ప్రాథమిక విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
91. ప్రజల ప్రాణాలకు, శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటే మేజిస్ట్రేట్ కింది చర్యను చేపడతారు?
ఎ) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 144వ సెక్షన్ విధింపు
బి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 147వ సెక్షన్ విధింపు
సి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం 171 సెక్షన్ విధింపు
డి) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1975 ప్రకారం 149 సెక్షన్ విధింపు
92. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 141వ సెక్షన్ ప్రకారం అయిదుగురు(5) లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశం కావడం ఏ పరిస్థితుల నేపథ్యంలో నేరం అవుతుంది?
1) ప్రభుత్వాధికారులను చట్ట వ్యతిరేకమైన పనులను చేయాలని ఒత్తిడి చేయడం, భయపెట్టడం
2) శాసనాన్ని లేదా చట్టబద్ధ ప్రక్రియను ప్రతిఘటించడం
3) వ్యక్తుల ఆస్తులను బలవంతంగా ఆక్రమించడం
4) అల్లరి పనులు, ఆస్తుల ధ్వంసం
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 1, 3, 4
93. జాతీయ గీతాన్ని ఆలపించాలని ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయరాదని, మౌనంగా ఉండటం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) సుబ్రహ్మణ్యస్వామి vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) రమేష్థాపర్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు
సి) భరత్ కుమార్ vs సీపీఐ పార్టీ కేసు
డి) బిజయ్ ఇమ్మాన్యుయేల్ vs స్టేట్ ఆఫ్ కేరళకేసు
94. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడాన్ని వారి ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొన్నది
2) బంద్‌లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది
3) ఆటవిక జాతులు నివసించే ప్రాంతాల్లో నాగరికుల సంచార స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు
4) 1990లో బీజేపీ నేత ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్రను బీహార్‌లోని లాలూ ప్రసాద్‌యాదవ్ ప్రభుత్వం నిలిపివేసింది
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
95. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(F) ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు?
ఎ) ఇందిరాగాంధీ ప్రభుత్వం – 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971
బి) ఇందిరాగాంధీ ప్రభుత్వం – 42వ రాజ్యంగ సవరణ చట్టం 1976
సి) మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం – 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
డి) రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టం 1987
96. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 20(1)- నేరం చేయనిదే ఏ వ్యక్తినీ శిక్షించరాదు
2) ఆర్టికల్ (20)(2) ఒక వ్యక్తిని ఒక
నేరానికి ఒకసారి మాత్రమే శిక్షించాలి
3) ఆర్టికల్ 20(3) ఒక వ్యక్తిని బలవంతంగా తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయరాదు
4) ఆర్టికల్ 20(4) అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి.
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 2, 3, 4 డి) 1, 3, 4
97. ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా హింసిస్తూ, బెదిరిస్తూ సమాచారాన్ని రాబడితే దానిని బలవంతపు సాక్ష్యంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది?
ఎ) నందినీ శతపతి Vs పీఎల్ దాని కేసు
బి) టీకే.రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్
ఆంధ్రప్రదేశ్ కేసు
సి) చరిత Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు
డి) మహర్షి అవధేష్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్
98. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3)ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు నార్కో అనాలసిస్’ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది?
ఎ) కోబాడ్‌గాంధీ కేసు
బి) అతుల నాయక్ కేసు
సి) సర్దార్ సజ్జన్ కేసు
డి) రమేష్ థాపర్ కేసు
99. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) నార్కో అనాలసిస్ పరీక్షలో సోడియం పెంటథాల్, సోడియం అమైటాల్ అనే పదార్థాలను వినియోగిస్తారు
2) ఐపీసీలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మ హత్యాయత్నం నేరం
3) వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప, ఇతర పద్ధతుల్లో హాని తలపెట్టరాదు.
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
100. కిందపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) జైన మతస్థులు అనుసరించే ‘సల్లేఖన వ్రతం’ బలవంతపు మరణంగా పరిగణించరాదని సుప్రీంకోర్టు 2015లో ప్రకటించింది
2) భారత ప్రభుత్వం 1977లో ‘మేనకాగాంధీ’ పాస్‌పోర్ట్‌ను చేసుకున్నది
3) విదేశాలకు వెళ్లే హక్కు ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కులో భాగం కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది
4) Ex-Post Facto Law అంటే
కార్యాంతర శాసనాలు అని అర్థం
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
101. మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాన్ని గుర్తించండి?
1) జీవించే హక్కు అంటే కేవలం భౌతికంగా జీవించడం మాత్రమేగాక, మానవ మర్యాదలతో జీవించడం అని అర్థం
2) రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఒకదానితో మరొకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి
3) బ్రిటన్‌లో అమల్లో ఉన్న ‘Due Process of Law’ అనే శాసన ప్రక్రియను సుప్రీంకోర్టు పేర్కొన్నది
4) భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
102. సహజ న్యాయ సూత్రానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 21 ప్రకారం రూపొందించే శాసనం ‘సహజ న్యాయ సూత్రాలను’ ఉల్లంఘించరాదు
2) ప్రతి వ్యక్తికి విన్నవించుకునే హక్కు ఉన్నది
3) ఏ ఒక్కరూ తన సొంత కేసుకు తానే జడ్జిగా ఉండరాదు
4) ప్రతి ఆధికార వ్యవస్థ న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
103. దేశంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2009, ఏప్రిల్ 1
బి) 2009 నవంబర్ 11
సి) 2010 జనవరి 21
డి) 2010 ఏప్రిల్ 1
104. ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు’కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 21(ఎ)- ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును తెలియజేస్తుంది
2) 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా ఆర్టికల్ 21(ఎ) చేర్చబడినది
3) మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసింది
4) భారత పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని 2009లో రూపొందించింది
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
105. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009కి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక విద్య పూర్యయ్యేవరకు ఏ విద్యార్థినీ కూడా పాఠశాల నుంచి తొలగించరాదు
బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5 తరగతులు
సి) అన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలి
డి) ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 గా ఉండాలి
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
106. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009కి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
ఎ) అర్హత గల వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి
బి) ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8వ తరగతులు
సి) బాలబాలికలను శారీరకంగా, మానసికంగా హింసించరాదు
డి) 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బాలలందరూ దీనికి అర్హులు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
107. జాతీయోద్యమ సమయంలోనే 1911లో భారతీయులకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించి, అమలు చేయాలని ఆంగ్లేయులను డిమాండ్ చేసిన భారతీయుడు ఎవరు?
ఎ) బాలగంగాధర్ తిలక్
బి) మహాత్మాగాంధీ
సి) గోపాలకృష్ణ గోఖలే
డి) లాలా లజపతిరాయ్
108. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) భారత్‌లో పౌరస్వేచ్ఛకు సంబంధించి నమోదైన మొదటికేసు – ఏకే గోపాలన్ కేసు
2) Due Process of The Law అనే సూత్రం అమెరికాలో అమల్లో ఉన్నది
3) ‘గోల్డెన్ ట్రయాంగిల్’ ఆర్టికల్స్ లేదా ‘గోల్డెన్ ట్రినిటీ’ ఆర్టికల్స్‌గా ఆర్టికల్ 14, 19, 21 పేరొందినవి
4) ఏకే గోపాలన్ తమిళనాడుకు చెందిన పర్యావరణవేత్త
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 2, 3, 4
109. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఏకే గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో జస్టిస్ హెచ్‌జే కానియా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది
2) ఏకే గోపాలన్ కేసులో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థ చర్యలు న్యాయ సమీక్షకు గురైనవి
3) ఏకే గోపాలన్ కేసులో ‘సహజ న్యాయ సూత్రాలను వర్తింపచేయలేదు
4) ఏకే గోపాలన్ కేసులో 1950 నాటి ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టంలోని అంశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
110. ఆర్టికల్ 21 ప్రకారం ప్రస్తుతం జీవించే హక్కుగా దేనిని పేర్కొనవచ్చు?
1) గోప్యత హక్కు, ఆరోగ్యాన్ని పొందేహక్కు ఏకాంతంగా ఉండే హక్కు
2) సమాచారం పొందే హక్కు, జీవితబీమా పొందే హక్కు
3) కాలుష్య రహిత గాలి, నీరు పొందే హక్కు, సత్వర విచారణ పొందే హక్కు
4) విదేశాలకు వెళ్లే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 1, 2, 3, 4
111. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ (తలాక్-ఎ- బిద్ధత్) ద్వారా ముస్లిం మతంలో భర్త భార్యకు ఇచ్చే విడాకులు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు 2017లో ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) సైరాబాను Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) షకీలాబేగం Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) మహ్మద్ ఖాసీం Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
112. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల్లోపు మహిళలను వయస్సుతో సంబంధం లేకుండా ఆలయంలోకి అనుమతించాల్సిందేనని 2018లో శబరిమలై కేసుగా పేరొందిన కింది కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది దానిని గుర్తించండి?
ఎ) అనురాగ్ మీర్జా Vs స్టేట్ ఆఫ్ కేరళ
బి) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs స్టేట్ ఆఫ్ కేరళ
సి) ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ Vs స్టేట్ ఆఫ్ కేరళ
డి) రూథర్ ఆమ్టే Vs స్టేట్ ఆఫ్ కేరళ
113. విహహేతర సంబంధం నేరమని పేర్కొంటున్న ఐపీసీలోని సెక్షన్ 497 చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు
ఏ కేసు సందర్భంగా కీలకమైన తీర్పు నిచ్చింది?
ఎ) జోసెఫ్ షైన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
బి) అఖిల మిశ్రా Vs యూనియన్ ఆఫ్ ఇండియా
సి) కేదారి నాథ్ Vs స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్
డి) నాడీ వర్మన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
114. గోప్యతా హక్కుకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) గోప్యతా హక్కుపై న్యాయస్థానంలో పిటిషన్లు వేసినవారు – పుట్టస్వామి, శాంత సిన్హా
2) ఆధార్ పథకాన్ని సవాల్ చేస్తూ గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని పుట్టస్వామి, శాంతసిన్హా కోరారు
3) 2017, ఆగస్టు 24న 9 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గోప్యతా హక్కుపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది
4) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ‘గోప్యత’ అనేది జీవించే హక్కులో అంతర్భాగం
ఎ) 1, 3, 4 బి 1, 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
సమాధానాలు
91-ఎ 92-బి 93-డి 94-డి 95-సి 96-బి 97-ఎ 98-ఎ 99-డి 100-సి 101-బి 102-ఎ
103-డి 104-సి 105-ఎ 106-డి 107-సి 108-ఎ 109-ఎ 110-డి 111-ఎ 112-సి 113-ఎ 114-బి
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు