Industrial training | సీఏలో నైపుణ్యానికి పారిశ్రామిక శిక్షణ

సీఏ కోర్సులో తరగతి విజ్ఞానంతోపాటు ప్రాక్టికల్ విజ్ఞానం కూడా చాలా ముఖ్యం. అంటే విద్యార్థి తరగతిలో నేర్చుకున్న అంశాలు నిజ జీవితంలో ఎలా ఆచరించాలో కూడా తెలుసుకోగలగడమే ఈ ప్రాక్టికల్ శిక్షణ ఉద్దేశం.
-పెరుగుతున్న పరిశ్రమల అవసరాల దృష్ట్యా సీఏ ఇన్స్టిట్యూట్ వారు పరిశ్రమల గురించి పూర్తి పరిజ్ఞానం, పరిశ్రమల పనితీరుపై అవగాహన కలిగిన నిపుణులను అందించాలన్న ఉద్దేశంతో ఈ పారిశ్రామిక శిక్షణను సీఏ కోర్సులో భాగంగా రూపొం దించారు. ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్‌లో పరిశ్రమల్లో ఉద్యోగాల్లో స్థిరపడాలన్నా, సీఏ పూర్తయ్యాక సొంతంగా పరిశ్రమ స్థాపించాలన్నా ఈ పారిశ్రామిక శిక్షణ ఉపయోగపడుతుంది.
పారిశ్రామిక శిక్షణ ఎప్పుడు?
-సీఏ ఇంటర్‌లోని మొదటి గ్రూప్‌కానీ, రెండో గ్రూప్‌కానీ అంటే ఏదో ఒక గ్రూపు పూర్తిచేసిన వారు లేదా రెండు గ్రూపులూ పూర్తిచేసిన వారు ఒక ప్రాక్టిసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ప్రాక్టికల్ శిక్షణకు తమపేరు నమోదు చేసుకుని మూడేండ్లపాటు శిక్షణ తీసుకోవాలి. ఈ మూడేండ్ల శిక్షణ సమయంలో ఒకవేళ కావాలనుకుంటే విద్యార్థి చివరి 12 నెలలు అంటే మూడో ఏడాది ప్రాక్టికల్ శిక్షణకి బదులుగా వేరే పరిశ్రమలో పారిశ్రామిక శిక్షణ కూడా తీసుకోవచ్చు. నేటి పారిశ్రామిక అవసరా లకు సరిపడే నైపుణ్యాలు కలిగిన సీఏలను తయారు చేయాలన్న ఉద్దేశంతోనే సీఏ ఇన్స్టిట్యూట్ వారు పారిశ్రామిక శిక్షణ విధానం అనే ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ పారిశ్రామిక శిక్షణవల్ల విద్యార్థి తన కెరీర్‌కు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను, ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
శిక్షణ ఎక్కడ?
-ముందుగా చెప్పిన విధంగా సీఏ ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థి, ప్రాక్టికల్ శిక్షణ మరో ఏడాదిలో ముగుస్తుందనగా ఈ పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు. కనీసం కోటి రూపాయలకుపైగా స్థిరాస్తులు కలిగిన వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల్లోగానీ, రూ.10 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన సంస్థల్లోగానీ, 50 లక్షలకి పైగా చెల్లింపు మూలధన వాటాలు కలిగిన సంస్థల్లోగానీ, కౌన్సిల్ ఆమోదం పొందిన సంస్థల్లోగానీ పారిశ్రామిక శిక్షణ తీసుకోవచ్చు.
శిక్షణ కాలపరిమితి
-పారిశ్రామిక శిక్షణను 9 నెలలకు తగ్గకుండా, 12 నెలలకు మించకుండా (సెలవులను కలుపుకుని) తీసుకోవాలి.
శిక్షణ ఇచ్చేవారి అర్హత
1. సీఏ ఇన్స్టిట్యూట్ వారు ఆమోదించిన సంస్థల్లో పనిచేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్స్ మాత్రమే సీఏ విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ ఇవ్వడానికి అర్హులు.
2. సీఏ ఇన్స్టిట్యూట్ పరిధిలో కనీసం మూడేండ్లపాటు అసోసియేట్ మెంబర్‌గా ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ ఒక విద్యార్థికి పారిశ్రామిక శిక్షణ అందించవచ్చు.
3. ఫెలోషిప్ చార్టర్డ్ అకౌంటెంట్ (FCA) ఇద్దరు విద్యార్థులకు శిక్షణ ఇవ్వవచ్చు.
శిక్షణతోపాటు సంపాదన కూడా
-చదువుతూనే సంపాదన అనే విధానం సీఏ పారిశ్రామిక శిక్షణలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చదువుతోపాటు విద్యార్థికి సంపాదన కూడా ఉంటుంది. ఏ సంస్థలో శిక్షణకు చేరుతామో ఆ సంస్థే విద్యార్థికి ఐసీఏఐ నిబంధనల ప్రకారం స్టయిఫండ్ కూడా ఇస్తుంది.
పారిశ్రామిక శిక్షణతో ప్రయోజనాలు
-మంచి భావప్రకటన నైపుణ్యాలు ఉండి, కొత్త వ్యక్తులతో కలిసి మాట్లాడే ఆసక్తి ఉంటే పారిశ్రామిక శిక్షణ ద్వారా వ్యాపార సామ్రాజ్యం గురించి ప్రాథమిక అనుభవాన్ని పొందవచ్చు.
-పారిశ్రామిక శిక్షణలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే.. శిక్షణలో భాగంగా ఒక స్టార్టప్ కంపెనీని స్థాపించవచ్చు. అనేక ప్రాజెక్టులను ప్రారంభదశ నుంచి మొదలు పెట్టవచ్చు.
-వ్యాపార అనుభవం పొందడంతోపాటు తరగతిలో లభించని విషయాలను నేర్చుకొనే, తయారుచేసే వీలు కలుగుతుంది. విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపును కూడా పొందవచ్చు.
-తరగతి గదిలో నేర్చుకున్న సబ్జెక్ట్ పరిజ్ఞానం ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునే వీలుంటుంది.
-సీఏ కోర్సులోని సబ్జెక్టులపై ప్రతి విద్యార్థికి లోతైన అవగాహన అవసరం. పూర్తి అవగాహన కలిగిన విద్యార్థులు మాత్రమే సీఏ ఫైనల్ పరీక్షలను చక్కగారాసే వీలుంటుంది. ఈ పారిశ్రామిక శిక్షణవల్ల విద్యార్థికి చదువుతున్న అంశాలపై లోతైన అవగాహన ఏర్పడి ఫైనల్ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుంది.
-విద్యార్థి పారిశ్రామిక శిక్షణ పొందే సమయంలో శిక్షణ ఇస్తున్న సంస్థలోని సహ విద్యార్థులు, సీనియర్లు, ప్రభుత్వాధికారులు, ఆదాయపు పన్ను విభాగం, లీగల్ అడ్వైజర్లు ఇలా అందరితో కలిసి పనిచేయడంవల్ల భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందిచుకొనే అవకాశం ఉంటుంది.
పారిశ్రామిక శిక్షణ నియమనిబంధనలు
1.విద్యార్థి ఏ రోజు నుంచైతే పారిశ్రామిక శిక్షణ తీసుకోవాలి అనుకుంటున్నాడో.. ఆ రోజుకి మూడు నెలల ముందే తను ఆర్టికల్‌షిప్ చేస్తున్న ప్రధాన ఆడిటర్‌కు శిక్షణ గురించి చెప్పి అనుమతి పొందాలి.
2.ప్రస్తుత ప్రధాన ఆడిటర్ వద్ద నుంచి శిక్షణ మార్గదర్శిలో సూచించిన శిక్షణా నివేదికతోపాటు ఫామ్ నెంబర్ 109 లేదా ఫామ్ నెంబర్ 114 (ఏది వీలైతే అది) పొందాలి.
3.అప్రెంటిస్‌షిప్ డీడ్‌ను ఫామ్ నెంబర్ 104 ప్రకారం నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ మీద గానీ, ప్రాంతీయ స్టాంప్ ధరలను అనుసరించి ప్రత్యేకంగా అంటించిన స్టాంప్ పేపర్ మీదగానీ తయారుచేసి దానికి నకలును జతచేసి శిక్షణ ఇచ్చే సంస్థ ద్వారా శిక్షణ ప్రారంభానికి 30 రోజులు ముందే సీఏ ఇన్స్టిట్యూట్ వారికి పంపాలి.
ఉద్యోగావకాశాలు
1.కంపెనీలు ఉద్యోగ నియామకాలు జరిపేటప్పుడు తమ కంపెనీలో ఎవరైతే పారిశ్రామిక శిక్షణ తీసుకున్నారో వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తాయి. అలాగే సీఏ చదువుతున్న వారికి కూడా వారు ఎక్కడైతే పారిశ్రామిక శిక్షణ తీసుకున్నారో అక్కడే ఉద్యోగపరంగా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
2.ఒకసారి సీఏ విద్యార్థి ఒక సంస్థలో పారిశ్రామిక శిక్షణ తీసుకుంటే సీఏ క్వాలిఫై అయ్యాక సహజంగా అదే కంపెనీ మంచి వేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటుంది. అంతేగాక పారిశ్రామిక శిక్షణ తీసుకున్న విద్యార్థికి ఇతర సంస్థల నుంచి కూడా ఉద్యోగావకాశాలు మెండుగా వచ్చే అవకాశం ఉంది.
3.సీఏ పూర్తయ్యాక సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి వ్యాపార/ పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలను కునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ పారిశ్రామిక శిక్షణ ఎంతో దోహదపడుతుంది.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం