ఒక క్యారట్ ఎన్ని మిల్లీగ్రామ్లతో సమానం?
అలోహాలు -3( నవంబర్ 23 తరువాయి )
132. మొక్కలు నేల నుంచి గ్రహించే పోషకాల్లో ప్రాథమిక పోషకం కానిది?
ఎ) నైట్రోజన్ బి) పాస్ఫరస్
సి) పొటాషియం డి) సోడియం
133. కింది వాటిలో సంయోగ ఎరువు ఏది?
ఎ) పొటాషియం నైట్రేట్
బి) మోనో అమ్మోనియం పాస్ఫేట్
సి) ఎ, బి డి) ఏదీకాదు
134. నైట్రోఫోస్ అనేది?
ఎ) ఏకమాత్ర ఎరువు
బి) సంయోగ ఎరువు
సి) మిశ్రమ ఎరువు
డి) సహజ ఎరువు
135. కింది వాటిలో సహజ సంతులిత ఎరువు ఏది?
ఎ) NDK బి) యూరియా
సి) కంపోస్టు డి) నైట్రోఫోస్
136. కింది వాటిలో సూక్ష్మ పోషకం ఏది?
1. కాపర్ 2. మాలిబ్డినం
3. మాంగనీస్ 4. జింక్
ఎ) 1 బి) 1, 5
సి) 1, 3, 4, 5 డి) అన్నీ
137. గంధకం ఏ ద్రవంలో కరుగుతుంది?
ఎ) నీరు బి) కార్బన్ డై సల్ఫేట్
సి) అయోడిన్ ద్రావణం
డి) ఏదీకాదు
138. గాలిలో ఉంచినప్పుడు గాలిలోని నీటి ఆవిరిని పీల్చుకొని ద్రవాలుగా మారే ఉదగ్రాహ్య పదార్థం?
ఎ) సోడియం హైడ్రాక్సైడ్
బి) మెగ్నీషియం క్లోరైడ్
సి) కాల్షియం క్లోరైడ్ డి) అన్నీ
139. నిశ్చితం (ఎ) – సముద్రపు లోతుల్లోకి వెళ్లే గజ ఈతగాళ్లు తీసుకెళ్లే ఆక్సిజన్ సిలిండర్లలో నైట్రోజన్‌కు బదులుగా హీలియంను కలుపుతారుకారణం (ఆర్) – సముద్రపులోతుల్లో గల అధిక పీడనం వల్ల నైట్రోజన్ రక్తంలో కరుగుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి కానీ, (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది కానీ, (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు కానీ, (ఆర్) సరైనది
140. నిశ్చితం (ఎ) – బెలూన్లలో హైడ్రోజన్‌కు బదులుగా హీలియం నింపుతార కారణం (ఆర్) – హైడ్రోజన్‌కు అధికపీడనానికి మండిపోయే స్వభావం ఉంటుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
141. నిశ్చితం (ఎ) – స్మశానాల్లో చీకట్లో ఎముకలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయికారణం (ఆర్) – ఎముకల్లోని తెల్లభాస్వరానికి గాలి తగలడం వల్ల నెమ్మదిగా మంట వస్తుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
142. నిశ్చితం (ఎ) – లెడ్ పెన్సిల్లో లెడ్ ఉంటుందికారణం (ఆర్) – పెన్సిల్ లెడ్లోని గ్రాఫైట్ నల్లగా రాస్తుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
143. నిశ్చితం (ఎ) – ఫొటోగ్రాఫిక్ ప్లేట్‌ను నల్లటి పేపరుతో కప్పి ఉంచుతారుకారణం (ఆర్) – సూర్యకాంతిలో సిల్వర్ బ్రోమైడ్ విఘటనం చెంది సిల్వర్‌గా మారుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
144. కింది వాటిలో పేలుడు పదార్థం కానిది ఏది?
ఎ) RDX బి) TNT
సి) నైట్రోగ్లిజరిన్ డి) DDT
145. పేలుడు పదార్థాలు సాధారణంగా?
ఎ) నైట్రో సమ్మేళనాలు
బి) సల్ఫేట్లు
సి) క్లోరైడ్లు డి) పాస్ఫేట్లు
146. గాలిలోని నీటి ఆవిరిని పీల్చుకున్నప్పటికీ ద్రవాలు కాని పదార్థాలను ఏమంటారు?
ఎ) ఆర్ద్రాకర్షక పదార్థాలు
బి) ఉదత్యాగ పదార్థాలు
సి) ఉదగ్రాహ్య పదార్థాలు
డి) ఏవీకావు
147. భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) సిలికాన్ డి) హైడ్రోజన్
148. భూపటలంలో ఆక్సిజన్ తరువాత అత్యధికంగా ఉండే మూలకం?
ఎ) సిలికాన్ బి) హైడ్రోజన్
సి) నైట్రోజన్ డి) హీలియం
149. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) హైడ్రోజన్ డి) సిలికాన్
150. సెమీ కండక్టర్లలో ఉండే మూలకం?
ఎ) ఐరన్ బి) సిలికాన్
సి) బోరాన్ డి) సీజియం
151. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి ఉపయోగపడే సోలార్ ప్యానెల్లో ఉండే మూలకం?
ఎ) సీజియం బి) సిలికాన్
సి) బోరాన్ డి) ఐరన్
152. సూపర్ హాలోజన్ అని దేనికి పేరు?
ఎ) ఫ్లోరిన్ బి) బ్రోమిన్
సి) క్లోరిన్ డి) అయోడిన్
153. నీటిలో దేని గాఢత 3ppm కంటే ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి (ఎముకలు వంకర పోవడం, పళ్లు పసుపు రంగులోకి మారడం) వస్తుంది?
ఎ) ఫ్లోరైడ్ బి) క్లోరైడ్
సి) అయోడైడ్ డి) బ్రోమైడ్
154. సముద్రపు నీటి నుంచి ఉప్పు సంగ్రహించే వారిలో కనిపించే వ్యాధి?
ఎ) గాయిటర్
బి) శ్వాససంబంధ వ్యాధులు
సి) ఎ, బి డి) క్యాన్సర్
155. లోహాల వలె తళతళా మెరిసే అలోహం?
ఎ) డైమండ్ బి) అయోడిన్
సి) సల్ఫర్ డి) పాస్ఫరస్
156. చిప్స్ పాడవకుండా ఉండటానికి ప్యాకెట్లలో నింపే చర్యాశీలత లేని వాయువు ఏది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్ బి) ఆక్సిజన్
సి) నైట్రోజన్ డి) సల్ఫర్ డై ఆక్సైడ్
157. ఒక క్యారట్ డైమండ్ ఎన్ని మిల్లీగ్రామ్లు?
ఎ) 100 బి) 200 సి) 300 డి) 400
158. గాలిలో సుమారు 78 శాతం ఉండే వాయువు ఏది?
ఎ) ఆక్సిజన్ బి) నైట్రోజన్
సి) కార్బన్ డై ఆక్సైడ్ డి) నీటి ఆవిరి
159. మండుతున్న పుల్లను హైడ్రోజన్ వాయువుగల పాత్రలో ఉంచితే?
ఎ) పుల్ల ప్రకాశవంతంగా మండుతుంది
బి) ‘టప్’ అనే ధ్వని వస్తుంది
సి) పాత్రలోని హైడ్రోజన్ నీలిరంగులో మండుతుంది
డి) బి, సి
160. అమ్మోనాల్ అనే పేలుడు పదార్థం వేటి మిశ్రమం?
ఎ) అమ్మోనియం నైట్రేట్, అల్యూమినియం
బి) అమ్మోనియం నైట్రేట్, TNT
సి) అమ్మోనియం నైట్రేట్, నైట్రోగ్లిజరిన్
డి) RDX, TNT
161. సురేకారం అని దేన్ని పిలుస్తారు?
ఎ) సోడియం నైట్రేట్
బి) పొటాషియం నైట్రేట్
సి) అమ్మోనియం నైట్రేట్
డి) అమ్మోనియం క్లోరైడ్
162. ముత్యాలు రసాయనికంగా?
ఎ) కాల్షియం క్లోరైడ్
బి) కాల్షియం కార్బోనేట్
సి) కాల్షియం హైడ్రాక్సైడ్
డి) సోడియం కార్బోనేట్
163. విద్యుద్వాహకత గల అలోహం?
ఎ) గ్రాఫైట్ బి) డైమండ్
సి) సల్ఫర్ డి) అయోడిన్
164. నిశ్చితం (ఎ) – భాస్వరాన్ని నీటిలో నిల్వ చేస్తారు కారణం (ఆర్) – పొడి గాలిలో అది మండుతుంది
ఎ) (ఎ), (ఆర్) రెండూ సరైనవి. (ఎ)కు (ఆర్) సరైన వివరణ
బి) (ఎ), (ఆర్) రెండూ సరైనవి, కానీ (ఎ)కు (ఆర్) సరైన వివరణ కాదు
సి) (ఎ) సరైనది, కానీ (ఆర్) సరైనది కాదు
డి) (ఎ) సరైనది కాదు, కానీ (ఆర్) సరైనది
165. శిలల్లోనూ ఖనిజాల్లోనూ ఎక్కువ భాగం ఉండే మూలకం?
ఎ) కార్బన్ బి) సిలికాన్
సి) సోడియం డి) ఐరన్
166. ఎమరాల్డ్‌కు ఆధారమైన మూలకం?
ఎ) కార్బన్ బి) బెరీలియం
సి) మెగ్నీషియం డి) సిలికాన్
167. అధిక ఉష్ణోగ్రత వెల్డింగ్లలో ఉపయోగించేది?
ఎ) ఆక్సిజన్ – ఎసిటలీన్ జ్వాల
బి) ఆక్సిజన్ – హైడ్రోజన్ జ్వాల
సి) ఆక్సిజన్ – కార్బన్ మోనాక్సైడ్ జ్వాల
డి) ఆక్సిజన్ – ఎల్పీజీ
168. గోళ్లు, వెంట్రుకలు కాలినప్పుడు దుర్వాసన రావడానికి కారణమైన మూలకం ?
ఎ) సల్ఫర్ బి) పాస్ఫరస్
సి) మెగ్నీషియం డి) కార్బన్
169. పరిశుద్ధ స్థితిలో ఏ ద్రవం విద్యుద్వాహకంగా పనిచేస్తుంది?
ఎ) నీరు బి) పాదరసం
సి) ఈథర్ డి) ఆల్కహాల్
170. మున్సిపల్ నీరు శుద్ధి చేసే ప్రక్రియ?
ఎ) సల్ఫిటేషన్ బి) క్లోరినేషన్
సి) ఫ్లోరినేషన్ డి) వాల్కనైజేషన్
171. క్వార్ట్ అనేది?
ఎ) సిలికాన్ డై ఆక్సైడ్
బి) కాల్షియం కార్బైడ్
సి) సిలికాన్ కార్బైడ్
డి) సోడియం కార్బోనేట్
172. మంచు నీరుగా మారినప్పుడు?
ఎ) భారం తగ్గుతుంది
బి) భారం పెరుగుతుంది
సి) ఘనపరిమాణం తగ్గుతుంది
డి) ఘనపరిమాణం పెరుగుతుంది
173. లెడ్ పెన్సిల్లో ఉండనిది ఏది?
ఎ) లెడ్ బి) గ్రాఫైట్
సి) బంకమట్టి డి) కర్రముక్క
174. గాజు మంచి?
ఎ) ఉష్ణవాహకం బి) ఇన్సులేటర్
సి) విద్యుత్ వాహకం డి) అర్ధవాహకం
175. వేడిగాజును నెమ్మదిగా చల్లార్చే ప్రక్రియకు గల పేరు?
ఎ) వాల్కనైజేషన్ బి) అన్నీలింగ్
సి) ఫ్రీజింగ్ డి) స్కందనం
176. సింధూర వర్ణం కాంతిని ఇచ్చే టపాకాయల్లో ఉండే సమ్మేళనం ఏ మూలకానికి చెందింది?
ఎ) స్ట్రాన్షియమ్ బి) మెగ్నీషియం
సి) కాల్షియం డి) బేరియం
177. స్పృహతప్పిన వారికి స్పృహ తెప్పించడానికి ఉపయోగించే స్మెల్లింగ్ సాల్ట్?
ఎ) సోడియం క్లోరైడ్
బి) అమ్మోనియం క్లోరైడ్
సి) అమ్మోనియం కార్బోనేట్
డి) అమ్మోనియం నైట్రేట్
178. కటకాలు, పట్టకాలలో ఉపయోగించే గాజు?
ఎ) పైరెక్స్ గాజు బి) వాటర్ గాజు
సి) ప్లింట్ గాజు డి) క్వార్ట్ గాజు
179. విరంజన ధర్మం ఉన్న పదార్థాలు ఏవి?
ఎ) క్లోరిన్ బి) సల్ఫర్ డై ఆక్సైడ్
సి) ఓజోన్ డి) అన్నీ
180. గన్‌పౌడర్ కలిగి ఉండే పదార్థం?
ఎ) పొటాషియం నైట్రేట్
బి) సల్ఫర్
సి) చార్కోల్ డి) అన్నీ
181. కార్బన్ డై ఆక్సైడ్ గురించి సరైన వాక్యం ఏది?
1. కిరణజన్య సంయోగ క్రియకు అవసరమైన వాయువు
2. కిణ్వ ప్రక్రియలో విడుదలయ్యే వాయువు
3. గ్రీన్హౌస్ వాయువు
4. రాత్రిపూట మొక్కలు విడుదల చేసే వాయువు
ఎ) 1, 2 బి) 1, 3
సి) 1, 2, 3 డి) అన్నీ
182. సిమెంట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు?
ఎ) సున్నపురాయి బి) బంకమన్ను
సి) ఇసుక డి) ఎ, బి
183. సిమెంట్ కంకర్లను చల్లబరిచి, పొడిగా చేసి చివరగా కలిపే పదార్థం?
ఎ) బ్లీచింగ్ పౌడర్ బి) జిప్సం
సి) సోడాయాష్ డి) ఇసుక
184. గాజు తయారీకి కావలసిన ముడి పదార్థాలు?
ఎ) సోడాయాష్ బి) సున్నపురాయి
సి) ఇసుక డి) అన్నీ
185. గాజు అనేది ఒక ?
ఎ) స్ఫటికం
బి) అతిశీతలీకరణం చెందిన ఘనం
సి) అతిశీతలీకరణం చెందిన ద్రవం
డి) ఘనీభవించిన వాయువు
186. గాజు తయారీకి సంబంధించిన సరైన వాక్యాలు గుర్తించండి.
1. ముడి పదార్థాలను అవసరమైన పాళ్లలో మరమిల్లులో వేసి పొడిగా చేస్తారు
2. బాచ్ ద్రవీభవన స్థానాన్ని తగ్గించడానికి కొన్ని పగిలిన గాజు ముక్కలను
కలుపుతాయి
3. కొలిమిలో ఏర్పడిన ద్రవ గాజుపై
తేలియాడే మలినాలను ‘గాజుగాల్’ అంటారు
4. ద్రవగాజును నెమ్మదిగా చల్లబరుస్తారు (మందశీతలీకరణం లేదా అన్నీలింగ్)
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) పైవన్నీ
187. జతపరచండి.
ఎ. పైరెక్స్ గాజు 1. ప్రయోగశాల
పరికరాలు
బి. క్వార్ట్ గాజు 2. విద్యుత్ బల్బులు
సి. ప్లింట్ గాజు 3. దృశ్య పరికరాలు
డి. సోడా గాజు 4. కిటికీ అద్దాలు,
గాజు సీసాల తయారీ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-1, బి-3, సి-2, డి-4
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు