స్వసమూహంలోని వారినే వివాహం చేసుకోవాలనే నియమం?
1. నంబూద్రి సమాజంలోని కుటుంబం పేరు?
1) తర్వాడ్ 2) మఛాంగ్
3) ఇల్లోమ్ 4) డెల్లింగ్సన్
2. నాయర్లలో కుటుంబం పేరు?
1) తారవాద్ 2) గోతుల్
3) పై రెండూ 4) ఏదీకాదు
3. మాతృవంశీయ కుటుంబ వ్యవస్థను కలిగిన సమాజం?
1) కాడార్లు 2) భిల్లులు
3) కేరళలోని నాయర్లు 4) ఏదీకాదు
4. బహు భార్యత్వం లేదా బహు భర్తృత్వం ద్వారా రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిన కుటుంబం?
1) అణు కుటుంబం
2) సంయోగ కుటుంబం
3) ద్విపార్శ కుటుంబం
4) విస్తృత కుటుంబం
5. ఒక వ్యక్తి వివాహమై, సంతానం పొందితే ఏర్పడే కుటుంబం పేరు?
1) పునరుత్పత్తి కుటుంబం
2) ఆవిర్భావ కుటుంబం
3) సంతానయోగ్య కుటుంబం
4) పైవన్నీ
6. ఒక కుటుంబంలోని వ్యక్తి తన భార్య కుటుంబంలో నివసించడం ఏ సమాజంలో కనబడుతుంది?
1) కేంద్రక కుటుంబం
2) వైవాహిక కుటుంబం
3) ఆవిర్భావ కుటుంబం 4) ఏదీకాదు
7. వివాహ అనంతరం భర్త తన భార్య కుటుంబంలో నివసించడం ఏ సమాజంలో కనబడుతుంది?
1) మాతృస్వామ్య సమాజం
2) పితృవంశీయ సమాజం
3) ఉమ్మడి కుటుంబ సమాజం
4) మాతృత్వాధికార కుటుంబ సమాజం
8. తల్లిద్వారా వంశానుక్రమం సంక్రమిస్తే ఆ కుటుంబం పేరు?
1) మాతృవంశీయ 2) మాతృస్థానిక
3) మాతృస్వామ్య 4) ఏదీకాదు
9. తండ్రి ద్వారా వంశానుక్రమం సంక్రమిస్తే ఆ కుటుంబం పేరు?
1) పితృస్వామ్య 2) పితృవంశీయ
3) పితృస్థానిక 4) పైవన్నీ
10. పురుషులు ఆధీనులుగా ఉంటూ స్త్రీలు ఆధిపత్యం చెలాయించే కుటుంబం?
ఎ) మాతృస్థానిక కుటుంబం
2) మాతృస్వామ్య కుటుంబం
3) మాతృపితృత్వాధికార కుటుంబం
4) ఏదీకాదు
11. నాయర్ల కుటుంబం దేనికి ఉదాహరణ ?
1) మాతృవంశీయ కుటుంబం
2) విస్తృత కుటుంబం
3) వివృత కుటుంబం 4) ఏదీకాదు
12. అధికారానికి విశేష ప్రాధాన్యం ఉంటూ తల్లిదండ్రులు, పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం?
1) వైవాహిక కుటుంబం
2) పితృస్వామ్య కుటుంబం
3) ఏకరక్త కుటుంబం
4) విస్తృత కుటుంబం
13. తాతా మనువలతో మూడు లేదా నాలుగు తరాలతో కూడిన కుటుంబం?
1) విస్తృత కుటుంబం
2) వైవాహిక కుటుంబం
3) పులియన్ కుటుంబం
4) సిండయాస్మిన్ కుటుంబం
14. కుటుంబానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) కుటుంబంలో సంస్థాగతమైన లైంగిక సంబంధం ఉంటుంది
2) కుటుంబం అనేది ఒక ఆర్థిక యూనిట్
3) కుటుంబ సభ్యులందరు ఉమ్మడి నివాసంలో నివసించాల్సిన అవసరం ఉండదు
4) కుటుంబంలో నిరంతరం సంఘర్షణ ఉంటుంది
15. కుటుంబ పరిణామ క్రమానికి సంబంధించి మోర్గాన్ ప్రకారం కింది వాటిలో ఏది సరైన క్రమం?
1) ఏక వివాహ కుటుంబం – ఏక రక్త కుటుంబం- పులియన్ కుటుంబం- సిండయాస్మియన్ కుటుంబం-పితృస్వామ్య కుటుంబం
2) పులియన్ కుటుంబం- సిండయాస్మిన్ కుటుంబం-ఏకరక్త కుటుంబం- పితృస్వామ్య కుటుంబం-ఏక వివాహ కుటుంబం
3) ఏకరక్త కుటుంబం- పులియన్ కుటుంబం – సిండయాస్మిన్ కుటుంబం- పితృస్వామ్య కుటుంబం- ఏక వివాహ కుటుంబం
4) ఏదీకాదు
16. ఆధునిక కుటుంబాల్లో కింది వాటిలో ఏది ఎక్కువగా కనిపిస్తుంది?
1) విస్తృత బంధుత్వ వ్యవస్థ నుంచి దూరమవడం
2) కుటుంబంపై మతపరమైన నియంత్రణ తగ్గడం
3) కుటుంబం పరిమాణం తగ్గడం
4) పైవన్నీ
17. మాతృస్వామ్య కుటుంబ లక్షణం కానిది?
1) మాతృవంశీయ వంశానుక్రమం
2) మాతృత్వ అధికారం
3) పితృశ్వాధికారం
4) ఆస్తి వారసత్వం మాతృవంశీయంగా లభించడం
18. జతపరచండి?
ఎ) భర్త తండ్రి కుటుంబంలో దంపతులు నివాసం ఉండటం 1) పతిస్థానిక నివాసం
బి) భర్త మేనమామ కుటుంబంలో దంపతులు నివాసం ఉండటం 2) నూతన స్థానిక నివాసం
సి) భార్య తల్లి కుటుంబంలో దంపతులు నివాసం ఉండటం 3) మాతృస్థానిక నివాసం
డి) స్వతంత్రంగా దంపతులు నివాసం ఉండటం 4) మాతుల స్థానిక నివాసం
1) ఎ-1, బి-4, సి-3, డి-2 2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-1, సి-2, డి-4 4) ఎ-4, బి-1, సి-3, డి-2
19. కుటుంబాలను ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు?
1) సమ్మర్ 2) సి.హెచ్.కూలీ
3) కింగ్ స్లే డేవిస్ 4) మెక్ ఐవర్
20. కుటుంబాల్ని వర్గీకరించడంలో ఆధారం కాని అంశం?
1) పూర్వీకుల పద్ధతి 2) నిర్మితి
3) మతం 4) నివాసం
21. సమాజంలో కుటుంబం కీలక పాత్ర పోషించడానికి కారణం కాని అంశం?
1) ఇది పునరుత్పత్తిని అందిస్తుంది
2) సమాజ వికాసానికి అభివృద్ధికి దోహదపడదు
3) ఇది వ్యక్తుల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దుతుంది
4) లైంగిక అవసరాలను తీరుస్తుంది
22. ఉమ్మడి కుటుంబం లక్షణం కానిది ?
1) ఉమ్మడి ఆస్తి
2) కార్పొరేట్ స్వభావం
3) ఉమ్మడి వ్యవసాయ భూమి
4) చిన్న పరిమాణం
23. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను విమర్శించడానికి కారణం
1) కొత్త దంపతులకు స్వేచ్ఛ ఉండదు
2) సోమరితనం పెరుగుతుంది
3) ఇందులో ప్రజాస్వామ్యం ఉండదు
4) పైవన్నీ
24. కిందివాటిలో ఏది సరైంది.
1) కుటుంబం అనేది ఏక పార్శ సమూహం, గోత్రం అన్నది ద్విపార్శ సమూహం
2) కుటుంబం, గోత్రం రెండూ ఏకపార్శ సమూహాలు
3) కుటుంబం, గోత్రం రెండూ ద్విపార్శ సమూహాలు
4) కుటుంబం ద్వి పార్శ సమూహం, గోత్రం ఏక పార్శ సమూహం
25. నాయర్ సమాజంలో స్త్రీ?
1) వివాహానంతరం భర్త ఇంటికి వెళ్తుంది
2) వివాహానంతరం పుట్టింటిని విడిచి వెళ్లదు, పుట్టింట్లోనే ఉంటుంది
3) వివాహానంతరం కొత్తచోట ఇద్దరు నివాసం ఉంటారు
4) వివాహానంతరం ఆమె తండ్రి యొక్క సోదరి ఇంట్లో నివాసం ఉంటారు
26. కుటుంబం విశిష్ట లక్షణం కానిది?
1) సార్వజనీనమైనది
2) సామాజిక సంస్థ
3) అన్ని సమాజాల్లోను ఉంది
4) రాజకీయ వ్యవస్థ
27. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్షీణించడానికి గల కారణం?
1) పాశ్చాత్య ప్రభావం
2) వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామికీకరణకు మారడం
3) వలసలు 4) పైవన్నీ
28. దంపతులు, సంతానం మాత్రమే కలిసి నివసించే కుటుంబం.
1) కేంద్రక కుటుంబం
2) వైవాహిక కుటుంబం
3) ఏకరక్త కుటుంబం
4) పునరుత్పత్తి కుటుంబం
29. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగే కుటుంబాలు
1. ఏకరక్త కుటుంబాలు
2) మాతృస్వామిక కుటుంబాలు
3) సిండయాస్మియాన్ కుటుంబాలు
4) ఏదీకాదు
30. వివాహం అనేది ?
1) ఒక సంస్థ 2) సమితి
3) రెండూనూ 4) ఏదీకాదు
31. కిందివాటిలో ఏది అధిగణన వివాహం?
1) సోదరీల వినిమయం
2) సమాంతర ప్రితృయ సంతతి వివాహం
3) ప్రతిలోమ వివాహం
4) అనులోమ వివాహం
32. ఏ అనే సమూహంలోని పురుషులు బి అనే సమూహంలోని స్త్రీలను, బి లోని పురుషులు సి లోని స్త్రీలను, సి లోని పురుషులు ఏ లోని స్త్రీలను వివాహం చేసుకుంటే ఆ నియమం?
1) సోదరీల మార్పిడి
2) తరాల వినిమయం
3) సహభాగినుల వినిమయం
4) పరిమిత లేదా ఆంక్షల వినిమయం
33. ఒక సమూహంలోని పురుషులు మరో సమూహంలోని సీ్త్రలను ఆ రెండవ సమూహంలోని పురుషులు మొదటి సమూహంలోని స్త్రీలను వివాహమాడే నియమం?
1) దేవర న్యాయం
2) సమూహ వివాహం
3) పరిమితి వినిమయం 4) ఏదీకాదు
34. వివాహం ప్రాథమిక లక్షణం?
1) బహిర్‌వివాహం 2) అంతర్వివాహం
3) అధిగణన వివాహం 4) ఏదీకాదు
35. మేనరిక వివాహాల్ని మధ్యప్రదేశ్‌లోని గోండులు ఏమని పిలుస్తారు?
1) దుధ్లతావా 2) దుధ్భడావా
3) విలోమెంబీ 4) చిక్బాగ్
36. మేనరిక వివాహం అనేది?
1) బహిర్‌వివాహం 2) అంతర్వివాహం
3) దేవర వివాహం 4) పైవన్నీ
37. తండ్రి సోదరి కూతురుని వివాహం చేసుకోవడం?
1) పితృత్వ మేనబిడ్డ వివాహం
2) బహిర్‌వివాహం
3) దేవర న్యాయం 4) పితృస్వాధికారం
38. తల్లి సోదరుడి కూతురుని వివాహం చేసుకోవడానికి గల పేరు?
1) మేన బిడ్డ వివాహం
2) మాతృత్వాధికార వివాహం
3) మాతృత్వ మేన బిడ్డ వివాహం
4) ఏదీకాదు
39. దేవర న్యాయం, భార్యా భగానీ న్యాయం దేనికి ఉదాహరణలు?
1) అసోదర బభర్తృత్వం
2) వివాహ రకాలు 3) నిషిద్ధ వివాహం
4) అధిగణన వివాహాలు
40. తమకు ఇష్టమున్న వరుడి ఇంటిలోకి వధువు బలవంతంగా ప్రవేశించి వివాహం చేసుకోవడం?
1) అనాత వివాహం
2) ప్రయోగ వివాహం
3) పరీక్ష వివాహం 4) ఏదీకాదు
41. వివాహానికి ముందు ఒక వ్యక్తి తన శక్తుల్ని బలాల్ని కొన్ని తెగల్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆచారం పేరు
1) ప్రయోగ వివాహం
2) శక్తి వివాహం
3) అనాత వివాహం 4) పైవన్నీ
42. జతపరచండి?
ఎ) ఒక భర్త- ఒక భార్య
1) బహుభర్తృత్వం
2) ఒక భర్త – ఒకరి కన్నా
ఎక్కువ మంది భార్యలు
2) బహుభార్యత్వం
3) ఒక భార్య – ఎక్కువ మంది భర్తలు
3) ఏక వివాహం
1) ఎ-3, బి-2, సి-1
2) ఎ-2, బి-3, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-1, సి-3
43. అపహరణ వివాహ అచారం గల తెగ?
1) గోండ్లు 2) సంతాల్‌లు
3) జాంగ్‌లు 4) ఖాసీలు
44. కొన్ని తెగల్లో ఒక వ్యక్తి తనకు కాబోయే భార్యతో అత్తవారింట్లో కొన్ని వారాలు ఉండి నచ్చితేనే వివాహం చేసుకోవచ్చు. లేదా ఆమెను చేసుకోకపోవచ్చు ఇలాంటి ఆచారం పేరు?
1) సేవా వివాహం
2) ప్రయోగ వివాహం
3) పరీక్ష వివాహం 4) పైవన్నీ
45. ముస్లింలలో విడాకులు పొందే విధానం?
1) ముసాయిదా పత్రంపై సంతకం చేయడం ద్వారా
2) ముబరాత్ ద్వారా 3) కోర్టుద్వారా
4) కనీసం ఇద్దరు సాక్షుల ముందు మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా
46. ముస్లింలలో ఒక పురుషుడు ఒకే సమయంలో ఎంత మందిని వివాహం చేసుకోవచ్చు?
1) ఇద్దరు 2) ముగ్గురు
3) ఆరుగురు 4) నలుగురు
47. ఒక వ్యక్తి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది అక్కా చెల్లెళ్లను వివాహం చేసుకోవడం?
1) బహుభర్తృత్వం
2) భగనీ బభార్యత్వం
3) బ భార్యత్వం 4) ఏదీకాదు
48. స్వసమూహంలోని వారినే వివాహం చేసుకోవాలనే నియమం?
1) అంతర్వివాహం 2) బహిర్‌వివాహం
3) అగమ్యగమనం 4) పైవన్నీ
49. స్వసమూహంలోని వారిని కాకుండా బయటి సమూహంలోని వారిని వివాహం చేసుకోవడం?
1) బహిర్‌వివాహం 2) అంతర్వివాహం
3) రెండూనూ 4) ఏదీకాదు
50. కిందివాటిలో దేనిని బహుభార్యత్వం, బహు భర్తృత్వం కలయికగా పేర్కొంటారు?
1) ఏక వివాహం
2) బ వివాహం
3) సమూహ వివాహం 4) పైవన్నీ
జవాబులు
1-3 2-1 3-3 4-2 5-1 6-3 7-1 8-1 9-2 10-2 11-1 12-3 13-1 14-4 15-3 16-4 17-3 18-1 19-2 20-3 21-2 22-4 23-4 24-1 25-2 26-4 27-4 28-1 29-3 30-1 31-2 32-4 33-3 34-3 35-1 36-2 37-1 38-3 39-4 40-1 41-1 42-1 43-1 44-1
45-4 46-4 47-2 48-1 49-1 50-3
విన్మయ్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు