‘సరస్సుల రాష్ట్రం’ అని దేనిని పిలుస్తారు?
ఆసియా ఖండంలోని ముఖ్యమైన సరస్సులు
– భూ ఉపరితలంపై నీటిని కలిగి చుట్టూ భూమితో విస్తరించిన భాగాన్ని సరస్సులు అంటారు. లేదా నదులు ప్రవహిస్తున్నప్పుడు విశాలమైన ప్రాంతంలో ఏర్పడిన భాగాన్ని సరస్సులు లేదా రిజర్వాయర్లు అని అంటారు.
– ఆసియాలో 20 శాతం సరస్సులు ఉన్నాయి.
– కాస్పియన్ సరస్సు: ఇది సముద్రపు సరస్సు. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. రష్యా-కజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఇరాన్, అజర్బైజాన్ దేశాల మధ్య విస్తరించినది.
– బైకాల్ సరస్సు: ప్రపంచంలోకెల్లా లోతైన సరస్సు (1620 మీ. లోతు). ఇది రష్యాలోని సైబీరియాలో విస్తరించి ఉంది. ఈ సరస్సులోనే లీనా నది జన్మిస్తుంది.
– ఊలార్ సరస్సు: ఇది జమ్ముకశ్మీర్‌లో ఉంది. దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు.
– టర్నూల్ సరసస్సు: టర్కీలో (అనటోలియా పీఠభూమిలో తూర్పు ఆఫ్రికా పగులు లోయ ఉత్తర అంచులో) ఉంది.
– లాప్నార్ సరస్సు: ఇది చైనాలోని ఉప్పు నీటి సరస్సు. ఇది చైనాలో అణుపరీక్షలు జరిపే ప్రదేశం.
– బల్కాష్ సరస్సు: ఇది కజకిస్థాన్‌లో ఉంది. ‘C’ ఆకారంలో ఉన్న ఈ సరస్సుకు ఉత్తరాన కరగండా బొగ్గు గనులు ఉన్నాయి.
– టోబా సరస్సు: ఇది ఇండోనేషియాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత సరస్సు (కాల్డెరా సరస్సు)
– సర్గమాయిష్ సరస్సు: ఇది కజకిస్థాన్-ఉజ్బెకిస్థాన్ల మధ్య ఉంది.
ఓనెగా సరస్సు: ఇది రష్యాలో ఉంది.
టైమర్ సరస్సు: ఇది రష్యాలో ఉంది.
ఇసిక్-కుల్ సరస్సు: ఇది కిర్గిజ్‌స్థాన్‌లో ఉంది.
ఉర్మియా సరస్సు: ఇది ఇరాన్లో ఉంది.
కింగ్ హోయి సరస్సు: ఇది చైనాలో ఉంది.
కాన్కా సరస్సు: ఇది రష్యా-చైనా దేశాల మధ్య ఉంది.
అసాద్ సరస్సు: ఇది సిరియాలో ఉంది.
వాన్గోల్ సరస్సు: ఇది టర్కీలో ఉంది.
భారత్‌లోని ముఖ్యమైన సరస్సులు
ఉత్తరాఖండ్
– భీమ్టాల్, నైనిటాల్, సత్తాల్, రూప్‌కుండ్.
– దేశంలో సరస్సుల జిల్లా అని నైనిటాల్ను పిలుస్తారు. ఇక్కడ భీమ్టాల్, నైనిటాల్, సత్తాల్, నౌకు చియాతాల్ సరస్సులు ఆ జిల్లాలో ఉన్నాయి. వీటిని ‘లేక్స్ ఆఫ్ కుమావుహిల్స్’ అంటారు.
గుజరాత్
– తాల్ సరస్సు: మొహసానా
– హమీసార్ సరస్సు: కచ్ భుజ్
– కాంకారియా సరస్సు: అహ్మదాబాద్ (దీన్ని 14వ శతాబ్దంలో మహ్మద్ షా-II నిర్మించారు)
– నారాయణ్ సరోవర్ సరస్సు: కచ్‌లో ఉంది.
హర్యానా
– సుల్తాన్పూర్ సరస్సు: సుల్తాన్పూర్
– టిల్యార్ సరస్సు: రోహతక్
– కర్నా సరస్సు: కర్నాల్
– బ్యాడ్కాల్ సరస్సు: ఫరీదాబాద్
– బ్లూబర్డ్ సరస్సు: హిస్సార్
– బ్రహ్మ సరస్సు: థానేశ్వర్
– డామ్ధామ: సోహ్న
రాజస్థాన్
– సాంబార్: సాంబార్ లేక్‌టౌన్‌లో ఉంది. ఇది రామ్సార్ వెట్ ల్యాండ్ లేక్. ఇది భారత భూభాగంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.
– పుష్కర (అజ్మీర్): ఎడారిలోని ఏకైక మంచినీటి సరస్సు. ఇది దేశంలో మొదటి రామ్సార్ వెట్ ల్యాండ్ లేక్.
– ఉదయ్‌పూర్‌ను సిటీ ఆఫ్ లేక్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఫతేసాగర్, స్వరూప్సాగర్ వంటి సరస్సులు ఉన్నాయి.
– ఇతర సరస్సులు డేగనా, పులేరా, దేబర్, నక్కి, తల్వార, రాజసమంద్, ఉదయ్‌సాగర్.
మహారాష్ట్ర
– సలీం అలీ సరస్సు: ఔరంగాబాద్‌లో ఉన్న సరస్సులో పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.
– శివసాగర్: సతారాలో ఉన్నది. ఇది కొయనా నది వల్ల ఏర్పడింది.
– లోనార్ (బుల్దానా): ఇది క్రేటర్/బిలం సరస్సు. ఇది ప్రపంచంలోనే బసాల్టిక్ రాక్స్‌లో కనుగొన్న ఒకే ఒక్క బిలం సరస్సు. ఇది జాతీయ భూ వారసత్వ స్మారక సరస్సు.
– ఇతర సరస్సులు రంకాలా, వెన్నా, గొరెవాడ, ఆంధ్ర, తిన్సొ.
హిమాచల్‌ప్రదేశ్
– రేవల్సర్ సరస్సు: ఇది మండి జిల్లాలో ఉంది. ఇది చతురస్రాకారంలో ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున 123 అడుగుల ఎత్తయిన పద్మ సంభవ (గురు రింపోచే) విగ్రహం ఉంది. దీన్ని హిందువులు, సిక్కులు, బౌద్ధులు పవిత్రస్థలంగా భావిస్తారు.
– రేణుకా సరస్సు: ఇది హిమాచల్‌ప్రదేశ్‌లో అతిపెద్ద సరస్సు. జమదగ్ని మహర్షి భార్య, పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి పేరుతో ఈ సరస్సును పిలుస్తారు.
– ఇతర సరస్సులు ప్రశార్, మహారాణా ప్రతాప్‌సాగర్, భృగు, చంద్రతాల్, కజ్జియార్, సూర్యతాల్
మధ్యప్రదేశ్
– భోజ్తాల్ (అప్పర్ లేక్), చోటాతాల్ (లోయర్ లేక్) సరస్సులు ఉన్నాయి.
– భోజ్తాల్ సరస్సు ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు. ఇది భోపాల్ వద్ద ఉంది.
బీహార్
– కన్వర్తాల్ లేదా కబర్: ఇది ఆసియాలోనే అతిపెద్ద ఆక్స్బో మంచినీటి సరస్సు.
ఉత్తరప్రదేశ్
– గోవింద్‌వల్లభ్ పంత్ సాగర్ సరస్సు: సొనేభద్ర వద్ద ఉంది. ఈ అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు రిహండ్ నది వల్ల ఏర్పడింది.
– బేలసాగర్: కుల్పాహర్
సిక్కిం
– చోలాం: ఇది దేశంలో ఎత్తయిన సరస్సు. సముద్ర మట్టం నుంచి 18,000 అడుగుల ఎత్తున ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే 14వ ఎత్తయిన సరస్సు. ఇది తీస్తా నదికి ప్రధాన నీటి వనరు.
– దీంతోపాటు త్రాలెమో, త్సాంగ్మో, చంగ్డు, గురుడొంగర్, కెచియోపల్రి, మెన్మెచో సరస్సులు ఉన్నాయి.
పశ్చిమబెంగాల్
– తూర్పు కోల్‌కతా సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు
అసోం
– హప్లాంగ్ (సిల్చార్ వద్ద), డిపర్బీల్ (క్యామ్ప్ వద్ద), సొన్ బీల్ (కరీంగంజ్ వద్ద-భూకంపం వల్ల ఏర్పడింది), చండూబి (క్యామ్ప్ వద్ద-వలస పక్షులకు ప్రసిద్ధి) సరస్సులు ఉన్నాయి.
మణిపూర్
– లోక్తక్ సరస్సు: ఈ సరస్సుకు దక్షిణ భాగంలో కెయింబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉంది. ఇది ప్రపంచంలోనే నీటిపై తేలియాడే ఏకైక నేషనల్ పార్క్. ఇక్కడ ప్రపంచంలో మరెక్కడా కనిపించని సంగమ్ జాతి జింక (డాన్సింగ్ డీర్)లు కనిపిస్తాయి. వీటిని అంతరించిపోతున్న జాతుల కింద IUCN ప్రకటించింది.
మేఘాలయ
– ఉమాయ్ సరస్సు: షిల్లాంగ్ వద్ద ఉంది. దీనిలో బోటింగ్, సైక్లింగ్ ఉంది.
మిజోరం
– టామ్దిలే సరస్సు: సైటువల్ వద్ద ఉంది.
చండీగఢ్
సుఖనా సరస్సు
పంజాబ్
– హరికే (ఫిరోజ్‌పూర్ వద్ద), రూపార్ (రూప్‌నగర్), కాంజిలి (కపుర్తలా) సరస్సులు ఉన్నాయి.
తమిళనాడు
– ఊటీ: నీలగిరి వద్ద ఉంది. ఇక్కడ పడవ ఇళ్లు ప్రధామైనవి.
– చంబరమ్ బాకం: ఇది చెన్నై వద్ద ఉంది.
తెలంగాణ
– హుస్సేన్‌సాగర్: ఇది ఆలేరు నదిపై ఉంది. ఇందులో కృత్రిమ జిబ్రాల్టర్ రాక్ దీవిగల బుద్ధ విగ్రహం ఉంది.
– ఉస్మాన్‌సాగర్ (గండిపేట): ఇది మూసీనదిపై గండిపేట వద్ద ఉంది.
– హిమాయత్ సాగర్: ఇది ఈసా నదిపై హిమాయత్‌సాగర్ వద్ద ఉంది.
– వీటితోపాటు రాష్ట్రంలో పాకాల, రామప్ప, లక్నవరం, కేసముద్రం, మీర్ ఆలం ట్యాంక్, దుర్గంచెరువు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
– కొల్లేరు సరస్సు: దీని వైశాల్యం 245 చ.కి.మీ. ఇది కృష్ణా నదిపై పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సహజ మంచినీటి చేపల ఉత్పత్తి కేంద్రం.
– పులికాట్ సరస్సు: దీని వైశాల్యం 460 చ.కి.మీ. ఇది ఏపీ నెల్లూరు జిల్లా – తమిళనాడు చెన్నై జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఈ ఉప్పునీటి సరస్సులో శ్రీహరికోట దీవి ఉంది.
కేరళ
– వెంబనాడ్ (అలప్పూజ కొట్టాయం), అష్టముడి (కోలం), కుట్టునాడ్ (కుట్టయాడ్ది), శష్టంకొట్ట (కోలం) సరస్సులు ఉన్నాయి.
– వెంబనాడ్: కేరళలో అతిపెద్ది సరస్సు. ఇది దేశంలో పొడవైన సరస్సు. ఇందులో అనే దీవి ఉంది. ఇది స్నేక్ బోట్ పందేలకు ప్రసిద్ధి.
ఒడిశా
– చిల్కా సరస్సు: ఇది పూరి వద్ద సముద్రతీరం వెంట ఉన్న పెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది పొడవైన (75 కి.మీ.) లాగూన్ సరస్సు. ఇందులో పియలేకుడ్ అనే దీవి ఉంది. ఇది నక్షత్రాకారపు రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి. రిడ్లే నక్షత్రాకారపు తాబేళ్లు దక్షిణ అమెరికా వలసవచ్చి భారతదేశ తూర్పుతీరంలోని ఒడిశా తీరం (ఉత్కల్ తీరం) పియల్కుడ్ దీవిలో గుడ్లు పెట్టి తమ సంతతిని వృద్ధి చెందిస్తున్నాయి.
– ఇంకా కంజియా (భువనేశ్వర్), అన్షూప (బాంకి) సరస్సులు ఉన్నాయి.
నోట్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీటి లోతు, ఉపయోగాలు, ఆకారాలు, ప్రదేశాలను బట్టి సరస్సులను కింది విధంగా వర్గీకరించారు. అవి.. 1) మంచినీటి సరస్సులు 2) ఉప్పునీటి సరస్సులు 3) సహజ సరస్సులు 4) కృత్రిమ సరస్సులు 5) ఆక్స్బౌ సరస్సులు 6) బిలం సరస్సులు
జమ్ముకశ్మీర్‌లోని సరస్సులు
– ఊలార్: ఇది దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. దీన్ని గతంలో మహాపద్మ సరస్ అని పిలిచేవారు. ఈ Oxbow సరస్సు జీలం నది వల్ల ఏర్పడింది.
– దాల్: ఇది శ్రీనగర్‌లో ఉంది. దీన్ని జ్యువెల్ ఇన్ ది క్రౌన్ ఆఫ్ కశ్మీర్‌గా పిలుస్తారు.
– పాంగ్ గాంగ్ సో: ఇది లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దులో ఉంది.
– త్సోమొరి: ఇది లడఖ్‌లో ఉంది.
– ఇంకా ఇవేకాక జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో చాలా సరస్సులు ఉన్నాయి. అవి.. మనస్బాల్, మన్నార్, శేష్నాగ్, సురిన్సార్, నాగిన్.
– జమ్ముకశ్మీర్‌లోని మంచినీటి సరస్సులను ‘టారన్స్’ అని పిలుస్తారు.
– జమ్ముకశ్మీర్‌ను సరస్సుల రాష్ట్రం అని పిలుస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు