1969 తెలంగాణ ఉద్యమంలో మహిళా విద్యార్థులకు అధ్యక్షురాలు? (TS TET Special)

48. కిందివాటిలో సరైనవి
ఎ) ఒకే ఆలోచన, ఒకే ఏజెండా, ఒకే జెండా అనే నినాదం ఇచ్చినది తెలంగాణ జన పరిషత్
బి) ప్రత్యేక రాష్ట్రం కోసం 1997లో గాదె ఇన్నయ్య తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు
సి) నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ వ్యవస్థను వివరిస్తూ రాజారెడ్డి రాసిన పుస్తకం ఫ్లోరోసిస్ డి) పైవన్నీ
49. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1989లో తెలంగాణ పోరాట సమితిని ఏర్పాటు చేసినది?
ఎ) మేచినేని కిషన్ రావు
బి) కోహెడ ప్రభాకర్ రెడ్డి
సి) కె.ఆర్. ఆమోస్
డి) పై వారందరూ
50. మార్చ్‌లో జరిగిన విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో సింగిడి రచయితల సంఘం తీసుకువచ్చిన కవితా సంకలనం?
ఎ) పొక్కిలి బి) జయశిఖరం
సి) దిమ్మిస డి) మునుము
51. తెలంగాణ మీద ఖర్చు పెట్టవలసి ఉండి పెట్టకుండా మిగిలిపోయిన నిధులు రూ. 34.10 కోట్లని పేర్కొన్న కమిటీ?
ఎ) కుమార్ లలిత్ కమిటీ
బి) జస్టిస్ భార్గవ కమిటీ
సి) వాంఛూ కమిటీ
డి) తెలంగాణ ప్రాంతీయ సంఘం
52. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఏర్పడిన సంవత్సరం
ఎ) 1990 బి) 1991
సి) 1992 డి) 1993
53. జగిత్యాల జైత్రయాత్ర జరిగినది?
ఎ) సెప్టెంబర్ 7, 1978
బి) సెప్టెంబర్ 8, 1978
సి) సెప్టెంబర్ 9, 1978
డి) సెప్టెంబర్ 10, 1978
54. 1969 మే 20న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ప్రొఫెసర్ల సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించిన వారు?
ఎ) ప్రొఫెసర్ జయశంకర్
బి) తోట ఆనందరావు
సి) శ్రీధర్‌స్వామి
డి) పైవారందరూ
55. 1969 ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్?
ఎ) కృష్ణ కాంత్
బి) వట్టం థానూ పిళ్లై
సి) ఖండూభాయ్ దేశాయ్
డి) ఆర్.బి. భండారి
56. జయభారత్ రెడ్డి కమిటీని నియమించిన ముఖ్యమంత్రి?
ఎ) ఎన్టీ రామారావు
బి) చెన్నారెడ్డి
సి) భవనం వెంకట్రావ్
డి) విజయ భాస్కర్ రెడ్డి
57. 1971లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి సాధించిన స్థానాలు?
ఎ) 11 బి) 14 సి) 12 డి) 10
58. కింది వాటిలో తెలంగాణ విద్యావంతుల వేదిక ముద్రించిన పుస్తకాలు?
ఎ) భూమి పుండు బి) నీళ్లు-నిజాలు
సి) చెదిరిన చెరువు డి) పైవన్నీ
59. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించినది?
ఎ) మార్చి 24,2013
బి) మార్చి 21, 2013
సి) మార్చి 12, 2013
డి) మార్చి 11, 2013
60. కిందివాటిని కాలక్రమంలో అమర్చండి?
i) మిలియన్ మార్చ్ ii) సకలజనుల సమ్మె
iii) తెలంగాణ మార్చ్ iv) వంటావార్పు
ఎ) i, ii, iii, iv బి) ii, i, iii, iv
సి) iii, ii, i, iv డి) i, iv, ii, iii
61. సరికాని జతను గుర్తించండి
ఎ) తెలంగాణ ప్రజాఫ్రంట్ – గద్దర్
బి) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆకుల భూమయ్య
సి) నగారా భేరి బెల్లయ్య నాయక్
డి) తుడుందెబ్బ నర్సింగరావు
62. 1952 ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన పోలీసు కాల్పులపై నియమించిన కమిషన్ అధ్యక్షుడు?
ఎ) కిషన్ ప్రసాద్
బి) రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి
సి) మురళీ మనోహర్
డి) పింగళి జగన్మోహన్
63. 1969 ఉద్యమంలో పోలీస్ కాల్పుల్లో మొదట అమరుడైన వ్యక్తి?
ఎ) శంకర్ బి) ప్రేమ్ కిషోర్
సి) యాదయ్య డి) రవీంద్రనాథ్
64. ఆపరేషన్ పోలోకి చేసిన ఖర్చుని కింది ఏ శాఖలో నమోదు చేశారు.
ఎ) హోంశాఖ బి) విద్యాశాఖ
సి) సంక్షేమ శాఖ డి) వ్యవసాయశాఖ
65. క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని తెరపైకి తెచ్చినది?
ఎ) శ్రీధర్ రెడ్డి బి) పురుషోత్తమ రావు
సి) మల్లికార్జున్ డి) ఆకుల భూమయ్య
66. తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం అనే కరపత్రాన్ని ముద్రించింది.
ఎ) ప్రొ. జయశంకర్
బి) ప్రొ. కోదండరాం
సి) పట్టాభి రామయ్య
డి) కేశవ్ రావ్ జాదవ్
67. కిందివారిలో వాంఛూ కమిటీలో సభ్యులు కానివారు?
ఎ) నిరెన్ డే బి) ఎం.సి. సెతల్వాడ్
సి) జస్టిస్ భార్గవ్ డి) ఎవరూకాదు
68. కింది వాటిని జతపరచండి?
i) తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి a) మల్లికార్జున్
ii) తెలంగాణ విద్యార్థుల పరిరక్షణ సమితి b) వెంకటరామి రెడ్డి
iii) పోటీ తెలంగాణ ప్రజాసమితి c) శ్రీధర్ రెడ్డి
iv) తెలంగాణ విమోచనోద్యమ సమితి d) కాళోజీ
ఎ) i-a ii-b iii-c iv-d
బి) i-d ii-c iii-b iv-a
సి) i-a ii-b iii-d iv-c
డి) i-d ii-b iii-c iv-a
69. “తెలంగాణ – ఆంధ్ర రాజీ క్యా కరేంగీ ఇందిరా జీ” అన్నది?
ఎ) అద్వానీ
బి) వాజ్‌పేయి
సి) శిబుసోరెన్
డి) శ్యాం ప్రసాద్ ముఖర్జీ
70. మా తెలంగాణ పత్రిక కింది ఏ సందర్భాల్లో ప్రత్యేక సంచికలు విడుదల చేసింది?
ఎ) 1989లో కల్వకుర్తి ఎన్నికల్లో ఎన్టీఆర్ పోటీ చేసినపుడు
బి) 1997లో మలిదశ ఉద్యమం ప్రారంభమైనపుడు
సి) 2001లో టీఆర్ఎస్ ఏర్పడినపుడు
డి) పైవన్నీ
71. తెలంగాణ ప్రాంతీయ సంఘం చివరి అధ్యక్షుడు?
ఎ) జి.వి. నర్సింగరావు
బి) అచ్యుత రెడ్డి
సి) జువ్వాడి చొక్కారావు
డి) హయగ్రీవాచారి
72. రాజోలీ బండ డైవర్షన్ పథకం సమస్యపై నిరాహార దీక్ష చేసింది?
ఎ) రవీంద్రనాథ్ రెడ్డి
బి) దుశ్చర్ల సత్యనారాయణ
సి) కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) శ్రీనివాస్ గౌడ్
73. సకల జనుల సమ్మె మొదలవుతున్నట్లు కేసీఆర్ ఏ సభలో ప్రకటించారు?
ఎ) సింహగర్జన బి) జనగర్జన
సి) తెలంగాణ గర్జన డి) పోరుగర్జన
74. శ్రీకృష్ణ కమిటీ రహస్య అధ్యాయంపై కేసును విచారణ చేసిన న్యాయమూర్తి?
ఎ) సుదర్శన్ రెడ్డి
బి) ఎల్. నరసింహారెడ్డి
సి) శ్రీ రంగారావు
డి) కొండా మాధవరెడ్డి
75. హైదరాబాద్ రెండు రాష్ర్టాలకు ఉమ్మడి రాజధానిగా ఎన్ని సంవత్సరాలు ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించింది?
ఎ) 7 బి) 10 సి) 5 డి) 3
76. సడక్ బంద్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది?
ఎ) శంషాబాద్ అలంపూర్
బి) శంషాబాద్- నల్ల్లగొండ
సి) శంషాబాద్- వరంగల్
డి) శంషాబాద్- మెదక్
77. 1970వ దశకంలో తెలంగాణ సెంటిమెంట్ రిఫరెండమ్‌గా జరిగిన ఎన్నికలు?
ఎ) ఖైరతాబాద్ ఉప ఎన్నిక
బి) మేడ్చల్ ఎన్నిక
సి) సిద్దిపేట ఎన్నిక డి) ఎ, సి
78. 1969 ఉద్యమంలో భాగంగా ఎన్జీవోలు ఎన్ని రోజులు సమ్మె చేశారు?
ఎ) 25 రోజులు బి) 30 రోజులు
సి) 35 రోజులు డి) 40 రోజులు
79. ‘రెడ్డి హాస్టల్’ సభలో మొట్టమొదటి సారిగా తెలంగాణ పటాన్ని ఆవిష్కరించినది?
ఎ) సదాలక్ష్మి
బి) టి. పురుషోత్తమరావు
సి) రామచంద్రరావు
డి) యస్.బి.గిరి
80. తెలంగాణలో పర్యావరణాన్ని సంరక్షించడానికి రూపొందించిన హరిత హారం పథకాన్ని జూలై 3,2015లో సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) చిలుకూరు బి) చింతమడక
సి) గజ్వేల్ డి) యాదాద్రి
81. భారతదేశం మొత్తంమీద త్వరగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్‌ను సూచించిన కమిటీ?
ఎ) ప్రణబ్ ముఖర్జీ కమిటీ
బి) శ్రీకృష్ణ కమిటీ
సి) ఆంటోని కమిటీ
డి) రోశయ్య కమిటీ
82. 1997, ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో ఆవిష్కరించిన సంస్థ?
ఎ) తెలంగాణ మహాసభ
బి) తెలంగాణ ఐక్యవేదిక
సి) తెలంగాణ జనసభ
డి) తెలంగాణ ప్రగతి వేదిక
83. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపించిన 12 పాల శీతలీకరణ కేంద్రాలను మూయించిన వారు?
ఎ) చంద్రబాబు నాయుడు
బి) దామోదరం సంజీవయ్య
సి) ఎన్టీ రామారావు
డి) అంజయ్య
84. తెలంగాణలో కవులే లేరన్న వాళ్లకు సమాధానంగా 1934లో ఏ పేరుతో 354 మంది తెలంగాణ కవుల కవితలు వెలువడ్డాయి?
ఎ) తెలంగాణ కవులు
బి) తెలంగాణ కవితలు
సి) గోలకొండ కవుల సంచిక
డి) తెలంగాణ కవుల సంచిక
85.1985లో వచ్చిన జీవో 610 ఎప్పటిలోగా అమలు చేయాలని ఎన్టీ రామారావు సూచించారు?
ఎ) 1985 బి) 1986
సి) 1987 డి) 1988
86. మా తెలంగాణ పత్రిక ఏ సంవత్సరంలో ఎవరు వెలువరించారు?
ఎ) 1990, నాట్యకళ ప్రభాకర్
బి) 1991 గూడూరు సత్యనారాయణ
సి) 1992 రావి సూర్యనారాయణ
డి) 1993 రామకృష్ణ్ణారావు
87. ప్రత్యేక తెలంగాణ ఫోరం (1992) ఎవరి నాయకత్వంలో ఏర్పడింది?
ఎ) పీవీ నరసింహారావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) జువ్వాడి చొక్కారావు
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
88. వ్యవసాయ భూములు గరిష్ట పరిమితి చట్టాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి?
ఎ) జలగం వెంగల రావు
బి) మర్రి చెన్నారెడ్డి
సి) పీవీ నరసింహారావు
డి) బ్రహ్మానంద రెడ్డి
89. ఖమ్మం జిల్లా థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను తొలిసారి వెలుగులోకి తెచ్చినది ఎవరు?
ఎ) రవీంద్రనాథ్ బి) కవిరాజ మూర్తి
సి) కొలిశెట్టి రామదాసు డి) మల్లికార్జున్
90. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి ఏ గుర్తుపైన పోటీ చేసింది?
ఎ) కొడవలి బి) పార
సి) నాగలి డి) గొడ్డలి
91. హైదరాబాద్ స్వాతంత్య్ర పోరాటాలు- అనుభవాలు గ్రంథ రచయిత?
ఎ) స్వామి రామానంద తీర్థ
బి) మాడపాటి హనుమంతరావు
సి) జె.వి. నర్సింగరావు
డి) బూర్గుల రామకృష్ణారావు
92. తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏ సంవత్సరంలో చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది?
ఎ) 1956 బి) 1957
సి) 1958 డి) 1959
93. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టును ఆశ్రయించిన వారు?
ఎ) వందేమాతరం రామచంద్రారావు
బి) మందుముల నరసింగరావు
సి) దామోదరం సంజీవయ్య
డి) కోట్ల విజయ భాస్కర రెడ్డి
94. పెద్ద మనుషుల ఒప్పందంలోని మౌలిక విషయాలను ఆంధ్రపాలకులు మరచిపోతున్నారని రాజ్యసభలో అన్న తెలంగాణ సభ్యుడు?
ఎ) వి.కె.ధగే బి) హరిశ్చంద్ర రెడ్డి
సి) మహాదేవ్ సింగ్ డి) అచ్యుతరెడ్డి
95. 1969 తెలంగాణ ఉద్యమంలో మహిళా విద్యార్థులకు అధ్యక్షురాలు?
ఎ) సంగం లక్ష్మీబాయి
బి) ఈశ్వరీభాయి
సి) సదాలక్ష్మి డి) ఏవరూకాదు
96. హైదరాబాద్ రాష్ర్టానికి పౌర పాలకునిగా నియమితుడైన ఎం.కె.వెల్లోడి ఏ రాష్ర్టానికి చెందిన ఐపీఎస్ అధికారి?
ఎ) తమిళనాడు బి) కర్ణాటక
సి) కేరళ డి) మహారాష్ట్ర
97. నిజాం సంస్థానంలో అతిపెద్ద తెలంగాణ జాగీర్దారు?
ఎ) విసునూరి రామచంద్రారెడ్డి
బి) జన్నారెడ్డి ప్రతాపరెడ్డి
సి) కల్లూరి దేశ్‌ముఖ్
డి) సూర్యాపేట దేశ్‌ముఖ్
98. తెలంగాణ తొలి దళిత కవి?
ఎ) ఎండ్లూరి సుధాకర్
బి) బొజ్జా తారకం
సి) కత్తి పద్మారావు డి) దున్న ఇద్దాసు
99. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఆవిర్భవించింది?
ఎ) మే 2000 బి) మే 2002
సి) మే 2004 డి) మే 2006
సమాధానాలు
48-డి 49-డి 50-సి 51-ఎ 52-బి 53-ఎ 54-డి 55-సి 56-ఎ 57-డి 58-డి 59-బి 60-డి 61-బి 62-డి 63-ఎ 64-బి 65-ఎ 66-సి 67-సి 68-ఎ 69-బి 70-డి 71-సి 72-ఎ 73-బి 74-బి 75-బి 76-ఎ 77-డి 78-సి 79-బి 80-ఎ 81-బి 82-ఎ 83-సి 84-సి 85-బి 86-ఎ 87-బి 88-సి 89-సి 90-బి 91-ఎ 92-సి 93-ఎ 94-బి 95-డి 96-సి 97-బి 98-డి 99-సి
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
-
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
-
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
-
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
-
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
-
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
-
English Grammar | We should all love and respect
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
Groups Special – Science | సహజ శక్తి అనంతం … కాలుష్య రహితం.. పర్యావరణ హితం
DSC SGT MATHS | చతురస్రాకార పొలం వైశాల్యం 1024 చ.మీ అయితే దాని భుజం ?
Physics – IIT/NEET Foundation | The acceleration of a body has the direction of
Economy – Groups Special | అండమాన్‌లో అల్పం… దాద్రానగర్‌లో అధికం
Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?