Title of Kalyana Bhupathi | కల్యాణ భూపతి బిరుదు గల వెలమ రాజు?
-తెలుగు సాహిత్యం: వెలమనాయకులు సంస్కృతంతోపాటు తెలుగును కూడా పోషించారు. ఈ కాలంలో అనేక తెలుగు కావ్యాలు వెలువడినాయి. పూసపాటి నాగనాథుడు తెలుగులో విష్ణుపురాణం రచించాడు. ఈ గ్రంథంలో వెలమనాయకుల విజయాల వర్ణనలు ఉన్నాయి.
-ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన కవి గౌరన. ఇతడు తెలుగులో హరిచంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర అనే రెండు ద్విపద కావ్యాలు, లక్షణ దీపిక అనే ఒక గ్రంథాన్ని రచించాడు. మరొక ప్రసిద్ధిచెందిన కవి కొరవి గోపరాజు. ఇతను తెలుగులో సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యాన్ని రాశాడు. ఇందులో ఉజ్జయినిని పాలించిన విక్రమార్కుడికి సంబంధించిన 32 కథలు ఉన్నాయి. ఇది సంస్కృతంలోని త్రిషష్ఠి సాలాకపురుషచ్చరిత్ర అనే జైన కావ్యానికి అనువాదం.
-వెలమ రాజుల కాలంలో అగ్రగణ్యుడైన కవి బమ్మెర పోతన. పోతన భోగిని దండకం, ఆంధ్రమహాభారతం, వీరభద్ర విజయం అనే మూడు గ్రంథాలను రచించాడు. వీటిలో భోగిని దండకాన్ని సర్వజ్ఞ సింగ భూపాలుడి ప్రియురాలిపై రాశాడు. ఇది శృంగార పరమైన గ్రంథం. కాలక్రమేణా రాజాస్థానంలోని పనులను చూసి విరక్తి కలిగిన పోతన రాజు సేవలను వదులుకొని తన స్వగ్రామం చేరుకొని వ్యవసాయదారుడిగా జీవనం సాగించాడు. పోతనకు సహజ కవి అనే బిరుదు కలదు. ఈయన తన ఇంటిలో కూర్చొని భక్తితో సంస్కృత భాగవతాన్ని తెనుగించాడు. ఈ భాగవతాన్ని తనకు అంకితమివ్వమని సర్వజ్ఞ సింగభూపాలుడు కోరగా, నిర్మొహమాటంగా తిరస్కరించి శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
కోటలు: వీరు తమ రాజ్య రక్షణకు అనేక కోటలను శత్రుదుర్బేధ్యంగా నిర్మించారు. వీరి రాజ్యంలో రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఓరుగల్లు కోటలు ప్రసిద్ధి చెందాయి. దేవరకొండ కోట నిర్మాణంలో అడుగడుగునా వారి రక్షణ వ్యూహం కనిపిస్తుంది. వీరి కాలమంతా యుద్ధాలతో గడిచిపోయింది. కాబట్టి శిల్పకళకు వీరు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ విధంగా దాదాపు 150 ఏండ్లపాటు తెలంగాణను రాచకొండ, దేవరకొండలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన రేచర్ల వెలమలు లేదా పద్మనాయక వంశీయుల పాలనలో రాజకీయ అలజడులు జరిగినా వీరి సమర్థవంతమైన పాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ముందడగు వేసి కాకతీయులకు వారసులమని అనిపించుకున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో పోతన రచించిన గ్రంథం?
1) ఆంధ్రమహాభారతం 2) నవనాథ చరిత్ర
3) భోగిని దండకం 4) వీరభద్ర విజయం
2. వసంతోత్సవాలను జరిపిన వెలమ నాయక రాజు?
1) రెండో సింగమనాయుడు
2) రెండో అనపోతానాయుడు
3) మొదటి సింగమనాయుడు
4) మూడో సింగమనాయుడు
3. సుభాషిత నీతి, తత్వ సందేశం, రహస్య సందేశం గ్రంథాల రచయిత?
1) వైనాచార్యుడు 2) శాకల్యమల్లుభట్టు
3) వేదాంతదేశీకుడు 4) నాగనాథుడు
4) వెలమ నాయకులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు?
1) సీమ 2) ఆహారం 3) ప్రదేశం 4) నాడు
5. వెలమ రాజుల కాలంలో కలమ, శాలి, శిరాముఖి, పతంగహోయన అంటే..
1) శ్రేణుల పేర్లు 2) వాయిద్య పరికరాలు
3) నృత్యరీతులు 4) వరిపంట రకాలు
6. కల్యాణ భూపతి బిరుదు గల వెలమ రాజు?
1) మొదటి సింగమనాయుడు
2) రెండో సింగమనాయుడు
3) మొదటి అనపోతానాయుడు
4) రావుమాదానాయుడు
7. కింది వాటిలో సరైనవి?
1) కుమార(రెండో) సింగమ నాయుడు గొప్పకవి, పండితుడు, పోషకుడు
2) ఇతనికి సర్వజ్ఞ, సర్వజ్ఞ చూడామణి అనే బిరుదులు ఉన్నాయి
3) ఇతడు రసార్ణవ సుధాకరం, సంగీత సుధాకరం, రత్న పాంచాలికలను రచించాడు
4) పైవన్నీ
8. కొండవీడు పెదకోమటి వేమారెడ్డిని హతమార్చి అతని శిరస్సును తమ్మా పడగ(గంప)లో భూస్థాపితం చేసిన వెలమ రాజు?
1) రెండో అనపోతానాయుడు
2) మొదటి అనపోతానాయుడు
3) రెండో సింగమనాయుడు
4) మొదటి సింగమనాయుడు
9. రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్యానం రాసి శ్రీరామచంద్రుడికి అంకితమిచ్చిన వెలమ రాజు?
1) మూడో సింగమనాయుడు
2) రావు మాదానాయుడు
3) పిన వేదగిరి 4) లింగమనేడు
10. రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చిన వెలమరాజు
1) మొదటి అనపోతానాయుడు
2) రావు మాదానాయుడు
3) రెండో అనపోతానాయుడు
4) రెండో సింగమనాయుడు
11. మొదటి అనపోతానాయుడి గురించి సరైనవి?
1) ఇతడు సోమకుల పరశురామ, ఆంధ్రదేశాధీశ్వర బిరుదాంకితుడు
2) ఇతడు అనపోత సముద్రం అనే చెరువును నిర్మించాడు
3) తెలంగాణ యాత్రికుల సౌకర్యార్థం శ్రీపర్వతంపైకి వెళ్లేందుకు మెట్లు కట్టించాడు
4) పైవన్నీ సరైనవే
12. రేచర్ల వెలమ రాజ్య స్థాపకుడు?
1) మొదటి సింగమనాయుడు
2) మొదటి అనపోతానాయుడు
3) రావు మాదానాయుడు 4) బేతాళనాయుడు
13. రామసింగారం, వసంత సింగారం, రామ విలాసం, వసంత విలాసం, శ్రీకష్ణ విలాసం అనేవి?
1) చీరల రకాలు 2) ఆభరణాలు
3) నృత్యరీతులు 4) సంగీతరీతులు
14. కిలారులు అంటే?
1) వర్తక శ్రేణులు 2) పశుశాలలు
3) అంగళ్లు 4) ఏదీకాదు
15. వెలమ రాజుల రాజ్యంలో దంతపు పరిశ్రమ ఉన్నట్లు తెలుపుతున్న సాహిత్యం?
1) సింహాన ద్వాత్రింశిక 2) రుక్మాంగద చరిత్ర
3) భోగినీ దండకం 4) విష్ణుపురాణం
16. జతపర్చండి.
I. చమత్కార చంద్రిక a. కొరవి గోపరాజు
II.సింహాసన ద్వాత్రింశిక b. గౌరన
III. నవనాథ చరిత్ర c. విశ్వేశ్వర కవి
IV. నిరోష్ట్య రామాయణం d. శాకల్యమల్లుభట్టు
1) I-a, II-b, III-c, IV-d
2) I-c, II-1, III-d, IV-b
3) I-c, II-a, III-b, IV-d
4) I-a, II-c, III-b, IV-d
17. పరిపాలనా సౌలభ్యం కోసం దేవరకొండ రాజ్యాన్ని స్థాపించింది?
1) మొదటి సింగమనాయుడు
2) మొదటి అనపోతానాయుడు
3) రెండో సింగమనాయుడు
4) మొదటి మాదానాయుడు
18. కింది వాటిలో తెలుగులో రచించింది?
1) విష్ణుపురాణం 2) సింహాసన ద్వాత్రింశిక
3) హరిచంద్రోపాఖ్యానం 4) మదనవిలాస బాణం
19. భేరీ, జయఘంట, పల్లకి, చక్కి, కాహళము, హుడుక్కి అంటే?
1) నృత్యరీతులు 2) శిల్ప రీతులు
3) వాయిద్య పరికరాలు 4) సంగీతరీతులు
20. ప్రతిగండ భైరవ, ఖడ్గనారాయణ బిరుదులు కలిగిన రాజు
1) సర్వజ్ఞ సింగమనాయుడు 2) మాదానాయుడు
3) మొదటి సింగమనాయుడు 4) బేతాళనాయుడు
21. కింది వాటిలో రావు మాదానాయుని గురించి సరైనవి.
1) ఇతడు రామానుజాచార్యుడి కుమారుడైన వెంకటాచార్యుడి శిష్యుడు
2) ఇతను క్రీ.శ. 1421లో తొర్రూరు గ్రామానికి శ్రీరంగాపురం అని నామకరణం చేసి శ్రీరంగనాథస్వామికి దానం చేశాడు
3) ఇతని భార్య నాగాంబిక రాచకొండ సమీపంలో నాగసముద్రం అనే చెరువును తవ్వించింది.
4) పైవన్నీ సరైనవే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు