ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్పిన పథకం (TS TET Special)
1. కింది వారిలో వెల్లోడి ప్రభుత్వంలోని మంత్రివర్గ సభ్యులు కానివారు
ఎ) బూర్గుల రామకృష్ణారావు
బి) వి.బి. రాజు
సి) నవాబ్జైన్ యార్ జంగ్
డి) కె.వి. రంగారెడ్డి
2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఏ రోజున రాష్ట్రపండుగగా ప్రకటించింది?
ఎ) జూన్ 02, 2014
బి) జూన్ 09, 2014
సి) జూన్ 16, 2014
డి) జూలై 16, 2014
3. 1952 ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్) గెలిచిన శాసనసభ స్థానాల సంఖ్య?
ఎ) 42 బి) 45 సి) 44 డి) 32
4. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జూన్ 1వ తేదీలోగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రక్తపాతం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగ సంఘం నాయకుడు?
ఎ) కొలిశెట్టి రామదాసు
బి) కె.ఆర్. ఆమోస్
సి) మదన్ మోహన్
డి) ప్రొ. జయశంకర్
5. రాష్ర్టాల పునర్విభజన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ) 1947 డిసెంబర్ 29
బి) 1950 డిసెంబర్ 29
సి) 1956 డిసెంబర్ 29
డి) 1953 డిసెంబర్ 29
6. కింది వాటిని జతపరచండి?
i) బూర్గుల రామకృష్ణారావు a) ముఖ్యమంత్రి
ii) దిగంబర రావు b) ఆర్థిక శాఖ
iii) కె.వి. రంగారెడ్డి c) హోంశాఖ
vi) జి.ఎస్. మేల్కోటే d) ఎక్సైజ్
ఎ) i-a,ii-b,iii-c,iv-d
బి) i-a,ii-d,iii-c,iv-b
సి) i-a,ii-c,iii-d,iv-b
డి) i-a,ii-c,iii-b,iv-d
7. తెలంగాణ విమోచన సమితిని స్థాపించింది?
ఎ) మదన్ మోహన్ రెడ్డి
బి) మంజూర్ ఆలం
సి) కాళోజీ
డి) కేశవ్ జాదవ్
8. 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా తెలంగాణ వారు ఎంతమంది పని చేశారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
9. తెలంగాణ మిగులు నిధులు వెనక్కి తీసుకురావడానికి నియమించిన కమిటీ?
ఎ) లలిత్ కుమార్ కమిటీ
బి) వశిష్ట భార్గవ్ కమిటీ
సి) ఎ మాత్రమే
డి) ఎ,బి రెండూ సరైనవి
10. తెలంగాణ నుంచి వెలువడిన తొలి తెలుగు పత్రిక?
ఎ) మీజాన్
బి) శేద్యచంద్రిక
సి) గోల్కొండ
డి) తెనుగు
11. కింది వాటిలో సరైనవి?
ఎ) 1969 ఫిబ్రవరిలో ఏర్పాటైన ‘తెలంగాణ ప్రజా కన్వెన్షన్’ మార్చి 25, 1969న తెలంగాణ ప్రజాసమితిగా మార్పు చెందింది
బి) దీనికి అధ్యక్షుడిగా మదన్ మోహన్ ఎన్నికయ్యారు
సి) ఎ మాత్రమే సరైనది
డి) ఎ, బి రెండూ సరైనవి
12. ఈ సదస్సులో ప్రొ.జయశంకర్ సార్ డా.కె. ఎల్రావు – నాగార్జున సాగర్ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు?
ఎ) ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సదస్సు
బి) రెడ్డి హాస్టల్ సదస్సు
సి) తెలంగాణ ప్రజా సమితి
డి) పైవేవీకాదు
13. కింది వాటిని జతపరచండి.
రచనలు రచయితలు
i) జగడం a) బోయ జంగయ్య
ii) తెలంగాణ తోకలు b) కాసుల ప్రతాపరెడ్డి
iii) నైలు నదీయాత్ర c) ముదిగంటి సుజాత
iv) గంగరేగి చెట్టు d) యశోదరెడ్డి
ఎ) i-d, ii-c, iii-b, iv-a
బి) i-a, ii-b, iii-c, iv-d
సి) i-a, ii-c, iii-b, iv-d
డి) i-a, ii-b, iii-d, iv-c
14. అభినవ పోతన బిరుదాంకితుడు?
ఎ) నాయని సుబ్బారావు
బి) వానమామలై వరదాచార్యులు
సి) ఆవంత్స సోమసుందర్
డి) ఆరుద్ర
15. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా దేశంలోనే పీడీ చట్టం కింద అరెస్టు అయిన మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్?
ఎ) ఆమోస్
బి) రావాడ సత్యనారాయణ
సి) గోపాల్ కిషన్
డి) కొలిశెట్టి రామదాసు
16. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం – ప్రజల ఉద్యమం అనే పుస్తక రచయిత ఎవరు?
ఎ) ఆదిరాజు వెంకటేశ్వర రావు
బి) ప్రొ. కోదండరాం
సి) వి. ప్రకాష్
డి) ప్రొ.జయశంకర్
17. ‘పంచసూత్ర పథకం’ పై స్పందిస్తూ ‘మహారాజుకి మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్న’ అనే సామెతను గుర్తుచేసినది?
ఎ) జి.ఎస్.మెల్కోటే
బి) గౌతులచ్చన్న
సి) కాళోజీ
డి) గంగారెడ్డి
18. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ గురించి సరైనది?
ఎ) 1986లో తెలంగాణ ప్రభాకర్ ఆధ్వర్యం లో ఇది ఏర్పడింది.
బి) తెలంగాణ అన్యాయాలపై పరిశోధన, వాటికి సంబంధించిన ప్రచురణలు ప్రచురించడం ట్రస్ట్ లక్ష్యాలుగా నిర్ణయించడమైంది
సి) ఈ ట్రస్టు ప్రచురించిన పత్రిక- ‘మా తెలంగాణ పత్రిక’ డి) పైవన్నీ
19. దాశరథి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది?
ఎ) కవితా పుష్పకం
బి) తిమిరంతో సమరం
సి) గాలిబ్ గీతాలు
డి) పునర్నవం
20. సిటీ కాలేజీ సంఘటన జరిగిన సంవత్సరం?
ఎ) 1952 సెప్టెంబర్ 4
బి) 1952 సెప్టెంబర్ 5
సి) 1952 సెప్టెంబర్ 6
డి) 1952 సెప్టెంబర్ 7
21. బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో నియమించిన ఏకైక ఆంధ్రప్రాంతానికి చెందిన మంత్రి?
ఎ) దిగంబర రావు బి) శంకర్ దేవ్
సి) వల్లూరి బసవరాజు
డి) పూల్‌చంద్ గాంధీ
22. తెలంగాణ మలి ఉద్యమంలో తొలి అమరుడు?
ఎ) వేణుగోపాల్ రెడ్డి బి) యాదయ్య
సి) శ్రీకాంతాచారి డి) కొమురయ్య
23. కేంద్ర ఆధ్వర్యంలో 2010లో జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ?
ఎ) సీపీఐ బి) సీపీఎం
సి) బీజేపీ డి) కాంగ్రెస్
24. సుందర్‌లాల్ కమిటీ ఏ రోజున హైదరాబాద్ ను సందర్శించింది?
ఎ) 1949 నవంబర్ 29
బి) 1999 డిసెంబర్ 25
సి) 1950 నవంబర్ 29
డి) 1949 నవంబర్ 18
25. జీవో నెంబర్ 36 అంటే?
ఎ) పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలను అమలు చేయడం
బి) అఖిలపక్ష ఒప్పందంలోని అంశాలను అమలు చేయడం
సి) ఆరుసూత్రాల పథకం అమలు చేయడం
డి) అష్టపథక సూత్రాలు అమలు చేయడం
26. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధ్యక్షులు కాని వారిని గుర్తించండి?
ఎ) చొక్కారావు బి) హయగ్రీవాచారి
సి) మదన్ మోహన్ డి) అచ్యుతరెడ్డి
27. కింది వాటిలో సరైనవి?
ఎ) 1997 ఆగస్టు 11న డా॥ చెరుకు సుధాకర్ అధ్యక్షతన సూర్యాపేటలో దోఖా తిన్న తెలంగాణ పేరుతో సదస్సు జరిగింది
బి) ఈ సభలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశ పెట్టినవారు వి. ప్రకాశ్
సి) ఈ సభ ‘కుల’ కోణంలో కోస్తాంధ్ర అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించింది
డి) పైవన్నీ
28. తెలంగాణ సింగిడి రచయితల వేదిక ఆవిర్భవించిన సంవత్సరం?
ఎ) 2008 బి) 2009
సి) 2010 డి) 2011
29. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తేదీ?
ఎ) ఫిబ్రవరి 18, 2014
బి) ఫిబ్రవరి 19, 2014
సి) ఫిబ్రవరి 20, 2014
డి) ఫిబ్రవరి 21, 2014
30. కిందివారిలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) లో సభ్యులు కానివారు?
ఎ) సుశీల్ కుమార్ షిండే
బి) మణిశంకర్ అయ్యర్
సి) చిదంబరం
డి) గులాంనబీ అజాద్
31. కేసీఆర్‌ను ఖమ్మం జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన తేదీ?
ఎ) డిసెంబర్ 3, 2010
బి) డిసెంబర్ 7, 2007
సి) డిసెంబర్ 3, 2008
డి) డిసెంబర్ 3, 2009
32. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కమిటీగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు?
ఎ) ఎం. సత్యనారాయణ రావు
బి) కె. కేశవరావు
సి) డి. శ్రీనివాస్
డి) పొన్నాల లక్ష్మయ్య
33. ఆంధ్ర నాయకుడు సుబ్బిరామిరెడ్డి ఇంటికి దావత్‌కు పోయిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు?
ఎ) వినోద్ కుమార్ దుగ్గల్
బి) రవీందర్ కౌర్
సి) రణబీర్‌సింగ్
డి) అబూ సలేష్ షరీఫ్
34. కింది వాటిలో సరికానిది?
ఎ) శ్రీకృష్ణ కమిటీని 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
బి) శ్రీకృష్ణ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదుగురు
సి) ఈ కమిటీ మొత్తం 7 ప్రతిపాదనలు చేసింది
డి) ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి కేంద్రం విధించిన కాలపరిమితి ఒక సంవత్సరం
35. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ కమిటీ ఎప్పుడు ప్రకటించింది?
ఎ) జూలై 26, 2011
బి) జూలై 26, 2012
సి) జూలై 26, 2014
డి) జూలై 26, 2013
36. ఆరు సూత్రాల పథకంలో సరైన అంశం కానిది?
ఎ) ముల్కీని బంధనలు రద్దవుతాయి
బి) తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దవుతుంది
సి) పరిపాలక న్యాయస్థానాలు రద్దవుతాయి
డి) ఏదీకాదు
37. ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని చెప్పిన పథకం
ఎ) అష్టసూత్రల పథకం
బి) పంచసూత్రాల పథకం
సి) ఆరుసూత్రాల పథకం
డి) జీవో నెం. 36
38. ఏ ఉద్యమ కాలంలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే నినాదం ప్రసిద్ధి చెందింది?
ఎ) సెప్టెంబర్ 16, 1980
బి) సెప్టెంబర్ 17, 1956
సి) నవంబర్ 16, 1990
డి) జూలై 26, 1952
39. 1969 ఉద్యమ సమయంలో విద్యార్థులపై కాల్పులకు నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేసింది?
బి) వి.వి.గిరి
బి) కొండా లక్ష్మణ్ బాపూజీ
సి) చొక్కారావు
డి) మర్రి చెన్నారెడ్డి
40. కింది వాటిలో సరైనది?
ఎ) లలిత్‌కుమార్ కమిటీ తెలంగాణ మిగులు నిధులపై అధ్యయనం
బి) వాంఛూ కమిటీ ముల్కీ నిబంధనల అధ్యయనం
సి) ఫజల్ అలీ కమిషన్ రాష్ర్టాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్
డి) అన్నీ సరైనవే
41. 2010 జనవరి 23న నిజాం కాలేజీలో విద్యార్థి రణభేరి పేరుతో సభను నిర్వహించింది?
ఎ) ఏబీవీపీ బి) ఎన్ఎస్యూఐ
సి) పీడీఎస్‌యూ డి) ఎస్ఎఫ్ఐ
42. కిందివాటిలో సరైనవి?
ఎ) తెలంగాణ ధూమ్‌ధామ్ ఏర్పాటులో అంతాడుపుల నాగరాజు, రసమయి బాలకిషన్, క్రియాశీల పాత్ర పోషించారు.
బి) తొలి ప్రదర్శన కామారెడ్డిలో 2002, సెప్టెంబర్ 30న జరిగింది
సి) ఎ మాత్రమే సరైంది
డి) ఎ, బి రెండు సరైనవే
43. ‘అమర వీరుల త్యాగ ఫలిత దినం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించినది?
ఎ) తెలంగాణ ప్రజాఫ్రంట్
బి) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
సి) తెలంగాణ సంఘర్షణ సమితి
డి) తెలంగాణ మహాసభ
44. కింది వాటిని జతపరచండి?
i) తెలంగాణ ప్రజా సమితి a) కాళోజి
ii) హైదరాబాద్ హిత సంరక్షణ సమితి b) పాగా పుల్లారెడ్డి
iii) భాగ్యనగర్ రేడియో c) రామాచారి
iv) తెలంగాణ విమోచనోద్యమ సమితి d) మదన్ మోహన్
ఎ) i- a, ii-b, iii-c, iv-d
బి) i-d, ii-c, iii-b, iv-a
సి) i-a, ii-b, iii-d, iv-c
డి) i-d, ii-c, iii-a, iv-b
45. మిగులు నిధుల గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేయని కమిటీ?
ఎ) లలిత్ కుమార్ కమిటీ
బి) వశిష్ట భార్గవ కమిటీ
సి) జయభారత్ రెడ్డి కమిటీ
సి) ఎ, బి
46. గాదె ఇన్నయ్య ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తకం ఏ సదస్సులో ఆవిష్కరించారు?
ఎ) ఫోరం ఫర్ ఫ్రీడం ఎక్స్ప్రెషన్ సభ
బి) ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ సభ
సి) తెలంగాణ ప్రగతి వేదిక సభ
డి) తెలంగాణ స్టడీస్ ఫోరం సభ
47. బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది?
ఎ) సెంటర్ ఫర్ తెలంగాణ ట్రస్ట్
బి) తెలంగాణ ప్రగతి వేదిక
సి) మల్లేపల్లి రాజం ట్రస్ట్
డి) మంజీర రచయితల సంఘం
సమాధానాలు
1-డి 2-సి 3-ఎ 4-బి 5-డి 6-సి 7-సి 8-డి 9-డి 10-బి 11-డి 12-ఎ
13-బి 14-బి 15-సి 16-ఏ 17-బి 18-డి 19.బి 20-ఎ 21-సి 22-సి 23-బి 24-ఎ
25-బి 26-సి 27-డి 28-ఎ 29-సి 30-బి 31-డి 32-బి 33-ఎ 34-సి 35-డి 36-సి
37-ఎ 38-డి 39-బి 40-డి 41-ఎ 42-డి 43-ఎ 44-బి 45-సి 46-ఎ 47-బి
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు