రాజ్యసభ మొదటి చైర్మన్ ఎవరు?
1. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కుల్లో రద్దు కాని అధికరణ?
1) 10, 18 అధికరణ 2) 29, 30 అధికరణ
3) 24, 25 అధికరణ 4) 20, 21 అధికరణ
2. కిందివాటిలో సరికాని అంశాలను సూచించండి?
ఎ) ఆదేశిక సూత్రాల అమల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు
బి) 21-ఎ అధికరణంలో విద్యాహక్కు చట్టం 6 నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య గురించి ప్రస్తావన ఉంది
సి) ప్రస్తుతం ఆస్తిహక్కు అధికరణ 300 (ఎ) ద్వారా చట్ట బద్దమైన హక్కుగా ఉంది
డి) 13వ అధికరణ చట్టం ముందు అందరూ సమానులేనని తెలియజేస్తుంది
1) ఎ 2) సి, డి 3) డి 4) పైవన్నీ
3. కిందివాటిలో సరైన అంశాలను సూచించండి?
ఎ) ఆర్థిక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం
బి) ఆర్థిక బిల్లును రాష్ట్రపతికి పంపేముందు ఆర్థిక బిల్లు అని స్పీకర్ ధ్రువీకరించాల్సి ఉంటుంది
సి) ఆర్థిక బిల్లును కేవలం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి
డి) లోక్‌సభ ఆమోదించిన ద్రవ్యబిల్లును, రాజ్యసభ 14 రోజుల లోపు ఆమోదించినట్లయితే ఆ బిల్లు ఆమోదించబడిందని భావించడం జరుగుతుంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
4. రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం జాతీయ ప్రాధాన్యతగల అంశాలపై సుప్రీంకోర్టు సలహాలు తీసుకుంటాడు?
1) అధికరణ 123 2) అధికరణ 143
3) అధికరణ 352 4) అధికరణ 360
5. రాజ్యాంగంలో మొదట కేబినెట్ అనే పదంలేదు. ఈ పదం 1978లో ఏ సవరణ ద్వారా చేర్చారు?
1) 42వ సవరణ 2) 43వ సవరణ
3) 44వ సవరణ 4) 46వ సవరణ
6. రాజ్యసభ మొట్ట మొదటి చైర్మన్ ఎవరు?
1) జీవీ మౌలాంకర్
2) ఎస్ రాధాకృష్ణన్
3) హమీద్ అన్సారీ
4) సుమిత్రా మహాజన్
7. రాజ్యాంగ అధికరణ 85 (2), 85 (9) ప్రకారం పార్లమెంట్ సభల సమావేశం ముగియడాన్ని లాంఛనప్రాయంగా ప్రకటించడాన్ని ఏమంటారు?
1) ప్రోరోగ్ 2) విప్
3) శూన్యకాలం 4) నియమభంగ ఆక్షేపణ
8. సుప్రీంకోర్టుకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) భారతదేశం మొత్తానికి ఏకీకృత న్యాయవ్యవస్థ ఉంది
బి) సుప్రీంకోర్టులో 30 మంది సాధారణ న్యాయమూర్తులు ఉంటారు
సి) సుప్రీంకోర్టు న్యాయమూర్తి 65 ఏండ్లకు పదవీ విరమణ పొందుతాడు
డి) ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ. లక్ష
1) బి, డి 2) ఎ, సి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
9. కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలు అధికారాలు, విధులు, బాధ్యతలను పునఃపరిశీలించాలనే నివేదికను 1987 అక్టోబర్ 27న కేంద్ర ప్రభుత్వానికి ఏ కమిషన్ సమర్పించింది?
1) రంజిత్‌సింగ్ సర్కారియా కమిషన్
2) పూంఛీ కమిషన్
3) సెతల్వాడ్ కమిషన్ 4) ఏదీకాదు
10. నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైనవి?
ఎ) 2015 జనవరి 1 నుంచి ఉనికిలోకి వచ్చింది
బి) నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా ఉంటారు
సి) కేంద్ర, రాష్ర్టాల సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు మన భారత జాతి నిర్మాణం చేయడం దీని విధి
డి) గతంలో ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు
1) ఎ, బి 2) సి, డి 3) ఎ, డి 4) పైవన్నీ
11. పట్టణ ప్రభుత్వాలను వివరించే 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన రోజు?
1) ఏప్రిల్ 20, 1983 2) జూన్ 1, 1993
3) ఏప్రిల్ 24, 1993 4) ఏప్రిల్ 22, 1993
12. 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992లో 243-wలో మున్సిపాలిటీ సంస్థల ప్రధాన విధులు, హక్కులు, అధికారాలకు సంబంధించిన అంశాలెన్ని ఉన్నాయి?
1) 29 అంశాలు 2) 27 అంశాలు
3) 18 అంశాలు 4) 21 అంశాలు
13. తెలంగాణలో ఉన్న నగర పాలక సంస్థల సంఖ్య?
1) 8 2) 6 3) 5 4) 7
14. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుల సంఖ్య?
1) 24 2) 48 3) 62 4) 52
15. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మున్సిపాలిటీలు కలిగిన జిల్లా?
1) ఆదిలాబాద్ 2) వరంగల్
3) నల్లగొండ 4) మహబూబ్‌నగర్
16. జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల కమిషన్‌కు ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు?
1) 65వ సవరణ 2) 66వ సవరణ
3) 89వ సవరణ 4) 86వ సవరణ
17. కిందివాటిలో సరికానిది సూచించండి?
1) 1906 డిసెంబర్ 30న ముస్లింలీగ్ ఏర్పడింది
2) 1916 ఏప్రిల్ 28న పుణెలో బాలగంగాధర్‌తిలక్ హోంరూల్ లీగ్‌ను స్థాపించారు
3) గాంధీజీ దండి యాత్రను మార్చి 12, 1930 గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు
4) గాంధీ-ఇర్విన్ ఒడంబడిక-1930
18. భారత పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది?
1) మే 13, 1952 2) మే 14, 1952
3) మే 13, 1951 4) మే 14, 1951
19. అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చెయ్యరనే అభిప్రాయంతో నేను అంగీకరించను అని అభిప్రాయపడిందెవరు?
1) హెచ్.వి. కామత్ 2) టి.టి. కృష్ణమాచారి
3) మహవీర్ త్యాగి 4) బీఆర్ అంబేద్కర్
20. ప్రాథమిక విధులకు సబంధించిన సరైన వాక్యాలను సూచించండి?
ఎ) రాజ్యాంగంలోని 4(ఎ) భాగంలోని 51(ఎ) అధికరణలో చేర్చబడ్డాయి
బి) స్వరణ్‌సింగ్ కమిటీ నివేదిక ప్రకారం ప్రాథమిక విధులను ఏర్పాటు చేశారు
సి) మొదటి పది ప్రాథమిక విధులు జనవరి 3, 1977 నుంచి అమల్లోకి వచ్చాయి
డి) పదకొండో ప్రాథమికవిధి డిసెంబర్ 12, 2002 నుంచి అమల్లోకి వచ్చింది
1) ఎ, సి 2) సి 3) బి, సి, డి 4) పైవన్నీ సరైనవే
21. 14 ఏండ్లలోపు వయస్సున్న పిల్లలను కర్మాగారాలు, గనులు తదితర ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేయించరాదని తెలిపే రాజ్యాంగ అధికరణ?
1) 21వ అధికరణ 2) 22వ అధికరణ
3) 24వ అధికరణ 4) 25వ అధికరణ
22. లోక్‌సభ సమావేశం జరగాలంటే సమావేశంలో సభ్యుల కోరం ఎంత ఉండాలి?
1) మొత్తం సభ్యుల్లో 1/10 వంతు సభ్యుల హాజరు ఉండాలి
2) మొత్తం సభ్యుల్లో 1/2 వంతు సభ్యుల హాజరు ఉండాలి
3) మొత్తం సభ్యుల్లో 1/3 వంతు సభ్యుల హాజరు ఉండాలి
4) మొత్తం సభ్యుల్లో 1/4 వంతు సభ్యుల హాజరు ఉండాలి
23. రాజ్యాంగ పరిషత్‌లో సభ్యత్వం లేని ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు?
ఎ) మహాత్మాగాంధీ
బి) మహ్మద్ అలీ జిన్నా
సి) నెహ్రూ
డి) సర్దార్ వల్లభాయ్ పటేల్
1) ఎ, సి 2) ఎ, బి 3) బి, సి, డి 4) ఎ
24. భారతదేశంలో అత్యున్నత అవార్డు భారతరత్నను స్వీకరించిన తొలి భారతీయుడు?
1) డా. బీఆర్ అంబేద్కర్
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్
3) సి. రాజగోపాలచారి
4) ఎవరూ కాదు
25. 1947లో నెహ్రూ ప్రథమ మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి?
1) డా. జాన్ మతాయ్
2) బీఆర్ అంబేద్కర్
3) రాజకుమారి అమృత్‌కౌర్
4) షన్ముఖ శెట్టి
26. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన రోజు?
1) జనవరి 24, 1950 2) జనవరి 26, 1950
3) ఆగస్టు 15, 1947 4) నవంబర్ 26, 1949
27. నీ అధికారం ఏమిటి అని ప్రశ్నించే రిట్?
1) హెబియస్ కార్పస్ 2) మాండమస్
3) ప్రొహిబిషన్ 4) కో వారెంటో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు