భారత రాజ్యాంగం – విశిష్ట లక్షణాలు
దృఢ-అదృఢ లక్షణాల సమ్మేళనం
-భారత రాజ్యాంగ పరిషత్‌లో భారత రాజ్యాం గం దృఢమైనదిగా ఉండాలని ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ పేర్కొన్నారు. దీనికి కారణం పార్లమెంట్లో మెజారిటీ కలిగిన పార్టీ తన ఇష్టప్రకారం రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంటుందని అందుకే దృఢమైన రాజ్యాంగం ఉండాలన్నారు.
-మారుతున్న కాలానికి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉండాలని, సరళించే ప్రక్రియలో సరళత్వం ఉండాలని రాజ్యాంగ పరిషత్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ తెలిపారు.
-దృఢ రాజ్యాంగ పద్ధతి అంటే శాసన వ్యవస్థ ప్రత్యేక పద్ధతిలో సవరణ చేయ డం. సాధారణంగా సమాఖ్య రాజ్యాంగాలన్నీ దృఢ రాజ్యాంగ సవరణ పద్ధతిని అనుసరిస్తాయి.
ఉదా : అమెరికా, స్విట్జర్లాండ్ రాజ్యాంగాలను కఠిన పద్ధతిలో సవరిస్తారు. వాటిని దృఢ రాజ్యాంగాలు అంటారు.
-అదృఢ రాజ్యాంగ అనగా చట్టసభ సాధారణ మెజారిటీతో శాసనాలను రూపొందించవచ్చు.
ఉదా : బ్రిటన్ రాజ్యాంగం
-భారత రాజ్యాంగాన్ని ధృడ-అధృడ రాజ్యాంగాల సమ్మేళనం అంటారు.
-భారత రాజ్యాంగాన్ని 20వ భాగంలోని 368వ నిబంధన ప్రకారం మూడు పద్ధతుల్లో సవరిస్తారు. అవి….
సాధారణ మెజారిటీ పద్ధతి
-సాధారణ మెజారిటీ పద్ధతి అంటే పార్లమెంట్‌లోని ఉభయసభలు వేర్వేరుగా సాధారణ మెజారిటీతో అనగా సభకు హాజరై ఓటువేసిన వారిలో సగానికంటే ఒకరు ఎక్కువ మెజారిటీతో ఆమోదించాలి.
-సభ సమావేశం కావాలంటే కోరం ఉం డాలి. కోరం అంటే సభ సమావేశం కావడానికి ఉండవలసిన కనిష్ఠ సభ్యుల సంఖ్య. అంటే 1/10వ వంతు. సాధారణ పద్ధతిలో కింది అంశాలను సవరణ చేయవచ్చు.
-నూతన రాష్ర్టాలను ఏర్పాటు చేయడం.
-రాష్ర్టాల సరిహద్దుల మార్చడం.
-రాష్ర్టాల పేర్చు మార్చడం.
-పౌరసత్వానికి సంబంధించిన విషయాలను మార్చడం.
-పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల నియోజక వర్గాల పునర్ విభజనను ఆమోదించడం.
-పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను సవరించడం.
-రాష్ర్టాల్లో విధానపరిషత్ ఏర్పాటు, రద్దుకు సంబంధించి అంశాలు.
-కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు
-అధికార భాషకు సంబంధించిన అంశాలు.
-రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్‌కు సంబంధించిన అంశాలను మొదటి పద్ధతిలో సవరణ చేయవచ్చు.
పాక్షిక ప్రత్యేక మెజారిటీ పద్ధతి
-పార్లమెంట్ ఉభయ సభలను వేర్వేరుగా లేదా కలిసి ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రత్యేక మెజారిటీ అంటే 2/3వ వంతు మెజారిటీతో సవరణ చేయాలి.
ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా..
-ప్రాథమిక హక్కులను సవరించడం.
-ఆదేశిక సూత్రాలను సవరించడం.
-ప్రాథమిక విధులను సవరించడం.
దృఢమైన పద్ధతి (ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి)
-దృఢమైన రాజ్యాంగ పద్ధతి అంటే పార్లమెంటులోని ఉభయసభలు 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించిన తర్వా త సగానికంటే ఎక్కువ రాష్ర్టాల శాసన సభల ఆమోదం పొందితేనే రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుంది.
-మూడో పద్ధతి ద్వారా కింది అంశాలను సవరణ చేస్తారు.
-భారత రాష్ట్రపతి అధికారాలు.
-రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలు.
-కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
-సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు అధికారాలు
-రాజ్యసభ నిర్మాణం
-పార్లమెంటు ఆమోదించిన రాష్ర్టాలకు బిల్లు పంపినప్పుడు ఎంతకాలంలోపు ఆమోదించాలి అనే నిబంధన పొందుపర్చలేదు.
-లోక్‌సభ ఆమోదించిన బిల్లు రాజ్యసభకు పంపినప్పుడు లోక్‌సభ రద్దయితే ఆ బిల్లు కూడా రద్దవుతుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వం
-శాసన నిర్మాణశాఖ, కార్యనిర్వాహక శాఖల సంబంధాల ఆధారంగా ప్రభుత్వాలను రెండు రకాలుగా విభజించవచ్చు.
పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
-దేశ కార్యనిర్వాహకశాఖ పార్లమెంటుచే ఏర్పాటు చేయబడి, పార్లమెంటుకు బాధ్యత వహించే ప్రభుత్వం.
-పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించడానికి ముఖ్య కారణం బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను అనుసరించడం వల్ల అది మనకు అంతకు మందు పరిచయం ఉండటమే. దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంతో ఈ పద్ధతి వైపు రాజ్యాంగ నిర్మాతలు మొగ్గు చూపారు.
-అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో మనం కోరే విధంగా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేయాలి. సమష్టి బాధ్యతా సూత్రంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
లక్షణాలు
-మంత్రి మండలి సమష్టిగా దిగువ సభకు బాధ్యత వహిస్తుంది.
-ఒకే పార్టీ లేదా ఒక కూటమికి చెందినవారు మంత్రులుగా ఉంటారు.
-పార్లమెంటరీ వ్యవస్థలో రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి.
-నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి.
-వాస్తవ కార్యనిర్వాహక అధికారి -ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి.
-భారతదేశంలో సార్వజనీన ఓటుహక్కు అందరికీ కల్పించడం వల్ల పార్లమెంటరీ ప్రభుత్వం మనలాంటి దేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి దేశానికి ఉత్తమంగా ఉంటుంది.
–పార్లమెంటుల మాతా అని బ్రిటన్ పార్లమెంట్‌ను అంటారు.
-బ్రిటన్, భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు.
అధ్యక్ష తరహా ప్రభుత్వం
-దేశ కార్యనిర్వాహక శాఖ శాసనసభ నుంచి ఆవిర్భవించక, బాధ్యత వహించకుండా, ప్రజలచే ఏర్పడి ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వం.
ఉదా : అమెరికా, స్విట్జర్లాండ్
-అధ్యక్ష తరహా ప్రభుత్వాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం లభించదు. జవాబుదారితనం తక్కువ.
-భారత రాజ్యాంగ పరిషత్‌లో కేటీ షా మనదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలని వాదించినప్పటికీ మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని స్వీకరించాం.
-పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా తమకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
సార్వజనీన వయోజన ఓటుహక్కు
-భారత రాజ్యాంగం 326 నిబంధన ప్రకారం జాతి, కుల, మత, లింగ, జన్మ విచక్షణలు పాటించకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి సార్వజనీన వయోజన ఓటుహక్కు కల్పించారు.
-రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1988 సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించింది.
-మన రాజ్యాంగం ఒక మనిషికి ఒక ఓటు మనకు ఇచ్చింది. ఇప్పుడు మనం సాధించవలసింది ఒక ఓటు ఒక విలువ అని డా. బీఆర్ అంబేద్కర్ అన్నారు.
-ఓటర్ల ప్రవర్తనపై ప్రజాస్వామ్య విజయం ఆధారపడి ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు