సుప్రీంకోర్టు పరిణామం (Evolution)

మీకు తెలుసా?
సుప్రీంకోర్టు పరిణామం (Evolution)
రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు గల నిబంధనల్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.
రెగ్యులేటింగ్ చట్టం-1773 ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్విలియంలో సుప్రీంకోర్టు ఏర్పడింది. ఈ సుప్రీంకోర్టు కూర్పు అనేది 1+3 గా ఉండేది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు న్యాయమూర్తులు ఉండేవారు.
ప్రధాన న్యాయమూర్తి – సర్ ఎలిజా ఇంపే (1)
ఇతర న్యాయమూర్తులు- స్టీఫెన్ సీజర్ లెమైజర్, జాన్ హైడ్, రాబర్ట్ చాంబర్స్ (3)
భారత ప్రభుత్వ చట్టం-1935 ఆధారంగా సుప్రీంకోర్టు స్థానంలో ఫెడరల్ కోర్టు ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ ఫెడరల్ కోర్టు తీర్పులపై బ్రిటన్‌లో ఉన్న ప్రివీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకునే అవకాశం ఉండేది.
1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి 28న ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు.
1937-1950 మధ్యకాలంలో కూడా ఫెడరల్ కోర్టు పార్లమెంటు భవనంలో ఉన్న ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌లో పనిచేసింది. 1950 నుంచి 1958 వరకు కూడా సుప్రీంకోర్టు ఇదే భవనంలో పనిచేసింది. 1958లో సుప్రీంకోర్టు ప్రస్తుత భవనంలోకి మారింది.
భారత సుప్రీంకోర్టు కేంద్ర భవంతి ( Central/ Main Buildings) త్రిభుజకారంలో ఉండి ఇండో-బ్రిటిష్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ నిర్మాణానికి ముఖ్య ఆర్కిటెక్ట్‌గా గణేష్ బికాజీ దియోల్కర్ పనిచేశారు. ఇతను సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మొదటి అధిపతిగా పనిచేశాడు. 1979లో ఈ ప్రధాన భవంతికి తూర్పున ఈస్ట్ వింగ్, పశ్చిమాన వెస్ట్ వింగ్ నిర్మించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యూఢిల్లీలోని తిలక్‌రోడ్‌లో ఉంది. దీని మోటో యధో ధర్మస్తతో జయ్ (Where there is Righteousness, there is victory) అంటే ధర్మమే విజయం సాధిస్తుంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు