-సమ్మిళిత వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 11, 12 ప్రణాళికల్లో సమ్మిళిత, సత్వర వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. 11వ పంచవర్ష ప్రణాళిక
-సమ్మిళిత వృద్ధి సాధించడానికి మొత్తం 27 ద్రవ్య విధాన లక్ష్యాలను 13 రాష్ట్రాలకు నిర్దేశించింది. దీనిలో భాగంగా పేదరికం తగ్గించి, ఉపాధి కల్పనను పెంచి సత్వర వృద్ధి సాధించడం, విద్య, ఆరోగ్యం వంటి అవసరమైన సేవలను అందించడం, విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా సాధికారతను సాధించడం, MGNREGS ద్వారా ఉపాధిని విస్తరించడం, పర్యావరణ కొనసాగింపు సాధించడం, లింగ వివక్షతను తగ్గించడం, పాలనలో మెరుగుదలను తీసుకురావడం వంటి అంశాల్లో దృష్టిని సారించింది.
-పై వాటిని సాధించడానికి వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 10-11 శాతం వృద్ధిని, సేవారంగంలో 9-11 శాతం వృద్ధిని సాధించాలని వాటి ద్వారా ప్రణాళికలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యమైన 9 శాతం వృద్ధిని సాధించాలని నిర్ణయించారు.
-సమాచార సాంకేతిక రంగంలో విశిష్టమైన అభివృద్ధిని సాధించాం. సాఫ్ట్వేర్ పరిక్షిశమ బాగా వృద్ధి చెందింది.
-వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి ‘ఇంటిక్షిగేటెడ్ యాక్షన్ ప్లాన్ (IAP)’ ను దేశంలోని 60 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
-11వ ప్రణాళికలో వివిధ పథకాల్లో భాగంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే పేదరికపు రేఖకు దిగువన ఉన్నవారికి సంబంధించి ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ పథకాన్ని 2007లో ప్రారంభించారు.
-గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని కుటుంబాలకు బీమా రక్షణ కల్పించడానికిగాను ‘ఆమ్ ఆద్మీ బీమా యోజన’ పథకాన్ని ప్రారంభించారు. దీనికి చెల్లించే ప్రీమియం రూ.200. దీని నిర్వహణ బాధ్యతను ఎల్ఐసీకి అప్పగించారు. దీనికి అవసరమయ్యే నిధులను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి.
-వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం కల్పించడానికిగాను ‘ఉజ్వల’ పథకాన్ని ప్రారంభించారు.
-గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి దేశంలో వేతన ఉపాధి పథకాన్ని (MGNREGS) అమలు చేస్తున్నారు.
-పైవాటితో పాటుగా ప్రభుత్వం కొన్ని ఫ్లాగ్షిప్ పథకాలను అమలు చేసింది. దీనిలో భాగంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ జాతీయ హార్టికల్చర్ మిషన్, సత్వర నీటి పారుదల ప్రయోజన పథకం (ALBP), గ్రామీణ తాగునీటి సదుపాయం, రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ, ఇందిరా ఆవాస్ యోజన, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నారు.
-ప్రభుత్వం వృద్ధిని సాధించడంతోపాటు దాన్ని సమాజంలో అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి అందించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
-సమ్మిళిత వృద్ధి సాధించడానికి ప్రధానంగా వ్యవసాయం తీరు తెన్నులు, విధానాలు, పేదరికం తగ్గించడం, ఆహారపు హక్కు, ఉద్యోగిత కల్పించడం ద్వారా సామూహిక భద్రత మానవాభివృద్ధి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడం వంటి విషయాల్లో వృద్ధిని సాధించినప్పుడే సమ్మిళిత వృద్ధి సాధ్యమవుతుంది.
-భారత ప్రభుత్వం 12వ ప్రణాళికలో ఆర్థిక వృద్ధిని 9 శాతానికి పెంచాలని పేర్కొన్నది. వ్యవసాయరంగంలో 4 శాతం వృద్ధిని, పారిక్షిశామిక రంగంలో 9.5 శాతం వృద్ధిని, సేవారంగంలో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించింది. మొత్తం మీద ప్రణాళికలో వృద్ధిని 9-9.5 శాతం వరకు సాధించాలని నిర్ణయించింది.
-ఈ ప్రణాళికలో విధానపరమైన సంస్కరణలపైన, పాలనా సంస్కరణలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, ప్రభుత్వ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించాలనే సూచనలను ఆమోదించింది.
-ప్రజారోగ్యంపై చేస్తున్న వ్యయాన్ని జీడీపీలో 1.3-2.5 శాతం పెంచాలని, దీంతోపాటుగా సాగునీరు, వాటర్‌షెడ్ మేనేజ్మెంట్, పట్టణ మౌలిక సదుపాయాలకు నిధులు పెంచి జీడీపీలో ఈ నిధులు 0.7 శాతానికి పెరిగేలా చూడాలి.
-ఈ ప్రణాళిక కాలంలో అణు విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష మెగావాట్ల స్థాయికి పెంచి అదే సమయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చేయాలి.
-వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు ఎలాంటి పరిస్థితుల్లోనూ 4 శాతానికి తగ్గకుండా చూడటం, అందుకు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలుగా ‘రాష్ట్రీయ వికాస్ యోజన’ను విస్తరింపజేయాలి.
-అలాగే 12వ ప్రణాళిక అమలు కాలంలో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ వంటి కార్యక్షికమాలు మరింత విజయవంతం కావాల్సిన అవశ్యకత ఉంది.
-సుస్థిరత్వ భావనకు మూలం: సుస్థిరత్వం అనే భావన ఐరోపాలోని అటవీ అధికారులు 1, 19వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన ఒక ప్రక్రియ. ఆనాటి యురోపియన్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అడవులే ప్రధాన చోదకశక్తులుగా ఉండేవి.
-అడవుల్లో చెట్లు తరిగిపోయినా, కొట్టివేసినా తిరిగి ఆ ప్రాంతాల్లో చెట్లను నాటి సంఖ్యను భర్తీచేసి కాపాడేవారు.
-ఈ ప్రక్రియలో అంటే చెట్లను భర్తీ చేయడంలో భావి తరాల వారికి కూడా అడవులు తరిగిపోకుండా ఉండాలనే సంకల్పమే సుస్థిరత్వ ప్రధాన లక్ష్యంగా ఉండేది.
-మూలధనాన్ని స్థిరంగా ఉంచి, సుస్థిర వాస్తవిక వినియోగాన్ని సాధించడంగా సుస్థిరత్వాన్ని నిర్వచించవచ్చు.
-మూలధనాన్ని తగ్గనివ్వకుండా వినియోగ ప్రవాహాన్ని కొనసాగించడమే సుస్థిరత్వం.
-పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు.
-అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణాన్ని విలీనం చేస్తూ వర్తమానంలో అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలు తీర్చుకోవడంలో రాజీలేని అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అంటారు. సుస్థిరాభివృద్ధిని ‘నిలకడగల అభివృద్ధి’ అని పిలుస్తారు.
-బ్రట్ల్యాండ్ (నార్వే ప్రధాని) నిర్వచనం ప్రకారం ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ, భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించడం ద్వారా సాధించే అభివృద్ధి సుస్థిరాభివృద్ధి.
-మైఖేల్ థామస్ ప్రకారం సుస్థిరాభివృద్ధి అంటే ‘ప్రస్తుత తరాల అవసరాలను తీరుస్తూనే భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని మరింతగా మెరుగుపర్చడం’.
-సుస్థిరాభివృద్ధి అంతర్గత అంశాలు: సుస్థిరాభివృద్ధి (నిలకడగల అభివృద్ధి) భావనలో ఆర్థిక, సాంఘిక, పర్యావరణానికి సంబంధించి మూడు ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ మూడు అంశాలు ఒకదానికి ఒకటి పరస్పర సంబంధంతో ఉన్నాయి.
ఆర్థిక అంశాలు
-అభిలషణీయమైన ఆదాయ ప్రవాహాన్ని సృష్టించి, భౌతిక, మానవ మూలధన మూలాధార నిల్వలను యథాస్థితిలో ఉంచడాన్ని నిలకడగల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ కోరుకుంటుంది. దీనికి మూడు ప్రధాన లక్ష్యాలున్నాయి. అవి..
1. వస్తు, సేవల ఉత్పత్తులను పెంపొందించడం
2. సమాజ అవసరాలను తీర్చి నిరపేక్ష పేదరికాన్ని నిర్మూలించడం
3. సమానత్వాన్ని మెరుగుపర్చడంసాంఘిక అంశాలు
-సాంఘిక న్యాయం, సమానత్వం సూత్రాల ఆధారంగా నిలకడగల అభివృద్ధికి సంబంధించిన సాంఘిక దృక్పథం నిర్మితమవుతుంది. కనీస ప్రమాణాలు కలిగిన భద్రత, మానవ హక్కులు, ఆహారం, ఆరోగ్యం, విద్య, గృహవసతి, స్వయం అభివృద్ధికిగాను అవకాశాలు మొదలైన సాంఘిక లాభాలన్నీ పౌరులందరికీ అందుబాటులో ఉండాలి.
పర్యావరణ అంశాలు
-నిలకడగా వనరులను వినియోగించడం, వ్యర్థ పదార్థాలను సమర్థవంతంగా ఇముడ్చుకునే విధంగా చేయడం, ప్రకృతి మూలధన నిల్వలను యథాతథంగా కొనసాగించడం అనే విధులను పర్యావరణ విభాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ విధంగా నిర్వహించినట్లయితే జీవావరణ స్థిరత్వం నెలకొని ఉంటుంది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
-ప్రపంచ స్థాయిలో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2005-2015 దశాబ్దాన్ని ‘సుస్థిరాభివృద్ధి కోసం విద్య’గా ప్రకటించింది.
1. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, విద్య, ఆరోగ్యం, ప్రజా జీవనంలో భాగస్వామ్యం, నాణ్యమైన పర్యావరణం, సమన్యాయాన్ని పెంపొందించడం, వనరుల సమాన పంపిణీ, భవిష్యత్ తరాల కనీస అవసరాలను తీర్చడానికి వనరులు అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుత అభివృద్ధి విధానాలను తీర్చిదిద్దడం వంటి అంశాలు సుస్థిరాభివృద్ధిలో సమ్మిళితం చేయబడ్డాయి.
2. పర్యావరణ, మానవ, భౌతిక మూలధన విషయాల్లో రాబోయే తరాలవారు రాజీపడకుండా ఆర్థికాభివృద్ధిని సత్వరం చేయడం.
3. అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని కలుగజేయని రీతిలో ఉండాలి. అంటే ఆర్థికాభివృద్ధి అనేది భావితరాల జీవన ప్రమాణాలను దెబ్బతీయకూడదు.
4. సుస్థిరాభివృద్ధి కొనసాగింపు కోసం నిరంతర జీవవైవిధ్యాలు పరిరక్షణ గావించబడాలి.
5. కాలుష్యరహితమైన, పునరుత్పాదిత, చౌకగా లభ్యమైన శక్తి వనరుల వినియోగాన్ని పెంపొందించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి.
6. అడవులను పరిరక్షించాలి, ఎడారీకరణ, భూసారం తగ్గుదలను అరికట్టాలి.
7. సుస్థిరాభివృద్ధి దిశలో ప్రపంచ భాగస్వాములను ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడం.
ప్రశ్నలు
1. తయారీరంగాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? (ఎ)
ఎ) మేక్ ఇన్ ఇండియా బి) స్కిల్ ఇండియా
సి) ముద్రాబ్యాంక్ డి) ఇంద్రధనుష్
2. 2015, సెప్టెంబర్ 25న న్యూయార్క్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సహవూసాభివృద్ధి లక్ష్యాల స్థానంలో వేటిని ప్రవేశపెట్టారు? (ఎ)
ఎ) సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
బి) అభివృద్ధి లక్ష్యాలు
సి) పర్యావరణాభివృద్ధి లక్ష్యాలు
డి) ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు
3. పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్షికమాలు ఏవి? (డి)
ఎ) బాలస్వాస్థ్య కార్యక్షికమం
బి) కిశోర్శక్తి యోజన
సి) ఆహారభద్రత మిషన్ డి) పైవన్నీ
4. పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికాభివృద్ధిని ఏమంటారు? (బి)
ఎ) పర్యావరణ అభివృద్ధి బి) సుస్థిరాభివృద్ధి
సి) స్థిర అభివృద్ధి డి) ప్రగతి పథకం
5. ప్రకృతి, సహజ వనరుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంఘం ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి భావనను ఎప్పుడు తెలియజేసింది? (ఎ)
ఎ) 190 బి) 191 సి) 192 డి) 193
6. 2014, డిసెంబర్ 25న ఏడు వ్యాధులను నిరోధించేలా పిల్లలందరికీ టీకాలు ఇచ్చే ఏ కార్యక్షికమాన్ని ప్రవేశపెట్టారు? (డి)
ఎ) ఏడు టీకాలు బి) చిన్నారి ఆరోగ్యం
సి) సాత్ టీకా డి) ఇంద్రధనస్సు
7. ఏ రంగంలో వృద్ధిని పెంచేందుకు ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టారు? (డి)
ఎ) సాంకేతిక రంగం బి) ప్రభుత్వ రంగం
సి) ప్రైవేటు రంగం డి) వ్యవసాయ రంగం
8.ఎనిమిదో ప్రణాళికలో ఏర్పాటు చేసిన వాటర్‌షెడ్ పథకాన్ని ఎన్ని రాష్ట్రాల్లో అమలుపర్చారు? (సి)
ఎ) 22 బి) 23 సి) 25 డి) 15
9. శివన్నగూడెం వాటర్‌షెడ్ ఎక్కడ ఉంది? (ఎ)
ఎ) తెలంగాణ (నల్లగొండ)
బి) తమిళనాడు (అన్నామలై)
సి) ఆంధ్రవూపదేశ్ (కర్నూలు) డి) రాజస్థాన్ (జైసల్మేర్
10. భారతవూపభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకాలు సమ్మిళిత సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతాయి? (డి)
ఎ) స్వచ్ఛభారత్ మిషన్
బి) ఇందిరా ఆవాస్ యోజన
సి) MGNREGS డి) పైవన్నీ