Indian Polity | ‘స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ?
జూన్ 12 తరువాయి
36. పంచాయతీ వ్యవస్థను ‘ప్రజాస్వామ్య పాఠశాల, వాస్తవ స్వరాజ్’గా పేర్కొన్నది ఎవరు?
1) మహాత్మాగాంధీ
2) జవహర్లాల్ నెహ్రూ
3) మెట్కాఫ్
4) లార్డ్ రిప్పన్
37. అశోక్ మెహతా కమిటీ (1978) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరికానివి ఏవి?
ఎ. జిల్లా స్థాయిలో ఆడిట్ చేయాలి
బి. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా సీట్లను రిజర్వ్ చేయాలి
సి. గ్రామ పంచాయతీలను రద్దు చేయాలి
డి. జిల్లా పరిషత్లను క్రమంగా రద్దు చేయాలి
1) ఎ, బి, సి 2) ఎ, సి
3) బి, సి 4) డి
38. ఏ కమిషన్ సిఫారసుల ప్రకారం దేశంలో సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1) వి.టి. కృష్ణమాచారి కమిషన్
2) బల్వంతరాయ్ మెహతా కమిటీ
3) అశోక్ మెహతా కమిటీ
4) పైవేవీ కావు
39. గ్రామ పంచాయతీ/మండల పరిషత్తు (లేదా) జిల్లా పరిషత్తు నిధులతో నిర్మాణాలు చేపట్టుటకు, రెండు గ్రామాలు (లేదా) పంచాయతీరాజ్ సంస్థల మధ్య వచ్చే వివాదాల పరిష్కారానికి ఉమ్మడి కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించేది ఎవరు?
1) మండల పరిషత్ అభివృద్ధి అధికారి
2) పంచాయతీ కార్యదర్శి
3) సర్పంచ్
4) మండల పరిషత్ ప్రెసిడెంట్
40. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ‘రిప్పన్ తీర్మానం’ ఎప్పుడు చేశారు?
1) 1882 మే 18
2) 1882 జూన్ 18
3) 1884 మే 18 4) 1882 ఏప్రిల్ 18
41. స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఎన్నికలు నిర్వహించేది?
1) భారత ఎన్నికల సంఘం
2) రాష్ట్ర ఎన్నికల కమిషన్
3) జిల్లా కలెక్టర్
4) పంచాయతీరాజ్ శాఖ
42. కింది వాటిలో పంచాయతీ వ్యవస్థ ఉద్దేశం కానిది ఏది?
1) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
2) భాగస్వామ్య ప్రజాస్వామ్యం
3) స్థానిక నాయకత్వాన్ని పెంపొందించటం
4) సామాజిక న్యాయాన్ని అందించడం
43. గ్రామసభకు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) నిర్ణీత కోరం ఉండదు
2) సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి
3) గ్రామసభకు సర్పంచ్ (లేదా) ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
4) పైవన్నీ
44. కింది వాటిలో పంచాయతీల విధి కానిది ఏది?
1) పారిశుద్ధ్య నిర్వహణ
2) విద్యుచ్ఛక్తి
3) శ్మశానాల నిర్వహణ
4) పర్యావరణ పరిరక్షణ
45. మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏది?
1) గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్
2) గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్
3) గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్
4) పైవేవీ కావు
46. ‘స్థానిక సంస్థలు అనేవి విఫలమైన భగవంతుడు కాదు’ అని పేర్కొన్న కమిటీ?
1) అశోక్ మెహతా కమిటీ
2) జి.వి.కె. రావు కమిటీ
3) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ
4) పైవేవీ కావు
47. మండల పరిషత్ అధ్యక్షుడిని ఏ విధంగా ఎన్నుకుంటారు?
1) ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు
2) మండల పరిషత్ సభ్యులు ఎన్నుకుంటారు
3) మండల పరిషత్కు ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు
4) మండలంలోని సర్పంచులందరూ కలిసి ఎన్నుకుంటారు
48. 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1993 జూన్ 1
2) 1992 ఏప్రిల్ 24
3) 1992 జూన్ 1
4) 1993 ఏప్రిల్ 24
49. కింది వాటిలో పంచాయతీల కాల పరిమితిని 4 సంవత్సరాలుగా సిఫారసు చేసిన కమిటీ?
1) బల్వంతరాయ్ మెహతా కమిటీ
2) అశోక్ మెహతా కమిటీ
3) ఎల్.ఎం. సింఘ్వి కమిటీ
4) పైవేవీ కావు
50. రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 1/3 వంతు నిధులను స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేటాయించాలని సూచించిన కమిటీ?
1) అశోక్ మెహతా కమిటీ
2) ఎల్.ఎం. సింఘ్వి కమిటీ
3) జి.వి.కె. రావు కమిటీ
4) వి.కె.ఆర్.వి. రావు కమిటీ
సమాధానాలు
36. 2 37. 4 38. 1 39. 1
40. 1 41. 2 42. 4 43. 4
44. 2 45. 1 46. 1 47. 3
48. 4 49. 2 50. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు