Indian Polity | ఆగంతుక నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
పాలిటీ
1. కింది వాటిలో అటార్నీ జనరల్‌కు సంబంధించి సరికానిది?
1) ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవి గురించి పేర్కొంటుంది
2) కేంద్ర ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్
3) భారత అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిసారు
4) మొదటి అటార్నీ జనరల్ సి.కె.దప్తరి
2. ఏ ఆర్టికల్ ప్రకారం భారత అటార్నీ జనరల్‌కు దేశంలోని ఏ న్యాయస్థానానికైనా వెళ్లి వాదించే స్వేచ్ఛ ఉంది?
1) ఆర్టికల్ 76(1) 2) ఆర్టికల్ 76(2)
3) ఆర్టికల్ 76(3) 4) ఆర్టికల్ 76(4)
3. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సరికానిది?
1) అటార్నీ జనరల్‌కు సహాయం చేయడానికి ఒక సొలిసిటర్ జనరల్ ఉంటాడు
2) సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవి గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు
3 సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ పదవి కాదు
4) పైవన్నీ సరైనవే
4. అటార్నీ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ఆర్టికల్ 76(4) ప్రకారం రాష్ట్రపతి అభీష్టం ఉన్నంత వరకు అటార్నీ జనరల్ పదవిలో కొనసాగుతారు
2. అటార్నీ జనరల్ నిర్ణీత పదవీకాలం ఐదేండ్లు
3) అటార్నీ జనరల్ జీత భత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు
4) రాష్ట్రపతి అటార్నీ జనరల్ ద్వారానే సుప్రీంకోర్టు సలహాలు పొందుతారు
5. అడ్వకేట్ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ నియామకం గురించి తెలియజేస్తుంది
2) అడ్వకేట్ జనరల్‌ను సంబంధిత రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు
3) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి అడ్వకేట్ జనరల్ డి.నరసరాజు
4) రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరాలు
6. తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్ ఎవరు?
1) ఎ. సుదర్శన్ రెడ్డి 2) రామకృష్ణారెడ్డి
3) ప్రకాష్ రెడ్డి
4) బి.శివానంద ప్రసాద్
7. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనే స్వేచ్ఛ కలదు?
1) ఆర్టికల్ 165 2) ఆర్టికల్ 166
3) ఆర్టికల్ 177 4) ఆర్టికల్ 176
8. కింది వాటిలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు సంబంధించి సరికానిది?
1) గవర్నర్ అభీష్టం మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవిలో కొనసాగుతాడు
2) రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎంత కాలం పదవిలో ఉండాలి, ఎప్పుడు తొలగించాలనేది పూర్తిగా గవర్నర్ ఇష్టం
3) రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు నిర్ణీత పదవీకాలం లేదు
4) రాష్ట్ర అడ్వకేట్ జనరల్ జీతాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు
9. భారత కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం?
1) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవి గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 నుంచి 151 ఆర్టికల్ వరకు తెలియజేస్తాయి.
2) భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 62 ఏండ్లు(దీనిలో ఏది ముందైతే అది)
3) భారతదేశ మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నరహరి రావు
4) పైవన్నీ సరైనవి
10. ‘భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను బహుళ సభ్య సంస్థగా మారిస్తే ఎన్నికల కమిషన్ లాగా బలహీన పడుతుంది’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
2) సీవీసీ మాజీ కమిషనర్ ఎన్.విఠల్
3) జవహర్లాల్ నెహ్రూ
4) టీఎన్ శేషన్
11. సివిల్ సర్వీస్ దినోత్సవాన్ని ఏప్రిల్ 21న ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు?
1) 2005 2) 2006
3) 2007 4) 2008
12. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1950లో స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పడింది
2) భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో ఆర్టికల్ 315 నుంచి 323 వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తాయి.
3) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రధానమంత్రి నియమిస్తారు.
4) అఖిల భారత సర్వీస్‌ల పితామహునిగా సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను పేర్కొంటారు.
13. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ వీరమణ వయస్సును 60 ఏండ్ల నుంచి 62 ఏండ్లకు పెంచారు?
1) 40వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 1976
2) 41వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 1976
3) 42వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 1976
4) 44వ భారత రాజ్యాంగ సవరణ చట్టం 1978
14. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని వివరణ ఏది?
1) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించేది రాష్ట్ర గవర్నర్
2) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్ర గవర్నర్‌కు ఉంది
3) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు
4) ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుసిరెడ్డి జనార్దన్ రెడ్డి
15. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) భారత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది
2) భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది
3) భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది
4) భారత ఎన్నికల సంఘం భవనం పేరు నిర్వచన్ సదన్
16. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ అధికార విధుల గురించి తెలియజేస్తుంది
2) ఆర్టికల్ 325 ఒకే ఓటర్ల జాబితా గురించి తెలియజేస్తుంది
3) ఆర్టికల్ 326 వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది
4) ఆర్టికల్ 327 ఎన్నికల సంఘం చైర్మన్, సభ్యుల అర్హతలు కాలపరిమితి గురించి తెలియజేస్తుంది
17. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఎన్నికల కమిషన్ ఏ సంవత్సరంలో నిషేధం విధించింది ?
1) 2002 2) 2003
3) 2004 4) 2005
18. ఎన్నికల సంస్కరణలపై దినేష్ గోస్వామి కమిటీ సిఫారసులో సరికానిది ఏది?
1) రాజకీయ పార్టీలకు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఖర్చును నగదు రూపంలో కాకుండా వస్తు రూపంలో ఇవ్వాలి
2) ఒక అభ్యర్థి ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి
3) ఎన్నికల్లో అక్రమాలను నిరోధించాలంటే ఈవీఎంలను ఉపయోగించాలని సూచించింది
4) ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులను కలిగిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉండాలని సూచించింది
19. కింది వాటిలో ఎన్నికల కమిషన్‌కు సంబంధించి సరికానిది ఏది?
1) ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు పేరిశాస్త్రి
2) ఎక్కువకాలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన వ్యక్తి కేవీకే సుందరం
3) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంది
4) ఓటర్ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్ .శేషన్
20. కింది వారిలో రామన్ మెగసెసె అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్లు ఎవరు?
1) సుకుమార్ సేన్, కేవీకే సుందరం
2) వీఎస్ రమాదేవి, టీఎన్ శేషన్
3) టీఎన్ శేషన్, జే.ఎం.లింగోడ్
4) టీఎస్ కృష్ణమూర్తి, ఎన్ గోపాలస్వామి
21. కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలపై ఏర్పాటు చేసిన రాజమన్నార్ కమిటీలోని ఇతర సభ్యులు ఎవరు?
1) డాక్టర్ ఏపీ ముఖర్జీ, పి.పి. చంద్రారెడ్డి
2) లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి. చంద్రారెడ్డి
3) డాక్టర్ జయప్రకాష్ నారాయణ, లక్ష్మణస్వామి మొదలియార్
4) వి.రామచంద్రన్, లక్ష్మణ స్వామి మొదలియార్, పి పి చంద్రారెడ్డి
22. రాజమన్నార్ కమిటీ(1969) సిఫారసులో కింది వాటిలో సరికానిది ఏది?
1) రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలన ప్రకటించే ఆర్టికల్ 356ను రద్దు చేయాలి
2) రాజ్యసభలో రాష్ర్టాలకు సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాలి
3) రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నియమించే పద్ధతిని రద్దు చేయాలి
4) అంతర్రాష్ట్ర వివాదాలను హైకోర్టు ద్వారా పరిష్కరించాలి
23. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ సిఫారసులో పేర్కొన్న అంశాల్లో కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) గవర్నర్‌ను నియమించే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని(ముఖ్యమంత్రి) తప్పక సంప్రదించాలి
2) వివాదాస్పదం కాని ఏదైనా రంగాల్లో ప్రసిద్ధ వ్యక్తిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి
3) గవర్నర్‌ను ఎంపిక చేసే ముందు మెజారిటీ వర్గాల వారికే ప్రాధాన్యం ఇవ్వాలి
4) క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిని, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని రాష్ట్ర గవర్నర్‌గా నియమించాలి
24. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యాయానికి ఏర్పాటు చేసిన(జస్టిస్ మదన్ మోహన్ పుంచి)రెండో కమిషన్‌లో ఇతర సభ్యులు ఎవరు?
1) వినోద్ కుమార్ దుగ్గల్
2) వీరేంద్ర సింగ్, డాక్టర్ ఎన్ఆర్ మాధవ మీనన్
3) అమరేష్ బాగీచి 4) పై వారందరూ
25. ఈశాన్య రాష్ర్టాల మండలికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) భారత పార్లమెంట్ ఈశాన్య రాష్ర్టాల మండలి చట్టం-1971 ప్రకారం 1972లో ఏర్పాటైంది
2) ఈశాన్య రాష్ర్టాల మండలిలో మొదట ఏడు రాష్ర్టాలు ఉండేవి
3) ఈశాన్య రాష్ర్టాల మండలి సవరణ చట్టం 2002 ప్రకారం సిక్కింను మండలిలో చేర్చారు
4) ఈశాన్య రాష్ర్టాల మండలి ప్రధాన కార్యాలయం మణిపూర్‌లో ఉంది
26. కింది వాటిలో ప్రాంతీయ మండళ్లు, వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించి సరికాని జత ఏది?
1) ఉత్తర ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ
2) కేంద్ర ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం అలహాబాద్
3) దక్షిణ ప్రాంతీయ మండలి ప్రధాన కార్యాలయం బెంగళూరు
4) ఈశాన్య రాష్ర్టాల మండలి ప్రధాన కార్యాలయం షిల్లాంగ్
27. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటును తెలియజేస్తుంది?
1) ఆర్టికల్ 261 2) ఆర్టికల్ 262
3) ఆర్టికల్ 263 4) ఆర్టికల్ 264
28. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారాన్ని తెలియజేసే ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 260 2) ఆర్టికల్ 261
3) ఆర్టికల్ 262 4) ఆర్టికల్ 263
29. ‘జాగో బంగ్లా’ అధికార పత్రిక ఏ పార్టీది?
1) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2) ఆల్ ఇండియా తృణముల్ కాంగ్రెస్
3) బహుజన్ సమాజ్ పార్టీ
4) జార్ఖండ్ ముక్తి మోర్చా
30. అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు అనే అంశాన్ని భారత రాజ్యాంగ నిపుణులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) అమెరికా రాజ్యాంగం
2) ఆస్ట్రేలియా రాజ్యాంగం
3) బ్రిటన్ రాజ్యాంగం
4) కెనడా రాజ్యాంగం
31. ‘కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మిగతా అంశాల కంటే ఎక్కువ వివాదానికి గురవుతున్న అంశం ఆర్థిక సంబంధాలే’నని పేర్కొన్న వ్యక్తి?
1) ప్రొఫెసర్ అమల్ రే
2) రంజిత్ సింగ్ సర్కారియా
3) జస్టిస్ పి.వి.రాజమన్నార్
4) వీరప్ప మొయిలీ
32. సంఘటిత నిధి, ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 265 2) ఆర్టికల్ 266
3) ఆర్టికల్ 267 4) ఆర్టికల్ 268
33. ఆగంతుక నిధి గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 266 2) ఆర్టికల్ 267
3) ఆర్టికల్ 268 4) ఆర్టికల్ 265
34. కింది వాటిలో రాజ్యసభకు సంబంధించి సరికాని అంశం ఏది?
1) ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభ నిర్మాణం, ఎన్నిక మొదలైన అంశాలను తెలియజేస్తుంది
2) దేశంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆయా రాష్ర్టాల జనాభా మేరకు నిర్ణయించబడుతుంది
3) రాజ్యసభను అమెరికా సెనేట్‌తో పోల్చవచ్చు
4) దేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర
35. భారత రాజ్యాంగంలో రాజ్యసభ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 88 2) ఆర్టికల్ 89
3) ఆర్టికల్ 90 4) ఆర్టికల్ 91
సమాధానాలు
1-4, 2-3, 3-2, 4-2,
5-4, 6-2, 7-3, 8-4,
9-4, 10-2, 11-2, 12-3,
13-2, 14-2, 15-1, 16-4,
17-3, 18-4, 19-3, 20-3, 21-2, 22-4, 23-3, 24-4, 25-4, 26-3, 27-3, 28-3, 29-2, 30-2, 31-1, 32-2, 33-2, 34-4, 35-2
నరేష్ జాటోత్
లెక్చరర్
సిద్ధార్థ డిగ్రీ పిజి కళాశాల
నల్లగొండ.
8247887267
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు