Research institutes | పరిశోధన సంస్థలు
ప్రతి విషయానికి పరిశోధన అనేది ముఖ్యం. సమస్యల పరిష్కారానికి, నూతన విషయాలను నిరూపించడానికి, కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలను అభివృద్ధి చేయడానికి చేసే అధ్యయనాన్ని పరిశోధన అంటారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే అందుకు తగిన వనరుల లభ్యత అవసరం. వాటిని సమాజాభివృద్ధికి అనుగుణంగా, పర్యావరణహితంగా ఎలా వాడుకోవాలో, ఏం చేయాలో పరిశోధన ద్వారానే తెలుస్తుంది. ఇందుకు దేశంలో ఉన్నత విద్య తర్వాత పరిశోధన చేయడానికి చాలా సంస్థలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
-దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
-ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో 1958లో ఏర్పడింది.
-దీని ఆధ్వర్యంలో 52 ప్రయోగశాలలు ఉన్నాయి.
-శక్తికి మూలం సైన్స్‌లోనే ఉంది అనేది దీని నినాదం.
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ
-ఇది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.
-దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 1977లో ఏర్పాటు చేశారు.
-మానవ జీవన భద్రత, అంటురోగాలు తదితర వ్యాధులపై అధ్యయనం చేస్తుంది.
నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది హైదరాబాద్‌లో ఉంది.
-దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 1961లో ఏర్పాటు చేశారు.
-భూగర్భ జల వనరులు, భూకంప ప్రమాదం, భూమి లోపలి నిర్మాణం, దాని పరిణామం వంటివాటిపై అధ్యయనం చేస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
-ఇది హైదరాబాద్‌లో ఉంది.
-దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో 1958లో ఏర్పాటు చేశారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
-ఇది హైదరాబాద్‌లో ఉంది.
-దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 1944లో ఏర్పాటు చేశారు.
-ప్రాథమిక, అనువర్తిత, బయో, బయోఇన్ఫర్మాటిక్స్, రసాయన ఇంజినీరింగ్‌లపై పరిశోధనలను నిర్వహిస్తుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్
-ఇది న్యూఢిల్లీలో ఉంది.
-దీనిని 1929లో స్థాపించారు.
-వ్యవసాయ విద్య, పరిశోధనకు సంబంధించినవాటిపై బాధ్యత వహిస్తుంది.
-దీని అధ్యక్షుడు రాధామోహన్ సింగ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్
-ఇది ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉంది.
-అటవీ పరిశోధన, అటవీ వినియోగదారుల సంస్థలకు అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అటవీ విద్యను అందించడానికి 1987లో స్థాపించారు.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్
-ఇది ముంబైలో ఉంది. అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న భారత ప్రభుత్వ జాతీయ కేంద్రం.
-దీనిని సర్ హోమీ బాబా విజన్‌తో, దొరాబ్జి టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1945లో స్థాపించారు.
-దీనిలో భౌతిక, రసాయన, జీవ, గణిత శాస్ర్తాల్లో, కంప్యూటర్ సైన్స్ విద్యలో పరిశోధనలు చేస్తున్నారు.
సెంట్రల్ గ్లాస్, సెరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది కోల్‌కతాలో ఉంది.
-దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 1950లో స్థాపించారు.
-ఇది గాజు, సెరామిక్, మైకా ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది.
సెంట్రల్ షీప్ అండ్ ఊల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది రాజస్థాన్‌లోని మల్పురాలోని అవికానగర్‌లో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అనుబంధ సంస్థ అయిన దీనిని 1962లో స్థాపించారు.
-ఇది గొర్రెలు, కుందేళ్లకు సంబంధించిన పరిశోధన, శిక్షణ నిర్వహిస్తుంది.
నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్
-ఇది ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉంది.
-ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్నది.
-దీనిని ప్రత్యేకంగా చేపల పెంపకంలో పరిశోధన చేయడానికి 1983లో స్థాపించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
-ఇది కర్ణాటకలోని బెంగళూరులో ఉంది.
-దీనిని 1938లో స్థాపించారు.
-ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
సెంట్రల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అలైడ్ ఫైబర్స్
-ఇది పశ్చిమబెంగాల్లోని బరక్‌పూర్‌లో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో దీనిని 1953లో స్థాపించారు.
-ఇది జనపనార, అనుబంధ పంటలపై పరిశోధన చేస్తుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్
-ఇది తమిళనాడులోని కోయంబత్తూరులో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని 1988లో స్థాపించారు.
-అటవీ నిర్మూలన, సాంఘిక అటవీప్రాంతాల్లోని చెట్ల రకాల జాతులను గుర్తించడానికి, అటవీ అభివృద్ధికి ఇది కృషిచేస్తుంది.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్
-ఇది కోల్‌కతాలో ఉంది.
-మహేంద్ర లాల్ సర్కార్ అనే ఒక ప్రైవేట్ వైద్యుడు దీనిని 1876లో స్థాపించారు.
-ప్రాథమిక సైన్స్‌పై ఈ సంస్థ దృష్టి పెడుతుంది.
ఆరిడ్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని 1988లో స్థాపించారు.
-వేడి, సెమీ శుష్క ప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడటానికి, సాంకేతికతను అందించడానికి అటవీ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనను నిర్వహిస్తుంది.
రెయిన్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది అసోంలోని జోర్హాట్లో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని 1988లో స్థాపించారు.
ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్
-ఇది పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది.
-భారత ప్రభుత్వం, సాంకేతిక పరిజ్ఞానం విభాగం కింద గణితశాస్త్రంలో ప్రాథమిక పరిశోధన చేయడానికి దీనిని 1986లో ఏర్పాటు చేశారు.
-చంచల్ కుమార్ మజుందార్.. దీనిని శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ పేరుపై స్థాపించారు.
అగార్కర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది మహారాష్ట్రలోని పుణెలో ఉంది.
-దీన్ని మొదట డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో 1946లో స్థాపించారు.
-దీని స్థాపకులు శంకర్ పురుషోత్తమ్ అగార్కర్ పేరుతో అగర్కార్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్గా 1992లో మార్చారు.
-ఇది జంతు, సూక్ష్మ, మొక్కల శాస్ర్తాల్లో పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ
-ఇది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.
-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని 1997లో స్థాపించారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్
-ఇది న్యూఢిల్లీలో ఉంది.
-దీన్ని ప్రఖ్యాత ఆర్థికవేత్త వీకేఆర్‌వీ రావు 1958లో స్థాపించారు.
-ఇది ఆర్థిక, సాంఘిక అభివృద్ధిపై పరిశోధన చేస్తుంది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ
-ఇది జార్ఖండ్‌లోని రాంచీ వద్ద ఉన్నది.
-దేశ వ్యవసాయశాఖ, వ్యవసాయ మార్కెటింగ్ అవసరాలను తీర్చడానికి, పరిశోధన చేయడానికి 2013లో దీనిని ఏర్పాటు చేశారు.
ఓమియో కుమార్ దాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్
-ఇది అసోంలోని గువాహటిలో ఉంది.
-కేంద్రం, అసోం రాష్ట్రం సంయుక్తంగా మొదట ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్‌మెంట్‌గా 1989లో ఏర్పాటు చేశారు.
-అసోం రాష్ట్ర మొదటి విద్యాశాఖ మంత్రి ఓమియో కుమార్ దాస్ పేరు మీద దీనిని ఓమియో కుమార్ దాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ డెవలప్‌మెంట్‌గా 1995లో మార్చారు.
-అసోం, ఇతర రాష్ర్టాల సామాజిక పరివర్తన, అభివృద్ధి, సమస్యలు, ప్రక్రియలపై అధ్యయనం చేస్తుంది.
వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ
-ఇది ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉంది.
-దీనిని హిమాలయాల భూగర్భ శాస్త్ర అధ్యయనం కోసం 1968లో స్థాపించారు.
-దీని స్థాపకుడు దరాష నొషెర్వాన్ వాడియా.
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్
-ఇది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.
-ఎకనామిక్, సోషల్ సైన్సెస్‌లో పరిశోధన కార్యకలాపాల కోసం 1980లో దీనిని స్థాపించారు.
-సీహెచ్ హనుమంతరావు దీని స్థాపకుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు