6 సూత్రాల పథకంలోని అంశాలు
-హైదరాబాద్లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు
-ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ మండలిని రద్దు చేశారు.
-నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియమాకానికి, హాస్పిటల్స్లో అసిస్టెంట్ సర్జన్ స్థాయి వరకు స్థానికులతోనే నియామకం, జోనల్ విధానం ఏర్పాటు.
-ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు పాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు.
-రాష్ట్ర స్థాయి ప్రణాళికా మండలి ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సభా కమిటీల ఏర్పాటు
-పై 5 అంశాలు అమలు చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించడం.
-16వ నిబంధన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి ప్రభుత్వ నియామకాలలో సరైన ప్రాతినిథ్యం లేనప్పుడు రిజర్వేషన్లను కల్పించవచ్చు.
– 16(4) నిబంధనను 1975 లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
-ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ-15 శాతం, ఎస్టీ-7.5 శాతం, ఓబీసీ వర్గాల వారికి 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు.
-16(4A) నిబంధన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడమనే నియమం వివక్షత పరిధిలోకి రాదు.
-16(4) నిబంధనను 85వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చారు.
-16(4B) నిబంధన 16(4), 16(4A) నిబంధనల్లో పేర్కొన్న విధంగా రిజర్వేషన్ల కోటా ప్రకారం భర్తీ కాకపోవచ్చు, అలా భర్తీ చేయకపోతే ఆ ఉద్యోగాలు మరుసటి ఏడాదిలో కలపబడుతాయి. అలాంటి సమయంలో 50% కంటే రిజర్వేషన్లు మించినట్లయితే పరిగణనలోనికి తీసుకోరాదు. దీనిని 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో చేర్చారు.
-16(4) నిబంధన ప్రకారం ఒక సంస్థలో మతవిశ్వాసం ఉంటే ఆ మతానికి చెందిన వారితోనే ఆ సంస్థలో ఉద్యోగులను భర్తీ చేయవచ్చు.
-ప్రభుత్వ ఉద్యోగాల నివాస అర్హతల చట్టాన్ని 1957 లో రూపొందించారు.
-17వ నిబంధన : అంటరానితనం నిషేధం
(Abolition of Untouchbility)
-అస్పృశ్యత నివారణ చట్టాన్ని 1955లో రూపొందించి 1976లో పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా మార్పు చేశారు.
-అస్పృశ్యత అనే పదం మొదటగా ఉపయోగించిన ఆంగ్లేయుడు జే.ఎం. నెస్ఫీల్డ్
-అస్పృశ్యత అనే పదాన్ని ఉపయోగించడం వల్ల ఆ వర్గాల మనోభావాలు దెబ్బతింటాయని.. ఆ పదాన్ని తొలగించాలని మైసూరు హైకోర్టు సూచించింది.
-పౌరహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం.. 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తారు.
-1989లో ఎస్సీ, ఎస్టీ నేర అకృత్యాల నివారణ చట్టం (అట్రాసిటీ) రూపొందించగా 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.
-18 నిబంధన : బిరుదులు కీర్తి చిహ్నాలును నిషేధిస్తుంది.
-సైనిక, విద్యాసంబంధ పురస్కారాలు తప్ప ఏ విధమైన బిరుదులు స్వీకరించరాదు.
ఉదా॥ పరమవీరచక్ర, శౌర్యచక్ర, అశోకచక్ర.
-రాష్ట్రపతి ముందస్తు అనుమతి లేకుండా విదేశాల నుంచి ఇచ్చే బిరుదులు స్వీకరించకూడదు.
-భారతదేశంలో 1954లో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ వంటి అవార్డులను ప్రారంభించారు.
-మధ్యప్రదేశ్ హైకోర్టు భారతరత్నలాంటి బిరుదులను ఇవ్వడం 18 నిబంధన ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగా, 1978లో మొరార్జీదేశాయ్ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ 1980లో తిరిగి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ బిరుదులను పునరుద్ధరించింది.
-1992లో బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ బిరుదులు కావని అవి పురస్కారాలు అని, వాటిని ప్రదానం చేయవచ్చని, అయితే వాటిని పేరుకు ముందుగాని పేరుకు తర్వాతగాని ఉపయోగించరాదని ప్రకటించింది.
-భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీరచక్ర.
-భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం – భారతరత్న.
-పాకిస్తాన్ అత్యున్నత పౌరపురస్కారం – నిషాన్-ఏ-ఇంతియాజ్.
-అమెరికా అత్యున్నత పురస్కారం – కాంగ్రెషనల్ గోల్డ్మెడల్.
-2015 సంవత్సరానికి భారతరత్న గ్రహీతలు:
1. అటల్బిహారీ వాజ్పేయి
2. మదన్మోహన్ మాలవ్య.
చంపకం దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ కేసు (1951)
-వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలో మద్రాస్ ప్రభుత్వం కొన్ని కులాలవారికి సీట్లు రిజర్వుచేస్తూ 1950లో ఉత్తర్వులు జారీ చేసింది.
-చంపకం దొరై రాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా రిజర్వేషన్లు చెల్లవని ప్రకటించింది.
-ఆదేశిక సూత్రాల్లోని 46 నిబంధన ప్రకారం.. రిజర్వేషన్లు ప్రవేశపెట్టామని మద్రాస్ ప్రభుత్వం తెలిపినా కోర్టు అంగీకరించలేదు.
-ఎంఆర్.బాలాజీ వర్సెస్ మైసూర్ (1963), ఇంద్రాసహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (1993) కేసులలో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
-ఇందిరాసహానీ కేసులో సుప్రీంకోర్టు కులాన్ని చట్టబద్ధంగా గుర్తించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు