సలేశ్వర శిలా శాసనాలు ఎక్కడ లభించాయి?
1.క్రీ.శ. 358 నుంచి క్రీ.శ. 569 వరకు సుమారు 210 ఏండ్లు కృష్ణానదికి ఉత్తరంగా ఉన్న తెలంగాణను, ఉత్తరాంధ్రను పరిపాలించారు. వీరి రాజధానులు అమరపురం, ఇంద్రపాలనగరం, దెందులూరు. అమరపురం నేటి మహబూబ్నగర్ జిల్లాలోని
ఏ మండల కేంద్రం ?
1) అచ్చంపేట 2) కొల్లాపూర్
3) అమ్రాబాద్ 4) ఏదీకాదు
2. విష్ణుకుండుల చరిత్రకు ప్రధాన ఆధారాలు శాసనాలు. వారి కాలంలో వేయించిన శాసనాలు, వారి తర్వాతి కాలంలో వేయించిన 8 శాసనాలు కూడా విష్ణుకుండుల చరిత్రను తెలియజేస్తున్నాయి. వీరి కాలంలో వేయించిన శాసనాలెన్ని ?
1) 13 శాసనాలు 2) 12 శాసనాలు
3) 9 శాసనాలు 4) 10 శాసనాలు
3.తుమ్మలగూడెం రాగి శాసనాలు ఏ ప్రాంతంలో లభించాయి ?
1) వలిగొండ మండలం, నల్లగొండ జిల్లా
2) అమ్రాబాద్ మండలం, మహబూబ్నగర్ జిల్లా
3) సత్తెనపల్లి, గుంటూరు జిల్లా
4) తెనాలి, గుంటూరు జిల్లా
4. సలేశ్వర శిలా శాసనాలు ఏ ప్రాంతంలో లభించాయి ?
1) వలిగొండ మండలం, నల్లగొండ జిల్లా
2) అమ్రాబాద్ మండలం, మహబూబ్నగర్ జిల్లా
3) సత్తెనపల్లి, గుంటూరు జిల్లా
4) తెనాలి, గుంటూరు జిల్లా
5. ప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్ర ప్రాంతం మామిడి చెట్ల వనాలకు, ప్రత్యేకించి తుమ్మెద మామిడి చెట్లకు పేరుగాంచింది. రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా ఉమామహేశ్వరంలో తుమ్మెద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు కిందనే ఆలయం ఉండేది. ఆ చెట్టు మామిడి కాయలను పగులగొడితే అందులోనుంచి తుమ్మెదలు వచ్చేవి. మామిడిని సంస్కృతంలో ఆమ్రం అని, తుమ్మెదను భ్రమరం అని అంటారు. అలా తుమ్మెద మామిడి భ్రమరామ్రం అవుతుంది. ఈ పదం 13వ శతాబ్దం నాటి రసరత్నాకరంలో ఉంది. దీన్ని ఎవరు రాశారు ?
1) నాగార్జునుడు 2) నిత్యానాథ సిద్ధుడు
3) యోగేంద్రుడు 4) ఎవరో తెలియదు
6.విష్ణుకుండులు వైదిక మతాన్ని అవలంభించారు కాబట్టి వేదాల్లో ఇంద్రుడు ప్రధాన దైవం కావున అతని పేరున అమరపురం అని, అతని మరో పేరు శుక్రపురం అని, ఆరో రాజధానికి ఇంద్రపాలనగరం అని పేర్లు పెట్టుకొన్నారు. ఈ పేర్లు ఏ భాషకు సంబంధించినవి ?
1) తెలుగు 2) ప్రాకృతం 3) సంస్కృతం 4) ఏదీకాదు
7.విష్ణుకుండులు యజ్ఞాలు నిర్వహించారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశారు. బావులు, చెరువులు తవ్వించారని వారి శాసనాల్లో రాసి ఉంది. వీటికి భౌతిక ఆధారాలు ఎక్కడ లభించాయి ?
1) మున్ననూర్, అమ్రాబాద్ 2) చైతన్యపురి, హైదరాబాద్ 3) సతారా జిల్లా మహారాష్ట్ర 4) తెనాలి, గుంటూరు
8. విష్ణుకుండి రాజుల పరిపాలనా కాలాన్ని జతపర్చండి.
1) ఇంద్రవర్మ – ఎ) క్రీ.శ. 440-495
2) మొదటి మాధవవర్మ – బి) క్రీ.శ. 398-440
3) గోవిందవర్మ – సి) క్రీ.శ 370-398
4) రెండో మాధవవర్మ – డి)క్రీ.శ 358-370
1) 1-డి, 2-సి,3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
9.రెండో మాధవవర్మ విష్ణుకుండి రాజులందరిలో గొప్పవాడు. ఆయన వందకుపైగా యుద్ధాల్లో విజయం సాధించాడు. ఒక్కోయుద్ధానికి గుర్తుగా ఎక్కడ శివలింగాలను స్థాపించాడు ?
1) కీసరగుట్ట 2) శ్రీశైలం
3) ఉమామహేశ్వరం 4) కోటిలింగాల
10. విష్ణుకుండులకు, పల్లవులకు మధ్య ఎల్లప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి. పల్లవుల దండయాత్రలను అరికట్టే ఉద్దేశంతో రెండో మాధవవర్మ తన రాజధానిని వేంగి సమీపంలోని దెందులూరు పురానికి మార్చాడు. తన మొదటి రాజధాని అమరపురి కోటగోడను పెంచి, బలిష్టపరిచి అక్కడ ఎవరిని రాజప్రతినిధిగా నియమించాడు ?
1) రెండో ఇంద్రవర్మ 2) మూడో మాధవవర్మ
3) విక్రమేంద్రవర్మ 4) దేవవర్మ
11. రెండో ఇంద్రవర్మ చనిపోయిన తర్వాత అతని కొడుకు రెండో విక్రమేంద్ర భట్టారకవర్మ చిన్నతనంలోనే సింహాసనం అధిష్టించాడు. ఇతని పదకొండో రాజ్యపాలన సంవత్సరంలో పల్లవ సింహవర్మ విష్ణుకుండి రాజ్యంపై దండెత్తాడు. గుంటూరు జిల్లా ధాన్యకటక పరిసరాల్లో క్రీ.శ.566లో యుద్ధం జరిగినట్లు, రెండో విక్రమేంద్రవర్మకు పృథ్వీమూలుని సహాయం లభించినట్లు తెలుస్తున్నది. అయితే ఇతని రాజ్యంలోని జిల్లాలు ఏవి ?
1) గోదావరి 2) ఖమ్మం 3) నల్లగొండ 4) పైవన్నీ
12.విష్ణుకుండులు తమ దేశాన్ని రాష్ర్టాలుగా, రాష్ర్టాన్ని విషయాలుగా, విషయాన్ని గ్రామాలుగా విభజించారు. రాష్ర్టానికి పాలకుడు రాష్ట్రికుడు. విష్ణుకుండుల దేశంలో పఱకి రాష్ట్రం, ప్లక్కి రాష్ట్రం, కర్మ రాష్ట్రం, కళింగ రాష్ట్రం మొదలైన రాష్ర్టాలుండేవి. విషయానికి పాలకుడు విషయాధిపతి. అయితే కిందివారిలో రాజుకు పరిపాలనలో సహాయపడే వారిని గుర్తించండి ?
1) యువరాజు 2) మహామాత్య, అమాత్య
3) రహస్యాధికారి, అంతరంగికుడు 4) పైవారందరూ
జవాబులు
1-3, 2-1, 3-1, 4-2, 5-2, 6-3, 7-1, 8-1, 9-1, 10-4, 11-4, 12-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు