‘బంగారు ఫర్మానా’ను జారీ చేసినది?
శాతవాహనుల నుంచి అసఫ్జాహీల వరకు..
1. నాణేలపై ఉజ్జయినీ పట్టణ గుర్తు ముద్రించినది?
1) శాతకర్ణి-1 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) 1, 2
2. దక్షిణాది అశోకుడిగా పేరుగాంచింది?
1) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) రుద్రపురుష దత్తుడు
4) గౌతమీపుత్ర శాతకర్ణి
3. కరీంనగర్ జిల్లాలోని గంగాధర పట్టణాన్ని రాజధానిగా పరిపాలించిన వేములవాడ చాళుక్య రాజు?
1) అరికేసరి-2
2) వినయాదిత్య యుద్ధమల్లుడు
3) బద్దెగ-2 4) వేగరాజు
4. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలతో కూడిన వరి పండించారని పేర్కొన్నది?
1) మార్కోపోలో 2) విద్యానాథుడు
3) వినుకొండ వల్లభామాత్యుడు
4) జాయపసేనాని
5. శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధిచెందిన మహేశ్వర క్షేత్రానికి ద్వార మండపాన్ని నిర్మించినది?
1) లింగమనేడు
2) మాదా నాయకుడు
3) అనవోతా నాయకుడు
4) సింగమ నాయకుడు-1
6. కింది వాటిలో సరైనవి?
1) ఉస్మానియా గ్రాడ్యుయేషన్ అసోసియే షన్ వారు 1935 నుంచి హైదరాబాద్ పారిశ్రామిక ప్రదర్శనను శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడం మొదలుపెట్టారు
2) ఈ పారిశ్రామిక ప్రదర్శనను ‘నుమాయిష్’ అంటారు
3) 1 4) 1, 2
7. కింది వాటిలో ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితం ఇచ్చిన రచన?
1) యయాతి చరిత్ర
2) తపతీ సంవరణోపాఖ్యానం
3) సుగ్రీవ విజయం 4) పైవన్నీ
8. కింది వాటిని జతపర్చండి?
1. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎ. 1937
2. దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ బి. 1927
3. సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ సి. 1939
4. వీఎస్టీ ఫ్యాక్టరీ డి. 1919
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
9. ఫ్రయర్ జోర్డానెస్ తన ‘వండర్స్ ఆఫ్ ది ఈస్ట్’లో కాకతీయుల ఏ గొప్పతనాన్ని గురించి పేర్కొన్నాడు?
1) వర్తక, వ్యాపారాలు
2) వ్యవసాయ పంటల గొప్పదనం
3) పరిపాలన 4) ఆర్థిక వ్యవస్థ
10. ‘కాంట్ ఆఫ్ ఇండియా’ బిరుదు కలిగినది?
1) ధర్మకీర్తి 2) భావ వివేకుడు
3) ఆర్యదేవుడు 4) బుద్ధఘోషుడు
11. రోమ్ దేశ బంగారం భారత్కు తరలిపోతుంద ని తన ‘నేచురల్ హిస్టరీ’లో పేర్కొన్నది?
1) టాలమీ 2) మెగస్తనీస్
3) ప్లీనీ 4) అరిస్టాటిల్
12. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
1) శాతవాహనులు 2) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు
4) వేములవాడ చాళుక్యులు
13. కాకతీయుల కాలంలో సమయాలు అంటే?
1) కుల సంఘాలు 2) వర్తక సంఘాలు
3) పాఠశాలలు 4) అంగళ్లు
14. కందుకూరి రుద్రకవి రచనలేవి?
1) సుగ్రీవ విజయం
2) నిరంకుశోపాఖ్యానం
3) జనార్దనాష్టకములు 4) పైవన్నీ
15. కూచిపూడి భాగవతులకు కూచిపూడి గ్రామాన్ని ఇనామ్గా ఇచ్చిన కుతుబ్షాహీ పాలకుడు?
1) ఇబ్రహీం కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) మహ్మద్ కులీకుతుబ్ షా
16. బ్రిటిష్ వారు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదును ఎవరికి ఇచ్చారు?
1) అఫ్జల్ ఉద్దౌలా 2) నాసిరుద్దౌలా
3) నిజాం అలీఖాన్
4) మీర్ ఉస్మాన్ అలీఖాన్
17. కుతుబ్ షాహీల కాలంలో నౌకా పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన పట్టణం?
1) నర్సపట్నం 2) నర్సాపురం
3) మచిలీపట్నం 4) గోల్కొండ
18. యుద్ధంలో సాధించిన ఒక్కో విజయానికి గుర్తుగా కీసరగుట్టపై ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినది?
1) మాధవ వర్మ-1 2) మాధవ వర్మ-2
3) ఇంద్రభట్టారక వర్మ
4) గోవింద వర్మ
19. ఏ ఇక్ష్వాక రాజు కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది?
1) ఎహూవల శాంతమూలుడు
2) వీరపురుష దత్తులు
3) రుద్రపురుష దత్తుడు
4) శ్రీశాంతమూలుడు
20. కింది వాటిలో సరైనవి?
1) 1797లో కల్నల్ మెకంజీ అమరావతి స్థూపాన్ని కనుగొన్నాడు
2) అమరావతి స్థూపాన్ని శాతవాహన రాజు రెండో పులోమావి కాలంలో నిర్మించారు
3) 1 4) 1, 2
21. ‘ఘటికలు’ అనే వైదిక విద్యాలయాలు స్థాపించిన విష్ణుకుండిన రాజు?
1) మాధవ వర్మ-2
2) ఇంద్రభట్టారక వర్మ
3) మంచన భట్టారక వర్మ
4) గోవింద వర్మ
22.ఘూర్జర ప్రతీహార మహిపాల చక్రవర్తిని ఓడించిన వేములవాడ చాళుక్యరాజు?
1) రెండో నరసిండు
2) రెండో అరికేసరి
3) బద్దెగుడు 4) మూడో అరికేసరి
23. హనుమకొండలో ‘సిద్ధేశ్వరాలయం’ను నిర్మించినది?
1) ప్రోలరాజు-1 2) రుద్రదేవుడు
3) ప్రోలరాజు-2 4) మహాదేవుడు
24. కింది వాటిలో సరైనవి?
1) కిళరము- గొరెల మందపై పన్ను
2) గణాచార పన్ను- వేశ్యలపై పన్ను
3) ఇల్లరి- ఇంటి పన్ను 4) పైవన్నీ
25. గోల్కొండలో ఆంగ్లేయులు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి ‘బంగారు ఫర్మానా’ను 1636లో జారీచేసినది?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్ షా
3) ఇబ్రహీం కుతుబ్ షా
4) సుల్తాన్ కులీకుతుబ్ షా
26. రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన అసఫ్ జాహీ నవాబు?
1) నలాబత్ జంగ్ 2) నాసిరుద్దౌలా
3) నిజాం అలీఖాన్ 4) అఫ్జలుద్దౌలా
27. కింది వాటిలో సరైనవి?
1) డచ్ వారికి గోల్కొండ రాజ్యంలో వర్తకా నికి అనుమతిచ్చింది సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా
2. ఆంగ్లేయులకు గోల్కొండ రాజ్యంలో వర్తకానికి అనుమతిచ్చింది సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా
3) 1 4) 1, 2
28. ఓరుగల్లు కోటకు నాలుగు వైపుల ‘నాలుగు శిలా నిర్మిత తోరణాలు’ నిర్మించినది?
1) గణపతి దేవుడు 2) రుద్రమ దేవి
3) ప్రతాపరుద్ర-2 4) మహాదేవుడు
29. సోమదేవ సూరి ‘యశస్థిలక చంపూ కావ్యం’ను ఎవరి కాలంలో పూర్తిచేశారు?
1) మూడో అరికేసరి 2) భద్రదేవుడు
3) వాగరాజు 4) రెండో అరికేసరి
30. కింది వాటిలో సరైనవి?
1) కాజీపేట శాసనం ప్రకారం రెండో బేతరాజు రామేశ్వర పండితునికి వైజనపల్లి గ్రామాన్ని ‘శివపురం’ పేరుతో దానం చేశాడు
2) మొదటి కాకతీయ రాజులు ‘కాలాముఖ’ శాఖను ఆదరించి పోషించారు
3) 1 4) 1, 2
31. కింది వాటిలో పోతన రచనలు?
1) వీరభద్ర విజయం 2) భోగినీ దండకం
3) నారాయణ శతకం 4) భాగవతం
32. కన్నడ కవిత్రయంలో మొదటివాడు, ఆదికవిగా పిలిచే ‘పంప మహాకవి’ ఎవరి ఆస్థానంలో నివసించాడు?
1) మొదటి అరికేసరి 2) రెండో అరికేసరి
3) యుద్ధమల్లుడు 4) మూడో అరికేసరి
33. ప్రసూతి వైద్య కేంద్రాల గురించి తెలుపుతున్న రుద్రమ దేవి శాసనం?
1) మల్కాపురం 2) బీదర్ కోట
3) ఓరుగల్లు 4) కాజీపేట
34. హైదరాబాద్కు ‘సుల్తాన్ నగర్’గా నామకరణం చేసింది?
1) మహ్మద్ కులీకుతుబ్ షా
2) సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) అబుల్ హసన్ తానీషా
35. బయ్యారం చెరువు శాసనం వేయించినది?
1) మైలాంబ 2) మైలమ్మ
3) రుద్రమ 4) ముమ్మడమ్మ
36. సోలదగండ (అపజయమెరుగని) బిరుదు పొందిన వేములవాడ చాళుక్య రాజు?
1) వినయాదిత్య యుద్ధమల్లుడు
2) బద్దెగుడు 3) రెండో అరికేసరి
4) వాగరాజు
37. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా హిందూ గుహాలయాలను నిర్మించినది?
1) శాతవాహనులు 2) విష్ణుకుండినులు
3) ఇక్ష్వాకులు 4) వేములవాడ చాళుక్యులు
38. నాగార్జునకొండ వద్ద బయల్పడిన అశ్వమేధ యాగ వేదిక ఎవరి కాలానికి చెందినది?
1) ఇక్ష్వాకులు 2) శాతవాహనులు
3) కాకతీయులు 4) చాళుక్యులు
39. దశరథ రాజనందన చరిత్రను రచించినది?
1) అద్దంకి గంగాధర కవి
2) పొన్నెగంటి తెలగనార్యుడు
3) మరింగంటి సింగరాచార్యులు
4) రుద్రకవి
40. కుతుబ్ షాహీల సమాచార వ్యవస్థను వర్ణించిన ఫ్రెంచి యాత్రికుడు?
1) థెవ్నాట్ 2) ట్రావెర్నియర్
3) రూమీఖాన్ 4) బెర్నియార్
41. రావిపాటి త్రిపురాంతక కవి రచనలు?
1) ప్రేమాభిరామం 2) మదన విజయం
3) అంబికా శతకం 4) పైవన్నీ
42. ‘మత్స్య పురాణం’ను ఏ శాతవాహన రాజు కాలంలో రచించారు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో శాతకర్ణి 4) పులోమావి
43. కింది వాటిలో సరైనవి?
1) హిరణికుడు- కోశాధికారి
2) ప్రతీహారుడు- కోట రక్షకుడు
3) స్కందవారాలు- తాత్కాలిక సైనిక శిబిరాలు
4) పైవన్నీ
44. గౌతమీపుత్ర శాతకర్ణి ఆదరించిన బౌద్ధమత శాఖ?
1) మహాసాంఘిక 2) హీనయాన
3) వజ్రయాన 4) భద్రయానిక
45. పుష్పభద్ర ఆలయాన్ని నిర్మించిన ఇక్ష్వాక రాజు?
1) శాంతమూలుడు 2) వీరపురుష దత్తుడు
3) రుద్రపురుష దత్తుడు 4) పులోమావి
46. ఉత్తర భారత్ నుంచి అనేకమంది బ్రాహ్మణు లను రప్పించి అగ్రహారాలను దానం చేసినది?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
3) యజ్ఞశ్రీ శాతకర్ణి
4) వీరపురుష దత్తుడు
47. విష్ణుకుండినుల రాజధానిగా విరాజిల్లినది?
1) ఇంద్రపాల నగరం 2) అమరపురం
3) దెందులూరు 4) పైవన్నీ
48. కిందివాటిలో సరైనవి?
1) విక్రమార్జున విజయం- పంప కవి
2) యశస్థిలక చంపూ- సోమదేవ సూరి
3) కవి జనాశ్రయం- మల్లియ రేచన
4) పైవన్నీ
49. వేములవాడ చాళుక్యులు ఆదరించిన మతం?
1) జైనం 2) శైవం
3) వైష్ణవం 4) బౌద్ధం
50. కాకతీయుల గురించి ప్రప్రథమంగా పేర్కొన్న శాసనం?
1) కురవిగట్టు 2) మాగల్లు
3) మోటుపల్లి 4) నాసిక్
51. మొగల్ చక్రవర్తి షాజహాన్ ఏ కుతుబ్షాహీ సుల్తాన్ కాలంలో గోల్కొండ రాజ్యంపై దాడి చేశాడు?
1) అబుల్ హసన్
2) మహ్మద్ కుతుబ్ షా
3) అబ్దుల్లా కుతుబ్ షా
4) సుల్తాన్ మహ్మద్
52. రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించిన సంవత్సరం?
1) క్రీ.శ. 1162 2) క్రీ.శ. 1161
3) క్రీ.శ. 1163 4) క్రీ.శ. 1164
53. శ్రీపర్వతం మీద నిలువెత్తు బంగారు బుద్ధ విగ్రహాలున్నట్లు తెలిపినది?
1) ఇత్సింగ్ 2) యాన్త్సాంగ్
3) ఫాహియాన్
4) ఆచార్య నాగార్జునుడు
54. విష్ణుకుండినుల కాలంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యేవని తెలిపినది?
1) ఫాహియాన్ 2) ఇత్సింగ్
3) యాన్త్సాంగ్ 4) ప్లీనీ
సమాధానాలు
1-4, 2-2, 3-3, 4-1, 5-2, 6-4, 7-2, 8-4, 9-2, 10-1, 11-3, 12-2, 13-1, 14-4, 15-2, 16-1, 17-2, 18-2, 19-1, 20-4, 21-2, 22-1, 23-3, 24-4, 25-2, 26-3, 27-4, 28-1, 29-3, 30-4, 31-4, 32-2, 33-1, 34-2, 35-1, 36-2, 37-2, 38-1, 39-3, 40-2, 41-4, 42-2, 43-4, 44-1, 45-3, 46-2, 47-4, 48-4, 49-1, 50-2, 51-3, 52-1, 53-2, 54-1,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు