డీలిమిటేషన్ కమిషన్‌ను ఎవరు నియమిస్తారు? groups special)
పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన విభాగమైన ‘ఇండియన్ పాలిటీ -గవర్నెన్స్’లో మే 4న 105వ రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చాం. ఈసారి ‘104వ రాజ్యాంగ సవరణ చట్టం’, సంబంధిత అనుబంధ అంశాలను అధ్యయనం చేద్దాం..
104 వ రాజ్యాంగ సవరణ చట్టం – పార్లమెంట్ ఆమోదం
లోక్‌సభ-2019, డిసెంబర్ 10
రాజ్యసభ- 2019, డిసెంబర్ 12
రాష్ట్రపతి- 2020, జనవరి 21
అమలు- 2020, జనవరి 25
ఉద్దేశం
1. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో (లోక్‌సభ, అసెంబ్లీ) రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు అంటే 2020 జనవరి 25 నుంచి 2030 జనవరి 25 వరకు పొడిగించడం.
2. చట్టసభల్లో (లోక్‌సభ, అసెంబ్లీ) ఇప్పటి వరకు (2020 జనవరి 25) అమలైన ఆంగ్లో-ఇండియన్స్ ప్రాతినిధ్యాన్ని రద్దు చేయడం.
చట్టసభల్లో రిజర్వేషన్లు – నేపథ్యం
రాజ్యాంగంలో ప్రస్తావించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంలో భాగంగా అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు, వారి సామాజిక వర్గాల తరఫున చట్టసభల్లో గొంతుక వినిపించడం కోసం వారికి లోక్‌సభ, శాసనసభలో కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు.
రాజ్యాంగ నిబంధనలు
భాగం-xvi
అధికరణ 330- ప్రజాప్రతినిధుల సభలో షెడూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు.
అధికరణ 331- ప్రజాప్రతినిధుల సభలో ఆంగ్లో-ఇండియన్స్‌కు రిజర్వేషన్లు
అధికరణ 332- రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్డ్ కలాల, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు
అధికరణ 333- రాష్ట్ర శాసనసభల్లో ఆంగ్లో-ఇండియన్లకు రిజర్వేషన్లు
అధికరణ 334- చట్టసభల్లో రిజర్వేషన్లను నిర్దిష్టకాలం తరువాత నిలిపివేస్తారు.
మౌలిక రాజ్యాంగంలో అధికరణ 334 ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల వరకు అంటే 1960 జనవరి 25 వరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కొనసాగు తాయని ప్రస్తావించారు. కాలానుగుణంగా ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్స్ ప్రత్యేక ప్రాతినిథ్యాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.
చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం
బ్రిటిష్ కాలంలో భారతదేశానికి వచ్చి భారతీయ మహిళలను వివాహం చేసుకుని, ఇక్కడే స్థిరపడ్డ వారికి కలిగిన సంతానమే ఆంగ్లో ఇండియన్లు. రాజ్యాంగంలోని అధికరణ 366(2)లో ఆంగ్లో ఇండియన్ల నిర్వచనం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో కేవలం ఏడు రాష్ట్రాల్లో 296 మంది ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు. అందువల్ల ఇంత తక్కువ మందికి చట్టసభల్లో ప్రత్యేక ప్రాతినిథ్యం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావించి 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వారి ప్రాతినిథ్యాన్ని రద్దు చేసింది.
దేశంలో ఆంగ్లో ఇండియన్లు
1. కేరళ-124
2. తమిళనాడు-69
3. ఆంధ్రప్రదేశ్-62
4. కర్ణాటక-9
5. పశ్చిమబెంగాల్-9
6. ఒడిశా-4
7. ఛత్తీస్‌గఢ్-3
నోట్: అధికరణ 331- తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్ చేస్తాడు.
అధికరణ 333- తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీకి ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేస్తాడు.
ప్రస్తుతం వీటిని రద్దు చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన
రాజ్యాంగంలోని అధికరణ 82 ప్రకారం పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన, అధికరణ 170 ప్రకారం రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా పునర్వి భజన చేయాలి. దీని కోసం కేంద్రం ప్రత్యేక మైన డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.
డీలిమిటేషన్ కమిషన్
నియమించేది- రాష్ట్రపతి
సభ్యులు- ముగ్గురు (సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి, భారత ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల అధికారి)
నివేదిక- రాష్ట్రపతికి సమర్పించాలి. ఆయన దాన్ని పార్లమెంట్లో సమర్పించాలి.
సిఫారసులు- కేంద్రం కచ్చితంగా అమలు చేయాలి. తుది నివేదిక తరువాత మార్పులు చేయడానికి పార్లమెంట్‌కు కూడా ఎలాంటి అధికారం ఉండదు.
ప్రత్యేకత- దీని నిర్ణయాలను ఏ న్యాయ స్థానంలోనూ ప్రశ్నించకూడదు.
విధులు/అధికారాలు
1. జనాభా లెక్కల ఆధారంగా పార్ల మెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం
2. నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణ యించడం
3. చట్ట సభల్లో జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వ్డ్ స్థానాలను నిర్ణయించడం
4. రాష్ట్రపతి నిర్దేశించిన ఇతర అధికారాలు
నిర్ణయాధికారం- 2:1 మెజారిటీ అభిప్రాయం
డీలిమిటేషన్ కమిషన్లు – సిఫారసులు
1952 – ఒకటో కమిషన్ – జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ – 494 లోక్‌సభ స్థానాలు
1963 – రెండో కమిషన్ – — – 523 లోక్‌సభ స్థానాలు
1973 – మూడో కమిషన్ – జస్టిస్ జేఎల్ కపూర్ – 543 లోక్‌సభ స్థానాలు
2002 – నాలుగో కమిషన్ – జస్టిస్ కుల్దీప్ సింగ్ – ఎస్సీ ఎస్టీ స్థానాల పెంపు
నోట్: 84వ రాజ్యాంగ సవరణ చట్టం-2001 ప్రకారం 2026 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయకూడదు. 87వ రాజ్యాంగ సవరణ చట్టం-2003 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం 2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా తీసుకోవాలి. అంతకుముందు 1971 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకునే వారు.
డీలిమిటేషన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలంటే పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టాన్ని రూపొందించాలి.
ప్రస్తుత చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు
లోక్‌సభ- 543
ఎస్సీ – 84, ఎస్టీ – 47
తెలంగాణ లోక్‌సభ స్థానాలు- 17
ఎస్సీ – 3, ఎస్టీ – 2
తెలంగాణ అసెంబ్లీ- 119
ఎస్సీ – 19, ఎస్టీ – 12
నోట్: రాజ్యసభ, శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో-ఇండియన్లకు రిజర్వేషన్లు ఉండవు.
ప్రాక్టీస్ బిట్స్
1. జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం-2019 ప్రకారం ఏర్పాటైన జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు?
ఎ) జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్
బి) జస్టిస్ రంజన్‌గొగోయ్
సి) జస్టిస్ చతుర్వేది
డి) జస్టిస్ సుశీల్చంద్రకుమార్
2. కింది వాటిలో 104వ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేసేది?
1. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల పెంపు
2. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సరిహద్దుల పెంపు
3. ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం రద్దు చేయడం
ఎ) 1 బి) 2 సి) 3 డి) 1, 3
3. ప్రస్తుతం దేశంలోని ఏ రాష్ట్రాల్లో ఆంగ్లో ఇండియన్లు లేరు?
1. తెలంగాణ 2. గుజరాత్
3. ఆంధ్రప్రదేశ్ 4. గోవా
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
4. కింది వాటిలో డీలిమిటేషన్ కమిషన్ గురించి సరికానిది?
1. దీని సిఫారసులు సమీక్షకు గురికావు
2. డీలిమిటేషన్ కమిషన్ నివేదికకు పార్లమెంట్ సవరణ చేయగలదు
3. డీలిమిటేషన్ సిఫారసులు రాష్ట్రపతి అనుమతితో అమల్లోకి వస్తాయి.
ఎ) 1 బి) 2 సి) 3 డి) 2, 3
5. చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు
ఎ) రాజ్యాంగ పరిరక్షణ ఉంది
బి) న్యాయ పరిహార యోగ్యత ఉంది
సి) చట్టాల సంరక్షణ ఉంది
డి) పైవన్నీ
6. 2022 మే 5 నాటికి ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిథ్యం కలిగి ఉన్నాయి? ……….
ఎ) 7 బి) 6 సి) 5
డి) అలాంటి రాష్ట్రమేదీ లేదు
7. కింది వాటిలో సరికానిది?
ఎ) గెర్రీమాండరింగ్ అనేది అమెరికాలో కనిపించే ఒక సరిహద్దుల విభజన ప్రక్రియ
బి) ఇది అక్రమంగా నియోజకవర్గాల సరిహద్దులను తారుమారు చేసే విధానాలను సూచిస్తుంది
సి) భారతదేశంలో ఈ విధానం అమల్లో లేదు డి) పైవన్నీ
8) భారతదేశంలో ఏ చట్టసభలో రిజర్వేషన్లు ఉండవు?
1. రాజ్యసభ
2. శాసనమండలి
3. నగరపాలక మండలి
4. పురపాలక మండలి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) పైవన్నీ
9 రాజ్యాంగంలోని ఏ భాగంలో చట్టసభల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించారు?
ఎ) XIV బి) XV
సి) XVI డి) XXI
10. భారత ప్రజాప్రతినిధుల సభల్లో కింది ఏ వర్గాల వారికి ప్రస్తుతం రిజర్వేషన్లు లేవు?
1. షెడ్యూల్డ్ కులాలు
2. షెడ్యూల్డ్ తెగలు
3. అగ్రవర్ణ పేదలు
4. ఆంగ్లో ఇండియన్లు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) 3
సమాధానాలు
1. ఎ 2. డి 3. సి 4. డి 5. డి 6…… 7. డి 8. ఎ 9. సి 10. సి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు