ధరలు పెరగడం… ద్రవ్యం విలువ తగ్గడం
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ద్రవ్యోల్బణ సమస్య ఒకటి. తర తమ బేధాలు లేకుండా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ సమస్యను ఏదో ఒక సమయంలో ఎదుర్కుంటూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం వివిధ దేశాల్లో వివిధ రంగాలపై, వివిధ స్థాయిల్లో అనేక ప్రభావాలను చూపిస్తూ అనేక సమస్యలకు కారణ మౌతుంది. ద్రవ్యోల్బణం అనేది జాతీయ సమస్యే కాకుండా అంతర్జాతీయ సమస్యగా చెప్పవచ్చు.
ద్రవ్యోల్బణం- నిర్వచనాలు- భావనలు
-ప్రాచీన కాలం నుంచి అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం ఉన్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.
– ప్రపంచంలో మొట్టమొదట 16వ శతాబ్దం లో సంభవించిన ధరల తిరుగుబాటు అనేది ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
నిర్వచనాలు (Definations)
– ద్రవ్యోల్బణం అంటే పెరుగుతున్న ధరలే కాని హెచ్చు ధరలు కాదు.
– ధరలు నిదానంగా, నిరంతరంగా, క్రమ క్రమంగా పెరుగుతున్న స్థితిని ద్రవ్యోల్బణం అంటారు.
– సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
– ద్రవ్యోల్బణానికి వివిధ ఆర్థిక వేత్తలు వివిధ రకాల నిర్వచనాలను సూచించారు.
– ‘వస్తుసేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగపడే ద్రవ్యం లభ్యమయ్యే వస్తువుల కన్నా ఎక్కువగా పెరగడమే ద్రవ్యోల్బణం’ – ఇర్వింగ్ఫిషర్
– ‘వాస్తవిక ఆదాయ పెరుగుదల కన్నా ద్రవ్య ఆదాయాలు ఎక్కువగా పెరగడం ద్రవ్యోల్బణం’ – ఎ.పి.పీగూ
– ‘ధరలు పెరుగుతున్న స్థితి అంటే ద్రవ్యం విలువ తుగ్గుతున్న స్థితి ద్రవ్యోల్బణం’ – క్రౌథర్
– ‘సాధారణ ధరల స్థాయిలోని పెరుగుదల ద్రవ్యోల్బణం’ – శామ్యూల్ సన్
– ‘నిలకడగా, నిరంతరంగా ధరల స్థాయిలోని పెరుగుదల ద్రవ్యోల్బణం’ – షాపిరో
– ‘అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం’ – హట్రే
– ‘తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశి తరమడమే ద్రవ్యోల్బణం’ – డాల్టన్
– ఆర్థిక వ్యవస్థలో వ్యాపార వ్యవహారాలు తక్కువగాను ద్రవ్యం ఎక్కువగా ఉన్న పరిస్థితిని ద్రవ్యోల్బణం’ – ఆచార్యకెమ్మెరన్
– పై నిర్వచనాలను చూస్తే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యరాశి ఎక్కువగాను వస్తుసేవల ఉత్పత్తి తక్కువగాను ఉన్నప్పుడే ధరల పెరుగుదల/ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణం-భావనలు (Concepts of Inflation)
ద్రవ్యోల్బణం(Inflation)
– ఆర్థిక వ్యవస్థలో, వస్తుసేవల సాధారణ ధరల స్థాయిలో నిరంతరంగా, దీర్ఘకాలంలో వచ్చే పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
-ఇది మార్కెట్ శక్తుల వల్ల ఏర్పడుతుంది.
– ఇది వస్తుసేవల సప్లయి, డిమాండ్ల మధ్య అసమల్యం వల్ల ఏర్పడుతుంది.
-డిమాండ్‌కు సరిపడా సప్లయి లేనపుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణం సమయంలో సప్లయి తగ్గి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
– ఫలితంగా ద్రవ్య కొనుగోలు శక్తి తగ్గుతుంది.
రుణాత్మక ద్రవ్యోల్బణం (Dis Inflation)
– పెరిగిన ధరలను వ్యయాలను తగ్గించడాన్ని, రుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.
– ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం, ప్రభుత్వ అనుబంధ సంస్థలు(ఆర్బీఐ) తీసుకున్న చర్యల వల్ల ధరలు తగ్గితే దానిని రుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు. ఉత్పత్తి పరిమాణంలో, ఉపాధిలో ఎటువంటి క్షీణత లేకుండా లేదా నిరుద్యోగితపై ఎటువంటి ప్రభావం చూపకుండా ధరలు తగ్గించడాన్ని ‘డిస్ ఇన్ఫ్లేషన్’ అంటారు.
-రుణాత్మక ద్రవ్యోల్బణం ఏర్పడటానికి భారతదేశంలో ప్రభుత్వం కోశ పరమైన చర్యలు, ఆర్బీఐ ద్రవపరమైన చర్యలు తీసుకుంటాయి.
ప్రతి ద్రవ్యోల్బణం (Deflation)
– ఇది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకమైనది. ధరలు తగ్గుతూ ఉండే స్థితి అంటే ద్రవ్య విలువ పెరుగుతున్న స్థితిని ‘Disinflation’ అంటారు.
– ప్రతి ద్రవ్యోల్బణం మార్కెట్ శక్తుల(సప్లయి, డిమాండ్) మధ్య సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గి ప్రతి ద్రవ్యోల్బణం వస్తుంది.
పునరుల్బణం (Reflation)
-ప్రతిద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నాన్ని ‘రిఫ్లేషన్’ అంటారు.
-ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం, అనుబంధ సంస్థలు(ఆర్బీఐ) జోక్యం చేసుకొని చేపట్టే చర్యల ఫలితంగా తగ్గిన వస్తుసేవల ధరలు పెరుగుతూ ఉండే పరిస్థితిని పునరుల్బణం అంటారు.
స్తంభన ద్రవ్యోల్బణం(Stag Fation)
-ఒక వైపు అధిక ద్రవ్యోల్బణ రేటు మరొక వైపు ఆర్థిక మాద్యం ఇలా పరస్పర వైరుధ్యంతో కూడిన స్థితినే స్తంభన ద్రవ్యోల్బణం అంటారు. దీనినే స్థబ్దత ద్రవ్యోల్బణం అని కూడా అంటారు.
– ఒకవైపు ధరలు పెరుగుతూ, మరోవైపు స్తబ్దత లేదా నిరుద్యోగిత కలిసి ఉంటే దానిని స్టాగ్ ఫ్లేషన్’ అంటారు.
-స్టాగ్ ఫ్లేషన్ అనే పదాన్ని శామ్యూల్ సన్ ఉపయోగించారు.
– ఈ ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యోల్బణస్థాయి ఎక్కువగా ఉండటమే కాక నిరుద్యోగితాస్థాయి ఎక్కువగా ఉండును.
– ఇది స్టాగ్నేషన్: ఇన్ఫ్లేషన్ అనే రెండు పదాల కలయికనే స్టాగ్ఫ్లేషన్
-దీనిని ఇన్ఫ్లేషనరీ రెసిషన్(Inflationary Recession) అని కూడా అంటారు.
-1970 దశకంలో భారతదేశంలో స్తంభన ద్రవ్యోల్బణ లక్షణాలు ఏర్పడ్డాయి.
Skewflation
ఆర్థిక వేత్తలు ద్రవ్యోల్బణం, సాపేక్ష ధరల పెరుగుదలకు మధ్యతేడాను చూపిస్తారు. ద్రవ్యోల్బణం అనగా సాధారణ వస్తు ధరల పెరుగుదల, సాపేక్ష వస్తు ధరల పెరుగుదల. ఇక్కడ ఒక గ్రూపునకు చెందిన వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ కేవలం ఆహార ధరలు మాత్రం పెరుగుతూ వచ్చాయి.
సౌష్ఠవ ద్రవ్యోల్బణం (Symmetrical Inflation)
-Stagflation పదాన్ని 2009-10 ఆర్థిక సర్వేలో భారత ప్రభుత్వం ఉపయోగించింది.
– ఆర్థిక వ్యవస్థలో ఒకే సమయంలో ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం కలసి ఉంటే దాన్ని సౌష్ఠవ ద్రవ్యోల్బణం అంటారు.
Bottle Neck Inflation
డిమాండ్ మారకుండా సప్లయి భారీగా పడిపోతే పెరిగే ధరలను ‘Bottle Neck Inflation’ అంటారు.
Bracket Creep
– ప్రజల ఆదాయంలో అతి స్వల్పంగా వచ్చే పెరుగుదల వల్ల వారు ఆదాయ పన్ను పరిధిలోకి రావటాన్ని బ్రాకెట్ క్రీప్ అంటారు.
ద్రవ్యోల్బణ సర్పిలం/ వేతన ధరల సర్పిలం (Wage Price Spirel)
-ధరలు పెరగడం ద్వారా జీతాలు/వేతనాలు పెరిగి, వేతనాలు పెరగడం వల్ల వస్తుసేవల ధరలు పెరుగుతూ ఉన్న స్థితిని ‘ద్రవ్యోల్బణ సర్పిలం/ వేతన ధరల సర్పిలం అంటారు.
– 1935 సం౹౹లో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.
ద్రవ్యోల్బణ ఖాతా(Inflation Accounting)
– ఆర్థిక సంస్థలు మార్కెట్ శక్తుల వల్ల పెరిగిన వస్తుసేవల ధరల ప్రభావానికి లోనుకాకుండా ఒక ఉత్పత్తి సంస్థ తన నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ద్రవ్యోల్బణ ఖాతా అంటారు.
ద్రవ్యోల్బణ పన్ను(Inflation tax)
– ఆర్థిక సంస్థలు(ఆర్బీఐ) అదనపు ద్రవ్యాన్ని ముద్రించటం ద్వారా ద్రవ్యసప్లయి పెరిగి వస్తు, సేవల ధరలు పెరిగి తద్వారా వస్తు సేవల డిమాండ్ ప్రియంగా మారితే దాన్ని ద్రవ్యోల్బణ పన్ను అంటారు.
Inflation Indexed Bonds(IIB)
– బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారిని ప్రభుత్వ పొదుపు వైపు మరలించి విత్తరంగంలోకి వనరులను తీసుకు రావాలని 2013 సం.లో ఆర్బీఐ వీటిని ప్రవేశ పెట్టింది.
-ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయటంలో ఈ బాండ్లపై స్థిరమైన వాస్తవ వడ్డీరేటు లభిస్తుంది.
-ప్రతీ పెట్టుబడి దారుడు 1000 నుంచి 2 కోట్ల రూపాలయల మధ్య పెట్టుబడి పెట్టవచ్చు . దీని కాలపరిమితి 1 సంవత్సరం.
ప్రాక్టీస్ బిట్స్
1. ద్రవ్యోల్బణం అనేది
ఎ) జాతీయ సమస్య
బి) అంతర్జాతీయ సమస్య
సి) రాష్ట్రీయ సమస్య డి) పైవన్నీ
2. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఏ శతాబ్దంలో ధరల తిరుగుబాటు ఏర్పడింది?
ఎ) 15వ శతాబ్దం బి) 16వ శతాబ్దం
సి) 17వ శతాబ్దం డి) 18వ శతాబ్దం
3. ద్రవ్యోల్బణం అంటే
ఎ) పెరుగుతూ ఉన్న ధరలు
బి) హెచ్చు ధరలు
సి) ఎ, బి డి) పైవేవీకావు
4. వాస్తవిక ఆదాయ పెరుగుదల కన్నా, ద్రవ్య ఆదాయాలు ఎక్కువగా పెరగడాన్ని ద్రవ్యోల్బణం అని ఎవరు నిర్వచించారు?
ఎ) ఇర్వింగ్ ఫిషర్ బి) ఏసీ పీగూ
సి) క్రౌథర్ డి) డాల్టన్
5. తక్కువ వస్తురాశిని హెచ్చు ద్రవ్యరాశి తరమడమే ద్రవ్యోల్బణం అని నిర్వచించింది ఎవరు?
ఎ) డాల్టన్ బి) పీగూ
సి) హట్రే డి) ఫిషర్
6. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని నిర్వచించినది ఎవరు?
ఎ) డాల్టన్ బి) శామ్యూల్ సన్
సి) క్రౌథర్ డి) హట్రే
7. వస్తుసేవల ధరల స్థాయిలో నిరంతరంగా, దీర్ఘకాలంలో వచ్చే పెరుగుదలను ఏమంటారు?
ఎ) ద్రవ్యోల్బణం బి) స్టాగ్ ఫ్లేషన్
సి) ప్రతిద్రవ్యోల్బణం డి) పైవన్నీ
8. ఒకవైపు ధరలు పెరుగుతూ మరొక వైపు స్తబ్దత కలిసి ఉంటే దానిని ఏమంటారు?
ఎ) డిస్‌ఇన్‌ఫ్లేషన్ బి) స్టాగ్ఫ్లేషన్
సి) రిఫ్లేషన్ డి) డిఫ్లేషన్
9. ఏ దశకంలో భారతదేశంలో స్తంభన ద్రవ్యోల్బణం ఏర్పడింది?
ఎ) 1950 దశకం బి) 1960 దశకం
సి) 1970 దశకం డి) 1980 దశకం
10. సాధారణ వస్తు ధరల పెరుగుదల, సాపేక్ష వస్తు ధరల పెరుగుదల మధ్య తేడాను తెలియజేసేది ఏది?
ఎ) Skewflation
బి) Stagflation
సి) Symmetrical Inflation
డి) Bottle Neck Inflation
11. డిమాండ్ మారకుండా సప్లయి భారీగా పడిపోయినపుడు పెరిగే ధరలను ఏమంటారు?
ఎ) Stagflation
బి) Skewflation
సి) Symmetrical Inflation
డి) Bottle Neck Inflation
12. Stagflation అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు?
ఎ) డాల్టన్ బి) రాబర్ట్సన్
సి) శామ్యూల్ సన్ డి) మార్షల్
13. వేతన ధరల సర్పిలం/ ద్రవ్యోల్బణ సర్పిలం అమెరికాలో ఏ సంవవత్సరంలో ఏర్పడింది?
ఎ) 1835 బి) 1935
సి) 1735 డి) 2005
14. పెరిగిన ధరలను వ్యయాలను తగ్గించడాన్ని ఏమంటారు?
ఎ) రుణత్మక ద్రవ్యోల్బణం
బి) పునరుల్బణం
సి) స్తంభన ద్రవ్యోల్బణం
డి) పైవన్నీ
15. ఆర్థిక వ్యవస్థలో ఒకే సమయంలో ద్రవ్యోల్బణం, ప్రతిద్రవ్యోల్బణం కలిసి ఉంటే దాన్ని ఏమంటారు?
ఎ) స్తంభన ద్రవ్యోల్బణం
బి) సౌష్ఠవ ద్రవ్యోల్బణం
సి) ద్రవ్యోల్బణ సర్పిలం
డి) పునరుల్బణం
16. ధరలు పెరగడం వల్ల వేతనాలు పెరిగి తద్వారా వస్తుసేవల ధరలు పెరగడాన్ని ఏమంటారు?
ఎ) వేతన ధరల సర్పిలం
బి) ద్రవ్యోల్బణ సర్పిలం
సి) బ్రాకెట్ క్రీప్ డి) ఎ, బి
17. విత్త సంస్థలు మార్కెట్ శక్తుల వల్ల పెరిగిన ధరల ప్రభావానికి లోనుకాకుండా ఒక ఉత్పత్తి సంస్థ నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్యోల్బణ ఖాతా
బి) ద్రవ్యోల్బణ ప్రీమియం
సి) ద్రవ్యోల్బణ పన్ను
డి) ద్రవ్యోల్బణ సర్పిలం
18. Skewflation అనే పదాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆర్థిక సర్వేలో ఉపయోగించింది?
ఎ) 2008-09 బి) 2009-10
సి) 2010-11 డి) 2011-12
19. ధరలు తగ్గుతున్న స్థితి అంటే ద్రవ్యం విలువ పెరుగుతున్న స్థితిని ఏమంటారు?
ఎ) ద్రవ్యోల్బణం
బి) ప్రతి ద్రవ్యోల్బణం
సి) రుణాత్మక ద్రవ్యోల్బణం
డి) పునరుల్బణం
20. ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నాన్ని ఏమంటారు?
ఎ) స్టాగ్ఫ్లేషన్ బి) రిఫ్లేషన్
సి) ఇన్ఫ్లేషన్ డి) డిస్ ఇన్ఫ్లేషన్
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు