భూమిపై ఎన్ని మిలియన్ ట్రిలియన్ గ్యాలన్ల నీరు ఉంది?
నైతిక విలువలు
1. ఏ దేశ రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైన, వివరణాత్మకమైన రాజ్యాంగం?
1) అమెరికా 2) రష్యా
3) భారతదేశం 4) చైనా
2. భారత రాజ్యాంగం అధికారికంగా ఎప్పుడు అమలులోకి వచ్చింది?
1) 1950, జనవరి 26
2) 1949, జనవరి 26
3) 1953, జనవరి 26
4) 1956, ఆగస్టు 15
3. భారత రాజ్యాంగ పరిషత్తు ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 1944 2) 1945
3) 1946 4) 1948
4. సామ్యవాద, లౌకిక అనే పదాలను ఏ సంవత్సరంలో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1) 1972 2) 1973
3) 1974 4) 1976
5. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను 1976లో రాజ్యాంగంలో చేర్చారు?
1) 40 2) 42 3) 44 4) 46
6. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) కెనడా 2) ఆస్ట్రేలియా
3) అమెరికా 4) సోవియట్ యూనియన్
7. అశోక చక్రవర్తి ఎక్కడ ప్రతిష్ఠించిన సింహ స్థూపం నుంచి మన జాతీయ చిహ్నాన్ని స్వీకరించారు?
1) సారనాథ్ 2) సాంచీ
3) అమరావతి 4) ఎరగుడి
8. జాతీయ చిహ్నాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు అమలులోకి తెచ్చింది?
1) 1950, జనవరి 12
2) 1950, జనవరి 26
3) 1953, అక్టోబర్ 3
4) 1956, జనవరి 26
9. ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ వారికి సహాయం చేయాలనే ప్రేరణను కలుగజేసేది?
1) గౌరవించడం 2) క్షమాగుణం
3) కరుణ 4) ధైర్యం
10. కరుణ అనే పదం ఏ భాషలోని సహవేదన అని అర్థం?
1) సంస్కృతం 2) లాటిన్
3) ఫ్రెంచ్ 4) గ్రీకు
11. మర్యాద అనే పదం పాత ఫ్రెంచ్ భాషలోని ఏ పదం నుంచి వచ్చింది?
1) కోర్టియస్ 2) సత్
3) సహావేదన 4) పైవన్నీ
12. మర్యాద అనే భావాన్ని సంస్కృత భాషలోని ఏ పదం ద్వారా వివరించడం జరిగింది?
1) కారుణ్య 2) దాక్షిణ్య
3) అనూహ్య 4) పైవన్నీ
13. పరిగణన లేదా పట్టించుకోవడం అంటే?
1) ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం
2) ఇతరుల అవసరాలను గుర్తించడం
3) ఇతరులను గౌరవించడం
4) పైవన్నీ
14. తనకు కీడును తలపెట్టిన వ్యక్తిపట్ల ప్రతీకార భావన లేకుండా అతని క్షేమాన్ని కోరుకునే భావాన్ని ఏమంటారు?
1) సంతుష్టి 2) కరుణ
3) నిరాడంబరత 4) క్షమాగుణం
15. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) ఢిల్లీ 4) చెన్నై
16. భారత రాజ్యాంగంలో మొదట ఎన్ని నిబంధనలు ఉండేవి?
1) 295 2) 343
3) 385 4) 395
17. రాజ్యాంగంలో మొదట ఎన్ని షెడ్యూళ్లు ఉండేవి?
1) 6 2) 8 3) 10 4) 12
18. ‘ఏ విధంగా చూసినా కుటుంబం అనేది మన గతానికి సంబంధాన్ని కలిగి ఉండి మన భవిష్యత్తుకు వారధిగా ఉంటుంది’ అని అన్నది?
1) కన్ఫ్యూషియస్ 2) గాంధీజీ
3) మార్టిన్ లూథర్ కింగ్
4) అలెక్స్ హాలె
19. భారత ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలులోకి తెచ్చింది?
1) 1951 2) 1955
3) 1961 4) 1965
20. ‘ప్రపంచాన్ని సక్రమంగా ఉంచాలంటే దేశాన్ని సక్రమంగా ఉంచాలి, దేశాన్ని సక్రమంగా ఉంచాలంటే మొదటగా కుటుంబాన్ని
సక్రమంగా ఉంచాలి’ అన్నది ఎవరు?
1) కన్ఫ్యూషియస్ 2) అలెక్స్ హాలె
3) లార్డ్ బాడెన్ పొవెల్
4) ఏపీజీ అబ్దుల్ కలామ్
21. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత ఏ సంవత్సరంలో స్త్రీలకు సమాన ఓటు హక్కు అందించడంతో పాటు ఎన్నికల్లో పోటీచేసే హక్కును కల్పించారు?
1) 1950 2) 1951
3) 1952 4) 1961
22. జాతీయ సగటుతో పోలిస్తే ఏ రాష్ట్రంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి తక్కువగా ఉంది?
1) బీహార్ 2) హర్యానా
3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్
23. 2011లోని జనాభా లెక్కల ప్రకారం పురు-షులు, స్త్రీల జాతీయ సరాసరి నిష్పత్తి ఎంత?
1) 1000 : 943 2) 1000 : 960
3) 1000 : 970 4) 1000 : 980
24. నిర్భయ చట్టం ఏ సంవత్సరంలో రూపొందిం-చారు?
1) 2010 2) 2011
3) 2012 4) 2013
25. వరకట్న దురాచారాన్ని గృహ హింసను నివారించడానికి, అరికట్టడానికి భారతీయ శిక్షాస్మృతిలో ఏ సెక్షన్‌కు పటిష్టమైన
చట్టాలను చేయడం జరిగింది?
1) 498 (ఎ) 2) 442 (ఎ)
3) 436 4) 426
26. కులం అనే పదం పోర్చుగీసు భాషలోని ఏ పదం నుంచి వచ్చింది?
1) కోర్టియస్ 2) కాస్టా
3) సత్ 4) పైవన్నీ
27. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి?
1) కేరళ, తమిళనాడు
2) గుజరాత్, పాండిచ్చేరి
3) మధ్యప్రదేశ్, ఢిల్లీ
4) కేరళ, పాండిచ్చేరి
28. భారతదేశంలో ఎన్ని కులాలు, ఉపకులాలు ఉన్నాయి?
1) రెండు వేలకు పైగా
2) మూడు వేలకు పైగా
3) నాలుగు వేలకు పైగా
4) అరు వేలకు పైగా
29. సంస్కృత భాషలో వర్ణం అంటే?
1) రంగు 2) ఆకులు
3) చెట్లు 4) పైవన్నీ
30. మానవ జాతిని అభివృద్ధి చేసే అన్ని రకాల శ్రమలు, గౌరవాన్ని, ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అందువల్ల అన్ని రకాల శ్రమలను ఉత్తమమైనవిగా భావించి నిర్వహించాలి అన్నది ఎవరు?
1) అలెక్స్ హాలె
2) కన్ఫ్యూషియస్
3) మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్
4) అంబేద్కర్
31. అమెరికాకు అబ్రహం లింకన్ ఎన్నో అధ్యక్షుడు?
1) 12 2) 13 3) 14 4) 16
32. జాతీయ విద్యార్థి సైనిక దళం ఎప్పుడు పార్లమెంట్ చట్టం ద్వారా అమలులోకి వచ్చింది?
1) 1948, జూలై 6
2) 1956, జనవరి 15
3) 1959, అక్టోబర్ 2
4) 1969, ఫిబ్రవరి 52
33. రోసా పార్క్ అనే నల్లజాతి వనిత ఏ సంవత్సరంలో తెల్లజాతి వ్యక్తి కోసం బస్సులో తాను కూర్చున్న సీటును వదులుకోవడానికి నిరికరించడమనే విషయం దేశవ్యాప్తంగా జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి దారితీసింది?
1) 1955 2) 1956
3) 1957 4) 1958
34. ఆడశిశువులను వదిలివేయడం లేదా గొంతులో వడ్ల గింజవేసి ఊపిరాడకుండా చేసి చంపడం వంటి దారుణ సంఘటనలకు చలించిన తమిళనాడు ప్రభుత్వం ఊయలలో పాప పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1) 1990 2) 1991
3) 1992 4) 1994
35. 37 విశ్వవిద్యాలయాల్లో జాతీయ సేవా పథకాన్ని ప్రారంభించిన 1969లో ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు?
1) డా. వీకేఆర్‌వీ రావు
2) పీవీ నరసింహారావు
3) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
4) సర్వేపల్లి రాధాకృష్ణ
36. లార్డ్ బాడెన్ పావెల్ ఏ సంవత్సరంలో కొద్దిమంది బాలలతోనే స్కౌట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1) 1905 2) 1906
3) 1907 4) 1908
37. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత దేశంలో పనిచేస్తున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ సంఘాలన్నింటినీ ఎవరు సంఘటితం చేశారు?
1) జవహర్లాల్ నెహ్రూ
2) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
3) జాకీర్ స్సేన్ 4) 1, 2
38. భారతదేశంలో కెప్టెన్ టీహెచ్ బాకర్ ఏ సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా మొదటి స్కౌట్స్ దళాన్ని ఏర్పాటు చేసి లండన్‌లో ఇంపీరియల్ ప్రధాన కార్యాలయం వద్ద నమోదు చేయించాడు?
1) 1905 2) 1906
3) 1908 4) 1909
39. ఏ సంవత్సరంలో చివరగా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అనే పేరుతో కేంద్రీకృత సంస్థ ఆవిర్భవించింది?
1) 1945 2) 1947
3) 1948 4) 1950
40. మీకు ఏమి కావాలి, ఎందుకు కావాలి అనే విషయాన్ని కనుగొనండి, ఏది ముఖ్యమో మీరు అవగాహన చేసుకున్న తరువాత, మీ ఆసక్తిని ఉపయోగించి, మీరు ఏదైనా సాధించవచ్చు అని అన్నది ఎవరు?
1) బ్రూక్ గ్రిఫిన్ 2) కన్ఫ్యూషియన్
3) అలెక్స్ హాలె
4) మార్టిన్ లూథర్ కింగ్
41. పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో తెలివైన పద్ధతిలో ఎదుర్కోవడానికి ఉపయోగపడే మానసిక-సాంఘిక నైపుణ్యాలను ఏమంటారు?
1) జీవన నైపుణ్యాలు
2) స్వయం ప్రతిపాదనా నైపుణ్యం
3) సామాజిక నైపుణ్యం
4) ఏదీకాదు
42. జాతీయ హరిత దళం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2000 2) 2001
3) 2002 4) 2004
43. భారతీయ సంప్రదాయంలో ఆవుని ఏమని పిలుస్తారు?
1) ఆవు మాత 2) దూడ మాత
3) గోమాత 4) పైవన్నీ
44. సమర్ధతను, ఉత్పత్తిని పెంపొందించడానికి మనం నిర్దిష్టమైన చర్యలపై ఎంత సమయం వెచ్చిస్తున్నాం అనే దానిపై చేతనావంతమైన నియంత్రణ ప్రణాళిక, ప్రక్రియ కలిగి ఉండే చర్యలను ఏమంటారు?
1) సమయ పాలనా నైపుణ్యం
2) సామాజిక నైపుణ్యం
3) జీవన నైపుణ్యం 4) ఏదీకాదు
45. భారతీయ సంప్రదాయంలో పాముని ఏమని పిలుస్తారు?
1) సర్ప దేవత 2) నాగ దేవత
3) పాము దేవత 4) హయగ్రీవుడు
46. భారతీయ సంప్రదాయంలో గద్దను ఏమంటారు?
1) హయగ్రీవుడు 2) గరుత్మంతుడు
3) మత్యావతారం 4) పైవన్నీ
47. భారతీయ సంప్రదాయంలో గుర్రాన్ని ఏమని పిలుస్తారు?
1) హయగ్రీవుడు 2) వరాహస్వామి
3) గరుత్మంతుడు 4) మత్యావతారం
48. భారతీయ సంప్రదాయంలో వరాహాలను ఏమని పిలుస్తారు?
1) హయగ్రీవుడు 2) గరుత్మంతుడు 3) గోమాత 4) వరాహస్వామి
49. భారతీయ సంప్రదాయంలో చేపను ఏమని పిలుస్తారు?
1) మత్స్యావతారం 2) గంగామాత
3) హయగ్రీవుడు 4) వరాహస్వామి
50. దాదాపు ఎంత శాతం భూ ఉపరితలం నీటితోనే కప్పబడి ఉంది?
1) 60 శాతం 2) 71 శాతం
3) 80 శాతం 4) 81 శాతం
51. భూమిపై ఎన్ని మిలియన్ ట్రిలియన్ గ్యాలన్ల నీరు ఉంది?
1) 226 2) 228 3) 326 4) 328
52. మన చుట్టూ ఉండే గాలిలో నత్రజని ఎంత శాతం ఉంది?
1) 60 శాతం 2) 65 శాతం
3) 70 శాతం 4) 78 శాతం
53. మన చుట్టూ ఉండే గాలిలో ఆమ్లజని ఎంత శాతం ఉంది?
1) 15 శాతం 2) 21 శాతం
3) 35 శాతం 4) 40 శాతం
54. సహజ వనరులు పునరుత్పత్తి కంటే వేగంగా వాటి వినియోగం జరిగితే దాన్ని ఏమంటారు?
1) క్షయం 2) మృత్తిక క్షయం
3) పర్యవేక్షణ ఆవరణ 4) ఏదీకాదు
55. గాలి లేదా నీటి వరద ప్రవాహం వల్ల భూ ఉపరితలంపైన మట్టి, రాళ్లు ఉన్న చోటు నుంచి కదిలి మరో చోట నిలిచిపోవడాన్ని ఏమంటారు?
1) క్షయం 2) మృత్తికా క్షయం
3) భూమి వేడెక్కడం 4) పైవన్నీ
56. ఏ సంవత్సరంలో అమెరికా వియత్నాంతో జరిగిన యుద్ధ సమయంలో అడవుల ఆకులు రాలిపోయేందుకు, ఎండిపోయేందుకు ఏజెంట్ ఆరెంజ్ అనే రసాయనాన్ని ప్రయోగించింది?
1) 1960 2) 1965
3) 1966 4) 1968
57. ‘నదులు, కొలనులు, సరస్సులు, సెలయేళ్లు అవన్నీ వేర్వేరు పేర్లతో పిలిచే అన్నీ నీటిని కలిగి ఉంటాయి. అలాగే మతాలన్నీ వేరైనా అవి సత్యాలను కలిగి ఉంటాయి’ అని పేర్కొన్నది?
1) దలైలామా 2) గాంధీజీ
3) ఏపీజే అబ్దుల్ కలామ్
4) మహ్మద్ ఆలీ
58. ‘ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం, విధేయత, క్షమాగుణం మొదలైన గుణాలను పెంపొందించటమే మతం ప్రయోజనం’ అని పేర్కొన్నది ఎవరు?
1) దలైలామా 2) ఏపీజే అబ్దుల్ కలామ్
3) మహ్మద్ ఇక్బాల్ 4) గాంధీజీ
59. మతం లేకుండా మానవుడు ఔన్నత్యాన్ని పొందలేడు అని నమ్మింది?
1) డా. బీఆర్ అంబేద్కర్
2) డా. సర్వేపల్లి రాధాకృష్ణ
3) ఏపీజే అబ్దుల్ కలామ్
4) జాన్ ఎఫ్ కెనెడీ
జవాబులు
1.3 2.1 3.3 4.4 5.2 6.4 7.1 8.2 9.3 10.2 11.1 12.2 13.4 14.4 15.3 16.4 17.2 18.4 19.3 20.1 21.1 22.2 23.1 24.4 25.1 26.2 27.4 28.2 29.1 30.3 31.4 32.1 33.1 34.3 35.1 36.3 37.4 38.4 39.4 40.1 41.1 42.2 43.3 44.1 45.2
46.2 47.1 48.4 49.1 50.2 51.3 52.4 53.2 54.1 55.2 56.1 57.4 58.1 59.2
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు