ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టిన కమిషనర్?
1. కింది వాటిలో ప్రాథమిక విధులకు సబంధించి సరైన వాక్యం ?
ఎ. రాజ్యాంగంలో 4(ఏ) భాగంలో 51(ఏ) అధికరణలో చేర్చారు
బి. 1976లో ప్రాథమిక విధులు 10 మాత్రమే ఉండగా, ప్రస్తుతం 11 విధులు కలవు
సి. సర్దార్ స్వరణ్సింగ్ కమిటీ సూచలను అనుసరించి ప్రాథమిక విధులను చేర్చారు
డి. 1977 జనవరి 3న ప్రాథమిక విధులు అమలులోనికి వచ్చినందున ప్రతి ఏడాది జనవరి 3న ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుతున్నారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) సి, డి 4) పైవన్నీ
2. ప్రాథమిక హక్కులు, స్వతంత్ర వ్యవస్థ, ఉపరాష్ట్రపతి ఎన్నిక, న్యాయ సమీక్ష అధికారం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతి తొలగింపు (మహాభియోగ తీర్మానం ద్వారా) అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
1) కెనడా రాజ్యాంగం 2) బ్రిటన్ రాజ్యాంగం
3) అమెరికా రాజ్యాంగం 4) రష్యా రాజ్యాంగం
3. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య -14. ప్రస్తుతమున్న భాషల సంఖ్య-22 . సంతాలీ భాషను ఏ సవరణ ద్వారా 2003లో రాజ్యాంగంలో చేర్చారు?
1) 92వ 2) 21వ 3) 71వ 4) 86వ
4. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితాలు కలవు. కేంద్ర జాబితాలో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న 97 అంశాలు చేర్చగా, ప్రస్తుతం ఎన్ని అంశాలున్నాయి?
1) 61 2) 47 3) 100 4) 99
5. కింది వాటిలో సరైనది ?
ఎ. 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం
బి. 2014 ఫిబ్రవరి 18న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు
లోక్సభ ఆమోదం
సి. 2014 ఫిబ్రవరి 20న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు
రాజ్యసభ ఆమోదం
డి. 2014 మార్చి 1న ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర
1) ఎ 2) బి 3) సి, డి 4) పైవన్నీ
6. 1956లో ఫజల్ అలీ కమిషన్ సూచనల మేరకు దేశంలోని
5 ప్రాంతీయ మండళ్లు ఉండేవి. ప్రస్తుతం ఎన్ని ప్రాంతీయ మండళ్లు ఉన్నాయి?
1) 6 2) 9 3) 8 4) 7
7. ఏ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్ (విలియం బెంటింగ్)గా నియమించారు?
1) 1773 2) 1833 3) 1813 4) 1784
8. సుప్రీంకోర్ట్టు గత తీర్పులన్నింటికీ భిన్నమైన, విరుద్ధమైన తీర్పును ఇవ్వటాన్ని ఏమంటారు?
1) రెట్రాస్పెక్టివ్ 2) ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్
3) లోకస్ స్టండీ 4) అమికస్ క్యూరీ
9. దేశం మొత్తాన్ని 6 ప్రాంతీయ మండళ్లుగా విభజించారు. దక్షిణ ప్రాంత మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెంగళూరు 2) హైదరాబాద్
3) చెన్నై 4) తిరువనంతపురం
10. సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య -31 (30 మంది న్యాయమూర్తులు+ ఒక ప్రధాన న్యాయమూర్తి). మొదటల్లో ప్రధాన న్యాయమూర్తితో సహా ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవారు?
1) 9 2) 5 3) 12 4) 8
11. దేశంలో కఠినమైన ఎన్నికల సంస్కరణలు ప్రవేశపెట్టిన ఎన్నికల కమిషనర్ ఎవరు?
1) జేఎం లింగ్డో 2) టీఎన్ శేషన్
3) టీఎస్ కృష్లమూర్తి 4) వీఎస్ సంపత్
12. అంబేద్కర్ దృష్టిలో చాలా ముఖ్యమైంది?
1) సమానత్వ హక్కు
2) పీడనాన్ని నిరోధించే హక్కు
3) మత స్వాతంత్య్ర హక్కు
4) రాజ్యాంగ పరిహార హక్కు
13. జాతీయ చిహ్నమైన మూడు సింహాల కింద ఉన్న పీఠంలో ఎడమ నుంచి కుడివైపు ఏవి ఉన్నాయి?
1) మూపురం ఉన్న ఎద్దు, అశోకచక్రం, జింక
2) అశోక చక్రం, గుర్రం, మూపురం ఉన్న ఎద్దు
3) జింక, అశోక చక్రం, మూపురం ఉన్న ఎద్దు
4) గుర్రం, అశోక చక్రం, మూపురం ఉన్న ఎద్దు
14. వందేమాతరం గేయం బంకించంద్ర ఛటర్జీ రాయగా, అది తీసుకున్న ఆనంద్మఠ్ అనేది ఒక..?
1) నాటకం 2) జానపద గేయ సంపుటి
3) నాటకం 4) నవల
15. ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచారాన్ని కోరిన వ్యక్తికి ఎంతకాలంలో (కనిష్టంగా, గరిష్టంగా) సమాచారం అందించాలి?
1) 48 గంటల నుంచి 30 రోజులు
2) 30 రోజుల నుంచి 45 రోజులు
3) 24 గంటల నుంచి 30 రోజులు
4) 72 గంటల నుంచి 30 రోజులు
16. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా 86వ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చారు?(2)
1) 2000 2) 2002 3) 2001 4) 1998
జవాబులు
1-4, 2-3, 3-1, 4-3, 5-4, 6-1, 7-2, 8-2, 9-3, 10-4, 11-2, 12-4,13-4,14-4,15-1,16-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు