వీరే మన గణిత శాస్త్రవేత్తలు
విల్ డ్యూరాంట్ (అమెరికా) ప్రకారం.. భారతదేశం మన జాతికి కన్నతల్లి, సంస్కృత భాష ద్వారా యూరోపియన్ యూనియన్ భాషలకు జన్మనిచ్చింది.
-అరబ్బుల ద్వారా గణిత విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచినది. ప్రజాస్వామ్యానికి జన్మనిచ్చిన దేశం. అందువల్ల భారతమాత అందరికి మాత అయినది.
-అంకెలు మొదటగా భారత్‌లోనే ఉద్భంవించాయి.
-సున్నాను గణిత ప్రపంచానికి కానుకగా అందించిన వారు భారతీయులు.
-సున్నాను కనుగొన్నది పేరు తెలియని భారతీయ శాస్త్రవేత్త.
-వేదాలలో చివరిదైన అదర్వణ వేదంలో గణిత సమస్యల ప్రస్తావన ఉన్నది. వీటిని వెలికి తీసి శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహరాజ్ vedic mathematics అనే గ్రంథాన్ని రచించాడు.
–1, -2, -3, . . . ఋణ సంఖ్యల ఉనికిని మొదట గుర్తించిన వారు భారతీయులు.
ఆర్యభట్ట
-ఇతను 476 మార్చి 21న పాటలీపుత్రలోని గ్రామంలో జన్మించాడు.
-ఉన్నత విధ్యాభ్యాసం కోసం నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొంది ఖగోళశాస్త్ర విషయాల్లో ప్రావీణ్యత సంపాదించి, నలంద రాజు బుద్ధగుప్తుని ద్వారా ఆ విశ్వ విద్యాలయ కులపతిగా నియమితుడయ్యాడు.
-తను కనుగొన్న విషయాలను తెలుపుతూ ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇందులో శ్లోకాలు ఉన్నాయి. ఇది 4 పాదాలుగా ఉంటుంది.
గీతికా పాదం
-ఇందులో 10 శ్లోకాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని దశ గీతికా పాదం అంటారు.
-ఇందులో సంఖ్యలను సూచించడానికి అక్షరాలను ఉపయోగించేవారు. సూర్య్రభ్రమణాలు 13,20,000లను సూచించడానికి ఖ్యుఘ్న అనే పదాన్ని ఉపయోగించేవారు.
గణిత పాదం
-ఇందులో సంఖ్యల వర్గం, వర్గమూలం, ఘనం, ఘన మూలాలు, క్షేత్రగణిత సూత్రాలు ఉన్నాయి.
కాలక్రియా పాదం
-ఇందులో భూ భ్రమణకాలం, భూ పరిభ్రమణ కాలం, గ్రహాల భ్రమణ కాలాల వివరాలు ఉన్నాయి.
గోళ పాదం
-భూమి కొలతలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
ఇతని గణిత కృషి
-భారతీయ గణితశాస్త్ర రచనకు ప్రారంభకుడు.
-భారతీయులకు ఖగోళ, గణితశాస్త్రాల్లో మొదటి ప్రామాణిక గ్రంథం ఆర్యభట్టీయం.
-గణిత ప్రపంచానికి విలువ 3.1416 అని మొదటగా తెలిపాడు.
-అంకశ్రేఢిలో n పదాల మొత్తం కనుగొనడానికి సూత్రం తెలిపాడు.Sn = n/2 (2a+(n-1)d)
-త్రిభుజ వైశాల్యం, వృత్త వైశాల్య సూత్రాలను తెలిపాడు.
-మొదటి సహజ సంఖ్యలు, వర్గాలు, మొత్తాలకు సూత్రాలను తెలిపాడు.
-వర్గమూలం, ఘనమూలాలను కనుగొనడానికి సూత్రాలను తెలిపాడు.
-అనిశ్చిత సమీకరణాల సాధన తెలిపారు.
-ఒక వృత్తంలోని శరాల లబ్దం వాటి కలయిక బిందువు గుండా పోయే అర్ధ జ్యా వర్గానికి సమానమని తెలిపాడు.
గమనిక
-ఇతని కృషి ఫలితంగా భారత ప్రభుత్వం 1975, ఏప్రిల్ 19న అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహానికి ఆర్య భట్ట అని పేరు పెట్టారు.
-ఆర్యభట్టీయం అనే గ్రంథాన్ని ఆజ్ జబాహర అనే పేరుతో అరబిక్లోకి అనువాదం చేశారు.
-ఇతని శిష్యులలో చెప్పదగినవాడు లాటదేవ.
-ఆర్యభట్ట సిద్ధాంతాలపై వ్యాఖ్యాన గ్రంథం రచించిన శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు. ఆ గ్రంథం ఖండ ఖాద్యక (చెరుకు తీపితో చేసిన వంటకం).
భాస్కరాచార్య
-భారతదేశ గణితశాస్త్ర చరిత్రలో ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారు. వారు భాస్కరాచార్య -1, భాస్కరాచార్య-2.
భాస్కరాచార్య -1
-ఇతను కేరళ వాసి.
-మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం, ఆర్యభట్టీయ మహాభాష్యం అనే గ్రంథాలు రచించాడు.
-Sine పట్టిక అవసరం లేకుండానే ఒక సూత్రాన్ని తెలిపిన మొదటి వ్యక్తి.
భాస్కరాచార్య-2
-ఇతను 1114లో సహ్యాద్రి అనే పట్టణానికి సమీపంలోని విజ్జల విడపురం అనే గ్రామంలో జన్మించాడు.
-బ్రహ్మగుప్తుని సిద్దాంతాలపట్ల ఆకర్షితుడై తన జీవితమంతా గణితశాస్త్ర సాధన కోసమే వినియోగించాడు.
-ఇతను తన 36వ ఏట సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు.
-తన 69వ ఏట కరణ కుతూహలం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది గ్రహాల గమన నియమాలను వివరిస్తుంది.
-సిద్దాంత శిరోమణి అనే గ్రంథం ఇతనికి మంచి పేరు తెచ్చి ంది. ఈ గ్రంథం నాలుగు భాగాలుగా ఉంటుంది.
1. అంకగణితం (పాటి గణితం)
2. బీజగణితం
3. గణితాధ్యయం
4. గోళాధ్యయం
1. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలోని మొదటి భాగమైన అంకగణితాన్ని మనోరంజక గణితంగా మార్చి మొదటిసారిగా తన కూతురికే భోదించి ఆమె పేరు మీదుగా లీలావతి గణితం అని పేరు పెట్టాడు.
ఇతని గణిత కృషి
-మొదటి భారతీయ గణిత, జ్యోతిష్య శాస్త్రవేత్త.
-గణిత ప్రపంచానికి వినోద గణితాన్ని అందించిన మొదటి శాస్త్రవేత్త.
-భారతీయుల అంకెలు, సున్నాను కలిగిన మొదటి గ్రంథం లీలావతి గణితం.
-హిందూ, అరబిక్ సంఖ్యామానంలో స్థాన విలువలను తెలిపాడు.
-a + 0 = a, a – 0 = a, a x 0 = 0 అనే సున్నా నియమాలను తెలిపాడు.
-రుణ సంఖ్యలకు వర్గమూలం లేదని సూచించాడు.
-Sin (A B), Sin (A-B/2), Sin 180, Sin 360 విలువలను కనుగొన్నాడు.
-ద్విపది విస్తరణలో nC0 + nC1+ ……. +nCn = 2n సూత్రాన్ని తెలిపాడు.
-గోళం ఉపరితల వైశాల్యం కనుగొన్నాడు.
-NX2 + 1 = Y2 అనే సమీకరణాన్ని సాధించడానికి భాస్కరాచార్య అనుసరించిన Cyclic Method (చక్రవార పద్దతి)నే ఆ తర్వాత కాలంలో గాల్వాస్, ఆయిలర్, లెగ్రాంజ్లు ఇన్వర్స్ క్లినిక్ మెథడ్‌గా ఉపయోగిస్తున్నారు. అందువల్ల కౌంటర్ అనే చరిత్రకారుడి అభిప్రాయం ప్రకారం పైసమీకరణాన్ని భాస్కరాచార్య సమీకరణంగా పిలుస్తున్నారు.
-సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని ఫైజి అరబిక్ భాషలోకి అనువాదం చేశాడు.
శ్రీనివాస రామానుజన్
-1887, డిసెంబర్ 22న తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఈరోడ్ గ్రామంలో జన్మించాడు.
-విద్యాభ్యాసం కుంభకోణం పట్టణంలో పూర్తయింది.
-చిన్నతనం నుంచి ప్రతిభ కలిగిన విద్యార్థి. సంఖ్యలు ఇతని నేస్తాలు అనేవాక్యం ఈ శాస్త్రవేత్తకే చెందుతుంది
ఉదా: 2/2 = 1, 3/3 = 1……. 0/0 = ?
-కార్ రచించిన సినాప్సిస్ అనే గ్రంథంలోని దాదాపు 6000 సిద్ధాంతాలకు నిరూపణలను తెలిపాడు.
-ఇతని ప్రతిభను గుర్తించిన ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపకుడైన రామస్వామి అయ్యర్ ఉపకార వేతనం ఇప్పించాడు. దీనిపై ఆధారపడటం ఇష్టంలేక మద్రాసు పోర్టు ట్రస్ట్‌లో నెలకు రూ.25 జీతానికి గుమాస్తా ఉద్యోగంలో చేరాడు.
-డా.వాకర్ అతని ప్రతిభను గుర్తించి మద్రాసు యూనివర్సిటీ నుంచి రూ. 75 ఉపకారవేతనం ఇప్పించి, ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో డా. జీహెచ్ హార్డీ వద్ద పరిశోధనకు అవకాశం కల్పించాడు.
-ఇంగ్లండ్‌లో శ్రీనివాస రామానుజన్ ఆరేండ్లలో 32 పరిశోధన పత్రాలను సమర్పించాడు.
-ఇతని ప్రతిభను గుర్తించిన ఇంగ్లండ్ ప్రభుత్వం, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటి అనే గౌరవాలతో సత్కరించింది. ఈ గౌరవం పొందిన మొదటి భారతీయుడు రామానుజన్.
-ఇతను 1920, ఏప్రిల్ 26న మరణించాడు.
ఇతని గణిత కృషి
-ఇతని పరిశోధనలన్నీ సంఖ్యావాదానికి సంబంధించినవి.
-ఎక్కువగా ప్రధాన సంఖ్యలపై పరిశోధన చేశాడు.
-మొదటి 6 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13లతో 2 x 3 x 7 + 13 = 5 x 11గా రాయవచ్చని తెలిపాడు.
-2 కంటే పెద్దదైన ప్రతి సరిసంఖ్యను ప్రధానసంఖ్యల మొత్తంగా రాయవచ్చని తెలిపాడు.
-సమోన్నత సంయుక్త సంఖ్య అనే భావనను ప్రవేశపెట్టాడు.
-వర్గమూలాల గూడును ప్రతిపాదించాడు.
-1729ని రామానుజన్ నంబర్ అంటారు. 1729 = 103 + 93 = 123 + 13 ఇలా రెండు విధాలుగా రాయగల సంఖ్యలలో మొదటిది 1729.
-మ్యాజిక్ స్వేర్స్ను ప్రతిపాదించాడు.
-ఆరోగ్యం క్షీణిస్తున్న చివరి దశలో క్యాన్సర్ వ్యాధి నివారణలో ఉపయోగించే మాక్ ఠీటా ఫంక్షన్‌పై చేసిన పరిశోధనకు ఇతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
-ఇతని కృషికి గౌరవార్థంగా భారతప్రభుత్వం డిసెంబర్ 22ను ఇండియన్ మ్యాథమెటికల్ డేగా జరుపుతున్నది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు