కంటిలోని రెటీనా చేసే పనిని కెమెరాలో ఏ భాగం చేస్తుంది?
1. కాంతి ఒక?
ఎ) యాంత్రిక తరంగం
బి) విద్యుదయాస్కాంత తరంగం
సి) తిర్యక్ తరంగం డి) బి, సి
2. గ్రహణాలు ఏర్పడటం అనేది కాంతి ఏ ధర్మం?
ఎ) రుజుమార్గంలో ప్రయాణించడం
బి) వ్యతికరణం
సి) వివర్తనం డి) ధృవణం
3. సైనికులు కందకాల్లో దాక్కొని శత్రువులను చూడటానికి ఉపయోగించేది?
ఎ) కెలాడియోస్కోప్ బి) పెరిస్కోప్
సి) ఆసిలోస్కోప్ డి) ఐకనోస్కోప్
4. స్టీలు చెమ్చా ఉబ్బుగా ఉన్నవైపు ఏ దర్పణంగా పనిచేస్తుంది?
ఎ) సమతల బి) పుటాకార
సి) కుంభాకార డి) సమతలపుటాకార
5. కాంతి వేగం ఎంత?
ఎ) 3×105 km/s బి) 3×106 km/s
సి) 3×107 km/s డి) 3×108 km/s
6. పుటాకార దర్పణం ఏర్పరిచే నిజ ప్రతిబింబం?
ఎ) చిన్నగా, నిటారైంది
బి) పెద్దగా, నిటారైంది
సి) చిన్నగా, తలకిందులైంది
డి) పెద్దగా, తలకిందులైంది
7. ఒక వ్యక్తి దర్పణం ముందు 5మీ. దూరంలో నిల్చొని ఉంటే అతనికి, అతని ప్రతిబింబా-నికి మధ్య దూరం ఎంత?
ఎ) 2.5 మీ. బి) 5 మీ.
సి) 10 మీ. డి) 20 మీ.
8. దర్పణం ముందు నిల్చున్న వ్యక్తి ఆ దర్పణం వైపునకు ఒక మీటరు నడిస్తే అతనికి, అతని ప్రతిబింబానికి మధ్యదూరం ఏమవుతుంది?
ఎ) 1 మీ. తగ్గుతుంది
బి) 1 మీ. పెరుగుతుంది
సి) 2 మీ. తగ్గుతుంది
డి) 2 మీ. పెరుగుతుంది
9. పుటాకార దర్పణం వక్రతా వ్యాసార్థం 40 సెం.మీ అయితే ఆ దర్పణం నాభ్యాంతరం ఎంత?
ఎ) 20 సెం.మీ బి) 40 సెం.మీ
సి) 80 సెం.మీ డి) లెక్కించలేం
10. సమతల దర్పణం నాభ్యాంతరం?
ఎ) 0 బి) 100 సెం.మీ.
సి) అనంతం
డి) నాభ్యాంతరం ఉండదు
11. ఎదరెదురుగా ఉంచిన రెండు సమతల దర్పణాల మధ్య నిలుచున్న వ్యక్తి చూడగల ప్రతిబింబాల సంఖ్య?
ఎ) 3 బి) 6 సి) 9 డి) అనంతం
12. రెండు సమతల దర్పణాలను 900 కోణంలో ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
ఎ) 1 బి) 2 సి) 3 డి) అనంతం
13. మీటరు పొడవున్న వ్యక్తి తన పూర్తి ప్రతిబింబాన్ని చూసుకోవడానికి అవసరమయ్యే దర్పణం కనీస ఎత్తు?
ఎ) 25 సెం.మీ. బి) 50 సెం.మీ
సి) 1 మీ. డి) 2 మీ.
14. దృశా తంతువు పనిచేసే సూత్రం?
ఎ) వ్యతికరణం బి) వివర్తనం
సి) సంపూర్ణాంతర పరావర్తనం
డి) కాంతి ధృవణం
15. ఎండమావులు ఏర్పడటానికి కారణం?
ఎ) వ్యతికరణం బి) వివర్తనం
సి) సంపూర్ణాంతర పరావర్తనం
డి) ధృవణం
16. వేసవిలో నల్లటి రోడ్డుపై నీరు ఉన్నట్లు కనిపించడానికి కారణం?
ఎ) సంపూర్ణాంతర పరావర్తనం
బి) వివర్తనం
సి) సంబద్ధత డి) వ్యతికరణం
17. సాధారణంగా సినిమా ప్రదర్శనలో ఒక సెకనులో కదిలే ఫ్రేముల సంఖ్య?
ఎ) 6 బి) 12 సి) 18 డి) 24
18. పాత్రను నీటితో నింపినప్పుడు దానిలోతు వాస్తవం కంటే తక్కువగా కనిపించడానికి కారణం?
ఎ) వక్రీభవనం బి) వ్యతికరణం
సి) ధృవణం డి) పరవర్తనం
19. సూర్యోదయం కంటే ముందే వెలుగు రావడానికి కారణం?
ఎ) వ్యతికరణం బి) వక్రీభవనం
సి) వివర్తనం డి) ధృవనం
20. మెరుగు పెట్టిన వజ్రం మెరవడానికి కారణం?
ఎ) సంపూర్ణాంతర పరావర్తనం
బి) వివర్తనం
సి) ధృవణం డి) పైవన్నీ
21. వక్రీభవనం వల్ల పగలు సమయం
ఉండాల్సిన దాని కంటే?
ఎ) 2 నిమిషాలు పెరుగుతుంది
బి) 2 నిమిషాలు తగ్గుతుంది
సి) 4 నిమిషాలు పెరుగుతుంది
డి) 4 నిమిషాలు తగ్గుతుంది
22. సాధారణ వక్రీభవన గుణకం విలువ?
ఎ) ఎప్పుడూ 1 కంటే తక్కువ
బి) ఎప్పుడూ 1 కంటే ఎక్కువ
సి) ఎప్పుడూ రుణాత్మకం
డి) ధనాత్మకం లేదా రుణాత్మకం
23. ఏ యానకంలో కాంతి వేగం గరిష్ఠం?
ఎ) వజ్రం బి) నీరు
సి) గాలి డి) శూన్యం
24. ఇంద్రధనస్సులో పైన ఉండే రంగు ఏది?
ఎ) ఎరుపు బి) ఊదా
సి) నారింజ డి) నీలం
25. పాథమిక వర్ణం కానిది?
ఎ) ఎరుపు బి) ఆకుపచ్చ
సి) నీలం డి) పసుపు
26. గౌణ వర్ణం కానిది?
ఎ) ముదురు ఎరుపు బి) ఎరుపు
సి) పసుపు డి) ముదురు నీలం
27. న్యూస్ పేపర్ ముద్రణ, కలర్ ప్రింటర్లలో ఉపయోగించని రంగు ఏది?
ఎ) ముదురు ఎరుపు బి) ముదురు నీలం
సి) పసుపు డి) ఆకుపచ్చ
28. పసుపు, నీలం రంగులను కలిపినప్పుడు ఏర్పడే రంగు?
ఎ) ఆకుపచ్చ బి) ఊదా
సి) నారింజ డి) తెలుపు
29. ‘అన్ని రంగులు కలిస్తే తెలుపు రంగు ఏర్పడుతుంది’ ఈ విషయాన్ని ప్రదర్శించే పరికరం?
ఎ) న్యూటన్ వీల్ బి) స్పెక్ట్రొమీటర్
సి) ఫ్లైవీల్ డి) పైవన్నీ
30. ఆకుపచ్చని వస్తువును ఎరుపు రంగు అద్దాలు పెట్టుకొని చూస్తే ఆ వస్తువు కనిపించే రంగు?
ఎ) తెలుపు బి) పసుపుపచ్చగా
సి) ఎరుపు రంగులో డి) ఆకుపచ్చగా
31. నీలిరంగు బల్బు కాంతిలో ఉంచిన ఎర్రని వస్తువు ఏ రంగులో కనిపిస్తుంది?
ఎ) నల్లగా బి) పసుపు పచ్చగా
సి) ఎరుపురంగులో డి) ఆకుపచ్చగా
32. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం?
ఎ) సూర్యుని నుంచి ఎర్రని కాంతి మాత్రమే వెలువడుతుంది
బి) సూర్యకాంతి భూమిని చేరే సరికి ఎర్రగా మారుతుంది
సి) సూర్యకాంతిలో అన్ని రంగులున్నప్పటికీ పరిక్షేపణం వల్ల ఎరుపు రంగు మాత్రమే భూమిని చేరుతుంది
డి) మధ్యాహ్నం కంటే, ఉదయం ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల
33. అంబులెన్స్ పైన అక్షరాలను తిరగేసి రాయడానికి కారణం?
ఎ) ప్రత్యేకంగా ఉండటానికి
బి) ముందు ఉన్న వాహనాల అద్దాల్లో సరిగా కనిపించడానికి
సి) అది ఒక ఆచరం కాబట్టి
డి) పైవన్నీ
34. మంచు ప్రాంతాల్లో తిరిగే వాహనాలకు ఎరుపు, నారింజ రంగు హెడ్లైట్లను ఉపయోగించడానికి కారణం?
ఎ) ఈ రంగుల తరంగదైర్ఘ్యం తక్కువ
బి) మిగతా రంగుల కంటే ఎక్కువ దూరం చెదిరిపోకుండా ప్రయాణిస్తాయి
సి) ప్రత్యేకంగా ఉండటానికి
డి) ఈ రంగుల పౌనఃపున్యం తక్కువ
35. కటక సామర్థ్యాన్ని కొలిచే యూనిట్లు?
ఎ) సెం.మీ. బి) మీ.
సి) డయాప్టర్లు డి) అంగ్స్ట్రామ్లు
36. 20 సెం.మీ. నాభ్యాంతరం ఉన్న కటక సామర్థ్యం ఎంత?(డయాప్టర్లలో)
ఎ) 5 బి) 20 సి) 0.5 డి) 0.05
37. మానవుని కన్ను 1 సెకను కాలంలో విడివిడిగా చూసే గరిష్ఠ చిత్రాల సంఖ్య ఎంత?
ఎ) 4 బి) 8 సి) 16 డి) 24
38. సాధారణ మానవుని కన్ను స్పష్టంగా చూడటానికి వస్తువు నుంచి ఉండవలసిన కనీస దూరం?
ఎ) 10 సెం.మీ. బి) 15 సెం.మీ
సి) 16 సెం.మీ డి) 25 సెం.మీ
39. ఒక కటక సామర్థ్యం -8 డయాప్టర్లు అయితే, అది ఏరకమైన కటకం, దాని నాభ్యాంతరం ఎంత?
ఎ) కుంభాకార, 12.5 సెం.మీ
బి) పుటాకార, 12.5 సెం.మీ
సి) కుంభాకార, 8 సెం.మీ
డి) పుటాకార, 8 సెం.మీ
40. దృష్టి లోపాలను సవరించడంలో కింది వాటిలో సరైనది?
ఎ) దీర్ఘదృష్టి ఉన్న వారు కుంభాకార
కటకాలను ఉపయోగిస్తారు
బి) హ్రస్వ దృష్టి ఉన్నవారు పుటాకార
కటకాలను ఉపయోగిస్తారు
సి) హ్రస్వ దృష్టి ఉన్నవారు కుంభాకార
కటకాలను ఉపయోగిస్తారు
డి) ఎ, బి
41. కంటిలోని రెటీనా చేసే పనిని కెమెరాలో ఏ భాగం చేస్తుంది?
ఎ) కటకం బి) షట్టర్
సి) ఫిల్మ్ డి) చాంబర్
42. కెమరాలో షట్టర్ చేసే పని కంటి ఏ భాగంతో పోల్చవచ్చు?
ఎ) రెటినా బి) కనుగుడ్డు
సి) కనుపాపలు డి) ఎ, బి
43. ఒక కుంభాకార కటకం దేనివలె పనిచేస్తుంది?
ఎ) సరళ సూక్ష్మదర్శిని
బి) సంయుక్త సూక్ష్మదర్శిని
సి) భూగోళ దూరదర్శిని
డి) ఖగోళదూరదర్శిని
44. బ్యాక్టీరియాను చూడటానికి ఉపయోగపడే పరికరం?
ఎ) సరళ సూక్ష్మదర్శిని
బి) సంయుక్త సూక్ష్మదర్శిని
సి) భూగోళ దూరదర్శిని
డి) ఖగోళదూరదర్శిని
45. భూగోళ దూరదర్శిని మధ్యలో ఉండే మూడో కటకం పని?
ఎ) ప్రతిబింబాన్ని కటక దోషం లేకుండా
చేస్తుంది
బి) తలకిందులుగా ఉన్న ప్రతిబింబాన్ని
నిలువుగా చేస్తుంది
సి) దూరంగా ఉన్న ప్రతిబింబాన్ని నిలువుగా చేస్తుంది డి) పైవన్నీ
46. దృష్టిలోపం ఉన్న వారికి సంబంధించి కింది వాటిలో సరైన సమాధానం?
ఎ) హ్రస్వ దృష్టి ఉన్న వారిలో దూరంగా ఉన్న వస్తువు తుది ప్రతిబింబం రెటినా ముందు ఏర్పడుతుంది
బి) దీర్ఘ దృష్టి ఉన్నవారిలో దగ్గరగా ఉన్న వస్తువు ప్రతిబింబం రెటినా వెనుక
ఏర్పడుతుంది
సి) అసమదృష్టి ఉన్న వ్యక్తి అడ్డుగీతలను, నిలువు గీతలను ఒకేసారి చూడలేడు
డి) పైవన్నీ
47. దూరదర్శని కనుగొన్నది?
ఎ) రామ్స్డన్ బి) గెలీలియో
సి) హైగెన్స్ డి) న్యూటన్
48. కొలతలు తీసుకోవడానికి ఉపయోగపడే అక్షికటకం ఏది?
ఎ) రామ్స్డన్ బి) హైగెన్స్
సి) న్యూటన్స్ డి) హెర్ట్
49. వర్ణ విపథనాలకు కారణం?
ఎ) వస్తువు ప్రధానాక్షానికి దూరంగా ఉండటం
బి) కాంతి కిరణాలు వేరువేరు చోట్ల కేంద్రీకరించబడటం
సి) వేరువేరు రంగులకు వేర్వేరు వక్రీభవన గుణకాలు ఉండటం
డి) వస్తువు కాంతి విహీనంగా ఉండటం
50. రిపుల్ ట్యాంకును ఉపయోగించి అధ్యయనం చేయగల కాంతి దృగ్విషయం?
ఎ) వక్రీభవనం బి) పరావర్తనం
సి) వివర్తనం డి) పైవన్నీ
51. స్ఫటికాల అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే కాంతి దృగ్విషయం?
ఎ) పరావర్తనం బి) వక్రీభవనం
సి) వివర్తనం డి) వ్యతికరణం
52. ‘థాయస్ యంగ్’ వివరించిన కాంతి దృగ్విషయం?
ఎ) పరావర్తనం బి) వక్రీభవనం
సి) వివర్తనం డి) వ్యతికరణం
53. డీఎన్ఏ నిర్మాణాన్ని అధ్యయనం చేయడంలో ఉపయోగపడే కాంతి ధర్మం?
ఎ) పరావర్తనం బి) ధృవణం
సి) వ్యతికరణం డి) వక్రీభవనం
54. కింది వాటిలో కాంతి తీవ్రతకు ప్రమాణం?
ఎ) ల్యూమెన్లు బి) క్యాండిలా
సి) స్టేరేడియన్లు డి) ఎర్గ్లు
55. మానవ కన్నుకు అత్యంత సూక్ష్మగాహ్యమైన రంగు?
ఎ) ఎరుపు బి) పసుపు
సి) నీలం డి) ఆకుపచ్చ
56. మొదటిసారిగా లేసర్ నియమాన్ని ప్రతిపాదించింది?
ఎ) అలీ జవాన్ బి) టౌన్స్
సి) ప్లాంక్ డి) ఐన్స్టీన్
57. ఒక అణువులో భూస్థాయిలో కంటే ఉత్తేజిత స్థాయిలో ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే స్థితిని ఏమంటారు?
ఎ) ఎలక్ట్రాన్ సంభావ్యత
బి) స్వచ్ఛంద ఉద్గారం
సి) జనాభా విలోమం
డి) ఉత్తేజిత ఉద్గారం
58. లేసర్ తరంగ దైర్ఘ్య పట్టీ వెడల్పు దాదాపుగా ఎంత ఉంటుంది?
ఎ) 10 బి) 10 nm
సి) 10 డి) 10 mm
59. రెండు తరంగాల తరంగ దైర్ఘ్యాల మధ్య దశాభేదం కాలం, స్థానాల్లో స్థిరంగా ఉండటాన్ని ఏమంటారు?
ఎ) సంబద్ధత బి) ఏకవర్ణీయత
సి) దిశాత్మకత డి) పైవన్నీ
60. లేసర్ ప్రక్రియలలో జనాభా విలోమాన్ని సాధించే ప్రక్రియను ఏమంటారు?
ఎ) డ్రైనింగ్ బి) డ్రైవింగ్
సి) పంపింగ్ డి) చేజింగ్
61. ఏ లేసర్ సహాయంతో భూభ్రమణ రేటును కచ్చితంగా నిర్థరించడం జరుగుతుంది?
ఎ) He-Ne బి) రూబీ
సి) డై లేసర్ డి) అర్ధవాహక లేజర్
62. రూబీ లేసర్ నుంచి వచ్చే కాంతి తరంగదైర్ఘ్యం?
ఎ) 4369 బి) 6328
సి) 6823 డి) 6943
- Tags
- camera
- eye motion
- lens
- light speed
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు