బాల్‌బ్యాడ్మింటన్‌ను విప్లవీకరించిన ఆటగాడు ?
కొత్త రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఉద్యోగార్థి తెలుసుకోవాలన్న సంకల్పంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ పరీక్షలకు నూతన సిలబస్ రూపొందించింది. ఈ సిలబస్‌పై ఉద్యోగార్థులకు అనేక సందేహాలు కలుగుతున్నాయి. కొత్త సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఎలా రావచ్చు? ప్రశ్నల కఠినత స్థాయి ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు ఉద్యోగార్థులను వేధిస్తున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ భవిష్యత్ పరీక్షలపై ఉద్యోగార్థులకు అవగాహన కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన ఏఈఈ, హైదరాబాద్ వాటర్వర్క్లో మేనేజర్ (ఇంజినీరింగ్) తదితర పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్లలో తెలంగాణపై అడిగిన ప్రశ్నలు ‘నిపుణ’ పాఠకుల కోసం..
1. బయ్యారం చెరువు నిర్మించిందెవరు? (3)
1) రుద్రదేవుడు 2) రుద్రమదేవి
3) మైలాంబ 4) గణపతిదేవుడు
2. ఏ కుతుబ్‌షాహీ రాజును మల్కీభరాముడిగా పిలుస్తారు? (2)
1) జంషీద్ కుతుబ్‌షా 2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) అబ్దుల్లా కుతుబ్‌షా 4) మహ్మద్ కుతుబ్‌షా
3. 1857 తిరుగుబాటులో తురెబాజ్ఖాన్కు మద్దతు ఇచ్చిందె వరు? (3)
1) మస్కన్ అలీ 2) దిల్వార్ ఖాన్
3) మౌల్వీ అల్లా ఉద్దీన్ 4) అబ్బాస్‌ఖాన్
4. డీసీఎల్ అనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ పట్టాను పొందిందెవరు? (3)
1) సరోజిని నాయుడు 2) అలియావార్జంగ్
3) మొదటి సాలార్జంగ్ 4) మూడో సాలార్జంగ్
5. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్జంగ్ ఎవరిని నియమించాడు? (1)
1) ముఖరం-ఉద్-దౌలా- బహదూర్
2) శంషీర్జంగ్ బహదూర్
3) షాహబ్జంగ్ బహదూర్
4) బసాలత్ జంగ్ బహదూర్
6. కిందివాటిలో ఏది చివరి నిజాం కాలంలో కట్టలేదు? (4)
1) వైరా ప్రాజెక్టు 2) పాలేరు ప్రాజెక్టు
3) నిజాంసాగర్ 4) హుస్సేన్‌సాగర్
7. ‘అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమాన్సిపేషన్’ గ్రంథాన్ని రచించిందెవరు? (3)
1) వి.శ్యాంసుందర్ 2) బీఎస్ వెంకట్రావ్
3) పీఆర్ వెంకటస్వామి 4) భాగ్యరెడ్డి వర్మ
8. హైదరాబాద్‌లో ప్రచురించిన ‘రహబర్-ఇ-దక్కన్’ పత్రిక ఎడిటర్ ఎవరు? (1)
1) అహమ్మద్ మొయినుద్దీన్ అండ్ అబ్దుల్లా ఖాన్
2) బహదూర్ యార్జంగ్ అండ్ ఖాసింరజ్వీ
3) నిజామత్‌జంగ్ అండ్ బహదూర్ యార్జంగ్
4) అక్బర్ హైదరీ అండ్ అహ్మద్ ఆరిఫ్
9. హైదరాబాద్‌లో 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటీష్ రెసిడెంట్ ఎవరు? (1)
1) డేవిడ్సన్ 2) కిర్క్ ప్యాట్రిక్
3) హెన్రీ రస్సెల్ 4) చార్లెస్ మెట్కాఫ్
10. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన హైదరాబాద్ వాసి? (1)
1) అబిద్ హసన్ సఫ్రాని 2) షేక్ మొయినుద్దీన్
3) సి.రామకృష్ణదూత్ 4) రావి నారాయణరెడ్డి
11. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా? (1)
1) 48శాతం 2) 55 శాతం
3) 59 శాతం 4) 62 శాతం
12. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం? (4)
1) కరీంనగర్ 2) మంచిర్యాల
3) వరంగల్ 4) జగిత్యాల
13. తెలంగాణ రాష్ట్ర వర్షపాతంలో నైరుతి రుతుపవనాల ద్వారా లభించే వర్షపాత శాతం సుమారుగా? (2)
1) 70 శాతం 2) 80 శాతం
3) 90 శాతం 4) 95 శాతం
14. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం? (2)
1) పోచారం 2) జన్నారం
3) ఏటూరు నాగారం 4) పాకాల
15. 2013-14లో తెలంగాణలో బొగ్గు తర్వాత ఎక్కువ ఆదాయం సమకూర్చిన ఖనిజమేది? (4)
1) ముడి ఇనుము 2) మాంగనీస్
3) సున్నపురాయి 4) గ్రానైట్
16. తెలంగాణలో విద్యుచ్చక్తికి ప్రధాన ఆధారం? (1)
1) థర్మల్ 2) హైడల్
3) న్యూక్లియర్ 4) బయోఫ్యూయల్స్
17. హైదరాబాద్‌లో ఏరోస్పేస్ పరిశ్రమ ఉన్న ప్రదేశం? (3)
1) తుర్కపల్లి 2) తుక్కుగూడ
3) ఆదిభట్ల 4) పోలేపల్లి
18. తెలంగాణలో ఎస్టీ జనాభా అత్యధిక శాతం ఉన్న జిల్లా? (2)
1) వరంగల్ 2) ఖమ్మం
3) ఆదిలాబాద్ 4) మహబూబ్‌నగర్
19. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా (హెచ్ఎండీఏ) ఎన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది? (2)
1) మూడు 2) ఐదు 3) నాలుగు 4) ఆరు
20. మిషన్ కాకతీయ ఉద్దేశం కానిది? (4)
1) చెరువుల పూడికతీత
2) చెరువు గట్టులను బలపర్చడం
3) ఫీడర్ కాలువలను బాగుచేయడం
4) చెరువులను కలుపుట
21. టీ-హబ్ హైదరాబాద్‌లో ఎక్కడ ఉంది? (2)
1) ఐఐటీ హైదరాబాద్ 2) ఐఐఐటీ హైదరాబాద్
3) హెచ్‌సీయూ 4) రహేజా మైండ్‌స్పేస్
22. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే ప్రముఖ జాతర (2)
1) సమ్మక్క, సారక్క 2) నాగోబా
3) తీజ్ 4) కొమరెల్లి
23. తెలంగాణలో తరి అనే పదం వివరించేది? (1)
1) నీటి వసతి ఉన్న భూమి
2) నీటి వసతి లేని భూమి 3) అటవీ భూమి
4) పశువుల మేతకు వాడే భూమి
24. దసరా పండుగనాడు ఒకరికొకరు ఇచ్చుకునే జమ్మిఆకును తెలంగాణలో ఏమని పిలుస్తారు? (4)
1) ప్రసాదం 2) బోనం
3) నైవేద్యం 4) బంగారం
25. 1969 తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల సమ్మెకు నాయకత్వం వహించిందెవరు? (3)
1) శ్రీధర్‌రెడ్డి 2) మదన్మోహన్
3) ఆమోస్ 4) కేశవరావు
26. మా భూమి సినిమాలో ‘పల్లెటూరి పిల్లగాడా….’ అనే పాట పాడిన నేపథ్య గాయని? (3)
1) పి.లీల 2) ఎస్.జానకి 3) సంధ్య 4) పి.సుశీల
27. ఆరు సూత్రాల పథకాన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌లో పొందుపరిచారు? (4)
1) 371-A 2) 371-B
3) 371-C 4) 371-D
28. జయశంకర్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డిగ్రీ కళాశాల? (4)
1) కాకతీయ కళాశాల 2) మహబూబ్ కళాశాల
3) నిజాం కళాశాల 4) సీకేఎం కళాశాల
29. కిందివాటిలో ఏ ఆహార పదార్థాన్ని ఈ మధ్య ఒక భౌగోళిక సూచికగా నమోదు చేశారు? (3)
1) హైదరాబాద్ బిర్యానీ 2) రసగుల్లా
3) హైదరాబాద్ హలీమ్ 4) డబుల్ కా మీఠా
30. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య (2 )
1) 5 2) 7 3) 3 4) 6
31. ప్రాణహిత ఏ నదుల కలయిక ద్వారా ఏర్పడుతుంది? (1)
1) పెన్‌గంగా, వార్దా, వైన్‌గంగ
2) పూర్ణ, పెన్‌గంగ, వార్దా
3) ప్రవర, వైన్‌గంగ, మానేరు
4) కొలాబ్, వార్దా, పెన్‌గంగ
32. ప్రతిపాదిత ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? (1)
1) కరీంనగర్ 2) ఆదిలాబాద్
3) మెదక్ 4) నిజామాబాద్
33. గోదావరి జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా వ్యవహరించిందెవరు? (2)
1) బ్రిజేష్ కుమార్ 2) ఆర్ఎస్. బచావత్
3) ఎంపి.సింగ్ 4) ఆర్ఎస్.సర్కారియా
34. కిందివారిలో ఏ అధికారి తెలంగాణ ప్రాంతంలో వెట్టి/బేగార్ నిర్మూలనకు విశేషంగా కృషి చేశారు? (3)
1) జేఎం.గిర్గ్లాని 2) వి.సుందరేశన్
3) ఎస్ఆర్. శంకరన్ 4) పీవీఆర్కే ప్రసాద్
35. మెదక్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత యాత్రాస్థలం? (2)
1) ఇడుపులపాయ 2) ఏడుపాయల
3) మూడుపాయల 4) ఆరుపాయల
36. దేవాదుల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? (1)
1) వరంగల్ 2) ఖమ్మం
3) మెదక్ 4) ఆదిలాబాద్
37. గన్‌పార్క్ అంటే? (2)
1) తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్
2) తెలంగాణ అమరవీరుల స్మృతి స్థూపం
3) గోల్కొండ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్
4) పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థంగా నిర్మించిన పార్క్
38. కొండగట్టు దేనికి ప్రసిద్ధి? (1)
1) ఆంజనేయస్వామి దేవాలయం
2) నరసింహస్వామి దేవాలయం
3) వేంకటేశ్వరస్వామి దేవాలయం
4) అయ్యప్పస్వామి దేవాలయం
39. బతుకమ్మ సంబరాల్లోని మొదటి రోజును ఏమంటారు? (3)
1) తొలి పొద్దు 2) సద్దులు
3) ఎంగిలి పూలు 4) సంబురాలు
40. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పుట్టిన రోజును ఏమని ప్రకటించింది? (2)
1) తెలంగాణ అధికార భాషా దినోత్సవం
2) తెలంగాణ భాషా దినోత్సవం
3) తెలంగాణ వారసత్వ దినోత్సవం
4) తెలంగాణ సాంస్కృతిక దినోత్సవం
41. కిందివాటిలో ఏ దేశం భారత్‌తో కలిసి బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించింది? (4)
1) యునైటెడ్ కింగ్డమ్ 2) ఇజ్రాయిల్
3) అమెరికా 4) రష్యా
42. హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పరిశోధనా సంస్థ? (1)
1) ఇమారత్ పరిశోధనా కేంద్రం
2) నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ
3) డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్
4) సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్
43. తెలంగాణ ప్రభుత్వ నూతన పథకం జలహారం ముఖ్య ఉద్దేశం ? (3)
1) పరిశ్రమలకు కావాల్సిన నీరును సేకరించడం
2) వర్షపు నీరును ఆదా చేయడం
3) తాగునీరు సరఫరా చేయడం
4) పంటలకు నీటి సరఫరా చేయడం
44. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని మహిళా అక్షరాస్యత శాతం? (3)
1) 80.89 శాతం 2) 73శాతం
3) 57.99 శాతం 4) 60 శాతం
45. ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ దేశీయోత్పత్తి 2014-15 ? (3)
1) రూ. 2 లక్షల కోట్లు 2) రూ. 3 లక్షల కోట్లు
3) రూ. 4 లక్షల కోట్లు 4) రూ. 5 లక్షల కోట్లు
46. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన సహకార కార్పొరేషన్ ద్వారా తేనె ్ర పాసెసింగ్ సంస్థను ఏర్పాటుచేసిన ప్రాంతం ?(1)
1) కామారెడ్డి 2) నిర్మల్
3) ఏటూరునాగారం 4) కొడంగల్
47. 2011 జన గణన ప్రకారం తెలంగాణలో పట్టణ జనాభా? (2)
1) 25.5 శాతం 2) 38.88 శాతం
3) 40 శాతం 4) 45.5 శాతం
48. కల్టివేటెడ్ స్టెలిస్టుగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ క్రికెటర్ ఎవరు? (3)
1) వీవీఎస్ లక్ష్మణ్ 2) అజారుద్దీన్
3) జైసింహ 4) అర్షద్ అయూబ్
49. బాల్‌బ్యాడ్మింటన్‌ను విప్లవీకరించిన వరంగల్ ఆటగాడు ? (2)
1) కె.రాజయ్య 2) జె.పిచ్చయ్య
3) ఆర్.మల్లయ్య 4) టి.లక్ష్మయ్య
50. ఏక్తాకపూర్ బయోపిక్‌లో హైదరాబాద్ క్రికెటర్ అజారుద్దీన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? (3)
1) షారూక్‌ఖాన్ 2) అభిషేక్‌బచ్చన్
3) ఇమ్రాన్ హష్మి 4) సైఫ్ అలీఖాన్
51. ప్రతిపాదిత పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా నష్టపోయే గిరిజన తెగ? (3)
1) గోండులు 2) చెంచులు
3) గొత్తి కోయలు 4) లంబాడీలు
52. తెలంగాణ ప్రాంతంలో ఏ పట్టణం మొదట్లో ఇందూరుగా పిలువబడింది? (1)
1) నిజామాబాద్ 2) మహబూబ్‌నగర్
3) కరీంనగర్ 4) మెదక్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు