RPWD చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
సాధారణ విద్యార్థుల నుంచి సగటు విద్యార్థుల ప్రత్యేక అవసరాలు గల పిల్లలను వేరుపర్చి బోధించే విద్యను ‘ప్రత్యేక విద్య’ అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సగటు విద్యార్థులకు భిన్నంగా ఉంటారు. ప్రత్యేక అవసరాలు తీరుస్తూ, వారి మూర్తిమత్వ వికాసానికి, సాంఘీకరణకు తోడ్పడి వారికి తగిన పునరావాసం కల్పించడానికి దోహదపడే విద్యను ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య అంటారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా అధ్యయనంలో కింది పదాల గురించి తెలుసుకోవాలి. 1976లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వీటిని నిర్వచించింది. అవి.
బలహీనత (Impairment) )
అనువంశిక (Heredity) కారణాల వల్ల, పరిసరాల (Environment) వల్ల, శరీర నిర్మాణం, రూపం, శారీరక విభాగాల్లో తేడా వాటి పనితీరుల్లో ఏవైనా అస్వాభావికమైన/ అపసామాన్యమైన లోపాలుండటాన్ని బలహీనత అంటారు. ఈ వైకల్యం వల్ల ఆ శరీర భాగం పనితీరులో అవరోధాలుంటాయి.
వైకల్యం (Disability)
ఏ శారీరక అంగంలో బలహీనత ఉంటుందో ఆ భాగం పనితీరులోనూ, దీని వల్ల వ్యక్తుల మొత్తం పనితీరులో అశక్తులవటాన్ని వైకల్యం లేదా ‘అసామర్థ్యం’ అంటారు.
వికలాంగ/ ప్రతిబంధం (Handicap)
వైకల్యం, అసామర్థ్యాల ఫలితంగా వ్యక్తి ఎదుర్కొనే అననుకూల పరిస్థితులను (disad vantages) ‘ప్రతిబంధం’ లేదా ‘లోపం’ అని అంటారు. ఈ లోపం అనేది వ్యక్తులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులతో అననుకూలతను పొందడంలో పరస్పర చర్యలుగా ప్రతిబింబిస్తుంది.
పైన పేర్కొన్న మూడు పదాల మధ్య అంగాంగిక నమూనా (Organic mode) మీద ఆధారపడిన కార్యాత్మక పరస్పర బంధం (dunctional inter- relatio nship) ఉంది.
ఉదా: వ్యక్తికి కాలు లేకపోవడం బలహీనత, కాలు లేకపోవడం వల్ల నడవలేకపోవడం వైకల్యం, దీనితో సమాజం ప్రత్యేక వ్యక్తిగా చూడటం వికలాంగం(Handicap).
ప్రత్యేక విద్య ఆవశ్యకత
‘కొఠారి కమిషన్’ ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వం పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి.
‘అందరికీ విద్య’ అనే నినాదం ప్రకారం ‘ప్రత్యేక అవసరాలు’ గల పిల్లలకు విద్య అవసరం.
భారత రాజ్యాంగంలో 6-14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని ఆర్టికల్ 45లో పొందుపర్చారు.
6-14 సంవత్సరాల్లోపు పిల్లల్లో ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలు’ చాలా మంది ఉంటారు.
అందరికి ‘సమాన విద్యావకాశాలు’ కల్పించాలంటే ప్రత్యేక విద్య అవసరం.
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సమాజానికి కొంత సహాయం చేయగలరు.
ఉదా: దృష్టిలోపం కలిగిన లూయి బ్రెయిల్, పలు వైకల్యాలు గల హెలెన్ కెల్ల్లెర్.
ప్రత్యేక విద్యా స్వభావం
- ప్రత్యేక విద్యా అవసరాలు గల పిల్లలకు ఉద్దేశించినది.
- ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధనా పద్ధతుల్లో తేడా ఉంటుంది.
- ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక బోధనా పద్ధతులు ఉంటాయి.
ఉదా: బ్రెయిలీ లిపి - ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు.
- ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ‘ఆరోగ్య పరీక్షలు’ మనోవిజ్ఞాన పరీక్షలు మొదలైన మూల్యాంకన సాధనాలుంటాయి.
ప్రతిభావంతులు
- బోధించగల బుద్ధిమాంద్యులు
- శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యులు
- సాంఘిక సంయోజనం లోపించిన వారు
- భావోద్రేకం లోపించినవారు
- బధిరులు
- కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు
- దృష్టి లోపం కలవారు
- అంగవైకల్యం కలవారు
- దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు
- భాషణ లోపం కలవారు
PWD 1995 ( Person with Disabilty)
భారతదేశంలో మొదటి వికలాంగుల చట్టం 1995 లో పార్లమెంటు ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1996 ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వికలాంగులను 7 రకాలుగా వర్గీకరించింది.
అంధత్వం (Blindness)
కొద్దిపాటి దృష్టిలోపం (Low-vision)
కుష్ఠు వ్యాధి (Leprosy )
వినికిడి లోపం (Heariing impairment)
మానసిక అనారోగ్యం (Mental iillness)
చలన/ అంగవైకల్యం (Locomoter disa bility)
మానసిక వైకల్యం (Mental reterdation)
ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ
డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు.
- అంధత్వం
- కుష్ఠు
- దృష్టిలోపం
- వినికిడి లోపం
- చలన వైకల్యం
- మరుగుజ్జుతనం
- బుద్ధిహీనత
- మానసిక సమస్యలు
- ఆటిజమ్
- సెరిబ్రల్ టిస్ట్టోపి
- మస్కులర్ టిస్టోపి
- నాడీ సంబంధిత సమస్యలు
- మల్ట్టిపుల్ స్టెరోసిన్
- తలసేమియా
- మాట్లాడలేకపోవడం
- హిమోఫీలియా
- సికెల్ సెల్ డిసీజ్
- మల్టిపుల్ డిజేబిలిటీస్
- యాసిడ్ దాడి బాధితులు
- పార్కిన్సన్ బాధితులు
చట్టంలోని ముఖ్యాంశాలు
- ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల వయస్సు వరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అభ్యసన వాతావరణం కల్పించి ఉచిత విద్యను అందించాలి.
- సాధారణ పాఠశాలల్లోనే చదువుకునేలా వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహించాలి.
- 5వ తరగతి పూర్తిచేసి పై తరగతులకు వెళ్లలేని వారికి పార్ట్‌టైమ్ క్లాస్‌లు నిర్వహించాలి.
- ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పుస్తకాలు, పరికరాలు ఉచితంగా ఇవ్వాలి.
- పాఠశాలలో వికలాంగ విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా భవన నిర్మాణం చేయాలి.
- వికలాంగ విద్యార్థుల ప్రయోజనార్థం పాఠ్యాంశాలను తగిన రీతిలో పునర్వ్యవస్థీకరించాలి.
- వికలాంగులకు 3శాతం రిజర్వేషన్ కల్పించాలి.
RPWD 2016 (Right of Person with Disabilty)
- 1995- PWD act స్థానంలో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం రావడానికి కింది పరిస్థితులు తోడ్పడ్డాయి.
- 2000 సంవత్సరంలో United National millinium diclaration (UNMD) రూపొందించారు. దీని ప్రకారం
- 2015 నాటికి ప్రపంచ దేశాలన్నీ 100శాతం 14సంవత్సరాల్లోపు పిల్లలకు విద్యని సాధించాలని (వికలాంగులు కూడా) నిర్ణయించారు. ఈ డిక్లరేషన్ని భారత్ ఆమోదించింది.
- 2006లో ఐక్యరాజ్యసమితి (UNC RPWD) United National Conven ction for Right of Person with disability ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సమావేశం నిర్వహించి ఒక డిక్లరేషన్ ప్రకటించింది.
- దీనిని UNCRPWD అంటారు. ఈ డిక్లరేషన్‌లో వికలాంగుల హక్కుల గురించి పేర్కొన్నారు.
- దీనికి అనుగుణంగా 2016లో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని రూపొందించింది. (RPWD) ఈ చట్టం 2016 డిసెంబర్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం వికలాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 4శాతానికి పెంచింది. ఈ చట్టం వికలాంగులను 21 రకాలుగా వర్గీకరించింది.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా నమూనాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం 3 విద్యా నమూనాలు ఉన్నాయి. అవి.
సమైక్య విద్య
ప్రత్యేక విద్య
సమ్మిళిత విద్య
సమైక్య విద్య
లోపాలు కలిగిన విద్యార్థులకు కొన్ని రోజులు ప్రత్యేకంగా బోధించి వారు సాధారణ స్థాయికి చేరగానే సాధారణ తరగతిలో పిల్లలందరితో కలిసి బోధించడాన్ని సమైక్య విద్య అంటారు.
ప్రత్యేక విద్య
లోపాలు తీవ్రస్థాయిలో కలిగిన బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించడం. ప్రత్యేక విద్య భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధించినవి. ఉదా: అంధుల పాఠశాల, బధిరుల పాఠశాల.
సమ్మిళిత విద్య
బలాలు బలహీనతలతో సంబంధం లేకుండా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, సాధారణ పిల్లలు అందరూ కలిసి ఒక పాఠశాల సముదాయంలో భాగం కావడాన్ని విలీన విద్య, సమ్మిళిత విద్య, సహిత విద్య అని అంటారు.
సమ్మిళిత విద్య (Inclusive Ecuction)
- ‘సమ్మిళిత విద్య’ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా దాదాపుగా ప్రపంచ దేశాలన్నింటిలో ఉద్భవించింది. గత 50 సంవత్సరాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్య ప్రత్యేక విద్య (Spl. Edn) నుంచి సహిత విద్య (Integrated Education) గా మార్పు చెందడంలో సమ్మిళిత విద్య ప్రధాన చర్చనీయాంశం. విద్యావేత్తల అభిప్రాయంలో ‘సమ్మిళిత విద్య’ అనేది మానవ హక్కు (Human right) గా పేర్కొన్నారు.
- క్రిస్టెన్సెన్ (christensen) ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరుచేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది’ అని 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
- లిప్స్కీ, గార్నర్ (Lipsky & Garner) కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కు (Fundamental right) గా పేర్కొన్నారు. దీనినే UNESCO కూడా తన Salmanaea Statement (1994) లో ఉద్ఘాటించింది. 1990లో థాయిలాండ్‌లోని జామితియెన్ (Jomitien) పట్టణంలో జరిగిన అందరికీ విద్య ప్రపంచ సదస్సు తర్వాత 1994లో స్పెయిన్‌లోని సాలమాంక నగరంలో 92 దేశాల ప్రభుత్వాలు, 25 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సమావేశమై ప్రత్యేక విద్యావసరాల సూత్రాల విధి విధానాలపై సాలమాంక ప్రకటన విడుదల చేశారు.
- “ శిశు కేంద్రీకృత బోధనా విధానాలను అనుసరించి ప్రత్యేక విద్యావసరాలున్న పిల్లలకు సాధారణ పాఠశాలల్లోనే వారి అవసరాలు తీరే విధంగా విద్యావకాశాలను కల్పించాలి”
- సాలమాంక (salamanca) ప్రకటనను సమ్మిళిత విద్యలో మాగ్నాకార్టాగా పేర్కొంటారు.
1994 మార్చిలో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ కూడా సహిత విద్య ప్రాధాన్యత గుర్తించింది.
సహితవిద్య నిర్వచనాలు-భావనలు
- ప్రతి పిల్లవాన్ని ఒక అభ్యాసకునిగా గుర్తించి జాతి, కుల, వర్ణ, మత, వర్గ, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా వారి శారీరక జ్ఞానాత్మక, సాంఘిక, ఉద్వేగ, భాషాపరమైన భేదాలను పరిగణలోకి తీసుకోకుండా
- వారి సమాజంలోని సాధారణ పాఠశాలల్లోనే విద్య అందడమే ‘విలీన విద్య’
- సమ్మిళిత విద్యా విధానాలు, ప్రక్రియ త్వరితగతిన సాధించేందుకు ‘ప్రత్యేక అవసరాల విద్య’ పై 1994లో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక.. ‘పిల్లలందరికీ అవసరాలు తీర్చేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాపరమైన అవసరాలను తీర్చేవిధంగా సాధారణ పాఠశాలలను తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చేయవలసిందిగా సూచించారు.
- యునెస్కో ప్రకారం ‘ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా, అభ్యసన, సంస్కృతి, సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి భిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియే సమ్మిళిత విద్య’.
- ఒక వయోపరిమితిలోని పిల్లలందరిని వారి భావనలకు అనుగుణంగా ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలల్లో విద్య అందించడానికి బోధనా పద్ధతులు, విధానాల అంశాల్లో మార్పులు కూడా భాగస్వామ్యం అవుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు