రాజ్యాంగ ప్రవేశికలోని పదాల వరుసక్రమం ఏది ?
నవంబర్ 2 నిపుణ స్పెషల్ 6వ పేజీ తరువాయి
48. రాజ్యంగ పరిషత్ ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీకి అధ్యక్షులుగా ఎవరు వ్యవహరించారు?
1) జీవీ మౌలాంకర్
2) అనంతశయనం అయ్యంగార్
3) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
4) బెనగళ్ నరసింగరావు
49. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు
బి) రాజ్యాంగ రచనకు అయిన వ్యయం- రూ.64 లక్షలు
సి) ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ పరిషత్‌లో చర్చ జరిగిన రోజులు -165
డి) రాజ్యాంగ రచనకు పట్టిన సమయం -2 సంవత్సరాల 11నెలల 18 రోజులు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
50. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగసభ ఎప్పుడు ఆమోదించింది?
1) 1948, నవంబర్ 4
2) 1949, నవంబర్ 26
3) 1950, జనవరి 24
4) 1950, జనవరి 26
51.రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన
జవాబును గుర్తించండి?
ఎ) ఫ్రాన్స్ 1) రాష్ట్రపతితో గవర్నర్ల నియామకం
బి) దక్షిణాఫ్రికా 2) అత్యవసర పరిస్థితి సమయంలో
ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయడం
సి) కెనడా 3) గణతంత్ర, ప్రొటెం స్పీకర్
డి) జర్మనీ 4) రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం
1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1 4) ఎ-4, బి-3, సి-1, డి-2
52. రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఏక పౌరసత్వం, సమన్యాయం,
పార్లమెంటరీ విధానం
బి) పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం
సి) శాసన నిర్మాణ ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ
డి) స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వ్యవస్థ, న్యాయస్థానాలు రిట్స్ జారీచేయడం.
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
53. మన రాజ్యాంగ నిర్మాతలు అమెరికా (USA) నుంచి గ్రహించిన అంశాల్లో లేని దాన్ని గుర్తించండి?
1) స్వేచ్ఛా వాణిజ్య వ్యాపార చట్టాలు, అంతర్ రాష్ట్ర వర్తక వాణిజ్యం
2) రాజ్యంగ ఆధిక్యత, రాజ్యంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు
3) స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థ, న్యాయసమీక్ష
4) ఉపరాష్ట్రపతి పదవి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం.
54. మన రాజ్యాంగ నిర్మాతలు వివిధ దేశాల రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఐర్లాండ్ 1) అవశిష్ట అధికారాలు కేంద్రానికి లభించడం
బి) ఆస్ట్రేలియా 2) ఉమ్మడి జాబితా
సి) జపాన్ 3) ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం
డి) కెనడా 4) జీవించే హక్కు
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-4
55. భారత రాజ్యాంగాన్ని ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ కి జిరాక్స్ కాపీ(నకలు) వంటిదని ఎవరు వ్యాఖ్యానించారు?
1) మౌలానా హస్రత్ మొహాని
2) రోహిణీ కుమార్ చౌదరి
3) ప్రామథ రంజన్ ఠాగూర్
4) దామోదర్ స్వరూప్ సేథ్
56. భారత రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) అందమైన 1) కె.సి.వేర్
అతుకుల బొంత
బి) ఐరావతం వంటిది 2) ఐవర్ జెన్నింగ్స్
సి) అర్ధసమాఖ్య 3) గాన్‌విల్ ఆస్టిన్
డి) న్యాయవాదుల స్వర్గం 4) హెచ్.వి. కామత్
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-1, బి-4, సి-3, డి-2
57. భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగాను వ్యవహరిస్తుందని ఎవరు వ్యాఖ్యానించారు?
1) డా.బి.ఆర్. అంబేద్కర్
2) జవహర్లాల్ నెహ్రూ
3) ఐవర్ జెన్నింగ్స్
4) దామోదర్ స్వరూప్‌సేథ్
58. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1946లో భారతదేశానికి పంపిన కేబినెట్ మిషన్/ మంత్రిత్వ రాయబార బృందంలో లేని సభ్యుడిని గుర్తించండి?
1) పెథిక్ లారెన్స్ 2) రిచర్డ్ జాన్సన్
3) సర్ స్టాఫర్డ్ క్రిప్స్
4) ఎ.వి. అలెగ్జాండర్
59. రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు, వారి ప్రత్యేకతలకు సంబంధించి సరైనజవాబును గుర్తించండి?
ఎ) సరోజినీ నాయుడు 1) విదేశీ రాయబారిగా సోవియట్ రష్యాలో పనిచేశారు
బి) సుచేత కృపలాని 2) తొలి మహిళా గవర్నర్
సి) విజయలక్ష్మీ పండిట్ 3) రాజ్యాంగ సభలో మహిళలకు ప్రాతినిధ్యం
డి) హంసామెహతా 4) తొలి మహిళా ముఖ్యమంత్రి
1) ఎ-2, బి-4, సి-1, డి-3 2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3 4) ఎ-3, బి-1, సి-4, డి-2
60. రాజ్యాంగ సభకు ఎన్నికైన ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర (History of Indian National Congress) అనే గ్రంథాన్ని రాశారు?
1) ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
2) అనంతశయనం అయ్యంగార్
3) కె.టి.షా
4) భోగరాజు పట్టాభి సీతారామయ్య
61. కింది అంశాల్లో సరైన జవాబునుగుర్తించండి?
ఎ) ముసాయిదా రాజ్యాంగంపై వచ్చిన
సవరణ ప్రతిపాదనలు -7,635
బి) సమగ్ర చర్చ అనంతరం ఆమోదించిన సవరణ ప్రతిపాదనలు -2,473
సి) ఎక్కువ సవరణ ప్రతిపాదనలు
తీసుకువచ్చింది హెచ్.వి. కామత్
డి) రాజ్యాంగ సభ ఆమోదించిన రాజ్యాంగం పై సంతకాలు చేసిన సభ్యులు 284
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
62. 1950, జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో గల అంశాలకు సంబంధించి సరికానిది గుర్తించండి?
1) ఆర్టికల్స్- 395 2) షెడ్యూల్స్- 8
3) భాగాలు- 22 4) షెడ్యూల్స్- 12
63. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) భారత రాజ్యాంగం ప్రవేశికతో
ప్రారంభమవుతుంది
బి) ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదాల సముదాయంతో
ప్రారంభమవుతుంది
సి) ప్రవేశిక రాజ్యాంగానికి ముందుమాట, ఉపోద్ఘాతం వంటిది
డి) ప్రవేశికను సవరించే వీలులేదు
1) ఎ, బి, డి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
64. రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1951)
2) బెరుబారి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1960)
3) కేశవానంద భారతి Vs యూనియన్ ఆఫ్ కేరళ కేసు (1973)
4) ఎస్.ఆర్.బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994)
65. ‘రాజ్యాంగ ప్రవేశిక’ రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
1) కేశవానంద భారతి Vs యూనియన్ ఆఫ్ కేరళ కేసు (1993)
2) గోలక్‌నాథ్ Vs యూనియన్ ఆఫ్ పంజాబ్ కేసు (1967)
3) ఇందిరా సహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992)
4) రాం జువాయ సింగ్ Vs యూనియన్ ఆఫ్ పంజాబ్ కేసు (1974)
66. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) భారతదేశం ప్రాతినిధ్య ప్రజాస్వామ్య
విధానాన్ని అనుసరిస్తుంది.
బి) భారతదేశం 1947, ఆగస్టు 15న
సార్వభౌమ రాజ్యంగా అవతరించింది.
సి) భారతదేశం 1950 జనవరి 26న
గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
డి) భారతదేశం 1952, జనవరి 26న
లౌకిక రాజ్యంగా అవతరించింది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
67. రాజ్యాంగ ప్రవేశికలోని పదాల వరుసక్రమాన్ని గుర్తించండి?
1) సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర
2) సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర
3) సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర
4) సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర
68. రాజ్యాంగ ప్రవేశికపై గల వ్యాఖ్యానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రవేశిక రాజ్యాంగానికి కంఠాభరణం, మణిహారం మైలురాయి వంటిది
– భార్గవదాస్ ఠాకూర్
బి) ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది
– హిదయతుల్లా
సి) ప్రవేశిక రాజ్యాంగానికి కీలక సూచిక వంటిది – ఎర్నెస్ట్ బార్కర్
డి) ప్రవేశిక రాజ్యాంగ లక్షణాల సారాంశం
నానీ పాల్కీవాలా
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి
69. ఇందిరాగాంధీ ప్రభుత్వం ‘రాజ్యాంగ ప్రవేశిక’ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సవరించెను?
1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
2) 25వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
70. ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికను సవరించి ప్రవేశికకు చేర్చిన పదాల సముదాయంలో లేని దాన్ని గుర్తించండి?
1) సామ్యవాద 2) సర్వసత్తాక
3) లౌకిక 4) సమగ్రత
71. దేశంలో ‘ప్రజాస్వామ్య సామ్యవాదం’ అనే లక్ష్యాన్ని సాధించేందుకు భారత ప్రభుత్వంచేపట్టిన చర్యలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) పనికి ఆహార పథకం 1) 1978
బి) 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం 2) 1970
సి) ఆస్తిహక్కు తొలగింపు 3) 1977
డి) రాజభరణాల రద్దు 4) 1975
72. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారత్‌లో వివిధ మతాలకు సంబంధించి సరికాని జవాబును గుర్తించండి?
1) హిందువులు -80 శాతం
2) ముస్లింలు -13 శాతం
3) క్రైస్తవులు -20 శాతం
4) బౌద్ధులు 4 శాతం
73. లౌకిక రాజ్యం లక్షణం కానిది గుర్తించండి?
1) మత వ్యవహారాల్లో తటస్థంగా ఉండేది
2) మత ప్రమేయం లేనిది
3) మతరహితమైంది
4) ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధనను నిషేధించేది.
74. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ‘డెమోక్రసీ’ అనే ఆంగ్ల పదం ‘డెమోస్’, ‘క్రేషియా’ అనే గ్రీకు పదాల నుంచి
ఆవిర్భవించింది
బి) ‘డెమోస్’ అంటే ‘ప్రజలు’ అని అర్థం
సి) ‘క్రేషియా’ అంటే పరిపాలన/ అధికారం అని అర్థం
డి) ప్రజాస్వామ్యంలో పాలకులు, పాలితులు ప్రజలు
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, డి
75. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన
గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా,
ఏథెన్స్ల్లో అమలులో ఉండేది
బి) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రస్తుతం
స్విట్జర్లాండ్‌లో అమల్లో ఉంది
సి) ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ప్రజస్వామ్యం కొనసాగుతుంది.
డి) భారతదేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమల్లో ఉంది.
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు