ఎక్కువకాలం కొనసాగిన లోక్‌సభ ఎన్నవది?
1. ప్రోటోకాల్ ప్రకారం కింది వారిలో అత్యున్నత హోదా ఎవరిది?
1) ఉపప్రధాని 2) మాజీ ప్రధాని
3) రాష్ట్ర పరిధిలో గవర్నర్ 4) లోక్‌సభ స్పీకర్
2. కిందివాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ. ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంటరీ ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది
బి. మొదటి పార్లమెంటరీ ఉభయసభల సంయుక్త సమావేశం 1961లో జరిగింది
సి. బ్యాంకింగ్ సర్వీస్ బిల్లును ఆమోదించడానికి రెండో పార్లమెంటరీ ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, బి, సి
3. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి?
1) లోక్‌సభలో మాత్రమే
2) పార్లమెంటు ఉభయసభల్లో
3) పార్లమెంటు సంయుక్త సమావేశంలో
4) రాజ్యసభలో మాత్రమే
4. రాష్ర్టాలు- ఏర్పడిన సంవత్సరాలను జతపర్చండి.
ఎ. 2014 1. తెలంగాణ
బి. 1960 2. మిజోరం
సి. 1986 3. గుజరాత్
డి. 1963 4. నాగాలాండ్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
5. కింది ప్రకరణలు జతపర్చండి.
ఎ. ప్రకరణ 80 1. లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితి
బి. ప్రకరణ 81 2. లోక్‌సభ నిర్మాణం
సి. ప్రకరణ 82 3. రాజ్యసభ నిర్మాణం
డి. ప్రకరణ 83 4. నియోజకవర్గాల పునర్విభజన
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
6. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 4-ఏ భాగం చేర్చారు
బి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 14-ఏ భాగం చేర్చారు
సి. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 9-ఏ భాగం చేర్చారు
డి. 75వ రాజ్యాంగ సవరణ ద్వారా 9-బీ భాగం చేర్చారు
ఇ. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 9-బీ భాగం చేర్చారు
1) బి, సి, డి 2) సి, డి, ఇ
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, ఇ
7. పార్టీలు, వాటి వ్యవస్థాపక అధ్యక్షులను జతపర్చండి.
ఎ. ద్రవిడ మున్నేట్ర కజగం 1. సీఎన్ అన్నాదురై
బి. సమాజ్‌వాదీ పార్టీ 2. ములాయం సింగ్ యాదవ్
సి. రాష్ట్రీయ జనతాదళ్ 3. లాలూప్రసాద్ యాదవ్
డి. రాష్ట్రీయ లోక్‌దళ్ 4. అజిత్ సింగ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
8. కింది ప్రకరణలను జతపర్చండి.
ఎ. ప్రకరణ 169 1. సభాపతుల తొలగింపు, రాజీనామా
బి. ప్రకరణ 179 2. సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్
సి. ప్రకరణ 159 3. గవర్నర్ ప్రమాణ స్వీకారం
డి. ప్రకరణ 129 4. శాసనమండలి రద్దు/ఏర్పాటు చేయడం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
9. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): భారత యూనియన్ నుంచి విడిపోయే అధికారం ఏ రాష్ర్టానికీ లేదు
కారణం (R): ఇండియా అంటే భారతదేశం, అది రాష్ర్టాల యూనియన్
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
10. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు, రాజ్యసభకు బాధ్యత వహించాలి
కారణం (R): లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉండటానికి అర్హులు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
11. కింది వ్యాఖ్యల్లో సరైనవి.
ఎ. లోక్‌సభ స్పీకర్‌కు సభను వాయిదా వేసే అధికారం ఉంది. అయితే ప్రోరోగ్ అయిన సభను తిరిగి సమావేశపరిచే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది
బి. లోక్‌సభను రద్దుచేస్తూ రాష్ట్రపతి లాంఛనంగా ఉత్తర్వులు జారీ చేయకపోయినప్పటికీ, సభ పదవీకాలాన్ని పొడిగించకపోతే, ఐదేండ్లు ముగిసిన తర్వాత లోక్‌సభ రద్దవుతుంది
సి. సభ రద్దయిన తర్వాత కూడా సభ ప్రథమ సమావేశం జరగడానికి ముందు వరకూ లోక్‌సభ స్పీకర్ పదవిలో కొనసాగుతాడు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ, బి, సి
12. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): ప్రతి రాష్ర్టానికి తన భూభాగంలో ఒక హైకోర్టు ఉంది
కారణం (R): రాజ్యాంగం ప్రతి రాష్ర్టానికి ఒక హైకోర్టును సమకూరుస్తుంది
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
13. కింది వారిలో భారత యూనియన్ ఆర్థిక మంత్రులెవరు?
ఎ. వీపీ సింగ్ బి. ఆర్ వెంకట్రామన్
సి. వైబీ చవాన్ డి. ప్రణబ్ ముఖర్జీ
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి 3) బి, డి 4) పైఅందరూ
14. కింది రాష్ర్టాల విషయంలో భారత యూనియన్ పూర్తి స్థాయిలో అవతరించడానికి సంబంధించి సరైన అవరోహణ క్రమం?
1) సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, హర్యానా 2) నాగాలాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ 3) సిక్కిం, హర్యానా, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ 4) నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హర్యానా
15. కింది వారిలో ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించిన వారు?
ఎ. మహ్మద్ హిదాయతుల్లా
బి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సి. నీలం సంజీవరెడ్డి
డి. శంకర్‌దయాళ్ శర్మ
1) ఎ, బి, సి, డి 2) ఎ, డి 3) బి, సి 4) సి, డి
16. రాజ్యాంగ పరిషత్‌లోని కమిటీలు, అధ్యక్షులను జతపర్చండి.
ఎ. ఈశాన్యరాష్ర్టాల హక్కుల కమిటీ
1. గోపీనాథ్ బోర్డోలాయి
బి. రాజ్యాంగపరిషత్ విధుల కమిటీ
2. జీవీ మౌలాంకర్
సి. అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ
3. హెచ్‌సీ ముఖర్జీ
డి. సారథ్య సంఘం
4. బాబూ రాజేంద్ర ప్రసాద్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-3, బి-1, సి-2, డి-4
17. రాజ్యాంగంలోని భాగాలు, వాటి అంశాలను జతపర్చండి.
ఎ. 17వ భాగం 1. అధికార భాష
బి. 14వ భాగం 2. కేంద్ర, రాష్ట్ర సర్వీసులు
సి. 10వ భాగం 3. షెడ్యూల్డ్, ట్రైబల్ ఏరియాల్లో పరిపాలన
డి. 20వ భాగం 4. రాజ్యాంగ సవరణ పద్ధతి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
18. రాజ్యాంగ ప్రవేశిక వాక్యాలను, ప్రముఖులను జతపర్చండి.
ఎ. ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు వంటిది 1. ముథోల్కర్
బి. ప్రవేశిక రాజ్యాంగానికి ఒక తాళంచెవి లాంటిది 2. పాల్కీవాలా
సి. ప్రవేశిక భారత రాజ్యాంగ సారాంశం
3. నెహ్రూ
డి. ప్రవేశిక ఒక నిశ్చయాత్మకమైన తీర్మానం, ఒక హామీ 4. జే డయ్యర్
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-3, బి-1, సి-2, డి-4
19. కింది ప్రకరణలను జతపర్చండి.
ఎ. ప్రకరణ 51-ఏ 1. విద్యాహక్కు
బి. ప్రకరణ 43-ఏ 2. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ
సి. ప్రకరణ 21-ఏ 3. ప్రాథమిక విధులు
డి. ప్రకరణ 48-ఏ 4. పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం
1) ఎ-2, బి-4, సి-3, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
20. మంత్రులు, వారి రాజీనామాకు కారణాలను జతపర్చండి.
ఎ. ప్రణాళికా సంఘానికి కల్పించిన ప్రాధాన్యతలేక దాని నిర్మాణ విషయంలో నెహ్రూతో విభేదించి రాజీనామా చేసిన వారు 1. వీవీ గిరి
బి. బొంబాయి రాష్ర్టాన్ని విభజించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసింది 2. సీడీ దేశ్‌ముఖ్
సి. పాకిస్థాన్‌తో లాల్‌బహుదూర్ శాస్త్రి చేసుకున్న తాష్కెంట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసింది 3. మహావీర్ త్యాగి
డి. రూపాయి విలువను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసింది 4. మొరార్జీ దేశాయ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-1, సి-2, డి-4
21. కింది వాటిలో సరైనది.
ప్రతిపాదన (A): వేవెల్ ప్లాన్ ప్రకారం కార్యనిర్వహణ మండలిలో హిందూ, ముస్లిం సభ్యుల సంఖ్య సమానంగా ఉండాలి
కారణం (R): ఈ ఏర్పాటు భారతదేశ విభజనను నివారిస్తుందని వేవెల్ భావించాడు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
22. కింది వాటిలో సరైనది?
ప్రతిపాదన (A): పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభలోని మొత్తం సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి రాజ్యాంగ సవరణ చేయాలి
కారణం (R): ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయకుండానే ఎన్నికల్లో పోటీచేసే అన్ని రాజకీయ పార్టీలు తాము పోటీచేసే మొత్తం సీట్లలో 33 శాతం సీట్లు మహిళలకే కేటాయించవచ్చు
1) A, Rలు నిజం, Aకు R సరైన వివరణ
2) A, Rలు నిజం, కానీ Aకు R సరైన వివరణ కాదు 3) A నిజం, R తప్పు 4) A తప్పు, R నిజం
23. ఏ బిల్లు విషయంలో ప్రతిష్ఠంభన ఏర్పడితే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు?
ఎ. సాధారణ బిల్లు బి. ద్రవ్యబిల్లు సి. రాజ్యాంగ సవరణ బిల్లు
1) ఎ 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
24. అతి దీర్ఘ పదవీకాలం కొనసాగిన లోక్‌సభ?
1) 1వ సభ 2) 4వ సభ 3) 5వ సభ 4) 6వ సభ
25. రాజ్యాంగంలో పేర్కొన్న కేంద్ర, రాష్ట్ర అధికారుల పంపిణీ ఎక్కడి నుంచి గ్రహించారు?
1) మింటో-మార్లే సంస్కరణలు, 1909
2) మాంటెగ్ ఛేమ్స్ఫర్ట్ సంస్కరణలు- 1919
3) భారత ప్రభుత్వ చట్టం- 1935
4) భారత స్వాతంత్య్ర చట్టం- 1947
26. పార్లమెంటులో వాయిదా తీర్మానం ఉద్దేశం?
1) ప్రజాప్రాముఖ్యత కలిగిన విషయంపై చర్చకు అనుమతించడం
2) మంత్రుల నుంచి ప్రతిపక్ష సభ్యులు సమాచారాన్ని రాబట్టడం
3) డిమాండ్ ఫర్ గ్రాంట్‌లో నిర్ణీత మొత్తాన్ని తగ్గించడం
4) సభలోని కొంత మంది సభ్యులు సభకు అంతరాయం కలిగిస్తే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు