ఫుల్‌మార్కులు ఇలా!
పేపర్IIలో
గ్రూప్-4లో పేపర్-2 అనేది చాలా కీలకం. ఈ పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో ఫుల్ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మొదట సిలబస్‌లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. తర్వాత గతంలో నిర్వహించిన గ్రూప్-4 పేపర్లు (2018లో), వీఆర్వో, వీఆర్ఏ ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
- అభ్యర్థులు మొదట గణిత ప్రాథమిక భావనలైన సంకలనం, గుణకారం, భాగాహారం, తీసివేతలపై పట్టు సాధించాలి. వీటితోపాటు
- 1 నుంచి 20 ఎక్కాలు
- 1- 30 వరకు గల సంఖ్యల వర్గాలు
- 1- 20 వరకు ఘనాలు
- ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, సరిసంఖ్యలు, బేసి సంఖ్యలు, గుణిజాలు వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అర్థమెటిక్లోనే కాకుండా రీజనింగ్‌లో కూడా వీటి అవసరం చాలా ఉంటుంది.
- నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటలు అర్థమెటిక్‌లోని సమస్యలు సాధించడానికి కేటాయించాలి. మొదటగా చాలా సింపుల్‌గా ఉండే అంశాన్ని ఎంచుకోండి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
- అర్థమెటిక్, రీజనింగ్‌లకు 125 మార్కులు కేటాయించారు. ఉద్యోగ నిర్ణయంలో అతి కీలకమైన సబ్జెక్టు అని చెప్పడంలో సందేహం లేదు. మొదటగా మెంటల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్ అలాగే న్యూమరికల్ అర్థమెటికల్ ఎబిలిటీస్లోని అంశాలు (యూనిట్లు) ఒక దగ్గర రాసుకొని ప్రతి అంశానికి అనుగుణంగా అకాడమీ పుస్తకాల సహాయంతో సెల్ఫ్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి.
- అర్థమెటిక్ విభాగంలో కొన్ని అంశాలు సూత్రాలకనుగుణంగా (ఉదా: క్షేత్రగణితం) ఉంటాయి. అందులోని సూత్రాలను షీట్ల రూపంలో లేదా కార్డ్సులో రాసుకుని మీరు చదువుకునే రూంలో కనిపించేటట్లుగా అతికించుకుంటే ఖాళీ సమయంలో కూడా ఎక్కువ సార్లు వాటిని చూడటం వల్ల మీకు బాగా గుర్తుండిపోతాయి.
- రీజనింగ్ అంటే విద్యార్థి తార్కిక ఆలోచనాశక్తిని వెలికితీసే ఒక విభాగం. రీజన్ అంటే వివేకం దీన్ని మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటారు
- రీజనింగ్ అనేది పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఉండటానికి కారణం విద్యార్థి శక్తిని, ప్రజ్ఞను, ప్రాబ్లమ్ ఐడెంటీని, హైపోథిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్, సమస్యల పట్ల అభ్యర్థి ఏ విధంగా స్పందిస్తారు అనేది పరిశీలిచండానికి దీని నుంచి ప్రశ్నలు ఇస్తారు.
రీజనింగ్‌లోని అంశాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు..
అవి.. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్
వెర్బల్ రీజనింగ్: దీనిలో అంశాలను మూడు విధాలుగా చూడవచ్చు. వాటిలో…
1. జనరల్ ఇంటెలిజెన్స్
దీనిలో అంశాలను పరిశీలిస్తే.. క్లాక్ (గడియారం), క్యాలెండర్, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, రిపీటెడ్ లెటర్ సిరీస్, రిపీటెడ్ నంబర్ సిరీస్, అనాలజీ (పోలిక పరీక్ష), క్లాసిఫికేషన్ /ఆడ్ మెన్ అవుట్ (భిన్న పరీక్ష), బ్లడ్ రిలేషన్స్ (రక్త సంబంధాలు), డైరక్షన్స్ (దిక్కులు), డైస్, క్యూబ్స్ (పాచికలు, ఘనాలు), ర్యాంకింగ్, వెన్ డయాగ్రమ్స్, మిస్సింగ్ నంబర్లు, డిక్షనరీ ఆర్డర్.
2. లాజికల్ రీజనింగ్
విద్యార్థి ఆలోచన విధానంలో పెన్ను, పేపర్ అవసరం లేకుండా చేసే రీజనింగ్ విభాగం. ఇందులోని అంశాలను Statments-Assumptions, Statements-Arguments, Statemnts-Conclusions, Course of action, Situation Reaction, Accerssion and Reason, Syllogism అనే అంశాలు వస్తాయి.
3. Analytical Reasoning
- దీనిలో సీటింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్, డెసిషన్ మేకింగ్, ఇన్పుట్, అవుట్‌పుట్ అనే అంశాలు వస్తాయి.
II. NON-VERBAL REASONING
- దీనిలో ప్రశ్నలన్నింటినీ పిక్చర్ రూపంలో ఇస్తారు. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఫిగర్ సిరీస్, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగర్ అనాలజీ, ఫిగర్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి.
- 2018లో జరిగిన గ్రూప్-4 పేపర్‌ను పరిశీలిస్తే.. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాల నుంచి 80 ప్రశ్నలు ఇచ్చారు. ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో పరిశీలిద్దాం.. నాన్ వెర్బల్ నుంచి -8 ప్రశ్నలు ఇచ్చారు.
- లాజికల్ రీజనింగ్ నుంచి -14 ప్రశ్నలు ఇచ్చారు. అవి. కింది విధంగా ఉన్నాయి…
- స్టేట్మెంట్స్ అసంప్షన్స్-2, స్టేట్మెంట్ ఆర్గ్యూమెంట్స్-3, స్టేట్మెంట్స్ కన్‌క్లూజన్-2, కోర్స్ ఆఫ్ యాక్షన్-3, అసెర్షన్ అండ్ రీజన్-3 సిలాజిసిమ్-1 ప్రశ్న ఇచ్చారు.
- న్యూమరికల్ ఎబిలిటీస్ నుంచి 45 ప్రశ్నలు ఇచ్చారు.
- నిష్పత్తి అనుపాతం -4, భాగస్వామ్యం-5, కాలం-దూరం-4, భిన్నాలు-3, శాతాలు-3, చక్రవడ్డీ, బారువడ్డీ-2, పడవలు-ప్రవాహాలు-1, పైపులు-తొట్టీలు-1, క్షేత్రగణితం-4, వయస్సులు-1, సరాసరి-1, సూక్ష్మీకరణలు-2, డిస్కౌంట్-1, ఘాతాంకాలు-2, మిశ్రమాలు-1, ప్రాఫిట్-లాస్-1, భిన్నాలు-3 ప్రశ్నలు ఇచ్చారు.
- అభ్యర్థులు పేపర్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ముఖ్యంగా సిలబస్ ప్రకారం అన్ని చాప్టర్లను ఒకటికి రెండుసార్లు రివిజన్ చేయాలి.
- మూడో తరగతి నుంచి పదోతరగతి వరకు గణితం పుస్తకాలలో ఉన్న సిలబస్ అంశాలను అర్థం చేసుకోవాలి. తర్వాత వాటిని చాప్టర్ల వారీగా ప్రాక్టీస్ చేయడం చేయాలి.
- సులభంగా ఉన్న చాప్టర్లను మొదట ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కఠినమైన వాటిని ప్రాక్టీస్ చేస్తే మంచిది.
- వెర్బల్, నాన్ వెర్బల్‌కు ఆర్ ఎస్ అగర్వాల్ వంటి ప్రామాణికమైన పుస్తకాలను తీసుకుని ప్రాక్టీస్ చేస్తే తప్పక ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
బీవీ రమణ: డైరెక్టర్, ఏకేఆర్ స్టడీ సర్కిల్,వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు