అభ్యసన బదలాయింపు వేటి మధ్య జరుగుతుంది?
1. ఒక ఉపాధ్యాయుడు ఇద్దరి నుంచి నలుగురు విద్యార్థులను ఒక సహకార సమూహంగా ఏర్పరచి, పాఠ్యగ్రంథ విషయంపై జవాబు సూచిక డైలాగులను వంతుల వారీగా చెప్పించడం.
1) పరస్పర బోధన
2) ప్రత్యుపాయ బోధన
3) విస్తార బోధన
4) సహకార అభ్యసనం
2. మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం.
1) అభ్యసన అంశాలను అర్థవంతంగా, అంతర్గత ప్రేరణతో నేర్చుకోవడం
2) నిర్విరామంగా నేర్చుకోవడం
3) అవరోధాన్ని కలిగి ఉండటం
4) పునర్బలనాలను పొందుతూ నేర్చుకోవడం
3. కింది వాటిలో అంతర్గత ప్రేరణను సూచించేది.
i) చింటు తుఫాను బాధితుల కోసం పాటల పోటీలో ప్రైజ్ మనీ గెలవాలనుకోవడం
ii) చింటు తండ్రి దగ్గర గుర్తింపు పొందాలని పాటల పోటీలో పాల్గొనడం
iii) చింటు తోటి పిల్లలు మెచ్చుకోవాలని పాటల పోటీలో పాల్గొనడం
iv) చింటు పాటల పోటీలో పాల్గొనడం ద్వారా ఆనందం పొందడం
1) i, iv 2) iv
3) ii, iv 4) i, ii, iv
4. ఏరకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం నిలిచి ఉండదు.
i) బహిర్గత ii) సహజ
iii) కృత్రిమ iv) దీర్ఘకాలిక
1) i,iii 2) i 3) iii 4) ii, iv
5. ఒక పిల్లవాడికి మొదట 20 చిత్రపటాలను చూపించి, వాటిని మరొక 60 చిత్రపటాలతో కలిపి, మొదట చూపిన 20 గుర్తించమంటే 15 తప్పుగా గుర్తిస్తే అతడి గుర్తింపు గణన
1) 75 శాతం 2) 25 శాతం
3) 50 శాతం 4) 66.6 శాతం
6. ఒక పిల్లవాడు ఆంగ్ల స్టోరీని మొదటిసారి 40 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 20 రోజుల తర్వాత రెండోసారి అదే ఆంగ్ల స్టోరీని 10 ప్రయత్నాల్లో నేర్చుకుంటే అతడి పొదుపు గణన ఎంత?
1) 25 శాతం 2) 50 శాతం
3) 75 శాతం 4) 16.6 శాతం
7. అభ్యసన బదలాయింపు అనేది వీటి మధ్య జరుగుతుంది.
1) రెండు నేర్చుకున్న విషయాల మధ్య జరుగుతుంది.
2) రెండు నేర్చుకోబోయే విషయాల మధ్య జరుగుంతుంది.
3) ఒక నేర్చుకున్న, ఒక నేర్చుకోబోయే విషయం మధ్య జరుగుతుంది.
4) ఏవిధంగానైనా జరగవచ్చు.
8. A అనే విద్యార్థి B అనే విద్యార్థికి ఆంగ్లం అభ్యసించడంలో సహాయపడ్డాడు. A నుంచి పొందిన జ్ఞానంవల్ల B ఆంగ్లంలో అధిక మార్కులు సాధించాడు. అయితే ఇక్కడ B, A లో జరిగే బదలాయింపు వరుసగా..
1) అనుకూల, అనుకూల
2) శూన్య, అనుకూల
3) అనుకూల, శూన్య
4) శూన్య, శూన్య
9. 8వ తరగతికి చెందిన ఒక విద్యార్థి మూర్తిమత్వాన్ని పెంపొందించడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఉపాధ్యాయుడు ఈ అభ్యసన రంగానికి ప్రాధాన్యమిచ్చాడు.
1) మానసిక చలనాత్మక 2) క్రియాత్మక
3) భావావేశ 4) జ్ఞానాత్మక
10. ఏ స్మృతి టెక్నిక్‌ను ఉపయోగించి పిల్లలు దిక్కులు, మూలలను వరుస క్రమంలో “ఊరుతై అదనెపవగా” గుర్తుంచుకుంటారు.
1) కొండ గుర్తులు
2) ద్వంద్వ సంసర్గ అభ్యసనం
3) రిహార్సల్
4) గుంపులుగా ఏర్పరుచుకోవడం
11. కింది వాటిలో స్మృతిని పెంపొందించుకోవడానికి తోడ్పడేది.
i) అతి అభ్యసనం
ii) నిర్విరామ అభ్యసనం
iii) వల్లె వేయడం
iv) విరామ అభ్యసనం
1) i, iii, iv 2) ii
3) ii, iii 4) i, ii, iv
12. విద్యార్థుల్లో మానసిక చలనాత్మక రంగ వికాసానికి దోహదపడే కృత్యం.
1) కవితల పోటీ 2) పాటల పోటీ
3) బృందగానం 4) ఈత, సైక్లింగ్
13. సకశేరుక వర్గాలను అభ్యసించిన తర్వాత అకశేరుక వర్గాలను గుర్తు తెచ్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బంది.
1) పురోగమన అవరోధం
2) తిరోగమన అవరోధం
3) దమనం
4) వాడుక లోపం
14. ఎబ్బింగ్ హౌస్ ప్రకారం వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివరకు జరిగే విస్మృతి, స్మృతి శాతం.
1) 75 శాతం, 25 శాతం
2) 72శాతం, 28శాతం
3) 28 శాతం, 72 శాతం
4) 25 శాతం, 75 శాతం
15. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక పాఠాన్ని బోధించిన తర్వాత ఆ పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలపై బహుళైచ్ఛిక రూపంలో పరీక్ష నిర్వహించాడు. అతడు విద్యార్థుల్లో దీన్ని మాపనం చేయదలిచాడు.
1) గుర్తింపు 2) పునఃస్మరణ
3) పునరభ్యసనం 4) వైఖరులు
16. “యథారాజా తథా ప్రజ” అనేది ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది.
1) అనుకరణ 2) నిర్గమ సిద్ధాంతం
3) ఉద్గమ సిద్ధాంతం 4) సంధాన సిద్ధాంతం
17. పాఠశాలపై ఇష్టాన్ని ఏర్పరుచుకున్న సిరి ఉదయాన్నే స్కూల్ డ్రెస్ వేయగానే ఆనంద పడటం నిబంధిత అభ్యసనంలోని ఈ నియమాన్ని సూచిస్తుంది.
1) పునర్బలనం 2) సామాన్యీకరణ
3) విరమణ 4) ఉన్నత క్రమ నిబంధనం
18. నర్సరీ పాఠశాలకు చెందిన సిరి పలకపై రాసి ఇచ్చిన A అనే అక్షరాన్ని పలుమార్లు పలుకుతూ దిద్దటం వల్ల A అక్షరాన్ని రాయగలగటం ఈ అభ్యసన సిద్ధాంతాన్ని సూచిస్తుంది.
1) ఎంపిక సంధాన సిద్ధాంతం
2) పరిశీలనాభ్యసనం
3) శాస్త్రీయ నిబంధనం
4) కార్యసాధక నిబంధనం
19. ఉపాధ్యాయుడు తరగతిలో హృదయ నిర్మాణాన్ని వివరించిన తర్వాత సిరిని హృదయ పటాన్ని నల్లబల్లపై గీయమన్నాడు. ఆ ఉపాధ్యాయుడు సిరిలో ఈ విషయాన్ని మాపనం చేయదలిచాడు.
1) పునఃస్మరణ 2) గుర్తింపు
3) పునఃభ్యసనం 4) అభిరుచి
20. 6వ తరగతి చదువుతున్న సరయు అసెంబ్లీలో నీతి పద్యాన్ని చదవమంటే చదివింది. కాని భావాన్ని తెలపలేకపోయింది. సరయులోని స్మృతి.
1) స్వల్పకాలిక 2) దీర్ఘకాలిక
3) క్రియాత్మక స్మృతి 4) బట్టీ స్మృతి
21. వ్యక్తి స్వభావసిద్ధంగా ఇతరులను అనుకరించే ప్రవృత్తి ఈ ప్రేరణను సూచిస్తుంది.
1) బహిర్గత 2) సహజ
3) సాధన 4) క్రియాత్మకత
22. సంకేత రూపంలో భద్రపరిచిన ఎన్గ్రామ్లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి మార్చడాని సంబంధించి సరికానిది.
1) ఎన్కోడింగ్ 2) డీకోడింగ్
3) జ్ఞప్తికి తెచ్చుకోవడం 4) రిట్రైవల్
23. కథలు సంఘటనలకు, సన్నివేశాలకు నాటకీకరణ చేయడం ద్వారా వాటిని నేర్చుకొని జ్ఞప్తికి ఉంచుకోవడం.
1) నిష్క్రియాత్మక స్మృతి
2) తార్కిక స్మృతి
3) క్రియాత్మక స్మృతి
4) సంసర్గ స్మృతి
24. ఉపాధ్యాయుడు నల్లబల్లపై గీత గీసి దాన్ని చెరపకుండా చిన్నది చేయడం ఎలా అని ప్రశ్నించినప్పుడు సిరి ఆకస్మికంగా వచ్చిన ఆలోచన వల్ల సమస్యకు పరిష్కారం చూపే అభ్యసనం.
1) శాస్త్రీయ నిబంధనం
2) కార్యసాధక నిబంధనం
3) యత్న దోష సిద్ధాంతం
4) అంతర దృష్టి
25. విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలపడంలో న్యూటన్‌కు ఈ అభ్యసన సిద్ధాంతం దోహదపడింది.
1) శాస్త్రీయ నిబంధనం
2) అంతర దృష్టి
3) కార్యసాధక నిబంధనం
4) యత్న దోష
26.ప్రశ్నించడం, సంక్షిప్తీకరించడం, స్పష్టం చేయడం, ప్రాగుక్తీకరించడం అనేది నిర్మాణాత్మక అభ్యసనంలోని ఈ అంశాన్ని సూచిస్తుంది.
1) పరస్పర బోధన
2) భాగస్వామ్యయుత బోధన
3) నిరంతర బోధన 4) జ్ఞాన బోధన
27. విస్మృతికి కారణం
1) కొండ గుర్తులు
2) అర్థవంతంగా చదవకపోవడం
3) సంసర్గాలు 4) అతి విశ్వాసం
28. కింది వాటిలో సరైనది.
1) పునఃస్మరణ కన్నా గుర్తింపు తేలిక
2) గుర్తింపు కన్నా పునఃస్మరణ తేలిక
3) పునఃస్మరణ కన్నా గుర్తింపు రెండు రెట్లు చిన్నది
4) గుర్తింపు కన్నా పునఃస్మరణ ఆరు రెట్లు పెద్దది
29. ఒక తోటలో ఒకేరకమైన గులాబీలు పెంచినప్పటి కంటే వివిధ రకాల గులాబీలు పెంచినప్పుడు ఆ తోట అందంగా కనిపిస్తుంది. ఇందులోని సిద్ధాంత భావన.
1) శాస్త్రీయ నిబంధన
2) కార్యసాధక నిబంధన
3) అంతర దృష్టి 4) యత్న దోష
30. దేశంలోని రాష్ర్టాలు, ముఖ్యమంత్రుల పేర్లు చెప్పమని అడగటంతో మురళి తన స్మృతిలో నుంచి సమాచారాన్ని బయటకు తీసే ప్రయత్నం.
1) సందర్భ సంకేతం
2) దీర్ఘకాలిక స్మృతి
3) వ్యవస్థీకరణ
4) వెనక్కి తీసుకోవడం
31. డెజావూ అనగా
1) గతంలో చూసిన దాన్ని ఇప్పుడు గుర్తించలేకపోవడం
2) గతంలో చూడటం వల్ల ఒక విషయాన్ని రాసినట్లు అనిపించడం
3) గతంలో చూడకపోయినా ఎక్కడో చూసినట్లు ఉంది అనిపించడం
4) ప్రస్తుతం చూస్తున్న విషయం గతంలో కూడా చూసి ఉండటం
32. గతంలో చూడటం వల్ల ఒక విషయాన్ని ఎక్కడో చూసినట్లు ఉంది అనిపించడం
1) పునఃస్మరణ 2) గుర్తింపు
3) పునరభ్యసనం 4) ధారణ
33. జంతువులపైన చేసిన ప్రయోగాలకు సంబంధించి సరైనది.
i) థారన్‌డైక్ (అమెరికా) పిల్లి
ii) స్కిన్నర్ (అమెరికా) ఎలుక/పావురం
iii) పావ్లోవ్ (రష్యా) కుక్క
iv) కొహ్లెర్ (జర్మనీ) చింపాంజీ
1) i,ii 2) i, ii, iii
3) ii, iii, iv, i 4) iv, iii
34. చీకట్లో మాత్రమే సంచరించే బొద్దింక చీకటి ప్రాంతానికి వెళ్లగానే అతి స్వల్పంగా షాక్ కొట్టేటట్లు చేస్తే కొద్ది కాలానికి చీకట్లో సంచరించడం మానేయడం.
1) సకారాత్మక నిబంధనం
2) నకారాత్మక నిబంధనం
3) పురోగామి నిబంధనం
4) తిరోగామి నిబంధనం
35. “మెరిసేదంతా బంగారమే” అనుకోవడం ఈ నియమాన్ని సూచిస్తుంది.
1) సామాన్యీకరణం 2) విచక్షణ
3) విరమణ 4) ఆయత్న సిద్ధ స్వాస్థ్యం
36. ఉపాధ్యాయుడు- విద్యార్థి, బ్లాక్‌బోర్డు- చాక్‌పీస్, పుస్తకం- పెన్ వంటి పదాలు ఒకదాని వెంట ఒకటి తటస్థపడటం ఈ థారన్‌డైక్ నియమాన్ని సూచిస్తుంది.
1) సారూప్యత 2) సామీప్యత
3) ప్రేరణాకారక 4) సంబంధిత
37. రసాయనశాస్త్రంలో అణు నిర్మాణం అనే పాఠ్యాంశ అభ్యసనం, భౌతికశాస్త్రంలో అదే పాఠ్యాంశ అభ్యసనాన్ని సులభతరం చేయడంలో ఇమిడి ఉన్న నియమం.
1) సామీప్య నియమం
2) సారూప్య నియమం
3) పాక్షిక చర్యా నియమం
4) బహుళ ప్రతిస్పందన నియమం
38. 1857 అనగానే సిపాయిల తిరుగుబాటు గుర్తుకు రావడం
1) సామీప్యత 2) సారూప్యత
3) సంబంధిత 4) పాక్షిక చర్య
39. శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి సరికానిది
1) ప్రతిస్పందన వెలువడినా వెలువడకపోయినా పునర్బలనం లభిస్తుంది.
2) థారన్‌డైక్ సామీప్యత నియమంపైన ఆధారపడుతుంది.
3) రాబట్టిన ప్రతిస్పందనలు(నిర్గమాలు)
4) ప్రవర్తన పరిసరాలతో సంబంధం కలిగి బహిర్గతంగా ఉంటుంది.
40. కార్యసాధన నిబంధనానికి సంబంధించి సరికానిది.
1) ప్రతిప్పందనకు ప్రాధాన్యత కలదు
2) ప్రవర్తన పరిసరాలతో సంబంధం కలిగి బహిర్గతంగా ఉంటుంది.
3) బయటకు వదిలిన ప్రతిస్పందనలు (ఉద్గమాలు)
4) ప్రవర్తన అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటుంది.
41. అంతర దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది.
1) గెస్టాల్ట్వాదానికి చెందింది
2) ఆయత్నసిద్ధ అభ్యసనం జరుగుతుంది
3) మొత్తానికి కాకుండా విడి భాగాలకు ప్రాధాన్యం ఇస్తుంది
4) సమస్య పరిష్కారం హఠాత్తుగా లభిస్తుంది
43. సంధాన సిద్ధాంతానికి చెందింది.
1) చింటు ఉపాధ్యాయుడి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవడం
2) చింటు అలారం మోత వినగానే నిద్ర నుంచి మేల్కోవడం
3) చింటు క్లిష్టమైన గణిత సమస్యలను సులభంగా సాధించగలగడం
4) చింటు యోగాసనాలు సాధన చేయడం
జవాబులు
1-1 2-2 3-2 4-1 5-2 6-3 7-3 8-3 9-3 10-1 11-2 12-4 13-2 14-1 15-1 16-1 17-4 18-1 19-1 20-4 21-2 22-1 23-3 24-4 25-2 26-1 27-2 28-1 29-3 30-4 31-3 32-2 33-3 34-2 35-1 36-2 37-2 38-1 39-4 40-4 41-3 42-3 43-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు