POLITY | ఏ నిబంధన ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు?
పాలిటీ
1. కిందివాటిలో పాలనా సంబంధాలకు సంబంధించి అసత్య వాక్యం
1. కేంద్ర, రాష్ర్టాల మధ్య పాలనా సంబంధాలను రాజ్యాంగంలో 11వ భాగంలో పేర్కొన్నారు
2) పాలనా సంబంధాలను 263-273 వరకు పేర్కొన్నారు
3) కేంద్ర రాష్ర్టాల మధ్య పాలనా సంబంధాలను 256-263 ప్రకరణల వరకు పేర్కొన్నారు
4) 258వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర గవర్నర్ అంగీకారంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పాలనా విధులను రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి బదలాయించవచ్చు
2. ప్రకరణల్లో సరికానిది ఏది?
1) 262(1) ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల నియంత్రణకు పార్లమెంటు ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయవచ్చు
2) 61 నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలు జారీ చేసిన పత్రాలను రికార్డులను న్యాయ తీర్పులపై గౌరవించాలి
3) 259 ప్రకకణను 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
4) 260 ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు
3. ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు?
1) 260 2) 261
3) 263 4) 264
4. కేంద్ర రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) కేంద్ర రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలను రాజ్యాంగంలో 12వ భాగంలో పేర్కొన్నారు
2) కేంద్ర రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలను 264 నుంచి 300 ప్రకరణల మధ్య పేర్కొన్నారు
3) రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తి పన్నును 2,500కు మించకుండా విధించాలి
4) 265 ప్రకారం కేంద్ర రాష్ర్టాలు పన్నులను విధించవచ్చు
5. రాష్ట్ర ప్రభుత్వం విధించని పన్ను ఏది?
1) వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
2) మూలధన విలువపై పన్ను
3) వ్యసాయ ఆదాయంపై పన్ను
4) రోడ్డు, జల వవాణాపై పన్ను
6. కింది నిబంధనలలో సరికాని దానిని గుర్తించండి?
1) 266వ నిబంధన ప్రకారం కేంద్ర సంఘటిత నిధి రాష్ట్ర సంఘటిత నిధి గురించి పేర్కొన్నారు
2) 267(1)వ నిబంధన ప్రకారం కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్ర ఆగంతుక నిధులు ఉంటాయి
3) 268వ నిబంధన ప్రకారం కేంద్ర, రాష్ర్టాల మధ్య వనరుల విభజనను పేర్కొన్నారు
4) 270వ నిబంధన ప్రకారం కొన్ని పన్నులను రాష్ట్రమే విధించి రాష్ట్రమే వసూలు చేస్తుంది
7. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెమరాండమ్ గురించి సరికాని వాక్యం?
1) దీనిని 1971లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నియమించింది
2) ఇది అఖిల భారత సర్వీసులను రద్దు చేయమన లేదు
3) జోనల్ కౌన్సిల్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలన్నది
4) ఆర్థిక నిపుణులచే ఆర్థిక సంఘాన్ని నియమించాలన్నాడు
8. డి.ఆర్.గాడ్గిల్ ఫార్ములాకు సంబంధించి సరికాని వాక్యం?
1) దీనిని 1971లో ప్రణాళిక సంఘం నియమించింది
2) ఇది కేంద్ర రాష్ర్టాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ ఆవశ్యకతను గురించి తెలిపింది
3) ఇది 1992లో కూడా పునఃసమీక్షించుకుంది
4) ఇది జనాభా ఆధారంగా 70 శాతం నిధులను కేటాయించాలన్నది
9. సర్కారియా కమిషన్ గురించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) దీనిని 1983లో కేంద్ర ప్రభుత్వం నియమించింది
2) ఇది 1987 అక్టోబర్ 27న 247 సిఫారసులతో నివేదికను సమర్పించింది
3) దీనిలో 180 సిఫారుసులను మాత్రమే అమలు చేసింది
4) 356ను చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే చేయాలన్నది
10. సర్కారియా కమిషన్ సిఫారసులకు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) అవశిష్ట అధికారాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి
2) జోనల్ మండలాలను ఏర్పాటు చేయాలి
3) కార్పొరేషన్ పన్ను కేంద్ర, రాష్ర్టాలకు పంచాల్సిన అవసరం లేదు
4) త్రిభాషా సూత్రాన్ని ఆచరణలో పెట్టాలి
11. మదన్ మోహన్ పూంచి కమిషన్‌కు సంబంధించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) దీనిని 2007లో నియమించారు
2) ఇది 310 సిఫారసులను చేసింది
3) ఇది ఆర్థిక సంఘం ప్రణాళిక సంఘం మధ్య ఎక్కువ సమన్వయం ఉండాలన్నాడు
4) ఇది విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వలేదు
12. రెండవ పాలనా సంస్కరణలకు సంబంధించి సరికాని వాక్యం?
1) దీన్ని 2005లో వీరప్ప మొయిలీ అధ్యక్షతన నియమించారు
2) ఇది 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
3) ఇది ఎం, డీఎల్ఎస్ను రద్దు చేయనున్నది
4) ఇది జడ్జీల నిమామకాలకు సలహాలు ఇచ్చింది
13. శ్రీకృష్ణ కమిటీ గురించి సరికాని వాక్యం
1) దీనిని 2010 ఫిబ్రవరి 3న నియమించారు
2) ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజనకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేసింది
3) ఈ కమిటీ 6 నివేదికలను సూచించింది
4) ఈ కమిటీ తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచమన్నది
14. కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాలు ప్రముఖుల వ్యాఖ్యానాల్లో సరికానిది?
1) భారతదేశం అర్ధసమాఖ్య అన్నది కె.సి వేర్
2) భారత వ్యవస్థ తీవ్రమైన సమాఖ్య అన్నది పాల్ ఆఫిల్బి.
3) భారత వ్యవస్థ బేరాల సమాఖ్య అన్నది సంతానం
4) భారత వ్యవస్థ సహకార సమాఖ్య అన్నది గ్రాన్విల్ ఆస్టిన్
15. భారత సమాఖ్య విశిష్ట లక్షణం?
1) ఏక కేంద్ర లక్షణాలు గల సమాఖ్య
2) సమాఖ్య లక్షణాలు గల ఏక కేంద్రం
3) బలమైన రాష్ర్టాలు ఉన్న సమాఖ్య
4) అర్ధ సమాఖ్య
16. భారత రాజ్యాంగం ప్రకారం కింద పేర్కొన్న జతల్లో ఏది సరైనది కాదు?
1) అడవులు ఉమ్మడి జాబితా
2) స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉమ్మడి జాబితా
3) పోస్టాఫీస్ సేవింగ్స్-కేంద్ర జాబితా
4) ప్రజా ఆరోగ్యం రాష్ట్రజాబితా
17. సహకార సమాఖ్య అంటే?
1) రాష్ర్టాల ప్రాధాన్యతలు గుర్తించడం
2) కేంద్రంపై ఆధారపడటం
3) రాష్ర్టాలు అడిగిన సహాయాన్ని కేంద్రం అందించడం
4) పరస్పర ఆధార, ప్రాధాన్యతలు
18. కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి?
ఎ) రాజ్యాంగ ప్రకరణలు
బి) సంప్రదాయాలు, వాడుకలు
సి) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు
డి) సంప్రదింపులు, చర్చలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) సి, డి 4) ఎ, సి, డి
19. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) కేంద్ర ప్రణాళిక సంఘాన్ని 1950లో ఏర్పాటు చేశారు
2) జాతీయ అభివృద్ధి మండలిని 1953లో ఏర్పాటు చేశారు
3) సమాఖ్య ముఖ్య లక్షణం అధికారాల విభజన
4) జాతీయ అభివృద్ధి మండలి దేశంలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి
20. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) మొట్టమొదటిసారిగా భారతదేశంలో సమాఖ్యను 1935లో ప్రవేశ పెట్టారు
2) కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ర్టాలు పాటించకపోతే 365 నిబంధన ప్రకారం రాష్ర్టాలపైన చర్య తీసుకోబడుతుంది
3) జోనల్ కౌన్సిల్స్‌కు ఉమ్మడి అధ్యక్షుడిగా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు
4) భారతదేశం సమాఖ్య లక్షణాలు గల ఏక కేంద్రం కాని, ఏక కేంద్ర లక్షణాలు కల సమాఖ్య కాదు అని పేర్కొన్నది కె.సి.వేర్
21. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) మొట్టమొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు కె. సంతానం
2) స్టాంప్‌డ్యూటీ పన్నును కేంద్రం విధిస్తే రాష్ర్టాలు వసూలు చేసి, రాష్ర్టాలే తీసుకుంటాయి
3) ఈశాన్య మండలాన్ని 1971లో ఏర్పాటు చేశారు
4) భారత సమాఖ్యను సహకార సమాఖ్యగా అభివర్ణించినది గాడ్విన్ ఆస్టిన్
22. కేంద్ర రాష్ర్టాల అధికార విభజన వివాదాలు పరిష్కరించేందుకు ఉపయోగించే సూత్రాలు?
1) డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్
2) డాక్ట్రిన్ ఆఫ్ ఇైంప్లెడ్ పవర్స్
3) డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియన్ కన్స్ట్రక్షన్
4) పైవన్నీ
23. ఏ సందర్భంలో రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన అంశాలపై పార్లమెంటు చట్టం చేస్తుంది?
ఎ) ఎమర్జెన్సీ కాలంలో
2) దేశ శ్రేయస్సు దృష్ట్యా రాజ్యసభ తీర్మానం చేసినపుడు
3) రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ద్వారా చట్టం చేయమని పార్లమెంటును కోరడం ద్వారా
4) పైవన్నీ
24. జతపరచండి?
1) కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను ఎ) కేంద్ర ఎక్సేజ్ పన్ను
2) రాష్ట్రం విధించి రాష్ర్టానికి చెందే పన్ను బి) స్టాక్ ఎక్ఛేంజ్లపై పన్ను
3) కేంద్ర రాష్ర్టాల మధ్య పంచే పన్ను సి) కార్పొరేషన్ పన్ను
4) కేంద్రం విధించి వసూలు చేసి రాష్ర్టాలకు ఇచ్చే పన్ను డి) వినోదపు పన్ను
1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
25. కింది వాటిని జతపరచండి.
1) కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఎ) కస్టమ్స్ సుంకం
2) రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే బి) అమ్మకపు పన్ను
3) కేంద్ర, రాష్ర్టాల మధ్య పంపకం సి) కేంద్ర ఎక్స్ఛేంజ్
4) కేంద్రం విధించగా రాష్ర్టాలు వసూలు చేసుకొనేవి డి) మత్తు పదార్థాలు కలిగిన ఔషధాల మీద పన్ను వసూలు చేసుకుంటాయి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
26. కిందివాటిలో సరికాని వాక్యం ఏది?
1) భారత సమాఖ్య కెనడా సమాఖ్యను పోలి ఉంది
2) కేంద్రానికి ఎక్కువ రాబడి సెంట్రల్ ఎక్సేంజ్ ద్వారా వస్తుంది
3) అంతర్రాష్ట్ర మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
4) రాజ్యాంగంలో ప్రస్తావించకుండా ఆ తర్వాత కాలంలో అమల్లోకి వచ్చిన పన్నులు కార్పొరేట్ ట్యాక్స్ సర్వీసు ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్
27. కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరిస్తే..
1) బడ్జెట్‌ను మార్పు చేసి తిరిగి ప్రవేశ పెడతారు
2) కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారు
3) ప్రధానమంత్రి, మంత్రి మండలి రాజీనామా చేస్తుంది
4) రాష్ట్రపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది
28. ఆర్థిక సమాఖ్య గురించి సరికాని వాక్యాన్ని రాయండి?
1) ఆర్థిక సమాఖ్య అనే పదాన్ని అమెరికా శాస్త్రవేత్త రిచర్డ్ మూస్గ్రావ్ 1959లో ప్రయోగించారు
2) ఇది ప్రభుత్వం విధులు, ఆర్థిక సంబంధాలు వనరులకు సంబంధించినది ఆర్థిక సమాఖ్య
3) ఇది 14వ ఆర్థిక సంఘం సిఫారసులను పరిపృష్ఠం చేయడానికి ఉద్దేశించినది
4) 14వ ఆర్థిక సంఘం రాష్ర్టాలకు 45 శాతం నిధులను కేటాయించాలన్నది
29. దిగువ స్థాయి న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నతస్థాయి న్యాయస్థానం జారీచేసే రిట్‌ను ఏమంటారు?
1) ప్రొహిబిషన్ (Prohibition)
2) సెర్షియోరరి (Certiorari))
3) కో వారెంటో (Quo warranto)
4) మాండమస్ (Mandamus)
30. న్యాయస్థానాలు న్యాయస్థానాలపైనే జారీచేసే రిట్స్‌ను గుర్తించండి?
1) మాండమస్ (Mandamus), సెర్షియోరరి (Certiorari)
2) కోవారెంటో (Quo warranto), ప్రొహిబిషన్ (Prohibition)
3) సెర్షియోరరి (Certiorari)), హెబియస్ కార్పస్ (Habeas Corpus)
4) ప్రొహిబిషన్ (Prohibition), సెర్షియోరరి (Certiorari)
31. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైన వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తుంటే నీవు ఏ అధికారంతో ఆ పనిచేస్తున్నావు? అంటూ ఉన్నత న్యాయస్థానం సంబంధిత వ్యక్తికి వ్యతిరేకంగా జారీ చేసే రిట్‌ను ఏమంటారు?
1) సెర్షియోరరి (Certiorari)
2) కో వారెంటో (Quo warranto)
3) ప్రొహిబిషన్ (Prohibition)
4) మాండమస్ (Mandamus)
32. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) సుప్రీంకోర్టు రిట్స్ అధికార పరిధి హైకోర్టు రిట్స్ అధికార పరిధి కంటే తక్కువ
బి) మూడో వ్యక్తికి కూడా హెబియస్ కార్పస్ (Habeas Corpus), కోవారెంటో (Quo warranto) రిట్స్‌ను కోరవచ్చు
సి) దిగువస్థాయి న్యాయస్థానం నిలిపివేసిన విచారణను ఉన్నత/ పక్క న్యాయస్థానానికి బదిలీ చేయాలని ఉన్నత న్యాయస్థానం సెర్షియోరరి రిట్‌ను జారీ చేస్తుంది
డి) రిట్లకు సంబంధించిన పదాలన్నీ లాటిన్ భాషకు సంబంధించినవే
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
33. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 33(ఎ) కేంద్రబలగాల్లో పనిచేసేవారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
బి) ఆర్టికల్ 33(సి) రహస్య గూఢచార సంస్థల్లో పనిచేసేవారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
సి) ఆర్టికల్ 33(డి) – రక్షణకు సంబంధించిన కమ్యూనికేషన్ రంగంలో పనిచేసే వారికి ప్రాథమిక హక్కులు పూర్తిగా లభించవు
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
సమాధానాలు
1-2 2-4 3-3 4-4
5-2 6-4 7-2 8- 4
9- 3 10-3 11-4 12-3
13-4 14-3 15-1 16-2
17-4 18-1 19-2 20-3
21-1 22-4 23-4 24-3
25-1 26-2 27-3 28-4
29-1 30-4 31-2 32-4
33-1
ఆంజనేయులు
పాలిటీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు