 (గుజరాత్)
4) నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1927 (కశ్మీర్)
15. రాజకీయ పార్టీలకు సంబంధించి సరికానిది ఏది?
1) వీటికి చట్టబద్ధత లేదు
2) 50 కంటే తక్కువ ఉన్న నియోజకవర్గాల రాష్ర్టాల్లో కనీసం 5 స్థానాలు పోటీ చేయాలి
3) 20 కంటే తక్కువ పార్లమెంట్ స్థానాలుంటే కనీసం 2 స్థానాల్లో పోటీచేయాలి
4) భారతీయ పౌరులు కొంతమంది మాత్రమే రాజకీయ పార్టీలను స్థాపించుకోవాలి
16. కాంగ్రెస్‌పార్టీకి సంబంధించి సరికానిది ఏది?
1) దీనిని 1885 డిశంబర్ 28న బొంబాయిలో స్థాపించారు
2) దీన్ని స్థాపించినది ఏవో హ్యూమ్
3) దీని మొదటి అధ్యక్షుడు డబ్ల్యూ.సి.బెనర్జీ
4) దీనిలో ఇంతవరకు చీలికలు రాలేదు
17. కిందివాటిలో సరికానిది రాయండి.
1) 1950 ఆవడి సమావేశంలో కాంగ్రెస్ సామ్యవాద తరహా సమాజాన్ని కోరుకున్నది
2) 1969లో యంగ్ టర్క్స్ అనే వర్గం చంద్ర శేఖర్ నాయకత్వంలో విప్లవాత్మక విధానాన్ని ప్రాతిపాదించింది.
3) 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయీకరణ చేసింది
4) 1970లో గరీబీ హఠావో నినాదాన్ని తెచ్చారు
సమాధానాలు
1-4 2-4 3-4 4-4
5-3 6-3 7-2 8-4
9-4 10-3 11-2 12-4
13-4 14-3 15-4 16-4
17-4
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు