హోలీ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/08/Second-battle-of-tarain.jpg)
1. సిజ్ద (సాష్టాంగ ప్రణామం) పైబాస్ (రాజు పాదాలను ముద్దాడుట) వంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్?
1) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
2) మహమ్మద్ బీన్ తుగ్లక్
3) ఇబ్రహీం లోడి
4) ఘియాసుద్దీన్ బాల్బన్
2. కరువు కాటకాలవల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఢిల్లీ సుల్తానులు తీసుకున్న చర్యలేంటి?
ఎ. నిత్యావసర వస్తువులు, విలాస వస్తువుల ధరలను అదుపు చేయడం
బి. లాభదాయకమైన కార్యకలాపాలను అదుపు చేయడం
సి. రైతులకు రుణాలిచ్చారు, నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచారు, కొరత ఏర్పడిన సమయాల్లో ధాన్యాన్ని పంచారు
డి. కాలువల నెట్వర్క్ను విస్తారంగా పెంచి, వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని పెంచారు
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి 4) ఎ, బి, సి, డి
3. లోడీ రాజవంశ స్థాపకుడు?
1) తిముర్ 2) బహలోల్ లోడీ
3) సికిందర్ లోడీ 4) ఇబ్రహీం లోడీ
4. జతపరచండి
1. యూక్లిడ్ ఎ. ప్రిన్సిపుల్ ఆఫ్ జామెట్రీ
2. అమీర్ ఖుస్రో బి. తారిఖ్-ఇ-అలై, ఆష్మీ
3. జియావుద్దీన్ బరౌని సి. ఫత్వా-ఇ- జహంగీర్
4. షంషీ-సిరాజ్-ఆసిఫ్ డి. తజక్-ఇ- ఫిరోజీ షాహీ
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
5. ఐబక్ ఆస్థాన కవి ఎవరు?
1) అమీర్ ఖుస్రో 2) అసఫ్ నిజామి
3) అల్ బెరూని 4) ఇబన్ బటూటా
6. తుగ్లక్ రాజవంశ స్థాపకుడు
1) ఘియాసుద్దీన్ తుగ్లక్
2) మహమ్మద్ బీన్ తుగ్లక్
3) ఫిరోజ్ షా తుగ్లక్
4) పై ఎవరూ కాదు
7. జతపరచండి
1. అమీర్ ఖుస్రో ఎ. నూషిపర్, తుగ్లక్ నామా
2. జియా నక్షబి బి. రతిరహస్య, సుఖ సప్తాసి
3. ఇబన్ బటూటా సి. కితాబ్-ఉల్-రిహ్ల
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
8. జతపరచండి
1. కువ్వత్-ఉల్-ఇస్లాం ఎ. అల్లావుద్దీన్ ఖిల్జీ
2. అలై దర్వాజ బి. కుతుబుద్దీన్ ఐబక్
3. జహపన నగరం సి. మహ్మద్ బీన్ తుగ్లక్
4. బారా గుంజాజ్ మసీదు డి. సికిందర్ లోడీ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
9. బానిస వంశ స్థాపకుడెవరు?
1) బాల్బన్ 2) ఇల్ టుట్ మిష్
3) ఐబక్ 4) రజియాసుల్తాన్
10. బానిస వంశస్థుల పాలనా కాలం?
1) 1192-1260 2) 1260-1290 3) 1206-1280 4) 1200-1300
11. రెండవ తరైన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1191 2) 1206
3) 1292 4) 1192
12. ఢిల్లీ సుల్తానుల వంశాలను వాటి పరిపాలనా కాలక్రమంలో అమర్చండి
ఎ. లోడీ బి. ఖిల్జీ
సి. బానిస డి. తుగ్లక్
1) సి, ఎ, బి, డి 2) సి, బి, డి, ఎ
3) ఎ, డి, బి, సి 4) డి, సి, ఎ, బి
13. కుతుబుద్దీన్ ఐబక్ రాజధాని?
1) ఢిల్లీ 2) లాహోర్
3) అజ్మీర్ 4) పెషావర్
14. బహమనీ సామ్రాజ్య ఆఖరి పాలకుడు
1) నిజాం షా 2) మహమ్మద్ షా
3) కలీమ్ ఉల్లా షా 4) అహమ్మద్ షా
15. ప్రతిపాదన (ఎ): మద్యం తాగడాన్ని, అమ్మకాన్ని ఢిల్లీ నగరంలో అల్లా ఉద్దీన్ ఖిల్జీ నిషేధించాడు
కారణం(ఆర్): అల్లా ఉద్దీన్ ఖిల్జీ ప్రజల నైతిక, మత ప్రమాణాలను వృద్ధి చేయటానికి ప్రయత్నించాడు
1) (ఎ), (ఆర్) నిజం; (ఎ)కు (ఆర్) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం కానీ(ఎ)కి (ఆర్) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
16. బానిస వంశస్థుల గురించి తెలియజేసే గ్రంథం?
1) తారిఖ్-ఇ-హింద్
2) ఖమాన్-ఇ-మసూది
3) కితాబ్-ఇ-హింద్
4) తాజ్-ఉల్-మాతిర్
17. జతపరచండి
1. హసన్ నిజామి ఎ. తబాకత్ నజారీ
2. మిన్హాజ్-ఉల్-సిరాజ్ బి. తాజుల్ మజర్
3. ఇబన్ బటూటా సి. సఫర్ నామా, రిఫ్లద్
4. అమీర్ ఖుస్రో డి. ఖజరా-ఉల్-సదిన్
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
18. భారతదేశంలో మొదటి మసీదు నిర్మించిన వారు?
1) ఫిరోజ్ షా 2) ఇల్-టుట్-మిష్
3) ఆరం షా 4) కుతుబుద్దీన్ ఐబక్
19. జతపరచండి
1. అల్బెరూనీ ఎ. షానామా
2. ఉద్బి బి. తారిఖ్-ఇ-హింద్
3. ఫిరదౌసి సి. తారిఖ్-ఇ-యమిని
4. ఇసామి డి. పుత్-ఉల్-సలాతిన్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
20. ఐబక్ భారతదేశంలో తాను సాధించిన విజయాలకు గుర్తుగా నిర్మించిన కట్టడం ఏది?
1) పురానాఖిల్లా 2) ఫతేపూర్ సిక్రీ
3) కుతుబ్ మీనార్
4) కువ్వత్-ఉల్-ఇస్లాం
21. హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్?
1) ఘియాసుద్దిన్ తుగ్లక్
2) మహమ్మద్ బీన్ తుగ్లక్
3) ఫిరోజ్ షా తుగ్లక్
4) మహమ్మద్ తుగ్లక్
22. జతపరచండి
1. లాల్ గుంబజ్ ఎ. నసీరుద్దీన్ మహ్మద్ తుగ్లక్
2. హౌస్ ఖాస్ బి. అల్లావుద్దీన్ ఖిల్జీ
3. కుతుబ్ మీనార్ సి. కుతుబుద్దీన్ ఐబక్
4. ఎర భవంతి డి. బాల్బన్
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
23. బహమనీ సామ్రాజ్యం విచ్ఛన్నమైన తర్వాత ఏర్పడిన వేర్వేరు ముస్లిం రాజ్యాల లోనిది?
1) ఆదిల్షాహీ రాజ్యం
2) నిజాంషాహీ రాజ్యం
3) కుతుబ్ షాహీ రాజ్యం 4) పైవన్నీ
24. మొదటి మహిళా ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) చాంద్ బీబీ 2) రజియా సుల్తానా
3) నూర్-ఎ-జహాన్
4) ముంతాజ్ మహల్
25. ప్రతిపాదన (ఎ): 14, 15 శతాబ్దంలో ఉత్తర భారతదేశ సూఫీ సాధువులు దక్కన్ ప్రాంతానికి రావడంవల్ల ఈ ప్రాంత రాజకీయ, మత విషయాల్లో లోతైన మార్పులు సంభవించాయి
కారణం (ఆర్): దక్కన్ పీఠభూమి పైకి ఖిల్జీలు, తొలి తుగ్లక్ దండయాత్రలను న్యాయబద్ధం చేయటానికి సూఫీ సాధువులు ఈ ప్రాంతానికి వచ్చారు
1) (ఎ), (ఆర్) నిజం; (ఆర్)కు (ఎ) సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ నిజం కానీ(ఆర్)కి (ఎ) సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కానీ (ఆర్) తప్పు
4) (ఎ) తప్పు కానీ (ఆర్) నిజం
26. జతపరచండి
1. ఇబన్ బటూటా ఎ. పుత్-అస్-సలాటిన్
2. అల్ బెరూని బి. కితాబ్-ఇ-హింద్
3. ఇసామి సి. తుగ్లక్ నామా
4. అమీర్ ఖుస్రూ డి. తాబక్త-ఇ-నసిరి
5. మిన్హాజ్ సిరాజ్ ఇ. కితాబ్-ఉల్-రహ్లా
1) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5
2) ఎ-1, బి-4, సి-5, డి-3, ఇ-2
3) ఎ-5, బి-2, సి-1, డి-3, ఇ-4
4) ఎ-5, బి-2, సి-4, డి-1, ఇ-3
27. ఐబక్ ‘కువ్వత్-ఉల్-ఇస్లాం’ మసీదును ఏ హిందూ దేవాలయం నిర్మూలించి కట్టించాడు?
1) శివ 2) దుర్గ 3) కాళీ 4) విష్ణు
28. ఢిల్లీ సుల్తానుల వంశ క్రమాన్ని తెలపండి
ఎ. తుగ్లక్ బి. బానిస వంశస్తులు
సి. భిల్జీలు డి. లోడీ సుల్తానులు
ఇ. సయ్యద్లు
1) సి, ఎ, బి, ఇ, డి 2) ఇ, బి, డి, ఎ, సి
3) ఎ, బి, సి, డి, ఇ 4) బి, సి, ఎ, ఇ, డి
29. ‘అరై దిన్ జోప్రా’ మసీదును కుతుబుద్దీన్ ఐబక్ ఎక్కడ నిర్మించాడు?
1) న్యూఢిల్లీ 2) లాహోర్
3) అజ్మీర్ 4) సింధూ
30. ‘లాక్బక్ష్’ అనే బిరుదు కలిగిన బానిస సుల్తాన్ ఎవరు?
1) బాల్బన్ 2) ఐబక్
3) ఇల్ టుట్ మిష్ 4) నసీరుద్దీన్ ఖుస్రో
31. ఢిల్లీ సుల్తానత్కు ఆదాయం సమకూర్చినవి ఏవి?
ఎ. ఖరజ్ బి. ఖమ్స్
సి. జిజియా డి. జకత్ ఇ ఉషర్
1. ఎ, బి, సి 2. బి, సి, డి
3. సి, డి, ఇ 4. ఎ, బి, సి, డి, ఇ
32. కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించనది
1) స్లేవ్ సామ్రాజ్యం
2) ఖిల్జీ సామ్రాజ్యం
3) సయ్యద్ సామ్రజ్యం
4) లోడీ సామ్రాజ్యం
33. ఏ సంవత్సరంలో పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీ బాబర్చే ఓడిపోయి చంపబడ్డాడు?
1) 1528 2) 1527
3) 1526 4) 1525
34. ‘పోలో’ ఆట ఆడుతూ గాయపడి మరణించిన బానిసరాజు ?
1) ఐబక్ 2) బాల్బన్
3) ఇల్ టుట్ మిష్ 4) ఆరాంషా
35. వ్యవసాయ పన్నుల పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాన్?
1) ముబారక్ ఖిల్జీ
2) ఘియాసుద్దీన్ తుగ్లక్
3) మహ్మద్ బీన్ తుగ్లక్
4) ఫిరోజ్ షా తుగ్లక్
36. ‘నేను దేవుని నీడను’ అని చెప్పుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) బాల్బన్ 2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) మహ్మద్ బీన్ తుగ్లక్
4) ఫిరోజ్ షా తుగ్లక్
37. తుగ్లక్ సామ్రాజ్య పాలకుల్లో ఉండేవారు?
1) ఫిరోజ్ షా తుగ్లక్
2) మహమ్మద్ బీన్ తుగ్లక్
3) ఘియాసుద్దీన్ తుగ్లక్
4) పైవారందరూ
38. జతపరచండి
1. ఫిరోజ్ షా తుగ్లక్ ఎ. దివాన్-ఇ-ఇస్తియాఖ్
2. అల్లావుద్దీన్ ఖిల్జీ బి. షహ్నయ్-ఇ-మండి
3. ఇల్ టుట్ మిష్ సి. పౌర సర్వీసులు
1) 1-ఎ, 2-సి, 3-బి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
39. ఢిల్లీ సుల్తానులు రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరు?
1) ఐబక్ 2) ఇల్ టుట్ మిష్
3) ఆరాంషా 4) బాల్బన్
40. తుగ్లక్ సామ్రాజ్య స్థాపకుడు?
1) ఫిరోజ్ షా తుగ్లక్
2) మహమ్మద్ బీన్ తుగ్లక్
3) ఘియాసుద్దీన్ తుగ్లక్
4) ఘియాసుద్దీన్ షా-II
41. చిహల్గని ముఠాని ఏర్పాటు చేసినవారు ఎవరు?
1) బాల్బన్ 2) ఇల్ టుట్ మిష్
3) అల్లా ఉద్దీన్ ఖిల్జీ 4) మహ్మద్ బీన్ తుగ్లక్
42. జతపరచండి
1. జిజియా పన్ను ఎ. నాన్-ముస్లిం మీద విధించే పోల్ ట్యాక్స్
2. షిర్చ్ పన్ను బి. యుద్ధంలో కొల్లగొట్టిన సొమ్ము (1/5) వంతు
3. ఖమ్స్ సి. నీటి పారుదలపై పన్ను
4. చరాయి పన్ను డి. ముస్లిం మీద మాత్రమే వేసే మతపరమైన పన్ను
1) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
43. అల్లావుద్దీన్కు దక్షిణ భారతదేశం జయించి అప్పగించిన ప్రసిద్ధ సేనాని ఎవరు?
1) జఫర్ఖాన్ 2) నస్రత్ఖాన్
3) అలాఫ్ఖాన్ 4) మాలిక్కపూర్
44. జతపరచండి
1. ఇల్ టుట్ మిష్ ఎ. దివాన్-ఇ-కోహి
2. బాల్బన్ బి. సిజిద, పైబోస్
3. అల్లావుద్దీన్ ఖిల్జీ సి. ఇక్తా విధానం, చిహల్ గనీ విధానం
4. మహ్మద్ బీన్ తుగ్లక్ డి. దివానీ-ఇ-రియాసత్
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
45. ‘సిరి’ అనే నూతన రాజధానిని నిర్మించింది ఎవరు?
1) తుగ్లక్ 2) బాల్బన్
3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) ఐబక్
జవాబులు
1.4 2.4 3.2 4.3 5.2 6.1 7.2 8.1 9.3 10.2 11.4 12.2 13.2 14.3 15.3 16.4 17.3 18.4 19.1 20.3 21.2 22.4 23.4 24.2 25.3 26.3 27.4 28.4 29.3 30.2 31.4 32.1 33.3 34.1 35.3 36.1 37.4 38.3 39.2 40.3 41.2 42.1 43.4 44.3 45.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు