Telangana History | తెలంగాణ చరిత్ర సంస్కృతి
TSPSC Special
1. కింది వాటిలో సరికానిది ఏది?
a) గుణాఢ్యుడు: బృహత్కథ
b) శర్వవర్మ: కాతంత్ర వ్యాకరణం
c) పాణిని: సుహృల్లేఖ
d) సోమదేవ: కథా సరిత్సాగరం
జవాబు: (c)
వివరణ: సుహృల్లేఖ ఆచార్య నాగార్జునుడి రచన. ప్రజ్ఞాపారమిత ఈయన మరో రచన. కాగా రత్నావళి రాజపరికథలో నాగార్జునుడు శ్రేయోరాజ్య భావనను పరిచయం చేశాడు.
2. కింది వాక్యాలను పరిశీలించండి.
1. శాతవాహన రాజు హాలుడికి ‘కవివత్సలుడు’ అనే బిరుదు ఉంది
2. హాలుడు ‘గాథాసప్తశతి’ పేరుతో గాథ శైలిలో రచించిన 700 కవితలను సంకలనం చేశాడు
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (c)
వివరణ: గాథాసప్తశతి భారతీయ సాహిత్యంలో తొలి సంకలన గ్రంథంగా పరిగణిస్తారు. ఇది ప్రాకృత భాషలో ఉంది. హాలుడి రాజ్యంలోని ఎంతోమంది కవులు, కవయిత్రులు ఇందులోని గాథలను రచించారు. ఇవి స్త్రీ కేంద్రంగా, స్త్రీల కోణంలో సాగుతాయి. ప్రేమ, శృంగారం ప్రధానమైనవి.
3. కింది శాతవాహనుల కాలం నాటి వృత్తులను పరిశీలించండి
1. హాలిక: రైతులు 2. గోలిక: గోపాలురు
3. కోలిక: తెలికవారు 4. వధిక: వడ్రంగి
పై వాక్యాల్లో సరిగా జతపరచని వాటిని గుర్తించండి.
a) 1, 2 b) 2, 3 c) 3 d) 4
జవాబు: (c)
వివరణ: కోలికులు అంటే నేతకారులు. పై ప్రశ్న శాతవాహనుల కాలం నాటి వృత్తులకు సంబంధించింది. కులాల (కుమ్మర), కమార (కమ్మర) ఆ కాలపు ఇతర వృత్తులు.
4. శాతవాహనుల చరిత్రకు సంబంధించి పత్తి నుంచి గింజలను తీసేసి, దూదిని వడికే యంత్రాన్ని ఎవరు తయారుచేసినట్లు పేర్కొన్నారు?
a) ఆచార్య నాగార్జునుడు
b) రక్కసి లోటాయ్
c) రేవక నిర్మాడి d) అనాథ పిండక
జవాబు: (b)
5. సింహాసన ద్వాత్రింశిక అనే కథాకావ్యాన్ని ఎవరు రచించారు?
a) మారన b) మూలఘటిక కేతన
c) మరింగంటి సింగరాచార్యులు
d) కొరివి గోపరాజు
జవాబు: (d)
వివరణ: కొరివి గోపరాజు చారిత్రకంగా రేచర్ల పద్మనాయకుల కాలానికి చెందినవాడు. ఈయన నిజామాబాద్ జిల్లా వేముగల్లు (భీంగల్) పాలకుడు రాణా మల్లుడి ఆస్థానంలో ఉన్నాడు. ‘సింహాసన ద్వాత్రింశిక’ను తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వంగా పరిగణిస్తారు. ఇందులో ఆనాటి సాంఘిక జీవితం కనిపిస్తుంది. ఈ కావ్యాన్ని శివుడు, విష్ణుమూర్తి ఇద్దరూ కలిసిన రూపం హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు.
6. కింది వాటిలో బమ్మెర పోతన రచన కానిది ఏది?
a) భోగినీ దండకం
b) నిర్వచనోత్తర రామాయణం
c) వీరభద్ర విజయం d) భాగవతం
జవాబు: (b)
వివరణ: ‘నిర్వచనోత్తర రామాయణం’ తిక్కన రచించాడు. ఈయన మరో రచన ‘మహాభారతం’ (విరాటపర్వం నుంచి స్వర్గారోహణపర్వం వరకు 15 పర్వాలు రచించాడు). కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు తిక్కన బిరుదులు. కాగా, పోతన బిరుదు సహజ పండితుడు. ‘నారాయణ శతకం’ను కూడా పోతన రాసినట్లుగా పేర్కొంటారు.
7. కింది వాక్యాలను పరిశీలించండి.
1. భోగినీ దండకంలో రేచర్ల మూడో సింగమ నాయకుడు, ఒక భోగిని ప్రేమ కథ ఉంది
2. పోతన రాసిన ఈ భోగినీ దండకం తెలుగులో దండక కావ్యాల్లో మొదటిది
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2 c) 1, 2
d) ఏదీ సరికాదు
జవాబు: (c)
8. నవనాథ చరిత్ర, హరిశ్చంద్రనలోపాఖ్యానం ఎవరి రచనలు?
a) పోతన b) గౌరన
c) కొరివి గోపరాజు
d) నాచన సోమనాథుడు
జవాబు: (b)
వివరణ: గౌరన దేవరకొండ పాలకుడు మాదా నాయుడు వేయించిన ఉమామహేశ్వరం శాసనాన్ని కూడా రచించాడు.
9. రాచకొండ, దేవరకొండ కేంద్రాలుగా పాలన సాగించిన రేచర్ల పద్మనాయకుల మూల పురుషుడు ఎవరు?
a) రేచర్ల రుద్రుడు
b) రెండో ప్రతాపరుద్రుడు
c) బేతాళ నాయకుడు
d) అనవోతా నాయకుడు
జవాబు: (c)
వివరణ: బేతాళ నాయకుడికే చెవిరెడ్డి అనే పేరు కూడా ఉంది.
10. కింది వివరాలను పరిశీలించండి.
1. మదన విలాస భాణం అనే రచన చేసిన పశుపతి నాగనాథ కవి మొదటి అనవోతా నాయకుడి ఆస్థానంలో ఉన్నాడు
2. మూడో సింగమ నాయకుడికి సర్వజ్ఞ అనే బిరుదు ఉంది
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 d) ఏదీ సరైనది కాదు
జవాబు: (a)
వివరణ: మదన విలాస భాణం సంస్కృతంలో ఉంది. రెండో సింగభూపాలుడి బిరుదు సర్వజ్ఞ. లక్ష్యలక్షణవేది అనేది ఈయనకున్న మరో బిరుదు. రసార్ణవ సుధాకరం అనే లక్షణ గ్రంథం రెండో సింగభూపాలుడి రచన.
11. రేచర్ల పద్మనాయకుల్లో తొలి స్వతంత్ర పాలకుడు ఎవరు?
a) బేతాళ నాయకుడు
b) రేచర్ల రుద్రుడు
c) మొదటి సింగమ నాయుడు
d) అనవోతా నాయుడు
జవాబు: (c)
12. కింది వివరాలను పరిశీలించండి.
1. పద్మనాయకులు మొదట నల్లగొండ జిల్లా ఆమనగల్లు కేంద్రంగా పాలించారు.
2. మొదటి అనవోతా నాయుడు రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు.
పై వాక్యాల్లో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (c)
వివరణ: 1361లో మొదటి అనవోతా నాయుడు రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు.
13. కింది వాటిలో భాగ్యరెడ్డి వర్మ 1906లో స్థాపించిన సంస్థ ఏది?
a) సునీతా బాల సంఘం
b) హైదరాబాద్ రాష్ట్ర ఆర్యసమాజం
c) జగన్ మిత్ర మండలి
d) మాన్యసంఘం
జవాబు: (c)
వివరణ: జగన్ మిత్ర మండలి తెలంగాణలో దళితుల జాగృతికి, చైతన్యానికి నాంది పలికింది. మండలి ఆధ్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ హరికథా కాలక్షేపాలు, సహపంక్తి భోజనాలు మొదలైన కార్యక్రమాలు చేపట్టారు.
14. కింది వివరాలను పరిశీలించండి.
1. భాగ్యరెడ్డి వర్మ 1911లో మాన్యసంఘం స్థాపించారు
2. ఈ సంఘం ద్వారా దళితుల్లో దురాచారాల నిర్మూలనకు కృషిచేశారు
పై వాటిలో సరైనవాటిని గుర్తించండి.
a) 1 b) 2 c) 1, 2 d) ఏదీ కాదు
జవాబు: (c)
15. హైదరాబాద్ రాష్ట్రంలో దళిత ఉద్యమానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
1. అరిగె రామస్వామి సునీతా బాలసమాజాన్ని స్థాపించాడు
2. బీఎస్ వెంకట్రావ్ 1922లో ఆదిహిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు
3. 1937లో గాంధీజీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పీసరి వీరన్న ‘హరిజన’ పదాన్ని వ్యతిరేకించాడు
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
a) 1, 2 b) 2, 3
c) 1, 2, 3 d) 1, 3
జవాబు: (d)
వివరణ: ఆదిహిందూ జాతీయోన్నతి సభను 1922లో అరిగె రామస్వామి స్థాపించారు. పీసరి వీరన్న స్థానంలో కొన్ని పుస్తకాల్లో పీసరి వెంకన్న అని కూడా ఉంది.
16. సుల్తాన్ కులీ కుతుబ్షా కాలంలో వచ్చిన తెలుగు కావ్యం ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ రచయిత ఎవరు?
a) ఈడూరు ఎల్లయ్య b) శంకర కవి
c) చరిగొండ ధర్మన్న
d) సారంగు తమ్మయ
జవాబు: (b)
వివరణ: శంకర కవి తన ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ కావ్యాన్ని సుల్తాన్ కులీ కాలం నాటి జాగీర్దారు ఈడూరు ఎల్లయ్యకు అంకితం ఇచ్చాడు.
17. ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో రాసిన తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్రం’ను ఎవరు రచించారు?
a) పొన్నగంటి తెలగన
b) కందుకూరి రుద్రకవి
c) చిత్రకవి పెద్దన
d) అద్దంకి గంగాధర కవి
జవాబు: (a)
వివరణ: దీన్ని పొట్లచెరువు (పటాన్చెరువు) పాలకుడు అమీన్ ఖాన్కు అంకితం ఇచ్చాడు.
18. కింది వాటిలో కామినేని మల్లారెడ్డి రచనలు ఏవి?
a) షట్చక్రవర్తి చరిత్ర, నలచరిత్ర
b) షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరం
c) బాలభారతం, కిరాతార్జునీయం
d) సూతసంహిత, బ్రహ్మోత్తరఖండం
జవాబు: (b)
వివరణ: కామినేని మల్లారెడ్డి నిజామాబాద్ జిల్లా బిక్కనవోలు పాలకుడు ఎల్లారెడ్డి తమ్ముడు. మల్లారెడ్డి మరో రచన ‘పద్మపురాణం’.
19. అద్దంకి గంగాధర కవి ‘తపతీ సంవరణోపాఖ్యానం’ను ఎవరికి అంకితం ఇచ్చాడు?
a) సుల్తాన్ కులీ కుతుబ్షా
b) మహ్మద్ కులీ కుతుబ్షా
c) ఇబ్రహీం కుతుబ్షా
d) అబ్దుల్లా కుతుబ్షా
జవాబు: (c)
20. కింది వివరాలను పరిశీలించండి.
1. కందుకూరి రుద్రకవికి ఇబ్రహీం కుతుబ్షా చింతలపాలెం అగ్రహారం దానంగా ఇచ్చాడు
2. సారంగు తమ్మయ ‘వైజయంతీ
విలాసం’ అనే ప్రబంధాన్ని రచించాడు
3. క్షేత్రయ్య తానీషా ఆస్థానాన్ని సందర్శించాడు
పై వివరాల్లో సరికానివి ఏవి?
a) 1, 2, 3 b) 2, 3
c) 3 d) 1, 2
జవాబు: (c)
వివరణ: అబ్దుల్లా కుతుబ్షా ఆస్థానాన్ని క్షేత్రయ్య సందర్శించాడు. మొవ్వ వేణుగోపాలస్వామిపై శృంగార పదాలు చెప్పిన క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. క్షేత్ర సందర్శన చేసినందుకు ఆయన ‘క్షేత్రయ్య’గా ప్రసిద్ధిచెందాడు. అబ్దుల్లా కుతుబ్షా మీద కూడా క్షేత్రయ్య వేయి దాకా పదాలు చెప్పినట్లు తెలుస్తున్నది.
21. కింది వివరాలను పరిశీలించండి.
దశరథరాజనందన చరిత్ర: మరింగంటి సింగరాచార్యులు
చిత్రభారతం: చరిగొండ ధర్మన్న
సుగ్రీవ విజయం: కందుకూరి రుద్రకవి
పై జతల్లో సరైనవి ఏవి?
a) అన్ని జతలూ సరైనవే
b) కేవలం రెండు మాత్రమే
c) కేవలం ఒక్కటి మాత్రమే
d) ఏవీ సరైనవి కాదు
జవాబు: (a)
వివరణ: ‘దశరథరాజనందనచరిత్ర’ తెలుగులో వచ్చిన నిరోష్ఠ్య (పెదవులు కదలని కావ్యాన్ని నిరోష్ఠ్యం అంటారు) కావ్యాల్లో ఒకటి. మహాభారతంలో శ్రీకృష్ణుడి సహాయంతో పాండవులు కౌరవులను ఓడిస్తారు. కాగా, చరిగొండ ధర్మన్న రాసిన చిత్రభారతంలో కౌరవులు, పాండవులు కలిసి శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తారు. అందుకే దీనికి చిత్రభారతం అనే పేరు వచ్చింది. ‘సుగ్రీవవిజయం’ లభిస్తున్న తొలి తెలుగు యక్షగానం. దీన్ని రాసింది కందుకూరి రుద్రకవి. ఈయన ఇతర రచనలు జనార్దనాష్టకం, నిరంకుశోపాఖ్యానం, బలవదరీ శతకం.
22. కింది వివరాలను పరిశీలించండి.
హితబోధిని: మాడపాటి హనుమంతరావు
నీలగిరి: షబ్నవీసు నరసింహారావు
తెనుగు పత్రిక: సురవరం ప్రతాపరెడ్డి
శైవప్రచారిణి: ముదిగొండ వీరభద్రశాస్త్రి
కింది వాటిలో సరైన జవాబును ఎంచుకోండి.
a) నాలుగు జతలు సరైనవే
b) మూడు జతలు సరైనవి
c) రెండు జతలు సరైనవి
d) ఒక్క జత సరైనది
జవాబు: (c)
వివరణ: ‘హితబోధిని’ పత్రికను మహబూబ్నగర్ జిల్లాలో శ్రీనివాస శర్మ ప్రారంభించాడు. ‘నీలగిరి’ పత్రికను 1922లో నల్లగొండలో షబ్నవీసు వెంకటరామనరసింహారావు ప్రారంభించాడు. ‘తెనుగు’ పత్రిక మహబూబాబాద్ (మానుకోట) జిల్లా ఇనుగుర్తి నుంచి వెలువడేది. దీన్ని ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు (ఒద్దిరాజు సోదరులు) 1922లో మొదలుపెట్టారు. శైవ ప్రచారిణి పత్రికకు ముదిగొండ వీరభద్ర శాస్త్రి సంపాదకులు.
23. కింది వివరాలను పరిశీలించండి.
1. గోల్కొండ పత్రిక మొదటి నుంచీ దినపత్రికగా వెలువడింది
2. బీఎన్ శర్మ విజయవాడ కేంద్రంగా ‘ఆంధ్రవాణి’ అనే పత్రికను నడిపించాడు
పై వాటిలో సరైన దాన్ని ఎంచుకోండి.
a) 1 b) 2
c) రెండూ సరైనవే
d) రెండూ సరైనవి కావు
జవాబు: (b)
వివరణ: గోల్కొండ పత్రిక 1926 నుంచి 1946 వరకు ద్వైవార (వారంలో రెండు రోజులు) పత్రికగా వెలువడింది. 1947లో దినపత్రికగా మారింది.
24. కింది జతలను పరిశీలించండి.
సుజాత: ముదిగొండ వీరభద్రశాస్త్రి
ఆంధ్రకేసరి: అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ
హైదరాబాద్ బులెటిన్: బుక్కపట్నం రామానుజాచార్యులు
దక్కన్ క్రానికల్: బుక్కపట్నం రామానుజాచార్యులు
పై జతల్లో సరైనవి ఏవి?
a) ఒకటి మాత్రమే b) రెండు మాత్రమే
c) మూడు మాత్రమే d) నాలుగు సరైనవే
జవాబు: (c)
వివరణ: సుజాత పత్రికను 1927లో పీఎన్ శర్మ ప్రారంభించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు