తొలివేద యుగంలో ‘నిష్కం’ అని దేన్ని పిలిచేవారు?
భారతదేశ చరిత్ర, సంస్కృతి
గత తరువాయి
25. చనిపోయినవారిని ఆహారం పనిముట్లతో సహా భూమిలో పూడ్చిపెట్టే ఆచారం ఏ యుగంలో ప్రారంభమైంది?
1) సూక్ష్మ శిలాయుగం
2) పూర్వ ప్రాచీన శిలాయుగం
3) మధ్య ప్రాచీన శిలాయుగం
4) ఉత్తర ప్రాచీన శిలాయుగం
26. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేసి, కర్నూలు జిల్లాలో అత్యంత ప్రాచీన శిలాయుగపు పనిముట్లు కనుగొన్నది?
1) సర్ రాబర్ట్ బ్రౌన్
2) ఎస్ ఆర్ రావు
3) రాబర్ట్ బ్రూస్పుట్
4) జాన్ మార్షల్
27. సింధూ ప్రజల వినోదాలు?
1) చదరంగం 2) నృత్యం
3) వేట 4) పైవన్నీ
28. వ్యవసాయం ఏ శిలాయుగంలో ప్రారంభమైంది?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్యశిలాయుగం
3) నవీన శిలాయుగం
4) తామ్ర యుగం
29. మానవులు సంఘజీవనం, సాంఘిక ఆచారాలు ఏ యుగం నుంచి పాటించడం ప్రారంభించారు?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) పైవేవీ కావు
30. మానవుడు ప్రథమంగా మచ్చిక చేసుకున్న జంతువు ఏది?
1) గొరె 2) పంది
3) ఎద్దు 4) కుక్క
31. లిపి ఉన్నప్పటికీ మనం చదవటానికి వీలుకాని యుగాన్ని ఏమంటారు?
1) చరిత్ర పూర్వయుగం
2) ప్రోటో హిస్టారిక్ యుగం
3) చారిత్రక యుగం 4) పైవేవీ కాదు
32. సింధూ ప్రజల ప్రధాన దిగుమతులు?
1) బంగారం 2) రాగి
3) వెండి 4) పైవన్నీ
33. రాతి పెచ్చులతో తయారైన అనేక ప్రాచీన శిలాయుగపు పనిముట్లు మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో విస్తారంగా లభించాయి?
1) నెవాసా 2) నాసిక్
3) దైమాబాద్ 4) అజంతా
34. భారత ఉపఖండంలో అతి ప్రాచీన రాతియుగ పరికరాలు ఏ నదీ లోయలో లభించాయి?
1) గోదావరి 2) గంగా
3) సోన్ 4) కావేరి
35. సింధూ నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది?
1) ఉత్తర ప్రాంతం 2) తూర్పు ప్రాంతం
3) పశ్చిమ ప్రాంతం 4) 1, 3
36. మొహెంజోదారోను స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు?
1) పూర్వీకుల దేవాలయం
2) క్రీడా ప్రాంగణం
3) మృతుల దిబ్బ 4) పైవేవీ కాదు
37. హరప్పా నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది?
1) 1912 2) 1921
3) 1922 4) 1925
38. మొహెంజోదారో ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాలను పర్యవేక్షించింది?
1) సర్ దయారాం సహాని
2) డా. ఆర్.డి. బెనర్జీ
3) సర్ మార్టిమర్ వీలర్
4) మాక్స్ ముల్లర్
39. ఇరానియన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న హరప్పా నగరం?
1) సుర్కోటోడా 2) సుత్కజెందార్
3) ధోలవీర 4) ఆలంగార్పూర్
40. ఇతర హరప్పా నగరాలకు భిన్నంగా మూడు భాగాలుగా విభజితమైన నగరం?
1) సుర్కోటోడా 2) ధోలవీర
3) దైమాబాద్ 4) లోథాల్
41. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దున్నిన పొలం ఎక్కడ బయటపడింది?
1) రోపార్ 2) హరప్పా
3) రంగాపూర్ 4) కాలీబంగన్
42. గుజరాత్లో జరిగిన తవ్వకాల్లో కొత్తగా బయటపడిన హరప్పా నగరం ఏది?
1) ధోలవీర 2) ఖాండియ
3) కుంటాసి 4) మాండా
43. మొహెంజోదారోలో బయటపడ్డ స్నాన వాటికను ఎవరు నిర్మించారు?
1) ఆర్యులు 2) అశోకుడు
3) కనిష్కుడు 4) హరప్పా ప్రజలు
44. సింధూ ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) గుజరాత్ 2) మహారాష్ట్ర
3) పంజాబ్ 4) రాజస్థాన్
45. సింధూ ప్రజలు ముద్రికలను వేటితో తయారు చేశారు?
1) చెక్క 2) కంచు
3) స్టియటైట్ 4) మట్టి
46. సింధూ నగరాల్లో గృహ నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు?
1) కాల్చిన ఇటుకలు 2) వెదురు
3) చెక్క 4) గ్రానైట్
47. హరప్పా సంస్కృతి నిర్మాతలు ?
1) సుమేరియన్లు 2) ఆర్యులు
3) ద్రావిడులు 4) ఆస్ట్రలాయిడ్లు
48. హరప్పా, మెసపటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది?
1) మెలూహ 2) సుమేరియా
3) డెల్మన్ 4) ఇరాన్
49. సింధూ ప్రజల కళాభినివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస్య విగ్రహం ఎక్కడ బయటపడింది?
1) మొహంజొదారో 2) హరప్పా
3) చన్హుదారో 4) కాలీబంగన్
50. ప్రపంచంలో మొదటిసారి పత్తిని పండించిన నాగరికత ?
1) మెసపటోమియా 2) చైనా
3) సింధూ 4) పర్షియా
51. గురం అవశేషాలు బయటపడిన సింధూ ప్రాంతం?
1) సుర్కోటోడా 2) లోథాల్
3) చన్హుదారో 4) బన్వాలి
52. బన్వాలీలో ఏ ధాన్యాలు బయటపడ్డాయి?
1) వరి 2) గోధుమ
3) బార్లీ, ఆవాలు 4) జొన్నలు, సజ్జలు
53. ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం?
1) కాలీబంగన్ 2) లోథాల్
3) హరప్పా 4) మొహెంజోదారో
54. హరప్పా ప్రజలు ఏ వస్తువు తయారీలో అత్యధిక ప్రామాణికతను పాటించారు?
1) పాత్రలు 2) టెరకోట బొమ్మలు
3) ఇటుకలు 4) శిల్పాలు
55. సింధూ నాగరికతలో వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైన నగరాలు?
1) లోథాల్, రంగాపూర్
2) కాలీబంగన్, బన్వాలీ
3) లోథాల్, కాలీబంగన్
4) హరప్పా, మొహెంజోదారో
56. ఆర్.ఎస్.బిస్ట్ 1974వ సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని తవ్వకాల్లో బయటపడిన బన్వాలీ ఏ నది ఒడ్డున ఉంది?
1) జోగవా 2) సరస్వతి
3) ఘగ్గర్ 4) జీలం
57. ‘అమ్మతల్లి’ ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుషదేవుడు ఎవరు?
1) ఇంద్రుడు 2) విష్ణువు
3) బ్రహ్మ 4) పశుపతి
58. మొహెంజోదారోలో బయటపడ్డ పశుపతి మహాదేవుని ముద్రలో లేని జంతువు ఏది?
1) ఏనుగు 2) పులి
3) సింహం 4) దున్నపోతు
59. లోథాల్, చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?
1) నౌకా నిర్మాణం 2) పూసల తయారీ
3) నేత పరిశ్రమ 4) లోహ పరిశ్రమ
60. బహ్రెయిన్ దీవి ద్వారా హరప్పా ప్రజలు మెసపటోమియాతో జరిపిన వర్తకంలో ఏ వస్తువు ముఖ్యమైన హరప్పా ఎగుమతి?
1) లోహాలు, విలువైన రాళ్లు
2) వసా్త్రలు 3) ఆహార ధాన్యాలు
4) టెరకోట బొమ్మలు
61. హరప్పా తవ్వకాల్లో బయటపడిన ఆయుధం?
1) ఖడ్గం 2) ఈటె
3) గొడ్డలి 4) బల్లెం
62. ఘగ్గ్గర్ నదీ తీరంలో ఉన్న కాలీబంగన్ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) దయారాం సహానీ 2) ఎ. ఘోష్
3) మజుందార్ 4) ఎస్.ఆర్.రావు
63. ఉపఖండంలో మొదటిసారి స్థిర వ్యవసాయం జరిగిన ఆనవాళ్లు బయటపడిన ప్రాంతం?
1) కాలీబంగన్ 2) మెహర్ఘర్
3) అమ్రి 4) ఇమాంఘర్
64. వరి ధాన్యం ఆనవాళ్లు లభించిన రంగాపూర్ను ఏ సంవత్సరం కనుగొన్నారు?
1) 1953 2) 1952
3) 1954 4) 1955
65. కోట్డిజి దగ్గర బయటపడిన పూర్వ హరప్పా సంస్కృతి ఏ కారణం వల్ల పతనం చెందింది?
1) భూకంపాలు 2) అగ్ని ప్రమాదం
3) వరదలు 4) పైవేవీకాదు
66. సింధూ ప్రజల పాలకులు ఎవరు?
1) పూజారులు 2) భూస్వాములు
3) యుద్ధవీరులు 4) ధనవంతులు
67. వ్యవసాయ అవసరాల కోసం మొదటిసారి నదులపై ఆనకట్టలను నిర్మించింది ?
1) ద్రావిడులు 2) ఆర్యులు
3) గ్రీకులు 4) పైవేవీ కాదు
68. రుగ్వేదాన్ని ఏ కాలంలో రచించారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు?
1) రాతి యుగం 2) రాగి యుగం
3) కంచు యుగం 4) నవీన శిలాయుగం
69. యుద్ధ విద్యల గురించి వివరించే వేదం?
1) సామవేదం 2) అధర్వణవేదం
3) రుగ్వేదం 4) యజుర్వేదం
70. విశ్వ జననం గురించి రుగ్వేదంలో ఎన్నవ మండలం వర్ణించింది?
1) 5 2) 10 3) 2 4) 7
71. తొలివేద కాలంలో ప్రాముఖ్యత వహించిన ఆర్యతెగ ?
1) కురు 2) మత్స్య
3) భరత 4) క్రివిస్
72. తొలివేద యుగంలో ‘నిష్కం’ అని దేనిని పిలిచేవారు?
1) బంగారు ఆభరణం 2) ఆవు
3) రాగి నాణాలు 4) వెండి నాణాలు
73. సూర్యాంశ అయిన ‘సావిత్రి’ని కీర్తిస్తున్న గాయత్రి మంత్రాన్ని వేద సాహిత్యంలో ఏ గ్రంథం నుంచి గ్రహించారు?
1) రుగ్వేదం
2) చాందోగ్య ఉపనిషత్తు
3) యజుర్వేదం
4) తైత్తరీయ బ్రాహ్మణం
74. మలివేద కాల సామాజిక వ్యవస్థలో ముఖ్య లక్షణం?
1) స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు
2) వృత్తులు నిర్ణయింపబడటం
3) పశుపోషణ స్థానంలో వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది
4) పైవన్నీ
75. తొలి ఆర్యుల ప్రధాన వృత్తి?
1) పశుపాలన 2) నేతి పని
3) విదేశీ వ్యాపారం
4) సుగంధ ద్రవ్యాల వ్యాపారం
76. వేద ఆర్యులకు తెలియని జంతువు ఏది?
1) ఏనుగు 2) సింహం
3) పులి 4) గురం
77. ఆర్యుల జన్మస్థనం గురించి చర్చించిన ‘ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్’ అనే గ్రంథాన్ని రచించింది?
1) బాలగంగాధర తిలక్
2) ప్రొ. మాక్స్ ముల్లర్
3) దయానంద సరస్వతి
4) జె.డి.మోర్గాన్
78. వ్యవసాయ కార్యకలాపాలను గురించి సమాచారం ఏ వేదంలో ఉంది?
1) రుగ్వేదం 2) అధర్వణ వేదం
3) సామవేదం 4) యజుర్వేదం
79. శాసా్త్రల ప్రకారం అనుమతించని, వరుడు తనకన్నా ఎక్కువ వర్ణంలోని స్త్రీని వివాహమాడటాన్ని ఏమంటారు?
1) అనులోమ వివాహం
2) ప్రతిలోమ వివాహం
3) ఆర్ష వివాహం
4) రాక్షస వివాహం
80. వేదాంతాల్లో పూర్వ మీమాంస వేదాంతానికి ప్రారంభికులు ఎవరు?
1) గౌతముడు 2) కపిలుడు
3) పతంజలి 4) జైమిని
81. సుప శాస్త్రం ఏ నైపుణ్యాన్ని గురించి వివరిస్తుంది?
1) తేనెటీగల పెంపకం
2) లోహ విజ్ఞాన శాస్త్రం
3) వ్యవసాయం 4) పాకశాస్త్రం
82. తొలి వేదకాలంలో కీలక భూమిక పోషించి, మలివేద కాలంనాటికి ప్రాముఖ్యత కోల్పోయిన వంశం?
1) భరత 2) కురు
3) పాంచాల 4) ఛేది
83. మానవ జీవితంలో నాలుగు ఆశ్రమ ధర్మాల గురించి ప్రథమంగా తెలిపిన ఉపనిషత్?
1) జాబాల ఉపనిషత్
2) చాందోగ్య ఉపనిషత్
3) ఐతరేయ ఉపనిషత్
4) ముండక ఉపనిషత్
84. సామాజిక కర్మకాండ జన్మ నుంచి మరణం వరకు పాటించాల్సిన సంస్కారాలు ఏ
‘సూత్ర’లో ఉన్నాయి?
1) గృహ్య సూత్రాలు 2) ఉపనిషత్
3) ధర్మసూత్రాలు 4) శ్రౌత్ర సూత్రాలు
85. రుగ్వేదాన్ని రచించిన కాలమేది?
1) 1500 బిసి 2) 1500-1000 బిసి
3) 1000 బిసి 4) 4500 బిసి
86. తెలుపు, నలుపు విభాగాలుగా విభజించిన ఏకైక సంహిత ?
1) రుగ్వేదం 2) సామవేదం
3) యజుర్వేదం 4) అధర్వణ వేదం
87. శ్రౌత్ర, గృహ్య, ధర్మ సూత్రాలు ఏ వేదాంగంలో ఉన్నాయి?
1) నిరుక్త 2) కల్ప
3) శిక్ష 4) జ్యోతిష
88. ఆర్యుల జన్మస్థానం ‘మధ్య ఆసియా’ అని ప్రవచించిన చరిత్రకారుడు?
1) డబ్ల్యూ వాస్ 2) మాక్స్ ముల్లర్
3) రోడ్ 4) పోటో
89. తొలివేద కాలంలో మహిళలకు కూడా సమాన స్థానం కల్పించిన ప్రజాసభ ఏది?
1) సభ 2) సమితి
3) గణ 4) విధాత
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట,
హైదరాబాద్
సమాధానాలు
25.1 26.3 27.4 28.2 29.2 30.4 31.2 32.4 33.1 34.3 35.4 36.3 37.2 38.2 39.2 40.2
41.4 42.1 43.4 44.1 45.3 46.1 47.3 18.1 49.3 50.3 51.1 52.3 53.1 54.3 55.1 56.2
57.4 58.3 59.2 60.2 61.1 62.2 63.2 64.1 65.2 66.1 67.1 68.3 69.2 70.2 71.1 72.1
73.1 74.4 75.1 76.3 77.1 78.2 79.2 80.4 81.4 82.1 83.1 84.1 85.2 86.3 87.2 88.2 89.4
- Tags
- competitive exams
- Groups
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు