భారత్‌లో శీతోష్ణస్థితి ప్రభావం ఎలా ఉంది?
ప్రధాన భూస్వరూపాలు
భూమి ఉపరితలంపై సహజ ప్రక్రియల వల్ల ఏర్పడిన భూ నిర్మితీయ రూపాలను ‘భూస్వరూపాలు’ (Landforms) అంటారు. కాబట్టి భూస్వరూపాల అధ్యయనం అవసరం మానవ జీవితాన్ని ప్రభావితం చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. మానవ జీవితంపై ఉండే ప్రభావం వల్ల వీటిన్నింటి స్వభావాన్ని వివరించేందుకు భూ ఉపరితలంపై వివిధ రకాల భూస్వరూపాలు ఉన్నాయి.
– ఇవి మూడు ప్రధాన భూస్వరూపాలు. అవి.. పర్వతాలు (Mountains), పీఠభూములు (Plateau), మైదానాలు (Plains)
పర్వతాలు
– భూ ఉపరితలంపై పైకి ఎత్తబడి ఉన్న భాగాన్ని (ప్రాంతాన్ని) కొండలు లేదా పర్వతాలు అంటారు. మన దేశంలో కొండల నుంచి పర్వతాలు వేరుగా ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తును కలిగి శిఖర భాగాలు తక్కువ విస్తీర్ణంలో మొనదేలి ఉండే వాటిని ‘పర్వతాలు’, అంతకంటే తక్కువ ఎత్తును కలిగిన (900 మీ. కన్న తక్కువ) వాటిని ‘కొండలు’ అంటారు.
– పర్వతాలను అవి ఏర్పడిన విధానాన్ని అనుసరించి (సాంకేతికంగా) నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి..
– ముడుత పర్వతాలు (Folded Mountains),
– ఖండపర్వతాలు (Block Mountains),
– అగ్నిపర్వతాలు (Volcanic Mountains),
– అవశిష్ట పర్వతాలు (Residual Mountains)
1. ముడుత పర్వతాలు
– ఇవి ఏర్పడిన కాలాన్ని అనుసరించి తిరిగి రెండు రకాలు.
పురాతన ముడుత పర్వతాలు
ఉదా: ఆరావళి పర్వతాలు (భారత్), యూరల్ పర్వతాలు (రష్యా).
నవీన ముడుత పర్వతాలు
ఉదా: హిమాలయాలు (ఆసియా)
– హిమాలయాల్లో ఎత్తయిన శిఖరాలు- మౌంట్ ఎవరెస్ట్ (8850 మీ.-నేపాల్, టిబెట్), కే2-గాడ్విన్ ఆస్టిన్ (8611 మీ. -భారత్), కాంచనగంగ (8598 మీ.-భారత్).
2. ఖండ పర్వతాలు
ఉదా: వింద్య-సాత్పురా పర్వతాలు- భారత్
వాస్జెస్ పర్వతాలు- ఫ్రాన్స్
బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు- జర్మనీ
డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు- దక్షిణాఫ్రికా
3. అగ్నిపర్వతాలు
ఉదా: బారెన్ (క్రియాశీల అగ్నిపర్వతం)- అండమాన్ నికోబార్ దీవులు నార్కొండమ్ (విలుప్తకారక అగ్నిపర్వతం)- అండమాన్ నికోబార్ దీవులు
4. అవశిష్ట పర్వతాలు
ఉదా: పశ్చిమ కనుమలు (మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు), తూర్పుకనుమలు (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా)
పీఠభూములు
– సముద్రమట్టం నుంచి సుమారు 200 మీ. నుంచి 500 మీ. ఎత్తు వరకు ఉండి కొంచెం వాలును కలిగి ఉపరితలం విశాలంగా ఉన్న భూభాగాన్ని పీఠభూములు అంటారు. పీఠభూములు సాధారణంగా దగ్గర ప్రదేశాలు కుచించుకుని ఉండటంతో ఉపరితలభాగం విశాలంగా ఉంటుంది. పర్వతాల వాలుల వెంబడి దూరంగా విస్తరించి విశాలమైన పీఠభూములు ఏర్పడతాయి. పీఠభూములు శిలలు ఇసుకరాయి, సున్నపురాయి, షేల్ వంటి పొరలతో ఉంటాయి.
ఉదా: దక్కన్ పీఠభూమి- దక్షణ భారత్
– చోటానాగ్పూర్ పీఠభూమి- ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్
– కర్ణాటక పీఠభూమి- కర్ణాటక
– మాల్వా పీఠభూమి- మధ్యప్రదేశ్
మైదానాలు
– సముద్ర మట్టం నుంచి సుమారు 200 మీ. ఎత్తు వరకు ఉండి అక్కడక్కడ కొంచెం పల్లపు ప్రాంతాలను లేదా దిగువ తలాలను కలిగి ఉన్న విశాల భూభాగాన్ని మైదానాలు అంటారు. అనేక ఖండాల దేశభాగాలు అధికంగా మైదానాలతో విస్తరించి ఉన్నాయి. కొన్ని మైదానాలు భూమిపై మృదువుగా, సమాంతరంగా, మరికొన్ని చుట్టబడినట్లు లేదా కరుకుగా ఉంటాయి. సాధారణంగా వివిధ రకాలుగా మైదానాలు ఏర్పడటానికి కారణం వివిధ మార్గాల ద్వారా ఏర్పడటం. మైదానాలు భూమి అంతర్గత జలాల వల్ల క్రమక్షయం, నిక్షిప్తం చేందడం అనే ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి.
ఉదా: ఉత్తర మైదానం, నదీ నిక్షేపిత మైదానాలు, పవన నిక్షేపిత మైదానాలు, హిమానీనద నిక్షేపిత మైదానాలు.
ప్రస్తుత రోజుల్లో భూస్వరూపాలు సాధారణత్వం కంటే భరించలేని విధంగా చాలా సంక్లిష్టంగా ఉన్నాయి.
అనేక చక్రీయ విధానాలవల్ల ఏర్పడిన భూస్వరూపాలు ప్రస్తుత రోజుల్లో ఏర్పడిన భూస్వరూపాల సాధారణత్వం కంటే భరించలేని విధంగా చాలా సంక్లిష్టంగా ఉన్నాయని తెలుస్తుంది. అనేక చక్రీయ భూ ప్రదేశాలు రెం లేదా అంతకంటే ఎక్కువ చక్రీయాల వల్ల ఏర్పడి సంక్లిష్టంగా ఉన్నాయి. చక్రీయ భూ ప్రదేశాలు అనేవి సరళంగాను లేదా సమ్మేళనంగాను ఉంటాయి.
– భూ స్వరూపశాస్త్ర సాధారణ చక్రీయత ప్రక్రియ అనేది కొన్ని సమయాల్లో తగ్గిపోవడం, ఆగిపోవడం లేదా వ్యతిరేకంగా ప్రదర్శించడం వల్ల ఫలితం చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
– ప్రస్తుత చక్రీయ విధానాల ద్వారా కాకుండా వివిధ చక్రీయ విధానాలవల్ల ఏర్పడిన వివిధ రకాల భూభాగాల్లో ఉండే మూలకాలను ప్రదర్శితం చేస్తుంది. అదేవిధంగా దశలవారీ క్రమక్షయ ఉపరితలాలు దాంతోపాటు నదుల వాలులు, వంకల ప్రాంతాలు అనేవి చక్రీయ భూ స్వరూపాలకు ఉదాహరణ. సాధారణత్వం కంటే సంక్లిష్టతకు మరొక ఉదాహరణగా పునరుజ్జీవన ప్రక్రియ ద్వారా వివరించవచ్చు.
– పనరుజ్జీవన ప్రక్రియ అనేది సాధారణ చక్రీయత అంతరాయాన్ని, దశల వ్యతిరేకతను తెలుపుతుంది. ఇవి రెండు రకాలు.. 1. అనుకూల 2. ప్రతికూల
– భూ స్వరూపం ఉన్నతి (ఎత్తు పెంచడం) లేదా సముద్రమట్ట రూపాలు తగ్గడం అనేవి ప్రతికూల పునరుజ్జీవనాన్ని సూచిస్తాయి. దీని ఫలితంగా నది అనేది పాత దశ (వృద్ధాప్య) నుంచి యవ్వన దశకు మార్చడం ద్వారా సాధారణ చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
– భూ స్వరూపం ఎత్తును తగ్గించడం లేదా ఆ సముద్రమట్ట రూపాలు పెరగడం అనేవి అనుకూల పునరుజ్జీవనాన్ని సూచిస్తాయి. దీని ఫలితంగా నది ప్రవాహచర్య పురోగతి సంభవిస్తుంది. తద్వారా క్రమక్షయ సాధారణ చక్రం పూర్తికావడానికి వీలు కలుగుతుంది.
– జత చేసిన నది భూభాగాలు, పురాతనమైన ఒండ్రుమైదానాలు, రెండు చక్రీయ లోయలు, మెలికలతో కూడిన కోతలు అనేవి పునరుజ్జీవ భూ ప్రదేశాలకు ఉదాహరణ. తద్వారా ఇది సాధారణంతో పోలిస్తే సంక్లిష్టతను తెలుపుతుంది.
శీతోష్ణస్థితి మార్పులు
దీర్ఘకాలికంగా భూమి, సముద్రాల శీతోష్ణస్థితుల్లోని వైవిద్యతను శీతోష్ణస్థితి మార్పుగా చెప్పవచ్చు.
– భూమి శీతోష్ణస్థితి మార్పుకు కారణం సహజమైన, యాంత్రికమైన, మానవ కారక ప్రక్రియలు, వాటి ఫలితమే హరితగృహ వాయువుల ఉద్గారం. అవే కార్బన్‌డై ఆక్సైడ్, మీథేన్ మొదలైనవి. ఈ రకమైన వాయువులు వాతావరణ పొరలోని స్ట్రాటో ఆవరణంలో నిలుపుదలై ఒక పొరమాదిరిగా ఉండి భూమి ఉపరితలాన్ని వెచ్చబరిచి ‘గ్లోబల్ వార్మింగ్’ను కల్గజేస్తాయి. శీతోష్ణస్థితి విధానాన్ని (నమూనాను) మార్చుతుంది. తద్వారా కాలాల్లో మార్పు, గ్లోబల్ ఉష్ణోగ్రత (అధిక ఉష్ణోగ్రత) పెరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల, వ్యవసాయపరమైన నమూనాల మార్పుల వల్ల తరచు సంభవించే విపత్తులైన సునామీ, భూపలకల కదలిక, కరువులు, దుర్భిక్షాలు, ప్రజల వలస, ఆరోగ్యపరమైన వైపరీత్యాలు కేవలం మనకే కాకుండా పిల్లలకు, వృద్ధులకు సంభవించే అవకాశం ఉంది.
– సహజ వనరులను తప్పనిసరిగా గుర్తించడమనేది అపారమైనది. అదేవిధంగా వాటిని వినియోగించడం తప్పనిసరిగా నియంత్రిత పరిమాణంలోనూ, నియమిత పద్ధతిలోను ఉండేవి. అందువల్ల సుస్థిరాభివృద్ధి తప్పనిసరి సాధ్యమవుతుంది. ప్రకృతిపై విశ్వాసంతో ఇష్టప్రకారం అంగీకరించడానికి వీలుగా పవనశక్తి, జల విద్యుత్ శక్తి, సౌరశక్తి-భూఉష్ణశక్తి, బయోమాస్ (జీవ వ్యర్ధాలు) శక్తిని భవిష్యత్ తరాల శక్తిగా తప్పనిసరిగా పరిశోధించడం, చాలినంతగా వినియోగించడానికి ఈ పద్ధతిని ఉపయోగించాలి.
భారతదేశ జీవవైవిద్యతపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావం కింది విధంగా ఉంది.
– వ్యవసాయం, ఆరోగ్యం, అడవులు, మౌలిక వసతులపై ప్రతికూల ప్రభావం.
వివరణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో ఏటా చోటుచేసుకునే మరణాలకంటే అదనంగా 2.50 లక్షల మరణాలు వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్నాయి.
– వ్యవసాయంపై 2006-16 మధ్య కాలంలో 80 శాతం సాగును కరువు కాటేసింది. ఇది ప్రజల ఆహార భద్రతకు సమస్యగా పరిణమించి వలసలకు దారితీశాయి. అడవుల వినియోగం అధికమవడంతో భూతాపం పెరిగి తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయ, నిర్మాణరంగ కార్మికులు ఆరుబయట పనిచేయలేని పరిస్థితులు ఏర్పడతాయి.
– మౌలిక వసతుల కల్పనలో 2030 నాటికి నిర్మాణరంగంలో ఏటా 19 శాతం పనిగంటలు కోల్పేయే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
– 21వ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రత పెరుగుదల 30C నుంచి 40C వరకు ఉంటుంది.
వివరణ: ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల సముద్ర నీటిమట్టాలు అంచనాలకు మించి వేగంతో పెరుగుతున్నాయని పేర్కొంది. 2100 నాటికి సముద్ర మట్టాలు 30-50 సెం.మీ. పెరుగుతాయని తెలిపింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 45 నగరాలు నీటమునిగే ప్రమాదం ఉంది. వీటిలో కోల్‌కతా, ముంబై, సూరత్, చెన్నై ఉన్నాయని పేర్కొనడం రానున్న విపత్తు తీవ్రతను తెలుపుతుంది.
– గంగామైదాన పశ్చిమభాగం వెంబడి వర్షపాత రోజులు తగ్గిపోయాయి.
– 70 శాతం సహజ ఉద్బిజ సంపద మార్పులకులోనై దుర్భలంగా మారింది.
– జీవజాతులు, ఇతర జీవసంబంధ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు