నోబెల్ అవార్డుల గురించి మీకెంత తెలుసు..?
ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం నోబెల్. విశ్వ మానవాళికి ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలు, వివిధ రంగాల్లో విశేష కృషిచేసినవారికి ఈ బహుమతిని ప్రతి యేటా ప్రకటిస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం 1901లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానం ఇప్పటికీ కొనసాగుతున్నది. తొలినాళ్లలో ఐదు రంగాల్లోనే నోబెల్‌ను అందించేవారు. సరిగ్గా 58 ఏండ్ల అనంతరం నోబెల్ గౌరవార్థం ఆర్థికరంగంలో కృషిచేసినవారికి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందించడం స్విస్ బ్యాంకు ప్రారంభించింది. ఈ ఏడాది ప్రకటించిన విజేతలు, ఆయా రంగాల్లో వారి సేవల వివరాలు నిపుణ పాఠకుల కోసం…
-భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం, వైద్య, ఆర్థిక రంగాల్లో, ప్రపంచ శాంతికి విశేష కృషి చేసినవారికి, తమ పరిశోధనల ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి మానవ సమాజానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలు, వ్యక్తులకు ప్రతి యేటా నోబెల్ బహుమతులు అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన ఐదేండ్ల తర్వాత అంటే 1901లో ఈ అవార్డుల బహూకరణ ప్రారంభమైంది. 1969 వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, మెడిసిన్, శాంతి రంగాల్లో మాత్రమే స్వీడిష్ అకాడమీ అవార్డులు ప్రకటించేది. అయితే నోబెల్ గౌరవార్థం 1969 నుంచి అర్థశాస్త్రంలో విశేష కృషి చేసినవారికి బ్యాంక్ స్వీడన్ నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నది. నోబెల్ బహుమతి స్థాపకుడు, ప్రఖ్యాత సైంటిస్ట్ అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. నోబెల్ ఫౌండేషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల తుది జాబితాలో ఎవరెవరున్నారనే వివరాలను 50 ఏండ్ల వరకు వెల్లడించకూడదు.
-ప్రతి ఏడాది నోబెల్ బహుమతులు అక్టోబర్ మొదటి సోమవారం నుంచి మళ్లీ సోమవారం వరకు (శని, ఆదివారాలు మినహా) రోజుకు ఒకటి చొప్పున ఆరు రంగాల్లో ఎంపికైన వారిని అవార్డు విజేతలుగా ప్రకటిస్తారు.
భారతీయులకు నోబెల్
-నోబెల్ ప్రారంభమైన 12 ఏండ్ల తర్వాత ఈ అత్యున్నత పురస్కారం భారతీయులకు దక్కింది. 1913లో సాహిత్యంలో నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్.. ఈ అవార్డు లభించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. తర్వాత రసాయన శాస్త్రంలో సీవీ రామన్ (1930), వైద్యశాస్త్రంలో హరగోవింద్ ఖొరానా (1968), శాంతి బహుమతికి మదర్ థెరిసా (1979), భౌతికశాస్త్రంలో సుబ్రమణ్య చంద్రశేఖర్ (1983), అర్థశాస్త్రంలో అమర్త్యసేన్ (1998), రసాయన శాస్త్రంలో వెంకట్రామన్ రామకృష్ణన్ (2009), 2014లో కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
నోబెల్‌తో కోల్‌కతాకు అనుబంధం!
-నోబెల్ అందుకున్న భారతీయులు, భారత సంతతికి చెందినవారిలో ఆరుగురు కోల్‌కతాతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారే.
-తొలి నోబెల్ అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ సాహిత్యానికి పునర్నిర్వచనం చేశారు. కోల్‌కతాలో శాంతినికేతన్‌ను స్థాపించారు.
-భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న సీవీ రామన్ మద్రాస్‌లో జన్మించినప్పటకీ కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
-1979లో శాంతి బహుమతి అందుకున్న మదర్ థెరిసా కోల్‌కతాలో చారిటీ మిషనరీలను నెలకొల్పారు.
-సంక్షేమ అర్థశాస్త్రంతో నోబెల్ అందుకున్న ఆర్థికవేత్త అమర్త్యసేన్ శాంతినికేతన్లో జన్మించారు. ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యనభ్యసించారు.
-ఈ ఏడాది నోబెల్ పొందిన అభిజిత్ బెనర్జీ కూడా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చదడంతోపాటు కోల్‌కతా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న బంధన్ బ్యాంక్‌తో కలిసి పనిచేశారు.
-భారతీయుడు కానప్పటికీ మలేరియాపై జరిపిన పరిశోధనలకుగాను రోనాల్డ్ రాస్ 1902లో మెడిసిన్‌లో నోబెల్ అందుకున్నారు. ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జనరల్ దవాఖానలో పనిచేశారు.
దంపతులకు నోబెల్
-ఇప్పటి వరకు ఆరుగురు దంపతులకు నోబెల్ బహుమతి లభించింది. మొదటిసారిగా 1903లో పియర్ క్యూరీ, మేరీ క్యూరీ దంపతులకు నోబెల్ లభించింది. వీరు రేడియో ధార్మిక శక్తిని కనుగొనడంతోపాటు యురేనియం, థోరియం మూలకాలపై పరిశోధన చేశారు.
-రేడియో ధార్మిక మూలతత్వాల కృత్రిమ నిర్మాణం గురించి కనుగొన్నందుకు ఫ్రెడరిక్ జోలియట్, ఇరీన్ జోలియట్ క్యూరీ దంపతులకు 1935లో ఈ పురస్కారం లభించింది.
-గ్లెకోజెన్, గ్లూకోజ్ మెటబాలిజమ్లతోపాటు కెటాలిక్ కన్వర్షన్ ఆఫ్ ైగ్లెకోజిన్పై పరిశోధనలకు 1947లో వైద్యశాస్త్రంలో గెర్టీ, కార్ల్ కోరి దంపతులు నోబెల్ అందుకున్నారు.
-మెదడులో కణాలకు ఒక స్థానవ్యవస్థ ఉంటుందని కనుగొన్న ఎడ్వర్డ్ ఐ మోసర్, మే బ్రిట్ దంపతులకు 2014లో నోబెల్ లభించింది.
-ప్రపంచ పేదరికంపై చేసిన పరిశోదనలకు గాను అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫ్లో 2019లో నోబెల్ అందుకున్నారు.
-దంపతులైన గుర్నార్ మిర్డాల్, అల్వా మిర్డాల్కు వేర్వేరు రంగాల్లో నోబెల్ లభించింది. 1974లో గుర్నార్ మిర్డాల్ (ఆర్థికం), 1984లో అల్వా మిర్డాల్ (శాంతి) ఈ అత్యున్నత పురస్కారం అందుకున్నారు.
మహిళలకు నోబెల్
-ఇప్పటివరకు మొత్తం 54 మంది మహిళలకు నోబెల్ అవార్డులు లభించాయి. ఇందులో శాంతి బహుమతి అత్యధికంగా 17 మంది అందుకోగా, సాహిత్యంలో 15 మందికి లభించింది. భౌతిక, రసాయన శాస్త్రం విభాగాల్లో మేడం క్యూరీ రెండుసార్లు ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. 2009లో నాలుగు విభాగాల్లో అత్యధికంగా ఐదుగురు మహిళలు నోబెల్ అవార్డు అందుకున్నారు.
శాంతి
-మొత్తం 17 మంది ఈ అవార్డు అందుకున్నారు. బెర్తా వాన్ సట్నెర్ (1905), జాన్ ఆడమ్స్ (1931), ఎమిలీ గ్రీని బాల్చ్ (1946), బెట్టి విలియమ్స్, మైరిడ్ మగ్వైర్ (1976), మదర్ థెరిసా (1979), ఆల్వా మిర్దల్ (1982), ఆంగ్‌సాన్ సూకీ (1991), రిగోబెర్టా మెంచూ (1992), జోడి విలియమ్స్ (1997), షిరిన్ ఎబాది (2003), వాంగారి మథాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్, లిమా బొవీ, తవక్కెల్ కార్మన్ (2011), మలాలా యూసఫ్‌జాయ్ (2014), నదియా మురాద్(2018).
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు