ఈవినింగ్ కాలేజీలు మళ్లీ వస్తున్నాయ్!
– బీబీఏ విద్యార్థుల కోసం జేఎన్టీయూ నిర్ణయం
-డబుల్ డిగ్రీలో చేరిన వారికి సాయంత్రం స్పెషల్ క్లాసులు
1990కి పూర్వం ఎంతో ప్రాచుర్యం పొందిన ఈవినింగ్ కాలేజీ విధానం మళ్లీ రాబోతున్నది. అప్పట్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూనే అనేకమంది ఈవినింగ్ కాలేజీల్లో చదువుకొనేవారు. కాలక్రమంలో ఈవినింగ్ కాలేజీలన్నీ రెగ్యులర్ కాలేజీలుగా మారిపోయాయి. మళ్లీ ఈవినింగ్ కాలేజీలు నడిపేందుకు జేఎన్టీయూ సమాయత్తమవుతున్నది. బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సును ఈవినింగ్ కోర్సుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి జేఎన్టీయూలో డబుల్ డిగ్రీ కోర్సుగా బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులు నాలుగేండ్ల బీటెక్ కోర్సును చదువుతూనే.. మరోవైపు మూడేండ్ల బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సు చేయ వచ్చు. అయితే, ఇంజినీరింగ్ కోర్సుతో పాటు బీబీఏ డాటా అనలిటిక్స్ కోర్సు ఒకే కాలేజీలో ఉంటేనే విద్యార్థులకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వీలుంటుంది. బీబీఏ కోర్సును మొత్తం కాల వ్యవధిలో 60% ఆన్లైన్లో, 40% ఆఫ్‌లైన్‌లో చదువుకోవచ్చు. విద్యార్థి ఏ కాలేజీలో చేరితే ఆ కాలేజీలోనే రెండు కోర్సులకు సంబంధించిన ల్యాబ్‌వర్క్, ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్‌ను పూర్తిచేయాలి. ఒకవేళ కోర్సును పూర్తిచేయడం వీలుకాని పక్షంలో సంబంధిత క్రెడిట్స్‌ను మరో కోర్సుకు బదలాయించుకోవచ్చు. ఈవినింగ్ క్లాసులను ఆన్లైన్లో నిర్వహించాలా? ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని జేఎన్టీయూకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు కోసం ఈ ఏడాది 148 ఇంజినీరింగ్ కాలేజీలు దరఖాస్తు చేశాయి. వీటితోపాటు 69 ఫార్మసీ, 9 స్టాండలోన్ ఎంబీఏ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. మరో 10 రోజుల్లో అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 23 నుంచి వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆలోపే అఫిలియేషన్ ప్రక్రియను పూర్తిచేసి, జాబితాను వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ జాబితా ప్రకారమే విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
జేఎన్టీయూ అఫిలియేషన్‌కు 148 కాలేజీల దరఖాస్తు
జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్న కాలేజీలు
విభాగం కాలేజీలు
ఇంజినీరింగ్ 148
ఫార్మసీ 69
ఎంబీఏ 09
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు