BIOLOGY | కణంలోని ఆత్మహుతి సంచులు అని వేటిని పిలుస్తారు?
శరీరధర్మ శాస్త్రం
1. అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది?
ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి బయటి నుంచి ఆహారంగా తీసుకోవాలి
బి. ఇవి రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తాయి
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
2. జతరపరచండి.
కొవ్వు ఆమ్లం వనరు
1. లినోలిక్, లినోలినిక్ ఆమ్లం ఎ. వేరుశనగ
2. అరాఖిడినిక్ ఆమ్లం బి. ద్రాక్షరసం
3. కాప్రిక్ ఆమ్లం సి. జాపత్రి
4. మిరిస్టిక్ ఆమ్లం డి. పత్తి
5. ఎసిటిక్ ఆమ్లం ఇ. కొబ్బరి
1) 1-ఎ, 2-సి, 3-డి, 4-ఇ, 5-బి
2) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-బి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఇ, 5-బి
4) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-బి
3. కింది వాటిలో సరైనది?
ఎ. NPK మూలకాలు నేలలో సాధారణంగా లభించవు కాని మొక్కల పెరుగుదలకు అవసరం అందువల్ల వీటిని నిర్మాణాత్మక మూలకాలు అంటారు
బి. CHO మూలకాలతో జీవి ఏర్పాటవుతుంది కాబట్టి వీటిని ప్రధాన మూలకాలు అంటారు
1) రెండూ సరైనవి 2) బి సరైనది
3) ఎ సరైనది 4) ఏదీకాదు
4. రైబోజోమ్ల్లో 2 ఉప ప్రమాణాలు కలవడానికి తోడ్పడే మూలకం?
1) Ca 2) Fe 3) Mg 4) Na
5. కిందివాటిలో సరైనది?
ఎ. గ్లూకోజ్‌ను నిత్యజీవితంలో వాడడం వల్ల టేబుల్ షుగర్ అంటారు
బి. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం లాక్టోజ్
1) ఎ, బి 2) ఎ
3) బి 4) ఏదీకాదు
6. కింది ఏ మూలక లోపం వల్ల మొక్కల్లో క్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది?
1) P 2) N 3) S 4) పైవన్నీ
7. జతరపరచండి.
మూలకం లోపం వల్ల కలిగే వ్యాధులు
1. Fe ఎ. హైపోకలీమియా
2. K బి. హైపోనట్రీమియా
3. Na సి. ఎనిమియా
4. I డి.ఆస్టియోమలేషియా
5. Ca ఇ. గాయిటర్
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-సి
2) 1-సి, 2-ఎ, 3-బి, 4-ఇ, 5-డి
3) 1-డి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
8. కింది ఏ మూలకం, విటమిన్లు వరుసగా పుష్పాల్లో వంధ్యత్వం, ఎముకల్లో పెలుసుతనానికి కారణమవుతాయి?
1) Mo, Vit-A 2) Mn, Vit-D
3) Zn, Vit-C 4) Cu, Vit-D
9. హార్ట్ రాట్ వ్యాధి ఏ మూలకం లోపం వల్ల కలుగుతుంది?
1) B 2) Cu 3) Mo 4) Mn
10. DNA తయారీకి తోడ్పడే విటమిన్?
1) రైబోఫ్లోవిన్ 2) నియాసిన్
3) ఫోలిక్ ఆమ్లం 4) పైరిడాక్సిన్
11. బీరులో లభించే విటమిన్?
1) నియాసిన్ 2) బి6
3) బి12 4) పైవన్నీ
12. పుట్టగొడుగులు ఏ విటమిన్‌కు వనరులు?
1) D 2) B 3) A 4) K
13. సర్జరీ సమయంలో పేషెంట్‌కు ఇచ్చే విటమిన్?
1) రైబోఫ్లావిన్ 2) సి
3) ఎ 4) కె
14. గర్భిణుల్లో ఎక్కువగా దేనిలోపం కనిపిస్తుంది?
1) రైబోఫ్లావిన్ 2) నియాసిన్
3) ఫోలిక్ ఆమ్లం 4) పైరిడాక్సిన్
15. టోన్డ్ మిల్క్‌లో కొవ్వును ఎంతశాతం నుంచి ఎంతశాతానికి తగ్గిస్తారు?
1) 8 శాతం నుంచి 3 శాతానికి
2) 10 శాతం నుంచి 3 శాతానికి
3) 12 శాతం నుంచి 6 శాతానికి
4) 10 శాతం నుంచి 3 శాతానికి
16. వేడిచేసిన పాలలో ప్రముఖంగా ఉండే విటమిన్లు?
1) సి 2) బి1 3) బి12 4) బి, సి
17. ఒక లీటర్ నీటిలో WHO ప్రకారం ఉండవలసిన సాధారణ ఫ్లోరిన్ స్థాయి?
1) 3 mg 2) 5 mg
3) 0.7mg 4) 1.2-5mg
18. స్వీట్ మీట్ అంటే?
1) గుర్రం మాంసం 2) ఆగ్రా పేటా
3) టెస్టికిల్స్ 4) బి, సి
19. కింది వ్యాఖ్యలను అధ్యయనం చేయండి.
ఎ. నెక్ స్వీట్ బ్రెడ్ అని థైమస్/బాల గ్రంథిని పిలుస్తారు
బి. స్టమక్ స్వీట్ బ్రెడ్ అని క్లోమాన్ని పిలుస్తారు
1) ఎ, బి సరైనవి 2) రెండూ తప్పు
3) ఎ తప్పు, బి సరైనది
4) ఎ సరైనది, బి తప్పు
20. కాన్ఫెక్షనరీ అంటే?
1) చక్కెరతో తీపి పదార్థాలను తయారు చేయడం
2) పిండి పదార్థాలతో తీపి పదార్థాలను తయారు చేయడం
3) పై రెండింటితో తీపి పదార్థాలను తయారు చేయడం
4) ప్రొటీన్స్, చక్కెరలతో తీపి పదార్థాలను తయారు చేయడం
సమాధానాలు
1. 3 2. 2 3. 4 4. 3
5. 4 6. 4 7. 2 8. 2
9. 1 10. 2 11. 3 12. 4
13. 2 14. 4 15. 3 16. 1
17. 4 18. 3 19. 4 20. 1
కణజీవ శాస్త్రం
1. కింది వాటిలో జీవాన్నిచ్చే కణభాగం ఏది?
1) మైటోకాండ్రియా
2) కేంద్రకం
3) అంతర్జీవ ద్రవ్యజాలకం
4) ప్రొటోప్లాజమ్
2. కణత్వచం ప్రధాన విధి?
1) కణంలోకి వెళ్లే అణువులను నియంత్రిస్తుంది
2) కణం లోపలి భాగాలను కప్పుతూ ఉండటం
3) కణాన్ని ఆవరించి ఉండటం
4) రెండు కణాలకు మధ్య ఒక యాంత్రికపరమైన అడ్డుగోడగా ఉండటం
3. కింది వాటిలో వేటిని సంయుక్తంగా జీవపదార్థం అంటారు?
1) ప్లాస్మా త్వచం, కేంద్రకం ద్రవ్యం, కణద్రవ్యం
2) కణకవచం, కణద్రవ్యం
3) కణకవచం, కణత్వచం, కేంద్రకం
4) కణకవచం, కణద్రవ్యం, కేంద్రకం
4. కింది వాటిలో సరైనది?
ఎ. కణకవచం కేవలం వృక్షకణాల్లోనే ఉంటుంది
బి.కణకవచం కేవలం జంతుకణాల్లోనే ఉంటుంది
సి. ప్రతి జీవకణంలో ప్లాస్మాత్వచం తప్పనిసరిగా ఉంటుంది
డి. ప్రతి జీవకణంలో కణకవచం తప్పనిసరిగా ఉంటుంది
1) ఎ 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
5. కణకవచం ప్రధాన విధి?
1) రక్షణ 2) పారగమ్యత
3) నిర్మాణాత్మక బలాన్నిస్తుంది
4) కణ విభజన
6. కేంద్రకాంశం దేనితో నిర్మితమై ఉంటుంది?
1) RNA 2) DNA
3) RNA, DNA 4) ఏదీ కాదు
7. RNA విధి ఏమిటి?
1) ఆహార పదార్థాల సంశ్లేషణ
2) ప్రొటీన్ల సంశ్లేషణ
3) పిండి పదార్థాల సంశ్లేషణ
4) కొవ్వుల సంశ్లేషణ
8. కింది వాటిలో క్రోమోసోమ్లు కనిపించే దశ?
1) కణ విభజన 2) కణ నిర్మాణం
3) కణ విభేదనం
4) కణ జీవితచక్రంలో ఎప్పుడైనా
9. జన్యువు అంటే ఏమిటి?
1) RNA 2) DNA
3) అమైనో ఆమ్లాల భాగం
4) పిండి పదార్థాల భాగం
10. క్రోమోసోమ్ క్రియాత్మక ప్రమాణం?
1) జన్యువు 2) క్రొమాటిన్
3) క్రొమాటిడ్ 4) ప్రొటీన్
11. కేంద్రకంలో జన్యువులు ఏవిధంగా అమరి ఉంటాయి.
1) క్రోమోసోమ్ నిలువునా సమాంతర వరుసల్లో అమర్చి ఉంటాయి
2) క్రోమోసోమ్ నిలువునా రేఖీయంగా అమరి ఉంటాయి
3) సర్పిలాకారంగా అమరి ఉంటాయి
4) అస్తవ్యస్తంగా ఉంటాయి
12. కణద్రవ్యం అంటే?
1) కణం- కణత్వచం
2) కణం- (కణత్వచం+కేంద్రకం)
3) కణం- కేంద్రకం
4) జీవపదార్థం- కేంద్రక ద్రవ్యం
13. కణాంగాలను కలిగి ఉండే కణభాగం?
1) కేంద్రకం 2) కణద్రవ్యం
3) కణ త్వచం 4) పైవన్నీ
14. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం విధి?
1) ప్రొటీన్ల సంశ్లేషణ
2) ప్రొటీన్ల విసర్జన
3) కొవ్వుల సంశ్లేషణ
4) కొవ్వుల విసర్జన
15. సిస్టర్‌నే అనే నిర్మాణాలను కలిగి ఉండే కణాంగం?
1) గాల్లీ పరికరం
2) మైటోకాండ్రియా
3) కేంద్రకం 4) రైబోజోమ్‌లు
16. కణంలోని విసర్జకాంగం ఏది?
1) మైటోకాండ్రియా 2) రిక్తిక
3) రైబోజోమ్‌లు
4) అంతర్జీవ ద్రవ్యజాలకం
17. కణంలో పవర్‌ప్లాంట్ అని దేన్ని అంటారు?
1) లైసోసోమ్స్ 2) డిక్టియోసోమ్స్
3) మైటోకాండ్రియా 4) పెరాక్సిసోమ్స్
18. పెరాక్సిసోమ్స్ ఎక్కువగా ఏ కణాల్లో కనిపిస్తాయి?
1) కాలేయ కణాలు
2) మూత్రపిండ కణాలు
3) పై రెండూ 4) ఏదీ కాదు
19. పెరాక్సిసోమ్స్ విధి ఏమిటి?
1) విష పదార్థాలను తొలగించడం
2) ఆక్సీకరణ చర్యలను జరపడం
3) పై రెండూ 4) ఏదీ కాదు
20. కణంలోని ఆత్మహుతి సంచులు అని వేటిని పిలుస్తారు?
1) లైసోసోమ్స్ 2) డిక్టియోసోమ్స్
3) పెరాక్సిసోమ్స్ 4) గాల్జీ పరికరం
21. మైటోకాండ్రియా లోపలి త్వచం ముడతలుపడి వేళ్ల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వీటిని ఏమని పిలుస్తారు?
1) క్రిస్టే 2) సీలియా
3) సిస్టర్‌నే 4) గ్రానా
22. క్రిస్టే ప్రధాన విధి ఏమిటి?
1) శక్తి విడుదల
2) చర్యల్లో పాల్గొనడం
3) ఉపరితల వైశాల్యం పెంచడం
4) ఉపరితల వైశాల్యం తగ్గించడం
23. కింది వాటిలో జంతు కణాల్లో మాత్రమే కనిపించేది?
1) సెంట్రోసోమ్స్ 2) డిక్టియోసోమ్స్
3) పెరాక్సిసోమ్స్ 4) లైసోసోమ్స్
24. జంతు కణంలో జరిగే కణ విభజనలో సెంట్రియోల్స్ పోషించే పాత్రను వృక్షకణాల్లో ఏ నిర్మాణాలు పోషిస్తాయి?
1) సెంట్రియోల్స్ 2) లైసోసోమ్స్
3) పోలార్కాప్స్ 4) రిక్తికలు
25. వృక్షకణంలో కేంద్రకం మధ్యలో కాకుండా కణకవచానికి దగ్గరగా వస్తుంది ఎందుకు?
1) పెద్ద మైటోకాండ్రియా ఉండటం వల్ల
2) పెద్ద రిక్తిక కణంలోని ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడం
3) కణంలోని ప్రధానమైన కణాంగాలు కణం మధ్యలో అమరి ఉండటం
4) పెద్ద ప్లాస్టిడ్ల వల్ల
26. రిక్తికలకు సంబంధించి సరైనది?
1) వృక్ష, జంతు కణాలు రెండింటిలో ఇవి కనిపిస్తాయి
2) జంతు కణాల్లో ఇవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి
3) లేత వృక్ష కణాల్లో ఇవి అధిక సంఖ్యలో ఉండి తర్వాతి దశల్లో అన్ని కలిసి ఒకే పెద్ద రిక్తికగా మారతాయి
4) వృక్ష, జంతు కణాల్లో ఉండవు
27. మైటోకాండ్రియా ఎంజైమ్స్ ఏ ప్రక్రియలో పాల్గొంటాయి?
1) కణ ద్రవాభిసరణ 2) విసర్జన
3) కణ శ్వాసక్రియ 4) పైవన్నీ
28. ప్లాస్టిడ్లలో కనిపించని నిర్మాణం ఏది?
1) క్రిస్టే 2) గ్రానా
3) స్ట్రోమా 4) థైలకాయిడ్
సమాధానాలు
1. 4 2. 1 3. 1 4. 2
5. 3 6. 1 7. 2 8. 1
9. 2 10. 1 11. 2 12. 4
13. 2 14. 1 15. 1 16. 2
17. 3 18. 3 19. 3 20. 1
21. 1 22. 3 23. 1 24. 3
25. 2 26. 3 27. 3 28. 1
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు