Indian Economy | భారత ఆర్థిక ప్రణాళికలు – వ్యూహాలు
ఎకానమీ
- ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలకు చాలా ప్రాధాన్యం ఉంది.
- ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే నిర్దిష్ట ప్రణాళిక అవసరం.
- అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు అంతర్భాగంగా చెప్పవచ్చు.
- నిర్ణీత కాలంలో, నిర్ణీత లక్ష్యాలను ఒక ప్రాధాన్య క్రమంలో సాధించడానికి నిర్దిష్ట వ్యూహం అవసరం.
- ప్రపంచంలో మొదట రష్యా ప్రణాళిక బద్దమైన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి సాధించిన తర్వాత భారతదేశం కూడా ప్రేరేపితమై, భారతదేశంలో కూడా ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించింది.
- భారతదేశం 1951 నుంచి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలను 6 వార్షిక ప్రణాళికలను అమలు చేసింది.
- అమలు పరిచిన వివిధ ప్రణాళికల్లో వివిధ రకాల వ్యూహాలను అనుసరించింది.
హారడ్ -డోమర్ వ్యూహం
- సర్ హెన్రీ రాయ్ ఫోర్బ్స్ హారడ్, ఎవ్సే డెవిడ్ డోమర్లు రూపొందించారు..
- హారడ్ డోమర్ మోడల్ ఆర్థిక వృద్ధికి సంబంధించిన కినేసియన్ మోడల్.
- ఆర్థికవృద్ధి రేటు, పొదుపు, పెట్టుబడులకు అనులోమానుపాతంలో ఉంటుంది.
- ఆర్థిక వృద్ధి రేటు, మూలధన ఉత్పత్తి నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే
- ఆర్థిక వృద్ధిరేటు = పొదుపు/ పెట్టుబడి మూలధన ఉత్పత్తి నిష్పత్తి (సీఓఆర్)
- దీనిలో పెట్టుబడి, సీఓఆర్ పై దృష్టి సారించారు.
- సీఓఆర్ అంటే ఒక యూనిట్ ఉత్పత్తిని పొందడానికి అవసరమయ్యే మూలధనం హారడ్-డోమర్ నమూనా ఆధారంగా మొదటి ప్రణళికను రూపొందించి అమలు చేశారు.
మహలనోబిస్ వ్యూహం/నాలుగు రంగాల నమూన (Mahalanobis Strategy/ Four Sector Model)
- ప్రశాంత్ చంద్ర మహల నోబిస్ రూపొందించారు.
- ఆర్థిక వృద్ధి జరగాలంటే పారిశ్రామికీకరణ జరగాలి.
- పారిశ్రామికీకరణ కోసం మౌలిక పరిశ్రమలు స్థాపించారు. అంటే భారీ పరిశ్రమల వ్యూహాన్ని అవలంభించాలి.
- రెండో ప్రణాళిక పీసీ మహలనోబిస్ వ్యూహం ప్రకారంగా రూపొందించి అమలు చేశారు.
- నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా భారీ పరిశ్రమల స్థాపనతోనే పారిశ్రామికీకరణ సాధించవచ్చని అభ్రిపాయపడ్డారు.
- పీసీ మహాలనోబిస్ రూపొందించిన 4 రంగాల నమూనా ఆధారంగా రెండో ప్రణాళిక అమలు చేశారు.
- కె1 పెట్టుబడి రంగం (భారీ పరిశ్రమలకు అవసరమయ్యే మౌలిక పరిశ్రమల రంగం)
- సీ1 కర్మాగారాల్లో వినియోగ వస్తువుల ఉత్పత్తి.
- సీ2- చిన్న, కుటీర పరిశ్రమల్లో వినియోగ వస్తువుల ఉత్పత్తి.
- సీ3 సేవా రంగం
- వీటిలో మూలధన సాంద్రత పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
- భారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు.
- ప్రభుత్వ రంగ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చారు.
- దిగుమతి, ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించారు.
- ఒక దేశ ఆర్థికాభివృద్ధికి కీలక భారీ, మూలధన పరిశ్రమల స్థాపన అవసరం. అయిన ప్పటికీ అవస్థాపన, పబ్లిక్‌రంగ పెట్టుబడులు అంటే వ్యవసాయం, గ్రామీణ, చిన్న కుటీర పరిశ్రమల అభివృద్ధికి కూడా పెట్టుబడి పెట్టాలి. అంటే ఇటు పబ్లిక్ రంగం అటు ప్రైవేటు రంగంలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ సమంగా అభివృద్ధి చెందుతుంది.
- కాని రెండవ ప్రణాళికలో/ ఈ వ్యూహంలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చి, వ్యవసాయ చిన్న కుటీర పరిశ్రమలను విస్మరించారు.
- తద్వారా ఆదాయ అసమానతలు, పేదరికం, నిరుద్యోగం పెరిగింది.
- వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ’భారత జాతికి ప్రణాళిక వేత్తల శాపం’ అని చరణ్‌సింగ్ వ్యాఖ్యానించారు.
గాంధీ వ్యూహం (Gandhi Strategy)
- 1978లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం శ్రీమన్నారాయణ అగర్వాల్ రూపొందించిన గాంధీ ప్రణాళిక ఆధారంగా వ్యవసాయ రంగానికి, చిన్న, కుటీర పరిశ్రలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రణాళికలను రూపొందించారు. అయితే 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో మళ్లీ మహలనోబిస్ వ్యూహానికి ప్రాధాన్యం ఇచ్చింది.
వేతన వస్తు వ్యూహం (Wage goods Strategy)
- వకీలు బ్రహ్మానందంలు రూపొందించిన ‘వేతన వస్తు వ్యూహం’ను 7వ ప్రణాళికలో కొంతవరకు అమలు చేయడానికి ప్రయత్నించారు.
- 7వ ప్రణాళికలో ‘Agricalture led Growth Strategy’ అవలంబించారు.
- అంటే 7వ ప్రణాళికలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యమిస్తూ అమలు చేశారు.
ఎల్పీజీ నమూనా/రావు-మన్మోహన్ నమూనా
- 1990లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సామ్యవాదం నుంచి స్వేచ్ఛా మార్కెట్లవైపు పయనించాయి.
- మనదేశ ఆర్థిక పరిస్థితులు కూడా క్లిష్టంగా ఉండటంతో అప్పటి(1991) ప్రధానమంత్రి పి.వి. నర్సింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి డా.మన్మోహన్‌సింగ్‌లు కలిసి భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనే స్థాయికి సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ‘1991 నూతన పారిశ్రామిక విధాన తీర్మానం’ ద్వారా సరళీకృత ఆర్థిక విధానాలు రూపొందించి, 8వ ప్రణాళిక ద్వారా అమలు పరిచారు.
- 8వ ప్రణాళికలో అనుసరించిన వ్యూహాన్ని/ నమూనాను ఎల్పీజీ నమూనా లేదా రావు-మన్మోహన్ నమూనా లేదా సరళీ కృత ఆర్థిక విధానాలు అని అంటారు.
- L- అంటే Liberalisation సరళీకరణ
- P- అంటే Privatisation ప్రైవేటీకరణ
- G- అంటే Globalisation ప్రపంచీకరణ
- 1992-97లో అంటే 8వ ప్రణాళికలో పబ్లిక్ రంగం పాత్రను తగ్గిస్తూ ప్రైవేటు రంగం ప్రాముఖ్యతను పెంచింది.
- పారిశ్రామిక రంగంపై నియంత్రణను ఎత్తి వేసింది.
- విదేశీ పెట్టుబడులను అనుమతించింది.
- స్థూలంగా మూలధన సాంద్రత పద్ధతికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇది సూచనాత్మక ప్రణాళికలకు ప్రాధాన్యం ఇచ్చింది.
- కానీ వ్యవసాయ రంగాన్ని, చిన్న కుటీర పరిశ్రమలను విస్మరించడం, ఉపాధికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల అసమానతలు పెరిగాయి.
పుర-నమూనా (PURA Model)
- PURA- Providing Urban Amenities Rural Area
- పుర నమూనాను ఏపీజే అబ్దుల్ కలాం 2004లో రూపొందించారు.
- పట్టణ ప్రాంతంలోని సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్పించాలనే ఉద్దేశంతో పురను రూపొందించారు.
- దీనిలో 10 నుంచి 15 గ్రామాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆ గ్రామాల మధ్య భౌతిక (రోడ్డు, రైల్వేలు, నిర్మాణం)
- సాంకేతిక (ఇంటర్నెట్ సదుపాయం)
- విద్యా సంబంధ (కాలేజీలు, యూనివర్సిటీలు)
- ఆర్థిక (మార్కెట్ సదుపాయాలు) మొదలైనవి.
- 4 ప్రధాన అంశాలను తీసుకొని పురను రూపొందించారు.
- పుర నమూనాను నవ్యగాంధీ నమూనా అని కూడా పిలుస్తారు.
- 10వ ప్రణాళికలో పుర నమూనాను కొంత వరకు అమలు చేశారు.
రూర్బన్ మిషన్ -2015
- ప్రస్తుతం పుర స్థానంలో రూర్బన్ మిషన్ వచ్చింది.
- పట్టణ ప్రాంత సౌకర్యాలను గ్రామాల్లో కల్పించడాన్ని ‘రూర్బన్ మిషన్’ అంటారు.
- శ్యామప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్‌ను 2015 సెప్టెంబర్16న క్యాబినెట్ ఆమోదించింది.
- 2016 ఫిబ్రవరి 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజ్‌నందన్‌గావ్ జిల్లా కురుబాత్ గ్రామంలో శ్యాంముఖర్జీ పేరుతో ప్రారంభించారు.
- దీన్ని శ్యామప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ అని కూడా అంటారు.
- 2015 నుంచి రాబోయే 3 సంవత్సరాల్లో 300 స్మార్ట్ విలేజ్ క్లస్టర్లలో ఆర్థిక, సాంఘిక, అవస్థాపనా సదుపాయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది.
- ప్రతి క్లస్టర్‌కి 14 అంశాలు అంటాయి.
ఉదా: గ్రామాల మధ్య రోడ్ల అనుసంధానం, సంచార ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు, డిజిటల్ లిటరసి, వ్యవసాయ ఉత్పత్తి యూనిట్ల పౌర సేవా కేంద్రాల ఏర్పాటు మొదలైనవి. - 5000 నుంచి 15000 జనాభా ఉండే ఎడారి, కొండ, గిరిజన ప్రాంతాల్లో 25000 నుంచి 50,000 జనాభా ఉండే మైదాన తీర ప్రాంతాల్లో క్లస్టర్‌ను ఏర్పాటు చేయడం.
- ఏ రాష్ట్రంలోని క్లస్టర్‌ను ఆ రాష్ట్రమే ఎంపిక చేస్తుంది.
- ఈ నమూనా ప్రణాళిక స్వభావాన్ని కేంద్రీకృతం నుంచి సూచనాత్మక ప్రణాళికకు మార్చింది అని చెప్పవచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. నిర్దిష్ట లక్ష్యసాధనకు కావలసింది?
ఎ) నిర్ణీత కాలం బి) నిర్దిష్ట వ్యూహం
సి) ప్రాధాన్యతా క్రమం
డి) పైవన్నీ
2. మొదటి ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందింది?
ఎ) నాలుగు రంగాల నమూనా
బి) మహలనోబిస్ నమూనా
సి) హారడ్-డోమర్ నమూనా
డి) వేతన వస్తు నమూనా
3. నాలుగు రంగాల నమూనాను రూపొందించింది ఎవరు?
ఎ) ప్రకాశ్ చంద్ర మహలనోబిస్
బి) ప్రశాంత్ చంద్ర మహలనోబిస్
సి) ప్రశాంత్ చరణ్ మహలనోబిస్
డి) ప్రమోద్ చంద్ర మహలనోబిస్
4. రెండో పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా రూపొందించి అమలు చేశారు.
ఎ) పీసీ మహలనోబిస్ నమూనా
బి) నాలుగు రంగాల నమూనా
సి) ఎ, బి
డి) ఎల్పీజీ నమూనా
5. నాలుగు రంగాల నమూనాలో C3 అంటే
ఎ) వ్యసాయ రంగం
బి) పారిశ్రామిక రంగం
సి) సేవా రంగం డి) పైవన్నీ
6. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ‘భారత జాతికి ప్రణాళిక వేత్తల శాపం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
ఎ) భగత్‌సింగ్ బి) చరణ్ సింగ్
సి) రాజాసింగ్ డి) రామ్ సింగ్
7. జనతా ప్రభుత్వం అనుసరించిన నిరంతర ప్రణాళిక వ్యూహం ఏది?
ఎ) గాంధీ వ్యూహం
బి) నెహ్రూ వ్యూహం
సి) వేతన వస్తు వ్యూహం
డి) పైవన్నీ
8. 7వ ప్రణాళిక అనుసరించిన వ్యూహం?
ఎ) జనతా వ్యూహం
బి) వేతన వస్తు వ్యూహం
సి) పుర నమూనా డి) గాంధీ వ్యూహం
9. 8వ ప్రణాళిక అనుసరించిన వ్యూహం ఏది?
ఎ) ఎల్పీజీ నమూనా
బి) పుర నమూనా
సి) రెండు రంగాల నమూనా
డి) పైవన్నీ
10. ఎల్పీజీ నమూనాకు మరోపేరు?
ఎ) సరళీకృత ఆర్థిక విధానాలు
బి) రావు మన్మోహన్ నమూనా
సి) రావు -సింగ్ నమూనా డి) పైవన్నీ
11. PURA అంటే
ఎ) Providing Urban Amenities Rural Area
బి) Proceeding Urban Amenities Rural Area
సి) Providing Unitary Amenities Rural Area
డి) Providing Union Amenity Rural Area
12. పుర నమూనాకు మరొక పేరు
ఎ) నవ్య గాంధీ నమూనా
బి) మహాగాంధీ నమూనా
సి) పుర నవ్య నమూనా
డి) మహా నవ్య నమూనా
13. రూర్బన్ మిషన్ నమూనా ఎప్పుడు ప్రతిపాదించారు?
ఎ) 2004 బి) 2014
సి) 2015 డి) 2005
14. రూర్బన్ మిషన్‌ను మొదట ఏ రాష్ట్రంంలో ప్రారంభించారు?
ఎ) మేఘాలయ బి) ఛత్తీస్‌గఢ్
సి) ఒడిశా డి) మిజోరం
15. పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన నమూనా ఏది?
ఎ) మహలనోబిస్ నమూనా
బి) ఎల్పీజీ నమూనా
సి) నాలుగు రంగాల నమూనా
డి) పైవన్నీ
16. భారీ పరిశ్రమల ద్వారానే అభివృద్ధి సాధ్యాన్ని సమర్థించిన ప్రధాని ఎవరు?
ఎ) జవహర్‌లాల్‌నెహ్రూ
బి) పి.వి. నరసింహారావు
సి) మొరార్జీ దేశాయ్ డి) ఎ, బి
సమాధానాలు
1-డి 2-సి 3-బి 4-సి
5-సి 6-బి 7-ఎ 8-బి
9-ఎ 10-డి 11-ఎ 12-ఎ
13-సి 14-బి 15-డి 16-డి
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు