రెండో లోక్‌సభకు ఎన్నికైన మహిళల సంఖ్య?
1. కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దానిని గుర్తించండి?
1) లోక్‌సభకు ఎన్నికయిన సభ్యులతో ప్రమాణం చేయించేది- ప్రొటెం స్పీకర్
2) ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు
3) లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా ఎన్నుకుంటారు
4) లోక్‌సభ స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణం చేయిస్తారు
వివరణ: లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గాను, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గాను ఎన్నుకుంటారు. లోక్‌సభ స్పీకర్‌కు ప్రత్యేకించి ఎలాంటి ప్రమాణ స్వీకారం ఉండదు. లోక్‌సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి.
2. ‘స్పీకర్’ పదవికి సంబంధించి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి?
1) 1919 నాటి మాంటేగ్ చేమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం కేంద్ర శాసనసభలో మొదటిసారిగా స్పీకర్ పదవిని ప్రవేశపెట్టారు
2) 1919 చట్టం ప్రకారం స్పీకర్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు
3) 1919 చట్టం ప్రకారం స్పీకర్‌ను కేంద్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు
4) 1919 చట్టం ప్రకారం స్పీకర్‌ను గవర్నర్ జనరల్ నియమిస్తారు
వివరణ: 1919 చట్టం ప్రకారం కేంద్ర శాసనసభ అధిపతిని అధ్యక్షుడిగా పిలిచేవారు. 1921లో సర్ ఫ్రెడరిక్ వైట్ తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం కేంద్ర శాసనసభ అధ్యక్షుడు అనే పదాన్ని స్పీకర్‌గా మార్పుచేశారు.
3. 1925 నుంచి 1930 మధ్య కేంద్ర శాసన సభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడిని గుర్తించండి?
1) విఠల్‌భాయ్ పటేల్ 2) షణ్ముఖం చెట్టి
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) దాదాభాయ్ నౌరోజీ
వివరణ: లోక్‌సభ స్పీకర్ పదవి బ్రిటిష్ కామన్స్ సభ స్పీకర్ పదవిని పోలి ఉంటుంది. రాజ్యాంగంలోని 93 నుంచి 97 వరకు గల ఆర్టికల్స్‌లో లోక్‌సభ స్పీకర్ పదవిని పేర్కొన్నారు.
4. కింది అంశాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) లోక్‌సభ స్పీకర్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతే స్పీకర్ పదవిని కూడా కోల్పోతారు
2) లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయిన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి
3) లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను తొలగించే తీర్మానాన్ని లోక్‌సభ సభ్యులు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయాలి
4) లోక్‌సభ సభ్యులు సాధారణ మెజారిటీతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను తొలగించగలరు
వివరణ: లోక్‌సభకు స్పీకర్‌గా ఎన్నికయిన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నీలం సంజీవరెడ్డి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయిన వెంటనే తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
5. లోక్‌సభ రద్దయిన తర్వాత సంబంధిత లోక్‌సభ స్పీకర్ పదవి ఎంతకాలం కొనసాగుతుంది?
1) నెల 2) 2 నెలలు 3) 3 నెలలు
4) కొత్త లోక్‌సభ ఏర్పడేవరకు
వివరణ: సాధారణంగా లోక్‌సభ స్పీకర్ పదవీకాలం 5 సంవత్సరాలు. లోక్‌సభ రద్దయినా లేదా పదవీకాలం ముగిసినా స్పీకర్ పదవి రద్దు కాదు. తిరిగి కొత్త లోక్‌సభ ఏర్పడి నూతన స్పీకర్ ఎన్నిక జరిగేంత వరకు అప్పటి వరకు ఉన్న స్పీకర్ పదవిలో కొనసాగుతారు.
6. కింది అంశాల్లో సరికాని దానిని గుర్తించండి?
1) లోక్‌సభ సభ్యుల నుంచి 1-6 వరకు ప్యానెల్ స్పీకర్లను నియమించేది స్పీకర్
2) లోక్‌సభ స్పీకర్ సమావేశాలకు గైర్హాజరైతే డిప్యూటీ స్పీకర్ సమావేశాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు
3) స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు లోక్‌సభ సమావేశాలకు ఏక కాలంలో గైర్హాజరైతే ప్యానెల్ స్పీకర్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు
4) స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానెల్ స్పీకర్ సమావేశాలకు గైర్హాజరైతే ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు
వివరణ: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఏకకాలంలో ఖాళీ అయితే ప్యానెల్ స్పీకర్లలో ఒకరు స్పీకర్‌గా వ్యవహరించే వీల్లేదు. ఈ సందర్భంలో రాష్ట్రపతి ద్వారా నియమితులైన ఒక లోక్‌సభ సభ్యుడు స్పీకర్‌గా వ్యవహరిస్తారు.
7. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌పై ప్రవేశపెట్టిన తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ఎవరిపై చర్చ జరుగుతుందో, వారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
1) 94 2) 95 3) 96 4) 97
వివరణ: ఆర్టికల్ 96(2) ప్రకారం స్పీకర్/డిప్యూటీ స్పీకర్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన చర్చ జరుగుతున్నప్పుడు వారు చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. ప్రారంభంలోనే ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఒకవేళ ఆ ఓటింగ్‌లో స్పీకర్/డిప్యూటీ స్పీకర్‌ను తొలగించే తీర్మానానికి అనుకూలంగా, ప్రతికూలంగా ఒకే సంఖ్యలో ఓట్లు వస్తే స్పీకర్/డిప్యూటీ స్పీకర్ నిర్ణాయకపు ఓటు వినియోగించుకునేందుకు అవకాశం లేదు.
8. లోక్‌సభ స్పీకర్ అధికారాలు, విధులకు సంబంధించి సరికాని జవాబును గుర్తించండి?
1) లోక్‌సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు లోక్‌సభను రద్దుచేస్తారు
2) లోక్‌సభకు కస్టోడియన్‌గా వ్యవహరిస్తారు
3) లోక్‌సభలో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు
4) లోక్‌సభలో కోరం లేనప్పుడు సభను వాయిదా వేస్తారు
వివరణ: పార్లమెంట్ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనల చట్టం-1950 (రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ యాక్ట్-1950) ప్రకారం స్పీకర్ అధికారాలు, విధులు పేర్కొన్నారు. లోక్‌సభను రద్దుచేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది.
9. లోక్‌సభ సభ్యుల సస్పెన్షన్‌కు ఉద్దేశించిన రూల్ 374(ఎ)ను ఏ లోక్‌సభ కాలంలో చేర్చారు?
1) 11వ 2) 12వ 3) 13వ 4) 14వ
వివరణ: లోక్‌సభ సభ్యులు ఎవరైనా లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తే వారిని నేరుగా సస్పెండ్ చేసే విధానాన్ని రూల్ 374(ఎ) తెలియజేస్తుంది. ఇది స్పీకర్‌కు గల నిర్ణయాధికార పరిధిలోకి వస్తుంది. రూల్ 374(ఎ) ప్రకారం సస్పెండ్ అయిన సభ్యులు 5 రోజులపాటు గాని లేదా లోక్‌సభ సమావేశాలు ముగిసేవరకు గాని సస్పెన్షన్‌లో ఉంటారు. ఈ సస్పెన్షన్‌ను ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మధ్యలోనే రద్దు చేయవచ్చు.
10. లోక్‌సభ స్పీకర్ అధికారాలు, విధులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు
2) ఒక బిల్లును ద్రవ్యబిల్లా? కాదా? అని ధ్రువీకరిస్తారు
3) అఖిల భారత స్పీకర్ల సదస్సుకు అధ్యక్షత వహిస్తారు
4) రాజ్యసభ సెక్రటరీ జనరల్‌పై నియంత్రణ కలిగి ఉంటారు
వివరణ: స్పీకర్ లోక్‌సభ సచివాలయ అధిపతిగా వ్యవహరిస్తారు. లోక్‌సభకు నూతనంగా ఎన్నికయిన సభ్యుల ధ్రువీకరణ పత్రాలను స్వీకరిస్తారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌పై నియంత్రణ కలిగి ఉంటారు. స్పీకర్ అనుమతితోనే సభ్యులు లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెడతారు.
11. లోక్‌సభ స్పీకర్ అధికార హోదాలో 7వ స్థానం కలిగి ఉండి ఎవరితో సమానంగా గౌరవ హోదాను పొందుతారు?
1) ఉపరాష్ట్రపతి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) అటార్నీ జనరల్
4) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
వివరణ: పార్లమెంటరీ విధానంలో లోక్‌సభ స్పీకర్ స్థానం కీలకమైంది. ఇతను లోక్‌సభకు స్వరంగా, లోక్‌సభకు ప్రథమ సభ్యుడిగా వ్యవహరిస్తారు. అర్ధ న్యాయాధికారాలు కలిగి ఉంటారు. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
12. పార్లమెంట్లో గుర్తింపు పొందిన పార్టీల నాయకులు, బృందాల నాయకులు, చీఫ్ విప్ల సదుపాయాల చట్టం ఎప్పుడు రూపొందింది?
1) 1995 2) 1996
3) 1998 4) 1991
వివరణ: పార్లమెంటులో గుర్తింపు పొందిన పార్టీల నాయకుల/బృందాల నాయకుల, చీఫ్విప్ల సదుపాయాల చట్టం-1998లో రూపొందింది. ఈ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం ఒక రాజకీయ పార్టీ లోక్‌సభలో కనీసం 10 శాతం సీట్లు అంటే 55 సీట్లు సాధిస్తే దానిని లోక్‌సభలో గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పేర్కొంటారు. రాజ్యసభలో ఈ సంఖ్య 25.
13. 1969లో 4వ లోక్‌సభలో ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు?
1) రాం సుభాగ్ సింగ్ 2) నిజ లింగప్ప
3) వైబీ చవాన్ 4) మొరార్జీ దేశాయ్
వివరణ: 1969లో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక వల్ల డా. రాం సుభాగ్ సింగ్‌ను లోక్‌సభలో తొలి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. 60 మంది సభ్యులున్న కాంగ్రెస్ చీలిక వర్గం అయిన కాంగ్రెస్ (O)ను ప్రతిపక్ష పార్టీగా గుర్తించి, దాని నాయకుడైన రాం సుభాగ్ సింగ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు.
14. లోక్‌సభలో మొదటి గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎవరిని పేర్కొనవచ్చు?
1) కమలాపతి త్రిపాఠి 2) వైబీ చవాన్
3) కృపలాని 4) చరణ్‌సింగ్
వివరణ: 6వ లోక్‌సభ కాలంలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి, కాంగ్రెస్ పార్టీకి చెందిన వైబీ చవాన్ 1977, జూలై 1న లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అవతరించాడు.
15. 8వ లోక్‌సభలో ఎక్కువ మంది సభ్యులు గల ప్రతిపక్ష పార్టీగా ఏ రాజకీయ పార్టీ అవతరించింది?
1) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2) తెలుగు దేశం పార్టీ
3) భారతీయ జనతా పార్టీ
4) ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)
వివరణ: 1984లో ఏర్పడిన 8వ లోక్‌సభలో 30 మంది సభ్యులు గల ‘తెలుగుదేశం పార్టీ (టీడీపీ)’ లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి చెందిన నాయకుడు పీ ఉపేంద్ర 1984-89 మధ్య లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా అవతరించారు.
16. వివిధ లోక్‌సభల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన సరైన జవాబును గుర్తించండి?
ఎ. 12వ లోక్‌సభ 1. సుష్మాస్వరాజ్
బి. 13వ లోక్‌సభ 2. ఎల్కే అద్వానీ
సి. 14వ లోక్‌సభ 3. సోనియాగాంధీ
డి. 15వ లోక్‌సభ 4. శరద్‌పవార్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-3, సి-4, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
వివరణ: 16వ లోక్‌సభ ఎన్నికల్లో, 17వ లోక్‌సభ ఎన్నికల్లో 10 శాతం స్థానాలు ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి లభించలేదు. అందువల్ల 16వ, 17వ లోక్‌సభల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు.
17. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర సహాయ మంత్రి హోదా పొందుతారు
2) ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా, సౌకర్యాలు పొందుతారు
3) ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని లోక్‌సభ స్పీకర్ ధ్రువీకరిస్తారు
4) జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్‌ను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తారు
వివరణ: ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేంద్ర విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్ చైర్మన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి వాటి నియామకాలకు ఏర్పడిన ఎంపిక కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తారు.
18. లోక్‌సభ ప్రత్యేక అధికారానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) ఆర్టికల్ 93 ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవడం
2) శాసనాల రూపకల్పన సమయంలో అటార్నీ జనరల్ న్యాయ సలహాను పొందడం
3) ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగానే లోక్‌సభలో ప్రవేశపెట్టడం
4) కేంద్ర ప్రభుత్వాన్ని పదవి నుంచి తొలగించే తీర్మానం లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి
వివరణ: ఆర్టికల్ 352 ప్రకారం విధించే అత్యవసర పరిస్థితి ప్రకటనను రద్దుచేసే తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978 ద్వారా లోక్‌సభకు ప్రత్యేక అధికారాన్ని కల్పించారు.
19. లోక్‌సభ స్పీకర్ అధికారాలు, విధులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) రాష్ట్రపతి రాజీనామా ప్రకటనను అధికారికంగా వెల్లడిస్తారు
2) లోక్‌సభ సమావేశాలను ‘Summans (ప్రారంభం)’ చేస్తారు
3) పార్లమెంట్, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు
4) లోక్‌సభ సభ్యులు ఏయే స్థానాల్లో ఆసీనులు కావాలనేది స్పీకర్ నిర్ణయిస్తారు
వివరణ: పార్లమెంట్ సభ్యుల హక్కులను సంరక్షించే వ్యక్తిగా వ్యవహరిస్తారు. లోక్‌సభ సభ్యులను అరెస్ట్ చేయాలంటే స్పీకర్ ఆనుమతి తప్పనిసరి. జైలు నుంచి లోక్‌సభ సభ్యులను విడుదల చేస్తున్న సందర్భంలో ముందస్తు సమాచారాన్ని జైలు అధికారులు స్పీకర్‌కు తెలియజేయాలి.
20. వివిధ లోక్‌సభలకు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్యకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
ఎ. మొదటి లోక్‌సభ 1. 27
బి. 2వ లోక్‌సభ 2. 22
సి. 3వ లోక్‌సభ 3. 31
డి. 4వ లోక్‌సభ 4. 34
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-3, సి-4, డి-1
వివరణ: మొదటి లోక్‌సభ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడంగా’ విమర్శకులు పేర్కొనగా, ‘విశ్వాసంతో కూడిన చర్య’ అని ఆశావలు పేర్కొన్నారు.
సమాధానాలు
1-4, 2-3, 3-1, 4-2, 5-4, 6-4, 7-3, 8-1, 9-3, 10-4, 11-2, 12-3, 13-1, 14-2, 15-2, 16-1, 17-1, 18-3, 19-2, 20-1
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు