సత్ యోగిని దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
2021 యుపీఎస్సీ జనరల్ స్టడీస్
1. మొరేనాకు దగ్గర్లో ఉన్న సత్ యోగిని దేవాలయానికి సంబంధించి, కింద ఇచ్చి వ్యాఖ్యలను పరిశీలించండి.
1. దీనిని కచ్ఛపఘట వంశ పాలనలో వృత్తాకారంలో నిర్మించారు
2. భారతదేశంలో వృత్తాకారంలో నిర్మించిన ఏకైక దేవాలయం ఇదే
3. ఈ ప్రాంతంలో వైష్ణవ సంప్రదాయాన్ని వ్యాప్తి చేయడానికి దీనిని ఉద్దేశించారు
4. భారత పార్లమెంటు నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిన నిర్మాణం ఇదే అన్న నమ్మకం ప్రచారంలో ఉంది
పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a) 1, 2 b) 2, 3
c) 1, 4 d) 2, 3, 4
జవాబు: (c)
వివరణ : సత్ యోగిని దేవాలయాన్ని క్రీ.శ. 1323లో కచ్ఛపఘట వంశానికి చెందిన దేవపాలుడు నిర్మించినట్లు తెలుస్తున్నది. ఒక గుట్టపై వృత్తాకారంలో ఉన్న ఈ నిర్మాణంలో 64 మంది యోగినుల (అమ్మ దేవతలు) విగ్రహాలున్న గదులు ఉన్నాయి. ంసట్ అంటే 64. అందుకని దీనికి సత్ యోగిని ఆలయం అని పేరు నిలిచిపోయింది. ఇది శక్తి ఆరాధనకు సంబంధించింది. వైష్ణవ మత సంబంధించింది కాదు. ఇలాంటి మరో ఆలయం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉంది. ప్రస్తుత భారత పార్లమెంటు నిర్మాణ ప్రణాళికకు సత్ యోగిని ఆలయమే స్ఫూర్తిగా నిలిచిందని ప్రచారం లో ఉంది. కాబట్టి జవాబును గుర్తించడానికి ఇచ్చిన ఐచ్ఛికాలలో 3వది ఉండకుండా, 4వది ఉండేలా చూసుకోవాలి. ఈ ప్రకారం జవాబు (c) అవుతుంది.
2. గుప్తుల క్షీణత అనంతరం హర్షవర్ధనుడు వచ్చేవరకు, ఏడో శతాబ్దం తొలినాళ్లలో ఏ రాజ్యాలు ఉత్తరభారతదేశంలో అధికారంలో ఉన్నాయి?
1. మగధ గుప్తులు
2. మాల్వా పరమారులు
3. థానేసర్ పుష్యభూతులు
4. కనోజ్ మౌఖారులు
5. దేవగిరి యాదవులు
6. వలభి మైత్రకులు
కింద ఇచ్చిన సంకేతాల నుంచి సరైన జవాబును ఎంచుకోండి.
a) 1, 2, 5 b) 1, 3, 4, 6
c) 2, 3, 4 d) 5, 6
జవాబు: (b)
వివరణ : పరమారులు, యాదవులు హర్షవర్ధనుడి తర్వాత పాలించిన రాజులు. గుప్తుల అనంతరం మగధ కేంద్రంగా మలి గుప్తులు హర్షవర్ధనుడి వరకు పాలించారు. కాబట్టి సమాధానంలో 2, 5 ఐచ్ఛికాలు లేకుండా, 1 ఉండేలా చూసుకోవాలి.
3. కింద ఇచ్చిన జతలను పరిశీలించండి:
(చారిత్రక ప్రదేశం) (ప్రసిద్ధి చెందిన అంశం)
1. బూర్జహోమ్ : రాతిని తొలిచిన మందిరాలు
2. చంద్రకేతుగఢ్ : టెరాకోట కళ
3. గణేశ్వర్ : రాగి కళాకృతులు
పైన పేర్కొన్న జతల్లో సరిగ్గా ఉన్నవి ఏవి?
a) 1 b) 1, 2
c) 3 d) 2, 3
జవాబు: (d)
వివరణ: బూర్జహోమ్ కొత్తరాతి యుగానికి చెందిన స్థలం. కాశ్మీర్లో ఉంది. గుంతల్లో నివసించిన మానవులకు ప్రసిద్ధి. కాబట్టి జవాబులో 1 ఉండొద్దు. చంద్రకేతుగఢ్ మౌర్యుల కాలపు టెరాకోట విగ్రహాలకు ప్రసిద్ధి. గణేశ్వర్ తామ్రశిలా యుగం (చాకో లిథిక్) నాటి రాగి కళాకృతులు బయల్ప డ్డాయి. అంటే జవాబు (d) అవుతుంది.
4. కింద పేర్కొన్న ప్రాచీన పట్టణాల్లో ఏది వరస ఆనకట్టలను నిర్మించుకొని, రిజర్వాయర్లలోకి నీటిని మళ్లించుకోవడం ద్వారా నీటిని ఒడిసిపట్టుకొనే, యాజమాన్యం చేసే విస్తారమైన వ్యవస్థకు ప్రసిద్ధిచెందింది?
a) ధోలవీర b) కాలిబంగన్
c) రాఖీగఢి d) రోపార్
జవాబు: (a)
వివరణ: సింధూ నాగరికతకు చెందిన ధోలవీర పట్టణం గుజరాత్లో ఉంది. దీనికి గత ఏడాది యునెస్కో ప్రపంచ వారసత్వం కేంద్రంగా గుర్తింపు లభించింది.
5. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు సంబంధించి సరైనది ఏది?
a) మువ్వన్నెల భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య ఇక్కడే రూపకల్పన చేశారు.
b) ఆంధ్ర ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమానికి పట్టాభి సీతారామయ్య ఇక్కడినుంచే నాయకత్వం వహించారు.
c) రవీంద్రనాథ్ టాగూర్ (తన) జాతీయ గీతాన్ని ఇక్కడే బెంగాలీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
d) మేడమ్ బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కేంద్రాన్ని మొదట ఇక్కడే ఏర్పాటుచేశారు.
జవాబు: (c)
6. మధ్యయుగాల భారతదేశానికి సంబంధించి, దిగువన పేర్కొన్న పదాలలో విస్తీర్ణాన్ని బట్టి ఆరోహణ క్రమంలో సరైన శ్రేణి ఏది?
a) పరగణా– సర్కార్– సుబా
b) సర్కార్– పరగణా– సుబా
c) సుబా– సర్కార్– పరగణా
d) పరగణా– సుబా– సర్కార్
జవాబు: (a)
7. వలసపాలనలో భారతదేశానికి సంబంధించి, షానవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, గురుబక్ష్ సింగ్ ధిల్లాన్‌లను ఎలా గుర్తుంచుకుంటారు?
a) స్వదేశీ, బహిష్కరణ ఉద్యమ నాయకులు
b) 1946లో మధ్యంతర ప్రభుత్వంలో సభ్యులు
c) రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీ (రచనా సంఘం) సభ్యులు
d) భారత జాతీయ సైన్యం (ఐఎన్ఎ)లో అధికారులు
జవాబు: (d)
వివరణ: పట్టుబడిన భారత జాతీయ సైన్యం (ఐఎన్ఏ) సైనికులైన పీకే సెహగల్, షానవాజ్ ఖాన్ జీ ఎస్ థిల్లాన్ తదితరుల మీద ఢిల్లీలోని ఎరకోటలో విచారణ జరిపారు. వీరి తరఫున వాదించేందుకు జవహర్లాల్ నెహ్రూ, భూల్భాయ్ దేశాయి,తేజ్ బహదూర్ సమ్రూ, కైలాసనాథ కట్జూ, అసఫ్ అలీ మళ్లీ నల్లకోటు ధరించారు.
8. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి భవభూతి, హస్తిమల్ల, క్షేమేశ్వర దేనికి ప్రసిద్ధి?
a) జైన భిక్షువులు
b) నాటక రచయితలు
c) దేవాలయ వాస్తుశిల్పులు
d) వేదాంతులు జవాబు: (b)
9. కింద పేర్కొన్న వారిలో ఎవరు తర్వాత కాలంలో బెతూక్ బాలికా పాఠశాలగా ప్రసిద్ధిచెందిన హిందూ బాలికా పాఠశాల సెక్రటరీగా పనిచేశారు?
a) అనీ బీసెంట్ b) దేవేంద్రనాథ టాగూర్
c) ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
d) సరోజినీ నాయుడు
జవాబు: (c)
10. ప్రాచీన భారతదేశ ధార్మిక గీతాలను ఇంగ్లిష్‌లోకి ‘సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్’ పేరిట ఎవరు అనువాదం చేశారు?
a) బాల గంగాధర తిలక్
b) జవహర్లాల్ నెహ్రూ
c) మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
d) సరోజినీ నాయుడు
జవాబు: (c)
వివరణ: 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమ సమయంలో ఎరవాడ జైలులో ఉన్నప్పుడు గాంధీజీ ఈ అనువాదం చేశారు.
11. భారతదేశ చరిత్రలో 1942 ఆగస్టు 8కి సంబంధించి సరైనది?
a) ఏఐసీసీ క్విట్ ఇండియా ఉద్యమ తీర్మా నాన్ని స్వీకరించింది.
b) మరింత మంది భారతీయులను చేర్చు కోవడానికి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని విస్తరించారు.
c) ఏడు ప్రావిన్సుల్లో కాంగ్రెస్ మంత్రి వర్గాలు రాజీనామా చేశాయి.
d) రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే పూర్తి అధినివేశ రాజ్య (డొమీనియన్ స్టేటస్) ప్రతిపత్తితో భారత యూనియన్ ఏర్పాటు చేస్తామని క్రిప్స్ ప్రతిపాదించాడు.
జవాబు: (a)
12. కింద ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించండి.
1. 1919 మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల్లో 21 ఏండ్లు దాటిన మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వాలని సిఫారసు చేసింది.
2. భారత ప్రభుత్వ చట్టం 1935 శాస నసభల్లో మహిళలకు కొన్ని స్థానాలను రిజర్వేషన్లను ఇచ్చింది.
పైన ఇచ్చిన వ్యాఖ్యల్లో ఏవి సరైనవి?
a) 1 b) 2
c) 1, 2 రెండూ సరైనవే
d) 1, 2 రెండూ కాదు
13. దిగువ ఇచ్చిన వ్యాఖ్యలను పరిశీలించండి.
1. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జెస్యూట్ పరంపరకు చెందిన వ్యవస్థాపక సభ్యుడు.
2. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో మరణించాడు. అక్కడ ఒక చర్చిని ఆయనకు అంకితం చేశారు.
3. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వేడుక గోవాలో ప్రతి సంవత్సరం జరుపు కొంటారు.
పైన ఇచ్చిన వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a) 1, 2 b) 2, 3
c) 1, 3 d) 1, 2, 3
జవాబు : (c)
వివరణ: సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చైనాలో మరణించాడు. కాబట్టి జవాబులో 2వ ఐచ్ఛికం ఉండకూడదు.
14. పోర్చుగీసు రచయిత న్యూనిజ్ మేరకు విజయనగర సామ్రాజ్యంలో మహిళలు ఎందులో నిపుణులు?
1. మల్లయుద్ధం (రెజ్లింగ్)
2. జ్యోతిషం (ఆస్ట్రాలజీ)
3. ఖాతాల నిర్వహణ (అకౌంటింగ్)
4. ఎరుక (సోది) చెప్పటం (సూత్సేయింగ్)
కింద ఇచ్చిన సంకేతాల నుంచి సరైన జవాబును ఎంచుకోండి.
a) 1, 2, 3
b) 1, 3, 4
c) 2, 4
d) 1, 2, 3, 4
జవాబు : (d)
15. పదిహేడో శతాబ్దం తొలి పావుభాగంలో దిగువ పేర్కొన్న ప్రదేశాల్లో ఎక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీలు నెలకొని ఉన్నాయి?
1. బ్రోచ్ 2. చికాకోల్
3. ట్రిచినోపోలి
కింద ఇచ్చిన సంకేతాల నుంచి సరైన జవాబు ను ఎంచుకోండి.
a) 1 b) 1, 2
c) 3 d) 2, 3
జవాబు: (a)
16. దిగువ ఇచ్చిన వివరాలను పరిశీలించండి.
1. ఇల్టుట్మిష్ పాలనా కాలంలో చెంఘిజ్ ఖాన్ ఖ్వారిజ్మ్ నామమాత్రపు యువరాజు ను వెంటాడుతూ సింధు నదివరకు వచ్చాడు.
2. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో తైమూర్ ముల్తాన్‌ను ఆక్రమించుకున్నాడు. సింధూ నదిని దాటివచ్చాడు.
3. విజయనగర సామ్రాజ్య పాలకుడు దేవరాయ– II కాలంలో వాస్కో డ గామా కేరళ తీరానికి చేరుకున్నాడు.
పైన ఇచ్చిన వ్యాఖ్యలలో సరైనవి ఏవి?
a) 1 b) 1, 2
c) 3 d) 2, 3
జవాబు : (a)
వివరణ: ఇల్టుట్మిష్ కాలంలోనే మంగోల్ పాలకుడు చంఘిజ్ ఖాన్ ఖ్వారిజ్మ్ యువ రాజు జలాలుద్దీన్ మంగబార్నీని తరుము తూ సింధు నది వరకు చేరుకున్నాడు. కాబట్టి, 1వ వివరణ సరైందే. తైమూర్ (తామర్లేన్) భారతదేశ దండయాత్ర మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాక, 1398లో జరిగింది కాబట్టి 2వది తప్పు. దేవరాయ– II పాలనాకాలం 1424– 1446 మధ్య. ఇక వాస్కో డ గామా 1498లో కేరళ తీరానికి చేరుకున్నాడు. కాబట్టి 3వ వివరం కూడా సరైంది కాదు. జవాబు (a) అంటే 1 మాత్రమే అవుతుంది.
17. దిగువ ఇచ్చిన వివరాల్లో సరైనది ఏది?
a) అజంతా గుహలు వాఘోరా నది గార్జిలో ఉన్నాయి.
b) సాంచి స్తూపం చంబల్ నది గార్జిలో ఉంది.
c) పాండు లేనా గుహాలయాలు నర్మదా నది గార్జిలో ఉన్నాయి.
d) అమరావతి స్తూపం గోదావరి నది గార్జిలో ఉంది. జవాబు: (a)
18. భారతదేశ చరిత్రకు సంబంధించి, కింద ఇచ్చిన వివరాలలో సరైనవి ఏవి?
1. ఆర్కాట్ నిజామత్ హైదరాబాద్ రాజ్యం నుంచి ఏర్పడింది.
2. విజయనగర సామ్రాజ్యం నుంచి మైసూరు రాజ్యం అవతరించింది.
3. అహ్మద్ షా దురానీ ఆక్రమించిన ప్రాంతాల నుంచి రోహిల్‌ఖండ్ సామ్రాజ్యం ఏర్పాటుచేశారు.
దిగువ ఇచ్చిన సంకేతాల నుంచి సరైన జవాబును ఎంచుకోండి.
a) 1, 2 b) 2
c) 2, 3 d) 3
జవాబు : (a)
19. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సరైనవి ఏవి?
1. మితాక్షర న్యాయశాస్త్రం అగ్రవర్ణాలను ఉద్దేశించింది కాగా, దాయభాగ దిగువ వర్ణాలవారికి ఉద్దేశించింది.
2. మితాక్షర విధానంలో, తండ్రి జీవించి ఉన్నప్పుడే కొడుకులు ఆస్తి హక్కును కోరవచ్చును. దాయభాగ విధానంలో, తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే కొడుకులు ఆస్తిపై హక్కులు కోరాల్సి ఉంటుంది.
3. కుటుంబంలో మగవాళ్ల అధీనంలో ఉన్న ఆస్తికి సంబంధించిన అంశాల గురించి మితాక్షర ప్రస్తావిస్తుంది. దాయభాగ విధానం కుటుంబంలో మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ కలిగిన ఉన్న ఆస్తికి సంబంధించిన అంశాలను పేర్కొంటుంది.
దిగువన ఇచ్చిన సంకేతాల నుంచి సరైన జవాబును ఎంచుకోండి.
a) 1, 2 b) 2 c) 1, 3 d) 3
జవాబు : (b)
20. దిగువ ఇచ్చిన వివరాలను పరిశీలించండి.
1. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యూనిసెఫ్ ప్రకటించింది.
2. జాతీయ భాషల్లో బంగ్లా కూడా ఉండాలని పాకిస్థాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు.
పైన ఇచ్చిన వివరాలలో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 రెండూ సరైనవే
d) 1, 2 రెండూ సరికాదు
జవాబు : (b)
వివరణ : యునిసెఫ్ కాదు. యునెస్కో ప్రకటించింది. 1948 ఫిబ్రవరి 25న బెంగాల్‌ని అధికార భాషల్లో ఒకటిగా గుర్తించాలని ధర్మేంద్రనాథ్ దత్తా పాకిస్థాన్ రాజ్య్గాం సభలో లేవనెత్తాడు. దాన్ని జిన్నా తిరస్కరించాడు.
సి.హర్షవర్ధన్, హైదరాబాద్
- Tags
- competitive exams
- Groups
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు