మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినవారు?
ఆధునిక భారతదేశ చరిత్ర -3
115. ఎవరి పాలనా కాలంలో కంపెనీ కర్నాటక రాజ్యాన్ని తన ప్రత్యక్ష పాలనలోకి తెచ్చుకుంది?
1) నవాబ్ మహ్మద్ అలీ
2) టిప్పు సుల్తాన్
3) ఉమదత్ ఉల్ ఉమ్రా 4) హైదరాలీ
116. 18వ శతాబ్దంలో సంస్కృత విద్యకు కేంద్రం గా మారిన ట్రావెన్కోర్ రాజ్య రాజధానిని గుర్తించండి?
1) క్విలన్ 2) త్రివేండ్రం
3) కోజికోడ్ 4) ఇడుక్కి
117. 18వ శతాబ్దంలో ఆధునిక నౌకాదళాన్ని సమకూర్చుకోడానికి ప్రయత్నించిన భారతీయ పాలకుడు?
1) కృష్ణరాజ్ 2) దేవరాజ్
3) హైదరాలీ 4) టిప్పు సుల్తాన్
118. కింది వాటిలో దేని ద్వారా భారత పరిపాలనా అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయింది?
1) రెగ్యులేటింగ్ చట్టం, 1772
2) చార్టర్ చట్టం, 1813
3) చార్టర్ చట్టం, 1833
4) భారత ప్రభుత్వ చట్టం, 1858
119. 1763లో జరిగిన యుద్ధాల్లో వరుసగా మీర్ ఖాసింను ఓడించిన బ్రిటిష్ అధికారి?
1) మేజర్ ఆడమ్స్
2) కల్నల్ మాలిసన్
3) మేజర్ హెక్టర్ మన్రో
4) కల్నల్ హాల్వెల్
120. 1775లో ఎవరు బెంగాల్ నవాబును ‘ఫాంటమ్, అర్చకుడైన వ్యక్తి’గా పేర్కొన్నారు?
1) కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ సభ్యుడు
2) రాబర్ట్ క్లెవ్
3) కలకత్తా సుప్రీంకోర్టు జడ్జి
4) వారన్ హేస్టింగ్స్
121. 1651వ సంవత్సరంలో ఇంగ్లిష్ వారికి ఏ ప్రాంతంలో వ్యాపారానికి మొగలులు అనుమతి మంజూరు చేసారు?
1) కాసింబజార్ 2) చంద్రనాగోర్
3) గ్లి 4) పైవేవీకాదు
122. బెంగాల్ ప్రభుత్వానికి ప్రథమ గవర్నర్ జనరల్ ఎవరు?
1) రాబర్ట్ క్లెవ్ 2) వారన్ హేస్టింగ్స్
3) లార్డ్ కారన్వాలీస్
4) లార్డ్ హేస్టింగ్స్
123. బ్రిటిష్ పాలనలో సంపద తరలింపు జరిగింది ఎందుకంటే?
1) బ్రిటన్ ప్రపంచంలో అనేక వలస రాజ్యాలను కలిగి ఉంది
2) ఎక్కువ భారత ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన రెవెన్యూను దేశంలో పలు ఖర్చు చేశాయి
3) భారతదేశం నుంచి ఎగుమతి చేసిన సంపద, వనరులకు సరితూగేంత స్థాయిలో ఆర్థికపరమైన లాభాలు తిరిగి దేశానికి రాలేదు
4) 2, 3
124. కింది వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి?
ఎ. దక్కన్ తిరుగుబాట్లు
బి. నీలిమందు తిరుగుబాట్లు
సి. బార్డోలి సత్యాగ్రహం
డి. అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
1) ఎ, బి, సి, డి 2) బి, ఎ, డి, సి
3) డి, సి, బి, ఎ 4) ఎ, బి, డి, సి
125. భారతీయ చేతివృత్తుల క్షీణతకు కారణాలు?
1) ముడి వస్తువులను బ్రిటన్కు ఎగుమతి చేయడం వల్ల ఇండియాలో ముడి పదార్థాల విలువ పెరిగింది
2) వారి వస్తువులను కొనుగోలు చేసే భారతీయ రాజులు, వారి కొలువులోని అధికారులు కనుమరుగయ్యారు
3) బ్రిటిష్ అధికారులు, మిలటరీ పాలకులు వారి స్వదేశ వస్తువులనే కొనుగోలు చేసేవారు
4) పైవన్నీ
126. భారతదేశం నుంచి సంపద ప్రవాహంలా బ్రిటన్కు తరలిపోతున్నదనే సిద్ధాంతాన్ని మొదటిసారి ప్రతిపాదించింది?
1) నౌరోజీ 2) నెహ్రూ
3) తిలక్ 4) హేస్టింగ్స్
127. దేశంలో ఆధునిక యంత్రాధార పరిశ్రమల యుగం ఏ దశాబ్దంలో ప్రారంభమైంది?
1) 1840 2) 1850
3) 1860 4) 1870
128. 1853లో కవాజి నానాభాయ్ మొట్టమొదటి వస్త్ర మిల్లును ఎక్కడ నెలకొల్పారు?
1) మద్రాసు 2) కలకత్తా
3) బొంబాయి 4) సూరత్
129. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూ శిస్తు విధానాలు?
1) శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
2) రైత్వారీ విధానం
3) మహల్వారీ పద్ధతి 4) పైవన్నీ
130. ఇనుము, ఉక్కు, పంచదార వంటి పరిశ్రమలు ఏ దశాబ్దాల్లో స్థాపించారు?
1) 1920-30 2) 1925-35
3) 1910-20 4) 1915-25
131. ఏ సంవత్సరంలో మధ్యకాలంలో భారత పరిశ్రమల అభివృద్ధికి మొట్టమొదట అవకాశం ఏర్పడింది?
1) 1912-16 2) 1914-18
3) 1915-19 4) 1918-21
132. పరిశ్రమల అభివృద్ధి కోసం హాలెండ్ కమిషన్ను ఎప్పుడు నియమించారు?
1) 1916 2) 1918
3) 1920 4) 1922
133. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1793 2) 1795
3) 1797 4) 1799
134. రైత్వారీ విధానాన్ని రూపొందించినవారు?
1) థామస్ మన్రో 2) కెప్టెన్ రీడ్
3) కారన్ వాలీస్ 4) 1, 2
135. భారతీయులు 1918-39 మధ్యకాలంలో అధిక ద్రవ్యోల్బణ రేటును ఎదుర్కోవడానికి కారణం?
1) మొదటి ప్రపంచ యుద్ధం
2) పరిశ్రమలు లేకపోవడం
3) ఎగుమతి అయ్యే ఆహారధాన్యాలు
4) పత్తి, ఉన్ని ఎగుమతి
136. స్త్రీ విద్యాభివృద్ధిలో ఉన్న సమస్యలను విచారించేందుకు మహిళా విద్యపై జాతీయ కమిటీ ఎప్పుడు నియమించారు?
1) 1958 2) 1959
3) 1961 4) 1962
137. 1959లో ఎవరి ఆధ్వర్యంలో జాతీయ విద్యా మండలిని స్థాపించారు?
1) గాంధీజీ 2) దుర్గాబాయి దేశ్ముఖ్
3) కమలాబాయి 4) నెహ్రూ
138. కింది వాటిలో ఉడ్స్ నివేదికలోని ప్రతిపాదనలు ఏవి?
1) విద్యా ప్రమాణాలను పెంచటం
2) పాఠశాలల పర్యవేక్షణకు ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేయాలి
3) టీచర్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం
4) పైవన్నీ
139. భారతీయ భాషల్లో విద్యాభివృద్ధికి, విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించిన కమిషన్?
1) హంటర్ కమిషన్
2) ఉడ్స్ కమిటీ
3) గ్రాంట్స్ కమిషన్
4) జేమ్స్ కమిటీ
140. మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినవారు?
1) అనీబిసెంట్
2) మదన్మోహన్ మాలవీయ
3) రాజారామ్మోహన్రాయ్
4) డి.కె. కార్వే
141. ఏ సంవత్సరంలో ప్రకటించిన విద్యా విధానం, భారతీయ భాషల్లో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు?
1) 1904 2) 1906
3) 1908 4) 1910
142. భారతదేశంలో ఆధునిక విద్యాభివృద్ధికి అంకురార్పణ జరిగిన కాలం?
1) 1751-1812 2) 1813-1853
3) 1854-1900 4) 1901-1943
143. ఇంగ్లిష్ విద్యను పొందినవారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులని ప్రకటించిన గవర్నర్ జనరల్?
1) మెకెన్ లే 2) హేస్టింగ్స్
3) లార్డ్ హోర్డింగ్ 4) శాడ్లర్
144. ‘ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్’ అనే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) బీహార్ 2) బెంగాల్
3) కలకత్తా 4) మద్రాసు
145. దేశంలో యూనివర్సిటీ విద్యపై రాధాకృష్ణన్ కమిషన్ను ఎప్పుడు నియమించారు?
1) 1948-49 2) 1949-50
3) 1950-51 4) 1951-52
146. బొంబాయిలో ఎస్ఎన్డీటీ మహిళా విశ్వ విద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1915 2) 1916
3) 1917 4) 1918
147. స్త్రీ విద్యావ్యాప్తికి కృషి చేసిన సంఘ సంస్కర్త?
1) రాజరామ్మోహన్రాయ్
2) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
3) కందుకూరి వీరేశిలింగం 4) 1, 2
148. జాతీయ విద్యావిధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1968 2) 1969
3) 1970 4) 1971
149. సర్ విలియం జోన్స్ ‘ఆసియాటిక్ సొసైటీ’ని ఎక్కడ స్థాపించారు?
1) కలకత్తా 2) మద్రాసు
3) బెంగాల్ 4) బరోడా
150. 1817లో హిందూ కళాశాలను కలకత్తాలో స్థాపించినవారు?
1) రాజారామ్మోహన్రావు
2) డేవిడ్ హేర్
3) చార్లెస్ ఉడ్ 4) 1, 2
151. భారతదేశంలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన ఆంగ్లేయుడు?
1) బెథ్యూన్ 2) థామస్
3) మెకాలే 4) విలియం జోన్స్
152. భారతీయ విద్యా సర్వీసు ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1897 2) 1898
3) 1899 4) 1900
153. విద్యపై సార్జంట్ ప్రణాళిక ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1) 1942 2) 1943
3) 1944 4) 1945
154. బైబిలును బెంగాలీ భాషలోకి అనువాదం చేసినవారు?
1) విలియం కేరి 2) నీతానియేల్
3) థామస్ 4) బి. హాల్హెడ్
155. ఆధునిక బెంగాలీ గద్యరచనకు పితామనిగా ఎవరిని పేర్కొంటారు?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
2) రాజారామ్మోహన్రాయ్
3) సర్ విలియం జోన్స్
4) విలియం కేరి
156. సార్జంట్ ప్రణాళిక ద్వారా ఎన్ని సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారు?
1) 6-14 2) 7-15
3) 6-12 4) 7-12
157. 1870లో ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ను స్థాపించింది ఎవరు?
1) రాజారామ్మోహన్ రాయ్
2) దేవేంద్రనాథ్ ఠాగూర్
3) కేశవ చంద్రసేన్
4) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
158. భారత జాతీయోద్యమంలో కీలక భూమిక పోషించిన దియోబంద్ వేదాంతి ఎవరు?
1) మహ్మద్ అలీ జిన్నా
2) చిరాగ్ అలీ
3) అబుల్ కలాం ఆజాద్
4) బద్రుద్దీన్ త్యాబ్జీ
159. అలీఘర్ ఉద్యమాన్ని స్థాపించింది?
1) అబుల్ కలాం ఆజాద్
2) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
3) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
4) చిరాగ్ అలీ
160. రాజారామ్మోహన్రాయ్ ఏ సంవత్సరంలో ఆత్మీయసభను స్థాపించారు?
1) 1814 2) 1820
3) 1815 4) 1817
161. జనవరి 17,1830లో ధర్మసభను కలకత్తాలో దేనికి వ్యతిరేకంగా స్థాపించారు?
1) సతి నిషేధం 2) బ్రహ్మ సమాజ్
3) ధగ్గుల అణచివేత
4) బ్రిటిష్ పాలనకు వ్యతిరేకత
162. విగ్రహారాధన, కులవ్యవస్థ నిర్మూలన విధవ పునర్వివాహం లక్ష్యాలుగా ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది?
1) దాదా కొండదేవ్ 2) కె.సి.సేన్
3) ఎం.జి. రనడే
4) దాదోబా పాండురంగ్
163. ‘ది ప్రిసెప్ట్ ఆఫ్ జీసెస్, ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్’ అనే గ్రంథాన్ని 1820లో రచించిన సంఘసంస్కర్త?
1) ఈశ్వర్చంద్ర విద్యాసాగర్
2) ఆత్మారాం పాండురంగ
3) హెన్రీ వివియన్ డిరోజియో
4) రాజారామ్మోహన్రాయ్
164. భారతదేశంలో విద్యాబోధన ఏ భాషలో జరగాలని రాజారామ్మోహన్రాయ్ ఉద్యమించారు?
1) బెంగాలీ 2) సంస్కృతం
3) ఇంగ్లిష్ 4) హిందీ
165. రాజారామ్మోహన్రాయ్ భావాలను ప్రచారం చేయడానికి 1839లో తత్వబోధి సభను దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ స్థాపించారు?
1) లండన్ 2) కలకత్తా
3) ముంబై 4) కటక్
166. దేవేంద్రనాథ్ ఠాగూర్ నడిపిన ‘తత్వబోధి పత్రిక’ ఏ భాషలో వెలువడింది?
1) బెంగాలీ 2) ఇంగ్లిష్
3) పర్షియన్ 4) హిందీ
167. కేశవ చంద్రసేన్ ప్రోద్బలంతో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్థానిక వివాహ చట్టం 1872 ప్రకారం వధూవరులకు ఉండవలసిన కనీస వయసు ఎంత?
1) 18, 14 2) 15, 19
3) 18, 21 4) 14, 18
168. కుల వ్యవస్థను, మూఢనమ్మకాలను నిరసిస్తూ విద్యావంతులైన గుజరాతీలు స్థాపించిన మానవ్ధర్మసభను 1844లో ఏ పట్టణంలో స్థాపించారు?
1) ముంబై 2) సూరత్
3) అహ్మదాబాద్ 4) రాజ్కోట్
169. ముంబైలో 1867లో డా. ఆత్మారాం పాండురంగ్ స్థాపించిన ప్రార్థనా సమాజంలో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించండి?
1) ఎం. జి. రనడే
2) ఆర్. జి. భండార్కర్
3) జ్యోతిబాఫూలే
4) గోపాలకృష్ణ గోఖలే
170. 1875వ సంవత్సరంలో దయానంద సరస్వతి ముంబైలో స్థాపించిన ఆర్య సమాజానికి ప్రత్యేకమైన ఉద్యమం ఏది?
1) కుల వ్యతిరేక ఉద్యమం
2) సతి నిర్మూలన ఉద్యమం
3) బ్రాహ్మణాధిపత్య వ్యతరేక ఉద్యమం
4) శుద్ధి ఉద్యమం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు