రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఎంత కాలంలోగా ఎన్నిక నిర్వహించాలి? (పాలిటీ)
1. రాష్ట్రపతి ఎన్నిక విధానంలో అనుసరించే సూత్రాన్ని గుర్తించండి?
ఎ) ఏకరూపతా సూత్రం, సౌమ్యతా సూత్రం
బి) ఏకరూపతా సూత్రం, ప్రాతినిధ్య సూత్రం
సి) ప్రాతినిధ్య సూత్రం, సౌమ్యతా సూత్రం
డి) ప్రాతినిధ్య సూత్రం
2. 1974లో ఏ రాష్ట్ర శాసనసభ రద్దు అయినప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను యథావిధిగా నిర్వహించారు?
ఎ) తమిళనాడు బి) మధ్యప్రదేశ్
సి) ఉత్తర ప్రదేశ్ డి) గుజరాత్
3. కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ సభ్యుని ఓటు విలువ దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది
2) రెండవ ప్రాధాన్యతా ఓట్ల బదిలీ ద్వారా వి.వి. గిరి రాష్ట్రపతిగా గెలుపొందారు
3) సి.డి దేశ్‌ముఖ్ మొదటి ప్రాధాన్యతా ఓటు బదిలీ ద్వారా ఫకృద్ధీన్ అలీ అహ్మద్ రాష్ట్ర పతిగా ఎన్నికయ్యారు.
4) రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్ర పతికి సమర్పిస్తారు
ఎ) 1, 2 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 2, 3, 4
4. రాష్ట్రపతి పదవీకాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి పదవిని చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్లు పదవిలో కొనసాగుతారు.
2) రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తే పదవికి ఖాళీ ఏర్పడుతుంది
3) రాష్ట్రపతి తన పదవీకాలం ముగిసినప్పటికీ కొత్త రాష్ట్రపతి పదవిలోకి వచ్చేంత వరకూ పదవిలో కొనసాగవచ్చు
4) రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగవచ్చు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 3, 4
5. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టవచ్చు?
ఎ) ఒక్కసారి మాత్రమే
బి) రెండుసార్లు మాత్రమే
సి) మూడుసార్లు మాత్రమే
డి) ఎన్నిసార్లయినా
6. రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) భారతదేశ పౌరుడై ఉండాలి
2) 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి
3) కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు
4) దివాళాకోరై ఉండకూడదు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 2, 3, 4
7. రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని ఎంత మంది సభ్యులు ప్రతిపాదించి, ఎంతమంది సభ్యులు బలపరచాలి?
ఎ) 30 మంది సభ్యులు ప్రతిపాదించి, 30 మంది సభ్యులు బలపరచాలి
బి) 40 మంది సభ్యులు ప్రతిపాదించి, 40 మంది సభ్యులు బలపరచాలి
సి) 50 మంది సభ్యులు ప్రతిపాదించి, 50 మంది సభ్యులు బలపరచాలి
డి) 100 మంది సభ్యులు ప్రతిపాదించి 100 మంది సభ్యులు బలపరచాలి
8. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతోపాటు ఎంత మొత్తాన్ని రిజర్వు బ్యాంకులో ధరావత్తు (డిపాజిట్) చేయాలి?
ఎ) రూ.15,000/- బి) రూ.25,000/-
సి) రూ.50,000/- డి) రూ.100,000/-
9. రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్ నందు వీరి జీతభత్యాలు పేర్కొన్నారు
2) వీరి జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు
3) వీరి జీతభత్యాలను కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది
4) పదవిలో ఉన్నంత కాలం వీరి జీతభత్యాలను తగ్గించరాదు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 4
10. రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ. 5 లక్షలు
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో కూడా వీరి జీతభత్యాలను తగ్గించరాదు
3) వీరి జీత భత్యాలపై ఇన్‌కం ట్యాక్స్ ఉండదు
4) వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
11. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏక కాలంలో ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
డి) రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
12. రాష్ట్రపతి పదవికి గల సౌకర్యాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) రాష్ట్రపతిపై క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు
బి) పదవిలో ఉన్న రాష్ట్రపతిని అరెస్ట్ చేయరాదు
సి) పదవీకాలంలో చేపట్టిన పనులు/ చర్యలకుగాను ఏ న్యాయస్థానానికి బాధ్యులు కాదు
డి) పదవీ విరమణ అనంతరం మాత్రమే పదవీ కాలంలో చేపట్టిన పనులకు బాధ్యత వహిస్తారు
1) 1, 2, 3 2) 1, 3, 4
3) 2, 3, 4 4) 1, 2, 3, 4
13. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పదవీబాధ్యతలను చేపట్టే సమయంలో ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి?
ఎ) లోక్ సభ స్పీకర్ బి) రాజ్యసభ చైర్మన్
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా
14. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి (Impeachment motion) సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఈ విధానాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు
2) ఈ తీర్మానాన్ని ముందుగా లోక్‌సభలో ప్రవేశ పెట్టాలి
3) ఈ తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశ పెట్టాలి
4) ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 4 డి 1, 3, 4
15. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) ఈ తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసుతో లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి తెలియజేయాలి
2) ఈ తీర్మానాన్ని ఆమోదించే విషయంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే తీర్మానం వీగిపోతుంది.
3) ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి పదవిని కోల్పోతారు
4) ఈ తీర్మానాన్ని రాష్ట్రపతి సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) 2, 3, 4
16. రాష్ట్రపతి పదవి రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్‌కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 56 i) పదవీకాలం
బి) ఆర్టికల్ 57 ii) మహాభియోగ తీర్మానం
సి) ఆర్టికల్ 58 iii) రాష్ట్రపతి పదవిని తిరిగి చేపట్టేందుకు గల అవకాశం
డి) ఆర్టికల్ 61 iv) అర్హతలు – నిబంధనలు
ఎ) ఎ-i, బి- iii, సి- iv, డి- ii
బి) ఎ-i, బి- iii, సి- ii, డి- iv
సి) ఎ-ii, బి- iii, సి- iv, డి- i
డి) ఎ-iii, బి- ii, సి- iv, డి- i
17. రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఎంతకాలంలోగా ఎన్నిక నిర్వహించి సంబంధిత ఖాళీని భర్తీ చేయాలి?
ఎ) 3 నెలల్లోగా బి) 4 నెలల్లోగా
సి) 6 నెలల్లోగా డి) 12 నెలల్లోగా
18. రాష్ట్రపతి పదవికి సంబంధించిన ఎన్నికల వివాదాలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు విచారిస్తుంది?
ఎ) ఆర్టికల్ 59 బి) ఆర్టికల్ 60
సి) ఆర్టికల్ 69 డి) ఆర్టికల్ 71
19. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’లో ఖాళీలు ఉన్నప్పటికీ రాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించవచ్చునని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?
ఎ) వి.ఎన్.ఖరే Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
బి) జగ్జీత్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
సి) పీపుల్స్ లిబరేషన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
డి) కె.ఎల్. సిన్హా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
20. రాష్ట్రపతి పదవికి సంబంధించిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి నివాసం న్యూఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్
2) హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వేసవికాల విడిది ఉన్నది
3) తెలంగాణలోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నది
4) మహారాష్ట్రలోని విదర్భలో ప్రత్యేక నివాసం ఉన్నది
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) 1, 2, 3
21. రాష్ట్రపతి ఎన్నికల వివాదాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఎన్నిక ముగిసిన తేదీ నుంచి 30 రోజుల్లోగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి
2) ఎన్నిక వివాదంపై పిటిషన్ వేయాలంటే ఎలక్టోరల్ కాలేజీలోని కనీసం 20 మంది సభ్యులు సంతకాలు చేయాలి
3) రాష్ట్రపతిగా ఎన్నికైన వి.వి. గిరి తన ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టుకు హాజరయ్యారు
4) రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నది
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 2, 3, 4
22. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల్లో ఆర్టికల్ 75(1) ప్రకారం రాష్ట్రపతిగా ఎవరిని నియమిస్తారు?
ఎ) ప్రధానమంత్రి, మంత్రి మండలి సభ్యులను నియమిస్తారు
బి) రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు
సి) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను నియమిస్తారు
డి) విదేశీ రాయబారులను నియమిస్తారు
23. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 53 – దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరుమీదుగా నిర్వహించాలి
2) ఆర్టికల్ 76 – అటార్నీ జనరల్‌ను నియమిస్తారు
3) ఆర్టికల్ 155 – రాష్ట్రాల గవర్నర్లను నియమిస్తారు.
4) ఆర్టికల్ 125 – యూపీఎస్సీ చైర్మన్, సభ్యులను నియమిస్తారు.
1) 1, 3, 4 2) 1, 2, 4
3) 1, 2, 3 4) 1, 2, 3, 4
24. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి నియమించే రాజ్యాంగ పదవులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 124 – సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు
2) ఆర్టికల్ 217 – హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు
3) ఆర్టికల్ 148 – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
4) ఆర్టికల్ 239 – కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు
ఎ) 1, 2, 4 బి) 1, 2, 3, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
25. రాష్ట్రపతి నియమించే పదవులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1) లోక్‌పాల్‌కు చైర్మన్, సభ్యులు
2) జాతీయ మహిళా కమిషన్‌కు చైర్మన్, సభ్యులు
3) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యులు
4) పరిపాలనా ట్రిబ్యునల్‌కు చైర్మన్, సభ్యులు
26. రాష్ట్రపతితో నియమితమయ్యే రాజ్యాంగ పదవులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 280- కేంద్ర ఆర్థిక సంఘానికి చైర్మన్, సభ్యుల నియామకం
బి) ఆర్టికల్ 262- కేంద్ర జలవనరుల సంఘం ఏర్పాటు
సి) ఆర్టికల్ 263 – అంతరాష్ట్ర మండలి ఏర్పాటు
డి) ఆర్టికల్ 324- కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4
సి) 1, 2, 3 డి) 2, 3, 4
27. భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఏ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు?
ఎ) జాతీయ మానవ హక్కుల కమిషన్
బి) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
సి) జాతీయ షెడ్యుల్డ్ కులాల కమిషన్
డి) జాతీయ మహిళా కమిషన్
28. రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338(A) ప్రకారం ఏ కమిషన్‌కు చైర్మన్, సభ్యులను నియమిస్తారు?
ఎ) జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
బి) జాతీయ సమాచార కమిషన్
సి) జాతీయ మైనార్టీ కమిషన్
డి) జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్
29. భారత రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు
2) ఆర్టికల్ 85 ప్రకారం లోక్‌సభను రద్దు చేస్తారు
3) ఆర్టికల్ 86 ప్రకారం రాజ్యసభను రద్దు చేస్తారు
4) ఆర్టికల్ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
30. పార్లమెంటు సమావేశాలు లేనపుడు ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవితకాలాన్ని గుర్తించండి?
ఎ) పార్లమెంటు సమావేశమైన 6 వారాలు
బి) పార్లమెంటు సమావేశమైన 3 వారాలు
సి) పార్లమెంటు సమావేశమైన 2 వారాలు
డి) పార్లమెంటు సమావేశమైన 1 వారం
జవాబులు
1-ఎ 2-డి 3-సి 4-ఎ 5-డి 6-ఎ 7-సి 8-ఎ 9-డి 10-సి 11-బి 12-ఎ 13-సి 14-సి 15-బి 16-ఎ 17-సి 18-డి 19-ఎ 20-డి
21-బి 22-ఎ 23-సి 24-బి 25-సి 26-ఎ 27-సి 28-ఎ 29-డి 30-ఎ
సత్యనారాయణ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు