భారత రాజ్యాంగం – ప్రాథమిక హక్కులు ( గ్రూప్-1,2,3 పాలిటీ )
పాలిటీలోని యూనిట్-2 సిలబస్ చాలా ప్రధానమైంది. ఇందులో ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు, ప్రాథమిక విధులు అనే టాపిక్స్ ఉన్నాయి. ఈ విభాగంలోని అంశాలపై ఆర్టికల్స్, సబ్-ఆర్టికల్స్ బాగా గుర్తుంచుకోవడంతోపాటు సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో ఇచ్చిన తీర్పులను అధ్యయనం చేయాలి. ఇందులోని అంశాలు సమానత్వంతోపాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన రక్షణలను కూడా అవగాహన చేసుకోవాలి.
-హక్కు అంటే కలిగి ఉండటం, విధులు అంటే నిర్వర్తించడం. అవి బాధ్యతలను తెలియజేస్తాయి. వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఉపయోగపడేవి హక్కులు.
-పౌరునిలో దాగి ఉన్న అంతర్గత శక్తి యుక్తులను బయటకు తీసి వ్యక్తుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలే ప్రాథమిక హక్కులు.
-హక్కుల భావన గతిశీలమైనది (Dynamic)
-క్రీ.శ. 1215లో జూన్ 15న ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ మొదటిసారిగా కొన్ని హక్కులను గుర్తించి మాగ్నా కార్టా ప్రకటన చేశాడు. దీనినే మానవ హక్కుల మాగ్నా కార్టా అంటారు.
-ప్రపంచంలోని అన్ని దేశాలకు, మానవ హక్కులకు మాగ్నాకార్టా మూలంగా మారింది.
-ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమైన అమెరికా రాజ్యాంగంలో Bill of Rights రూపంలో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు.
-మన రాజ్యాంగ నిర్మాతలకు అమెరికా రాజ్యాంగంలోని Bill of Rights స్ఫూర్తినిచ్చింది. దీంతో అమెరికా రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని ప్రాథమిక హక్కులను స్వీకరించి రాజ్యాంగంలో 3వ భాగంలో పొందుపర్చారు.
-ఐక్యరాజ్యసమితి 1948, డిసెంబర్ 10న విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన చేసింది. దీంతో డిసెంబర్ 10ని మానవహక్కుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు.
-అమెరికా రాజ్యాంగంలో హక్కులు ప్రకటించారు. కానీ పౌరులకు కల్పించలేదు.
-బ్రిటన్‌లో లిఖిత రాజ్యాంగం లేకపోవడంతో హక్కులు ప్రకటించలేదు.
-1895లో బాలగంగాధర తిలక్ స్వరాజ్య బిల్లులో తొలిసారిగా హక్కుల తీర్మానం ప్రతిపాదించారు.
-1925లో ఐర్లాండ్ దేశానికి చెందిన అనిబిసెంట్ భారత్‌లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించి అందులో బ్రిటన్ 1921లో ఐరిష్ రిపబ్లిక్కు ఇచ్చిన హక్కులనే భారతీయులకు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
-1927లో మద్రాస్ రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో భారతదేశానికి రూపొందించే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని తీర్మానం చేశారు.
-1928లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రూపొందించిన నివేదికలో 19 రకాల ప్రాథమిక హక్కులు భారతీయులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-1931లో కరాచిలో జరిగిన భారతజాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయులకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనా కమిటీల్లో భాగంగా 1947, జనవరి 24న సర్దార్ వల్లబాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కుల కమిటీని, జేబీ కృపలాని అధ్యక్షతన ప్రాథమిక హక్కుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
ఉపసంఘం నివేదికలోని అంశాలు
-న్యాయబద్ధమైన హక్కులు – ప్రాథమిక హక్కులు
-న్యాయబద్ధం కానివి – ఆదేశిక సూత్రాలు
-ప్రాథమిక హక్కుల్లో కేవలం భారతీయులకు మాత్రమే వర్తించే అధికరణాలు 15, 16, 19, 21 (A), 29, 30 నిబంధనలు.
-భారతీయులతోపాటు విదేశీయులకు వర్తించే హక్కులు 14, 20, 21, 23, 25, 27, 28 నిబంధనలు.
-నకారాత్మక హక్కులు: ఇవి ప్రభుత్వం ఏమి చేయకూడదో తెలుపుతూ పరిమితులు విధిస్తాయి. అవి.. 14, 15, 16, 20, 21, 25, 27 నిబంధనలు.
-సహకారాత్మక హక్కులు: ఇవి ప్రభుత్వ బాధ్యతలను తెలుపుతాయి.
ఉదా: 17వ నిబంధన- అంటరానితనం నేరం
24వ నిబంధన- బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన
-భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి 352 నిబంధన ప్రకారం విధించినప్పుడు రాష్ట్రపతి 20, 21 అధికరణాలు తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులను 359 నిబంధన ప్రకారం నిలిపివేయబడుతాయి.
-హక్కులు నిరపేక్షమైనవి కావు, పరిమితమైనవి. ప్రతి హక్కు అమలుకు మినహాయింపులు ఉంటాయి.
ప్రాథమిక హక్కుల వర్గీకరణ
-1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలోని 3వ భాగంలో 12వ నిబంధన నుంచి 35వ నిబంధన వరకు 7 ప్రాథమిక హక్కులను పొందుపర్చారు.
-1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాం గ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం వల్ల ప్రస్తుతం 6 రకాల ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి.
-ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి రాజ్యాంగంలోని 12వ భాగంలో 300 (A) నిబంధనలో చేర్చారు.
-ప్రస్తుతం ఆస్తి హక్కు న్యాయబద్ధమైన, శాసన బద్ధమైన రాజ్యాంగపరమైన సాధారణ హక్కు మాత్రమే.
-జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగా అమల్లో ఉంది.
ప్రాథమిక హక్కులు
-సమానత్వపు హక్కు – 14 నుంచి 18 అధికరణాలు
-స్వాతంత్య్రపు హక్కు – 19 నుంచి 22 అధికరణాలు
-పీడనాన్ని నిరోధించే హక్కు- 23, 24 అధికరణాలు
-మత స్వాతంత్య్రపు హక్కు- 25 నుంచి 28 అధికరణాలు
-విద్యా విషయక, సాంస్కృతిక హక్కు- 29, 30 అధికరణలు
-రాజ్యాంగ పరిరక్షణ హక్కు- 32వ అధికరణ
-ప్రాథమిక హక్కుల్లోని 12, 13, 33, 34, 35 నిబంధనలు ప్రాథమిక హక్కులకు అనుబంధంగా వివరణ ఇస్తాయి. అవి..
-12వ నిబంధన: రాజ్యానికి నిర్వచనాన్ని తెలుపుతుంది.
-రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అని అర్థం.
-1951లో సుప్రీంకోర్టు షామ్ దాసని Vs సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయే తప్ప ప్రయివేట్ కంపెనీలకు వర్తించవని తీర్పునిచ్చింది.
-1964లో సుప్రీంకోర్టు.. రాజస్థాన్ ఎలక్ట్రిసిటీ బోర్డు Vs మోహన్ లాల్ కేసులో వర్సిటీలు, ఎల్ఐసీ, సహకార సంస్థలు, ఓఎన్జీసీ, ఐఎఫ్‌సీ, బీపీసీఎల్ లాంటి సంస్థలు కూడా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని ప్రకటించింది.
-సుఖ్‌దేవ్ సింగ్ Vs భగత్రాయ్ (1975) కేసులో సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ), పారిశ్రామిక ఆర్థిక కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ)లు రాజ్యం లో భాగమని సుప్రీంకోర్టు ప్రకటించింది.
13వ అధికరణం
-ప్రాథమిక హక్కులను హరించే శాసనాలు చెల్లవు
-13 (1) నిబంధన: భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు, ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లయితే అవి చెల్లవు.
-13 (2) నిబంధన: ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు చెల్లవు. అవి న్యాయస్థానానికి ఉన్న అధికారాన్ని తెలియచేస్తుంది.
-భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా న్యాయసమీక్ష అధికారం అనే పదం లేకపోయినా పరోక్షంగా న్యాయస్థానాలిచ్చిన పలు తీర్పుల ప్రకారం అమల్లో ఉన్నాయి.
-13 (3) నిబంధన: శాసనం (LAW) అనే పదానికి పర్యాయపదాలను పొందుపర్చారు. అవి.. ఆర్డినెన్స్, ఆర్డర్ (ఉత్తర్వు), బైలాస్ (ఉపనియమం), రూల్ (నియమం), రెగ్యులేషన్, నోటిఫికేషన్ (ప్రకటన)
-భారత దేశంలో ఆచారాలు (Cousframs), వాడుకలు (Usages) అమల్లో ఉన్నాయి.
-13 (4) నిబంధన: 368 నిబంధన ప్రకారం భారత రాజ్యాన్ని సవరణ చేసే సమయంలో 13వ నిబంధన అవరోధం కాదు.
-13 (4) నిబంధనను 1974లో 34 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
-అంబికా మిల్స్ VS గుజరాత్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు గ్రహణ సిద్ధాంతాన్ని (Post- Constitution Laws) రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలకు రూపొందించబడిందని తన తీర్పులో ప్రకటించింది.
33 వ అధికరణం
-ప్రాథమిక హక్కులకు రక్షణ దళాలకు నిరాకరించే అధికారం పార్లమెంట్‌కు ఉంది.
-1984లో 50వ రాజ్యాంగ సవరణ ద్వారా దీని పరిధిని పెంచారు.
-సాయుధ దళాల వారి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చట్టాలు చెల్లవని భారత పార్లమెంట్ చట్టాన్ని రూపొందించవచ్చు.
34 వ అధికరణం
-మార్షల్ లా ఉంటే ప్రాథమిక హక్కులు అమల్లో ఉం డవు. మార్షల్ లా అంటే సైనిక శాసనం
-సైనిక చట్టం ప్రకటించిన సమయంలో సైనిక బలగాలు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం సంభవిస్తే వారి చర్యలకు బాధ్యులను చేయడానికి వీలులేదు. పార్లమెంట్ చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది.
-మార్షల్ లా అమల్లో ఉన్న సందర్భంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించరాదు.
ఉదా: 1958 సాయుధ దళాలు ప్రత్యేక అధికార చట్టానికి వ్యతిరేకంగా మణిపూర్‌లో ఇరోమ్ షర్మిళ ఉద్యమం చేస్తోంది.
35 వ అధికరణం
-కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించిన శాసనాలు చేయు అధికారం పార్లమెంట్‌కు ఉంది. అవి..
-16 (3) నిబంధన: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్స్
-32 (3) నిబంధన: రిట్లు జారీ చేసే అధికారాలను కింది న్యాయస్థానాలకు సంక్రమింపచేయడం.
-33 నిబంధన: సైనికులకు ప్రాథమిక హక్కులను తొలగించబడును.
-34 నిబంధన: మార్షల్ లాకు సంబంధించిన అంశాలు
పై అధికరణాలపై శాసననాలు చేసే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు లేదు.
13 వ నిబంధనలోని సిద్ధాంతాలు
గ్రహణ సిద్ధాంతం ( The Doctrine Of Eclipse): రాజ్యాంగం అమల్లోని రాక ముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అయితే ఆ చట్టాలు పూర్తిగా కొట్టివేయబడవు. ఈ చట్టాల అమలును మాత్రమే నిలిపివేస్తారు.(గ్రహణం) అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధం అయితే వాటిని పూర్తిగా రద్దు చేస్తారు.
ఉదా: 1974లో 35 వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్ర హోదా కల్పించి 2(A) అధికరణంగా 10వ షెడ్యూల్‌గా చేర్చి అనంతరం 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు రాష్ట్ర హోదా కల్పిస్తూ 2 (A) అధికరణాన్ని, 10వ షెడ్యూల్‌ను రద్దు చేశారు.
అధికార పృతఃక్కరణ సిద్ధాంతం (The Doctrine Of Severability): శాసన నిర్మాణ శాఖ చేసిన శాసనాలు, కార్వనిర్వాహక శాఖ అమలు చేసిన విధానాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే 13 (1) అధికరణం ప్రకారం చెల్లవు. ప్రాథమిక హక్కులకు విరుద్దమైన అంశాలను చట్టం నుంచి వేరు చేయడానికి వీలుకాకపోతే అప్పుడు ఆ చట్టం మొత్తం రద్దు చేయబడుతుంది. దీనినే డ్రాక్టిన్ ఆఫ్ సెవరబిలిటి అంటారు.
1, 2 సిద్ధాంతాలను సుప్రీంకోర్టు ఎస్పీ గుప్తా VS యూనియన్ ఆఫ్ ఇండియా (1982), సంపత్‌కుమార్ VS యూనియన్ ఆఫ్ ఇండియా (1987) కేసుల తీర్పుల్లో ప్రతిపాదించింది.
ప్రతిషేదించు సిద్ధాంతం (The Doctrine Of Waivers): పౌరులు తమకు ఇష్టమైనా, ఇష్టం లేకపోయినా, అవగాహన ఉన్న, అవగాహన లేకపోయినా తమ హక్కులను వదులుకోవడానికి న్యాయస్థానాలు అనుమతించవు. దీనినే డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటారు.
ఈ సిద్ధాంతం భారతదేశంలోని పౌరులకు వర్తించదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు