ఆర్బీఐ ఏ చట్టం ప్రకారం ఏర్పడింది ?
భారత రాజ్యాంగ పరిణామక్రమం గ్రూప్-2 పాలిటీ
– రాజ్యాంగ పరిణామంలో మరో రెండు దశలను చూద్దాం
– 1919 మాంటెగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అమలు విధానాన్ని పరిశీలించడానికి బ్రిటీష్ ప్రభు త్వం 1924లో మడ్డిమాన్ కమిటీని నియమించింది. చట్టం సమగ్రంగానే అమలు జరుగుతోందని ఈ కమిటీ నివేదిక సమర్పించింది.
– నాటి బ్రిటన్ ప్రధాని లార్డ్బాల్డిన్ 1927 నవంబర్‌లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
– సైమన్ కమిషన్‌లో మొత్తం ఏడుగురు ఆంగ్లేయులు ఉండటంతో వెళ్లిన ప్రతిచోటా సైమన్ గోబ్యాక్ అనే నినాదాలతో నిరసన వ్యక్తమైంది.
– సైమన్ కమిషన్ 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు మొదటిసారి, 1928, అక్టోబర్ 11 నుంచి 1929 ఏప్రిల్ 6 వరకు రెండోసారి పర్యటించి బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
సైమన్ కమిషన్ ముఖ్య సిఫారసులు
1) ప్రావిన్స్ (రాష్ర్టాలు)ల్లో శాసన మండలి సభ్యుల సంఖ్య పెంచాలి.
2) రాష్ర్టాల్లో ప్రవేశపెట్టిన డయార్కీ(ద్వంద పాలన) విధానాన్ని రద్దు చేయాలి.
3) భారతదేశంలో ఏకకేంద్ర వ్యవస్థ స్థానంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
4) భారతీయులతో సంప్రదించి కొత్త చట్టాన్ని రూపొందించాలి.
5) ఒరిస్సా, సింథ్ నూతన రాష్ర్టాలను ఏర్పాటు చేయాలి.
మోతీలాల్ నెహ్రూ నివేదిక-1928
– సైమన్ కమిషన్ నియామక సందర్భంలో ప్రభుత్వ వ్యవహారాల కార్యదర్శి బిర్కెన్‌హెడ్ 1927లో బ్రిట న్ ఎగువసభలో ప్రసంగిస్తూ భారతీయులందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని రూపొందించే శక్తి, సామ ర్థ్యం భారతీయులకు ఉందా అని సవాల్ విసిరాడు.
– లార్డ్ బిర్కెన్‌హెడ్ సవాల్‌ను స్వీకరించి ఇబ్రహీం అలీ అన్సారీ అధ్యక్షతన జరిగిన మద్రాస్ కాంగ్రెస్ సమావేశం రాజ్యాంగ రచన చేయాలని నిర్ణయించింది.
– 1928, మే 19న బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్, తేజ్‌బహదుర్ సప్రూలు తదితరులు సభ్యులుగా రాజ్యాంగ రచనా కమిటీని 8మందితో ఏర్పాటు చేశారు.
– నెహ్రూ కమిటీ 3 నెలల్లోపే అవసరమైన రాజ్యాంగ్యాన్ని రూపొందించింది. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు.
నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు
– భారతీయులందరికీ 19 ప్రాథమిక హక్కులు కల్పించాలి.
– అల్పసంఖ్యాకులు అనగా మైనార్టీలకు శాసనమండలిలో పదేండ్లపాటు కొన్ని స్థానాలు కేటాయించాలి.
– భారతదేశానికి అధనివేశ ప్రతిపత్తి (డొమీనియన్ హోదా) కల్పించాలి.
– శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత వహించే విధంగా ఏర్పాటు చేయాలి.
1935 భారత ప్రభుత్వ చట్టం
– సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడానికి ఆనాటి బ్రిటీష్ ప్రధానమంత్రి రాంసే మెక్‌డోనాల్డ్ అధ్యక్షతన 1930, 1931, 1932 సంవత్సరాల్లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్‌లో నిర్వహించారు.
– ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను 1933 మార్చిలో శ్వేతపత్రంగా ప్రకటించారు.
– అందులోని అంశాలు 1935, ఆగస్టు 2న 321 ప్రకరణలు, 10 షెడ్యూల్స్, 14 విభాగాలుగా ప్రకటించారు.
– 1935 భారత సమాఖ్య చట్టంలోని అంశాలను రూపొందిండంలో ప్రముఖప్రాత వహించింది- లార్డ్ వెల్లింగ్టన్.
1935 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యాంశాలు
– 1935 చట్టం ద్వారా భారతదేశంలో మొదటిసారి అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేశారు.
– రాష్ర్టాల్లో ద్వంద్వ ప్రభుత్వాలను రద్దుచేసి, రాష్ర్టాలకు పాక్షిక స్వయంప్రతిపత్తిని కల్పించి, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
– ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేసిన రాష్ర్టాలు- బెం గాల్, బీహార్, బొంబాయి, మద్రాస్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్.
– ఈ చట్టం ద్వారా అధికారాలను మూడు జాబితాలుగా విభజించారు. అవి..
– కేంద్ర జాబితా: 59 అంశాలు
– రాష్ట్ర జాబితా: 54 అంశాలు
– ఉమ్మడి జాబితా: 36 అంశాలు
– అవశిష్ట అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి అనగా గవర్నర్ జనరల్‌కు చెందుతాయి.
– భారతదేశంలో సమాఖ్య కోర్టును 1937, అక్టోబర్ 1న ప్రారంభించారు. ఇందులో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఆరుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
– కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య పెంచారు.
– A. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ): ఇందులో 156 మంది సభ్యులు ఉంటారు. ఇది శాశ్వత సభ. సభ్యుని పదవీ కాలం 9 ఏండ్లు. వారిలో ప్రతీ మూడేండ్లకు 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేయగా వారి స్థానంలో కొత్త సభ్యులు నియమింపబడేవారు.
– B. ఫెడరల్ అసెంబ్లీ (దిగువ సభ): దిగువ సభలో 375 మంది సభ్యులుంటారు. ఇందులో 250 మం ది బ్రిటీష్ ప్రావిన్స్‌ల నుంచి, 125 మంది సభ్యు లు స్వదేశీ సంస్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. వారి పదవీకాలం 5 ఏండ్లు.
– భారతదేశం నుంచి బర్మాను వేరుచేయడం జరిగింది.
– మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు శాసన మండలిలో ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు.
– ఓటు హక్కును విస్తృత పరిచారు. 10 శాతం జనాభాకు వర్తింపజేశారు.
– ఒరిస్సా, సింథ్ అనే రెండు రాష్ర్టాలను ఏర్పాటు చేశారు.
– కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకోసం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ర్టాల్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలి.
– 1935 చట్టంలో భాగంగా ఆర్బీఐ ఏర్పాటు.
విమర్శ:
– 1935 చట్టం భారతదేశ వ్యతిరేక చట్టం
– బలమైన బ్రేకులు కలిగి ఇంజన్ లేని యంత్రం లాంటిది.
– ద్వంద్వ పాలన కన్నా ఈ చట్టం నికృష్టమైంది.
– ప్రాథమికంగా చెడిపోయిన ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది 1935 భారత ప్రభుత్వ చట్టం
– 1935 చట్టం పొట్టి మనుషులు నిర్మించినఅవమానకరమైన గొప్ప కట్టడం
1935 భారత చట్టం ప్రాధాన్యత
– ఈ చట్టాన్ని భారత సమాఖ్య చట్టం అని, రాజ్యాంగ ఆధార చట్టమని, రాజ్యాంగానికి మాతృక అంటారు.
– 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ (నకలు)గా ప్రొఫెసర్ కేటీ షా వర్ణించాడు.
– భారత రాజ్యాంగంలో దాదాపు 2/3వ వంతు అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించినవే.
– బ్రిటీష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో సమగ్రమైనది, వివరణాత్మకమైనది భారత ప్రభుత్వ చట్టం.
ఆరో దశ (1935 నుంచి 1950 వరకు)
– 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా నూతన ప్ర భుత్వాలు 1937, ఏప్రిల్1న అధికారంలోకి వచ్చా యి.
– భారతీయులను సంప్రదించకుండా బ్రిటన్‌తో పాటు భారతీయులను కూడా రెండో ప్రపంచయుద్ధంలో భాగస్వాములను చేశారు. అందుకు నిరసనగా 1939 డిసెంబర్ 22న భారతదేశంలోని ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
– ముస్లింలు డిసెంబర్ 22, 1939న విమోచనదినంగా పాటించారు.
ఆగస్టు ప్రతిపాదనలు : 1940
– భారతదేశ వైశ్రాయ్ లార్డ్ లిన్ లిత్ గో 1940 ఆగస్టు 8న భారతీయులకు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆగస్టులో చేయడం వల్ల వీటిని ఆగస్టు ప్రతిపాదనలు అంటారు.
లిన్ లిత్గో ప్రతిపాదనలు..
– రాజకీయ పార్టీల ప్రాతినిథ్యంతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తారు.
– రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయులకు డొమీనియస్ హోదా కల్పించబడుతుంది.
– అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాతినిథ్యం కల్పించబడుతుంది.
– ఆగస్టు ప్రతిపాదనను రాజకీయ పార్టీలు తిరస్కరించాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. సైమన్ కమిషన్ నియమించడానికి ముఖ్య కారణం?
1) జలియన్ వాలాబాగ్ సంఘటన వివరించుటకు
2) రౌలత్ చట్ట పరిశీలనకు
3) పబ్లిక్ సర్వీసుల ఏర్పాటుకు
4) మాంటెంగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం పరిశీలనకు
2. భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వం అనే భావన మొదట ఎవరు తెలిపారు?
1) విస్కౌంట్ లీ 2) సర్ చార్లెస్ హబ్ హౌస్
3) హంటర్ కమిషన్ 4) సర్ జాన్ సైమన్ కమిషన్
3. ప్రాథమిక హక్కులను మొదట ఎవరు సూచించారు ?
1) జవహార్ లాల్ నెహ్రూ 2) మోతీలాల్ నెహ్రూ
3) ఎంఎన్ రాయ్ 4) ఎవరూకాదు
4. ప్రావిన్స్‌ల్లో ద్విసభా విధానం ఏర్పాటుకు ఏ చట్టం అవకాశం కల్పించింది?
1) 1892 భారతీయ మండళ్ల చట్టం
2) 1909 మింటో-మార్లే సంస్కరణల చట్టం
3) 1935 భారత ప్రభుత్వ చట్టం 4) 1919 చట్టం
5. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని జవహార్ లాల్ నెహ్రూ దీన్ని విమర్శించారు?
1) నెహ్రూ రిపోర్ట్ 2) ఆగస్టు ప్రణాళికా పత్రం
3) భారత సమాఖ్య చట్టం 4) పైవన్నీ
6. 1935 భారత ప్రభుత్వ చట్టం రాజ్యాంగానికి జిరాక్స్ వంటిది అని ఎవరు పేర్కొన్నారు ?
1) కేసీ వేర్ 2) కేటీ షా
3) హెచ్వీ కామత్ 4) జేబీ కృపాలాని
7. భారత ప్రభుత్వ చట్టం ప్రాధాన్యత కానిది ఏది ?
1) రాష్ర్టాలకు పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించలేదు
2) ఫెడరల్ న్యాయ వ్యవస్థ ఏర్పాటు
3) కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం
4) కేంద్ర-రాష్ర్టాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
జవాబులు:
1) 4 2) 4 3) 2 4) 3 5) 3 6) 2 7) 1
క్రిప్స్ రాయభారం : 1942
– రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయుల సహాయ సహకారాలు పొందడానికి బ్రిటీష్ ప్రభుత్వం సర్ స్ట్రాఫర్డ్ క్రిప్స్‌ను పంపగా క్రిప్స్ కమిషన్ 1942, మార్చి 22న భారతదేశానికి వచ్చింది.
క్రిప్స్ ప్రతిపాదనలు
– రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
– రెండో ప్రపంచయుద్ధంలో భారతీయులు బ్రిటీష్ వారికి సహకరిస్తే భారతీయులకు తాత్కాలిక స్వ యంప్రతిపత్తి ఇవ్వడం జరుగుతుంది.
– స్వదేశీ సంస్థాన అధిపతులకు రాజ్యాంగపరిషత్‌లో ప్రాతినిథ్యం కల్పిస్తామని ప్రతిపాదన చేశారు.
– క్రిప్స్ ప్రతిపాదనలను దివాళా తీసిన బ్యాంకు ముందు తేదీ వేసి ఇచ్చిన చెక్కులాంటివని మహాత్మాగాంధీ విమర్శించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు